
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 191 పరుగుల లక్ష్య చేధనలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన నికోలస్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కెప్టెన్ కమ్మిన్స్‌తో సహా ఏ బౌలర్‌ను పూరన్ విడిచిపెట్టలేదు.
ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో ఈ కరేబియన్ బ్యాటర్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా పూరన్ నిలిచాడు. ఓవరాల్‌గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. అతడి విధ్వంసం ఫలితంగా లక్నో లక్ష్యాన్ని కేవలం లక్నో కేవలం 16.1 ఓవర్లలో ఛేదించింది.
లక్నో బ్యాటర్లలో పూరన్‌తో పాటు మార్ష్(52) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా, హర్షల్ పటేల్, షమీ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.
Raining sixes in Hyderabad... but by #LSG 🌧
Nicholas Pooran show guides LSG to 77/1 after 6 overs 👊
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/K2Dlk5AXQw— IndianPremierLeague (@IPL) March 27, 2025