Hashmatullah Shahidi
-
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 72 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు అఫ్గన్ క్రికెట్ జట్టు జింబాబ్వే(Afghanistan tour of Zimbabwe, 2024-25) పర్యటనకు వెళ్లింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసంఈ క్రమంలో హరారే వేదికగా తొలుత టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన అఫ్గన్.. వన్డే సిరీస్‌ను కూడా 2-1తో నెగ్గింది. అనంతరం బులవాయోలో టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ క్రమంలో అఫ్గన్- జింబాబ్వే(Zimbabwe vs Afghanistan) మధ్య గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధీటుగా బదులిచ్చినాఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందుకు జింబాబ్వే ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు సాధించింది. సికందర్ రజా(61), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(75) అర్ధ శతకాలతో రాణించగా.. సీన్ విలియమ్స్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురి పోరాటం కారణంగా అఫ్గన్ కంటే.. జింబాబ్వే 86 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో హష్మతుల్లా బృందం పొరపాట్లకు తావివ్వలేదు. రహ్మత్ షా(Rahmat Shah) భారీ శతకం(139)తో చెలరేగగా.. ఇస్మత్ ఆలం(101) కూడా శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అఫ్గన్ 363 పరుగులు చేయగలిగింది. తద్వారా జింబాబ్వేకు 278 పరుగుల టార్గెట్ విధించింది.13 నిమిషాల్లోనే ఖేల్ ఖతంలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ జింబాబ్వే.. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి.. ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తద్వారా విజయానికి 73 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, అఫ్గన్ స్పిన్నర్ల ధాటికి ఆఖరి రోజు ఆటలో కేవలం 13 నిమిషాల్లోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అఫ్గన్ 72 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర2017లో అఫ్గనిస్తాన్ టెస్టు జట్టు హోదా పొందింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా.. ఇది నాలుగో విజయం. అదే విధంగా జింబాబ్వేపై రెండోది. కాగా 2021లోనూ జింబాబ్వేతో అఫ్గనిస్తాన్ రెండు టెస్టుల్లో తలపడగా.. 1-1తో నాటి సిరీస్ డ్రా అయింది. అయితే, ఈసారి మాత్రం అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేపై రెండో టెస్టులో గెలిచి.. తొలిసారి ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.చదవండి: Ind vs Pak: ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు -
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్‌లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్
Zimbabwe vs Afghanistan, 2nd ODI: అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత హరారేలో టీ20 సిరీస్ జరుగగా.. అఫ్గనిస్తాన్ 2-1తో నెగ్గింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై మంగళవారం వన్డే సిరీస్ మొదలైంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.అతల్ సెంచరీఈ నేపథ్యంలో జింబాబ్వే- అఫ్గనిస్తాన్ మధ్య గురువారం రెండో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. అఫ్గన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకంతో మెరిశాడు. అటల్ 128 బంతుల్లో 104 పరుగులు చేయగా.. అబ్దుల్ 101 బంతుల్లో 84 పరుగులు రాబట్టాడు.ఇలా ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా(5), నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(1) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(30 బంతుల్లో 29 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా.. మహ్మద్ నబీ(16 బంతుల్లో 18) అతడికి సహకారం అందించాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ 5 పరుగులు చేశాడు.54 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే(17.5 ఓవర్లలో) కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ జయభేరి మోగించింది.తద్వారా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా సాధించిన 19 పరుగులే టాప్ స్కోర్. అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.సింగిల్ డిజిట్ స్కోర్లుఓపెనర్లు బెన్ కర్రన్(0), తాడివనాషి మరుమాణి(3).. అదే విధంగా మిగతా ఆటగాళ్లలో డియాన్ మైయర్స్(1), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(4), బ్రియాన్ బెనెట్(0), న్యూమన్ నియామురి(1), రిచర్డ్ ఎంగర్వ(8), ట్రెవర్ గ్వాండు(0), టినోడెండా మపోసా(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సీన్ విలియమ్స్ 16 పరుగులు చేయగలిగాడు.ఇక అఫ్గనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నవీద్ జద్రాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఫజల్హక్ ఫారూకీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు సెదికుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో వన్డే జరుగనుంది. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
AFG Vs BAN: రాణించిన మొహమ్మద్ నబీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. షార్జా స్టేడియంలో ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఏ స్టేడియం కూడా 300 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బకొట్టారు. షొరీఫుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నాడు.రాణించిన నబీ, షాహిది71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. షాహీది 92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మొహమ్మద్ నబీ 79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 5, సెదికుల్లా అటల్ 21, రహ్మత్ షా 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ 0, గుల్బదిన్ నైబ్ 22, రషీద్ ఖాన్ 10, ఖరోటే 27 (నాటౌట్), అల్లా ఘజన్ఫర్ 0, ఫజల్ హక్ ఫారూకీ 0 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆఖర్లో నబీ, ఖరోటే వేగంగా ఆడటంతో ఆఫ్ఘన్లు గౌరవప్రదమైన స్కోర్ చేశారు.అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. తంజిద్ హసన్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. సౌమ్య సర్కార్ 28, నజ్ముల్ హసన్ షాంటో 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అల్లా ఘజన్ఫర్కు తంజిద్ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 42 ఓవర్లలో మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. -
CT: మాతో పాటు టీమిండియా.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్
ICC Champions Trophy 2025: వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో క్రేజీ ఈవెంట్ క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. దాదాపు ఏడేళ్ల రీఎంట్రీ ఇవ్వనున్న ఈ ఐసీసీ టోర్నీ పాకిస్తాన్లో జరుగనుంది. 2017లో ట్రోఫీ గెలిచిన పాక్.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.అఫ్గనిస్తాన్ చేతిలో తొలి ఓటమిఅయితే, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బాబర్ ఆజం జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాక్ నిష్క్రమించింది. అంతేకాదు.. తమ వన్డే చరిత్రలో మొట్టమొదటిసారి అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూసింది.పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగాఈ నేపథ్యంలో దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు మళ్లీ పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వన్డే, టీ20 జట్ల పగ్గాలు చేపట్టాడు. కానీ పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగా.. పసికూన అమెరికా చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా చేరకుండానే పాక్ ఇంటిబాట పట్టడం గమనార్హం.సంచలన విజయాలతో అఫ్గన్ సెమీ ఫైనల్కుమరోవైపు.. అఫ్గనిస్తాన్ సంచలన విజయాలతో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దిగ్గజ జట్లకు షాకిచ్చి టాప్-4లో నిలిచింది. అయితే, సెమీస్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగినా.. ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది.చాంపియన్‌గా చాంపియన్గాఇక ఈ పొట్టి వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ తర్వాత జరుగబోయే తొలి ఐసీసీ ఈవెంట్ కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సెమీస్ చేరే జట్లు ఇవేచాంపియన్స్ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవేనంటూ అఫ్గనిస్తాన్‌తో పాటు.. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ పేర్లను చెప్పాడు. గత కొన్నాళ్లుగా వరుస వైఫల్యాలతో చతికిల పడ్డ ఆతిథ్య పాకిస్తాన్ పేరును షాహిది పక్కనపెట్టడం గమనార్హం. కాగా అఫ్గన్ ఇటీవలే తొలిసారిగా సౌతాఫ్రికాపై వన్డే విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న జోష్‌లో ఉంది.ఇదిలా ఉంటే.. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న చాంపియన్స్‌ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. తమకు తటస్థ వేదికలు కేటాయించాలని బీసీసీఐ కోరగా.. ఐసీసీ నుంచి ఇంత వరకు ఎలాంటి హామీ రాలేదని సమాచారం.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
సౌతాఫ్రికాతో అఫ్గన్ వన్డే సిరీస్.. స్టార్ స్పిన్నర్ రీఎంట్రీ
అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేయనున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా షార్జా వేదికగా అఫ్గన్ జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది.ఆ ఇద్దరు దూరంఇందుకు సెప్టెంబరు 18- 22 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. హహ్మతుల్లా షాహిది కెప్టెన్సీలోని ఈ టీమ్‌లోకి రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. మరో కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సైతం చీలమండ నొప్పి వల్ల సెలక్షన్‌కు అందుబాటులోకి రాలేకపోయాడని వెల్లడించింది.రషీద్ రావడం సంతోషంవీరి స్థానాల్లో అబ్దుల్ మాలిక్, దార్విష్ రసూలీలను జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా వెన్నునొప్పి కారణంగా రషీద్ ఖాన్ కొన్నిరోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తాము ఆడబోతున్న ఏకైక జట్టుకు రషీద్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అఫ్గన్ బోర్డు గతంలో విచారం వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు అతడు జట్టుతో చేరడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసింది.కివీస్‌తో టెస్టు మొదలుకాకుండానేఇక భారత్‌లోని నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఏకైక టెస్టుకు అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. నోయిడా స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో.. చిత్తడిగా మారిన అవుట్‌ఫీల్డ్ ఎండకపోవడంతో తొలిరెండు రోజుల ఆట రద్దైంది. ఇక మూడో రోజు నుంచి వర్షం మొదలుకావడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో సోమవారం మొదలుకావాల్సిన టెస్టు మ్యాచ్ నాలుగు రోజులైనా.. కనీసం టాస్ కూడా పడలేదు. శుక్రవారం నాటి ఐదో రోజు ఆట కూడా రద్దైతే.. అఫ్గన్-కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోనుంది.సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, దార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతి, అల్లా మొహమ్మద్ గజన్ఫర్, ఫజల్ హక్ ఫారూఖీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’
న్యూజిలాండ్‌తో తమ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నోయిడా స్టేడియంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కనీస వసతులు కూడా లేవంటూ పెదవి విరిచారు. ఇలాంటి చోట ఇంకోసారి అడుగు కూడా పెట్టబోమంటూ ఘాటు విమర్శలు చేశారు.తటస్థ వేదికలపైకాగా తమ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడుతోంది అఫ్గన్ జట్టు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్ వేదికగా ప్రత్యర్థి జట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ పాతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను హోం గ్రౌండ్‌గా చేసుకుని పలు మ్యాచ్‌లు ఆడింది అఫ్గన్ జట్టు. వర్షం కురవనేలేదు.. అయినా..ఈ క్రమంలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టుతో తొలిసారి టెస్టు ఆడేందుకు సిద్ధమైన మరోసారి నోయిడాకు విచ్చేసింది. అయితే, సోమవారం(సెప్టెంబరు 9) మొదలుకావాల్సిన అఫ్గన్- కివీస్ మ్యాచ్‌కు ప్రతికూల పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఫలితంగా ఇరుజట్ల మధ్య మొదలుకావాల్సిన ఏకైక టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. నిజానికి సోమవారం ఏమాత్రం వర్షం కురవనేలేదు. కానీ కొన్నిరోజుల పాటు కురిసిన కుండపోత వర్షాల వల్ల నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్ ఏమాత్రం అనుకూలంగా లేదు.ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేదుదీంతో ఆటగాళ్లు మైదానంలో దిగే అవకాశమే లేకపోవడంతో పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా చేసేదేమి లేక తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేకపోవడంతో మైదానం తడారిపోయేందుకు ఎండకాయాల్సిందే! కాబట్టి.. దీని కారణంగా మ్యాచ్‌పై ఎన్నిరోజులు ప్రభావం పడుతుందో స్పష్టంగా చెప్పడం కష్టం.చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోముఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇక్కడి పరిస్థితి చెత్తగా ఉంది. ఇంకోసారి ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాం. ఇక్కడ కనీస వసతులు లేవు. మా ఆటగాళ్లు కూడా నిరాశకు లోనయ్యారు. నిజానికి.. గతంలో మేము ఇక్కడకు వచ్చినపుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది.మాకు సొంతగడ్డ లాంటిదిఅందుకే ముందుగానే సంబంధిత అధికారులతో మాట్లాడాము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని స్టేడియం వాళ్లు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు కాగానే.. అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది బీసీసీఐ, ఏసీబీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తమకు సొంతగడ్డ లాంటిదని.. ఇక్కడ తాము ఆడబోయే మ్యాచ్‌కు మంచి వేదికను ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటంతో అతడు కూడా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కాగా 2017లో టెస్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి.. ఆరింట ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే! చదవండి: ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
Afg vs NZ Day 1: ఒక్క బంతి పడకుండానే ముగిసిన ఆట
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు మొదటిరోజే ఆటంకం కలిగింది. వర్షం తాలూకు ప్రభావం కారణంగా ఒక్క బంతి పడకుండానే తొలి రోజు ఆట ముగిసిపోయింది. ఫలితంగా మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించాలనుకున్న ఇరుజట్లకు చేదు అనుభవమే మిగిలింది.మూడింట విజయాలుకాగా 2017లో టెస్టు జట్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్... ఇప్పటి వరకు సంప్రదాయ ఫార్మాట్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. టీమిండియాతో ఒకటి, ఐర్లాండ్‌తో రెండు, బంగ్లాదేశ్‌తో రెండు, వెస్టిండీస్‌తో ఒకటి, జింబాబ్వేతో రెండు, శ్రీలంకతో ఒక టెస్టులో పాల్గొంది. వీటిలో జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్‌లపై ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆడేందుకు సిద్ధమైంది.ఆటగాళ్ల క్షేమమే ముఖ్యంతమదేశంలో ఇందుకు అనుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో భారత్ వేదికగా కివీస్‌తో పోటీకి అన్నిరకాలుగా సన్నద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా నోయిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవుట్‌ఫీల్డ్ మొత్తం పూర్తిగా తడిచిపోయింది. ఈరోజు కాస్త ఎండగానే ఉన్నా.. అవుట్‌ఫీల్డ్ మాత్రం పూర్తిగా ఆరలేదు.రోజుకొక అరగంట ఎక్కువ?గ్రౌండ్స్‌మెన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే.. ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్ట్యా తొలిరోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు కుమార్ ధర్మసేన, షర్ఫూద్దౌలా తెలిపారు. రేపటి నుంచి నాలుగురోజుల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు.అనూహ్య పరిస్థితుల్లో తొలిరోజు ఆట రద్దైన కారణంగా మిగిలిన నాలుగు రోజులు అరగంట ఎక్కువసేపు ఆట కొనసాగిస్తామని తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆట మొదలవుతుందని పేర్కొన్నారు. కాగా స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ గాయం కారణంగా కివీస్‌తో టెస్టుకు దూరమయ్యాడు.న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌కు న్యూజిలాండ్ జట్టుటామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, మ్యాచ్ హెన్రీ, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, విలియం ఒరూర్కీ. The buildup is 🔛!While we wait for the start of the game, check out these glimpses of the current scenes in Greater Noida. 👍#AfghanAtalan | #GloriousNationVictoriousTeam pic.twitter.com/aLC5SZGoaW— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2024 -
కివీస్‌తో టెస్టుకు అఫ్గన్ జట్టు ప్రకటన.. రషీద్ లేకుండానే!
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్‌లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది. నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానేఅయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్‌కు కీలకం కానున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్‌కు నో ప్లేస్అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు. ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట గెలిచింది.న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్. -
గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా
ICC WC 2023- Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ జట్టు ప్రదర్శన పట్ల అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి దాకా పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతమని ఆటగాళ్లను కొనియాడాడు. మెగా టోర్నీలో భాగం కావడం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని.. తమ భవిష్యత్తుకు అవెంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో పరాజయాలు చవిచూసిన అఫ్గనిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలిచి చరిత్ర సృష్టించిన అఫ్గన్.. అనంతరం శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లపై గెలిచింది. తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత ఈ నేపథ్యంలో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకున్న హష్మతుల్లా బృందం.. బంగ్లాదేశ్- శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత చాంపియన్ ట్రోఫీ-2025 బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలిచిన అఫ్గనిస్తాన్.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్‌డెర్ డసెన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) వాళ్లు అద్భుతం దీంతో పరాజయంతో ప్రపంచకప్ టోర్నీని ముగించింది. అయితే, ఇంతవరకు వరల్డ్‌కప్ చరిత్రలో తమకు సాధ్యం కాని విషయాలెన్నో ఈసారి చేసి చూపించింది అఫ్గనిస్తాన్ జట్టు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తొలిసారిగా వరల్డ్‌కప్‌లో అఫ్గన్ తరఫున సెంచరీ చేసి సత్తా చాటాడు. మరోవైపు.. బౌలింగ్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 97(నాటౌట్) పరుగులు చేయడం విశేషం. ఇక జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది బ్యాటర్‌గానూ రాణించాడు. టోర్నీలో మొత్తంలో 310 పరుగులు సాధించాడు. లోపాలు, బలహీనతలపై చర్చించాం ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లో తమ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన హష్మతుల్లా.. ‘‘టోర్నీ ఆసాంతం మా బ్యాటర్లు ఆడిన తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. ఆరంభంలో గెలుపు కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అయితే, లోపం ఎక్కడుంది.. మా బలహీనతలు ఏమిటన్న అంశంపై అందరం కూర్చుని చర్చించాం. దాని ఫలితమే ఈ విజయాలు. ఈ టోర్నీలో రాణించడం మాకు సానుకూలాంశం. మా స్పిన్ విభాగం పటిష్టమైందని అందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాటర్లు కూడా మెరుగ్గా ఆడటం మరింత ఉత్సాహాన్నిస్తోంది. అదొక్కటే షాకింగ్ ఈ టోర్నీ ద్వారా మేము పెద్ద జట్లపై కూడా గెలవగలమని.. గెలుపు కోసం ఆఖరి వరకు పోరాడగలమనే సందేశాన్ని క్రికెట్ ప్రపంచానికి అందించాం. అయితే, ఆస్ట్రేలియా విషయంలో ఆఖరి వరకు మ్యాచ్ మా చేతిలో ఉన్నా అనూహ్య రీతిలో చేజారిపోయింది. అదొక్కటే మాకు ఇప్పటికీ షాకింగ్‌గా ఉంది అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అఫ్గన్ విజయంపై ధీమాగా ఉన్న తరుణంలో.. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అజేయ ద్విశతకంతో ఆసీస్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. దీంతో అఫ్గనిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఇంటిబాట పట్టింది. చదవండి: ICC: శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత.. View this post on Instagram A post shared by ICC (@icc) -
చాలా బాధగా ఉంది.. ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము: ఆఫ్ఘన్ కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 3 వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 291 పరుగులు చేసిన ఆఫ్ఘన్లు ఓ దశలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించేలా కనిపించారు. అయితే మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ద్విశతకంతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఫ్ఘన్ల ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాక్సీ ఆఫ్ఘన్లకు విజయాన్ని దూరం చేయడంతో పాటు వారి సెమీస్ అవకాశాలను సైతం సంక్లిష్టం చేశాడు. ఊహించని ఈ ఓటమితో ఆఫ్ఘన్లు ఖంగుతిన్నారు. వారి బాధ వర్ణణాతీతంగా ఉంది. ఇది వారి కెప్టెన్ మాటల్లో స్పష్టంగా తెలిసింది. మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహీది మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది. మేం ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము. ఓ దశలో గెలుస్తామని పూర్తి విశ్వాసంగా ఉన్నాము. క్రికెట్ తమాషా ఆట. క్షణాల వ్యవధిలో ఫలితం తారుమారవుతుంది. మ్యాక్స్‌వెల్ మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. మా బౌలర్లు అద్భుతంగా ప్రారంభించారు. అయితే డ్రాప్ క్యాచ్‌లు మా కొంపముంచాయి. పలు మార్లు లైఫ్‌లు లభించిన అనంతరం మ్యాక్స్‌వెల్ ఆగలేదు. అతను ప్రతి రకమైన షాట్ ఆడాడు. క్రెడిట్ మొత్తం అతనికే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ సాగిన తీరు వర్ణణాతీతం. మా బౌలర్లు తమ వంతు ప్రయత్నం చేసినా అతను మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జారవిడిచిన క్యాచ్‌లకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ, జట్టు ప్రదర్శన పట్ల ఇప్పటికీ గర్వంగా ఉంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇదంతా ఆటలో భాగం. దక్షిణాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పుంజుకుంటాం. ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుం. అతన్ని చూస్తే గర్వంగా ఉంది. వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన మొదటి ఆఫ్ఘన్‌గా రికార్డుల్లోకెక్కినందుకు అతను కూడా గర్వపడాలి అని అన్నాడు. కాగా, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీం జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్ ఓ దశలో (91/7) ఓటమి కొరల్లో చిక్కుకుంది. అయితే మ్యాక్స్‌వెల్ అజేయ డబుల్ సెంచరీతో వారిని విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ తమ చివరి లీగ్ మ్యాచ్ (బంగ్లాదేశ్‌తో) ఆడాల్సి ఉంది. చదవండి: గొప్ప విజయం.. మ్యాక్సీని ఎలా పొగడాలో తెలియడం లేదు: కమిన్స్ -
WC 2023: సంచలన విజయాలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్..
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో సంచలన విజయాలు నమోదు చేసిన అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తొలిసారిగా అర్హత సాధించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య సోమవారం నాటి మ్యాచ్ ఫలితం తర్వాత ఈ మేరకు ఐసీసీ ఈవెంట్ బెర్తును ఖరారు చేసుకుంది. కాగా ఢిల్లీ వేదికగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. శ్రీలంకను 3 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో శ్రీలంక కూడా ఈ వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇప్పటికే బంగ్లా కూడా ఇదే తరహాలో ఇంటిబాట పట్టినప్పటికీ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. పాకిస్తాన్లో మెగా టోర్నీ ఇక 2025లో పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించాలంటే ఈ ప్రపంచప్‌లో పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలవాలని ఐసీసీ ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో బంగ్లా చేతిలో ఓటమితో శ్రీలంక ఎనిమిదో స్థానానికి పడిపోగా.. ఆరో స్థానంలో ఉన్న అఫ్గనిస్తాన్ తమ బెర్తును ఖాయం చేసుకుంది. కాగా పాకిస్తాన్ ఆతిథ్య జట్టు కాబట్టి ఆటోమేటిక్‌గా క్వాలిఫై కాగా.. టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. తాజాగా అఫ్గన్ కూడా ఆ జాబితాలో చేరింది. మిగతా రెండు స్థానాల కోసం బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు నెదర్లాండ్స్, ఇంగ్లండ్ కూడా పోటీపడనున్నాయి. సంచలనాలకు మారుపేరుగా.. 2015, 2019 వరల్డ్‌కప్ ఎడిషన్లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన అఫ్గనిస్తాన్ ఈసారి అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ముంబైలో మంగళవారం నాటి మ్యాచ్‌లో గనుక ఆస్ట్రేలియాను ఓడిస్తే అఫ్గన్‌కు ప్రపంచకప్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. చదవండి: టైమ్డ్ ఔట్ కాకుండా మరో విచిత్ర పద్దతిలో ఔట్.. అది కూడా ఈ ఏడాదిలోనే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అతడు ఎప్పుడూ ఇలాగే.. సెమీస్ చేరుతాం: అఫ్గనిస్తాన్ కెప్టెన్
ICC WC 2023- Afg Vs Ned- Hashmatullah Shahidi: ‘‘ఈరోజు మా బౌలర్లు రాణించారు. బ్యాట్‌తోనూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాం. లక్ష్యాన్ని ఛేదించాం. ఈ టోర్నీలో ఛేజింగ్‌లో విజయవంతం కావడం ఇది మూడోసారి. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇక మహ్మద్ నబీ గురించి చెప్పేదేముంది. అతడు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. ఎప్పుడూ ఇలాగే.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ పట్టుదలగా నిలబడతాడు. మేమంతా సమిష్టి కృషితో ఇక్కడి దాకా చేరుకున్నాం. ప్రతీ గెలుపును పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒకవేళ మేము గనుక ఆ ఫీట్ సాధిస్తే అంతకంటే పెద్ద విషయం మరొకటి ఉండదు’’ అని అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నాం వన్డే వరల్డ్‌కప్-2023లో జట్టు సాధిస్తున్న విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నామంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇలాగే ముందుకు సాగి సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నామని తెలిపాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో అఫ్గన్ జట్టు నాలుగో గెలుపు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే మూడు మాజీ చాంపియన్లను ఓడించిన హష్మతుల్లా బృందం శుక్రవారం నాటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) స్పిన్నర్ల ధాటికి అఫ్గన్ బౌలర్ల ధాటికి 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కీలక సమయంలో రనౌట్ల కారణంగా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అఫ్గన్ స్పిన్నర్లు మహ్మద్ నబీ మూడు, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఒకటి, నూర్ అహ్మద్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గన్‌ను డచ్ బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(10), ఇబ్రహీం జద్రాన్(20)లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు. హష్మతుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(52) అర్ద శతకం సాధించాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 56, అజ్మతుల్లా ఒమర్జాయ్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి అఫ్గన్‌కు విజయం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ ముగ్గురు రాణించడంతో 31.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించిన అఫ్గనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగపరచుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హష్మతుల్లా మాట్లాడుతూ.. ఈసారి తాము కచ్చితంగా సెమీ ఫైనల్ రేసులో నిలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల క్రితం మా అమ్మను కోల్పోయాం. మా కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మా దేశానికి చెందిన చాలా మంది శరణార్థులు బతుకుపోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల బాధను మేము అర్థం చేసుకోగలం. ఈ రోజు ఈ విజయాన్ని వాళ్లకు అంకితం చేస్తున్నాం’’ అని హష్మతుల్లా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ -
ICC World Cup: అఫ్గాన్ తీన్మార్...
ఇకపై తమ జట్టును కూనగా పరిగణించాల్సిన అవసరం లేదని అఫ్గానిస్తాన్ చాటి చెప్పింది. మేటి జట్లపై తాము సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని తమ నిలకడైన ప్రదర్శనతో నిరూపించింది. మూడోసారి వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఈసారి తమకంటే అన్ని విభాగాల్లో ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టిస్తూ ఔరా అనిపించింది.డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన ఉత్సాహంతో 1992 విశ్వవిజేత పాకిస్తాన్ జట్టును కూడా మట్టికరిపించిన అఫ్గానిస్తాన్ జట్టు తాజాగా 1996 ప్రపంచ చాంపియన్ శ్రీలంకను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పుణే: ప్రత్యర్థి జట్టు గత రికార్డు ఎలా ఉంటేనేమి తమదైన రోజున సమష్టిగా గర్జిస్తే అద్భుత ఫలితం సాధించవచ్చని వన్డే ప్రపంచకప్ టోరీ్నలో అఫ్గానిస్తాన్ జట్టు మూడోసారి నిరూపించింది. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ మూడో సంచలన విజయంతో అలరించింది. 1996 ప్రపంచ చాంపియన్ శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హష్మతుల్లా షాహిది నాయకత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి అబ్బురపరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (60 బంతుల్లో 49; 5 ఫోర్లు), కెపె్టన్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 39; 3 ఫోర్లు), సమరవిక్రమ (40 బంతుల్లో 36; 3 ఫోర్లు), తీక్షణ (31 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫజల్హక్ ఫారూఖీ (4/34) శ్రీలంక జట్టును దెబ్బ తీశాడు. ఒకదశలో 134/2తో పటిష్టస్థితిలో కనిపించిన శ్రీలంక నిసాంక అవుటయ్యాక తడబడింది. 107 పరుగుల తేడాలో ఏడు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో 100వ వన్డే ఆడిన రషీద్ ఖాన్ ఒక వికెట్ తీయగా, మరో స్పిన్నర్ ముజీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ 45.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గుర్బాజ్ (0) డకౌట్‌కాగా... రహ్మత్ షా (74 బంతుల్లో 62; 7 ఫోర్లు), హష్మతుల్లా షాహిది (74 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో అఫ్గానిస్తాన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. హష్మతుల్లా, అజ్మతుల్లా నాలుగో వికెట్‌కు అజేయంగా 111 పరుగులు జోడించడం విశేషం. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన అఫ్గానిస్తాన్... రెండో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి బోణీ కొట్టింది. మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 149 పరుగుల తేడాతో ఓడిపోయి... నాలుగో మ్యాచ్‌లో విజృంభించి 1992 విశ్వవిజేత పాకిస్తాన్‌పై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. అనంతరం అదే ఉత్సాహంతో శ్రీలంకను కూడా మట్టికరిపించి అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మూడోసారి వన్డే వరల్డ్‌కప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఒకే ప్రపంచకప్‌లో మూడు విజయాలు సాధించడం ఇదే ప్రథమం. 2015 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో నెగ్గిన అఫ్గానిస్తాన్... 2019 ప్రపంచకప్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ తమ కంటే మెరుగైన జట్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్‌లను నెదర్లాండ్స్ (నవంబర్ 3న), ఆ్రస్టేలియా (నవంబర్ 7న), దక్షిణాఫ్రికా (నవంబర్ 10న) జట్లతో ఆడుతుంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 46; దిముత్ కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫారూఖీ 15; కుశాల్ మెండిస్ (సి) నజీబుల్లా (సబ్) (బి) ముజీబ్ 39; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 36; అసలంక (సి) రషీద్ ఖాన్ (బి) ఫారూఖీ 22; ధనంజయ డిసిల్వా (బి) రషీద్ ఖాన్ 14; ఎంజెలో మాథ్యూస్ (సి) నబీ (బి) ఫారూఖీ 23; చమీర (రనౌట్) 1; తీక్షణ (బి) ఫారూఖీ 29; కసున్ రజిత (రనౌట్) 5; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–22, 2–84, 3–134, 4–139, 5–167, 6–180, 7–185, 8–230, 9–239, 10–241. బౌలింగ్: ముజీబ్ ఉర్ రెహ్మాన్ 10–0–38–2, ఫజల్లఖ్ ఫారూఖీ 10–1–34–4, నవీన్ ఉల్ హక్ 6.3–0–47–0, అజ్మతుల్లా ఒమర్జాయ్ 7–0–37–1, రషీద్ ఖాన్ 10–0–50–1, నబీ 6–0–33–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (బి) మదుషంక 0; ఇబ్రహీమ్ జద్రాన్ (సి) కరుణరత్నే (బి) మదుషంక 39; రహ్మత్ షా (సి) కరుణరత్నే (బి) రజిత 62; హష్మతుల్లా షాహిది (నాటౌట్) 58; అజ్మతుల్లా (నాటౌట్) 73; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (45.2 ఓవర్లలో మూడు వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–0, 2–73, 3–131. బౌలింగ్: మదుషంక 9–0–48–2, రజిత 10–0–48–1, మాథ్యూస్ 3–0–18–0, చమీర 9.2–0–51–0, తీక్షణ 10–0–55–0, ధనంజయ డిసిల్వా 4–0–21–0. -
వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్
వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ(58 నాటౌట్), ఒమర్జాయ్(72 నాటౌట్), రెహమత్ షా(62) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక రెండు, రజితా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సంక(46),కుశాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4, ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంతో అఫ్గాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. కాగా వన్డే వరల్డ్‌కప్‌లలో శ్రీలంకపై అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా ఈ టోర్నీలో అంతకుముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను అఫ్గాన్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం.. బాబర్ ఆజం ప్రైవేట్ చాట్ లీక్ -
చరిత్ర సృష్టించడానికే వచ్చాం.. నేను ముందే చెప్పా: అఫ్గాన్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో అఫ్గాన్ చిత్తు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం. ఈ చారిత్రత్మక విజయంలో అఫ్టాన్ బ్యాటర్లు గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) పరుగులతో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 283 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ 130 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత రెహమత్ షా, కెప్టెన్ షాహిది మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హసన్ అలీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గానిస్తాన్ కెప్టెన్ షాహిది స్పందిచాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. "ఈ విజయం మాకెంతో ప్రత్యేకం. మేము చాలా ప్రొఫెషనల్‌గా ఛేజ్ చేశాం. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇదే ఆట తీరును మా తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తాము. మేము గత రెండేళ్లుగా క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నాం. ఆసియాకప్‌లో కూడా మేము మంచి క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తూ టోర్నీ నుంచి బయటకు వచ్చాం. కానీ అదే పట్టుదలో భారత్‌కు వచ్చాం. మా దేశ ప్రజల కోసం ఈ టోర్నీని చరిత్రాత్మకం చేస్తామని ముందే చెప్పా. అందులో భాగాంగానే తొలుత ఇంగ్లండ్‌ను చిత్తు చేశాం.. ఇప్పుడు పాకిస్తాన్‌ను ఓడించాం. ఈ టోర్నీ అసాంతం ఇదే దృక్పథంతో ఆడుతాం. మా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. నూర్ అహ్మద్‌పై నమ్మకంతో ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చాం. అతడు మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తన టాలెంట్ ఎంటో చూపించాడు. ఇక గుర్భాజ్, ఇబ్రహీం ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు మా చేతిలోనే ఉంది. నేను రహమత్ కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పడం ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో షాహిది పేర్కొన్నాడు. చదవండి: AFG vs PAK: చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! క్రెడిట్ మాత్రం వారికే: బాబర్ ఆజం -
వారిని ఆపలేకపోయాం, మా ఫీల్డింగ్ చండాలం, క్యాచ్‌లే కొంపముంచాయి: ఆఫ్ఘన్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 149 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఓడించి, సంచలనం సృష్టించిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. ఫలితంగా వారు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. మరోపక్క న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసికట్టుగా మరో అద్భుత ప్రదర్శన చేసి, టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. విల్ యంగ్ (54), కెప్టెన్ టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు.. ముజీబ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్.. లోకీ ఫెర్గూసన్ (7-1-19-3), మిచెల్ సాంట్నర్ (7.4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (7-1-18-2), మ్యాట్ హెన్రీ (5-2-16-1), రచిన్ రవీంద్ర (5-0-34-1) ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మాత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (27) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కివీస్ చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహీది స్పందిస్తూ.. ముందుగా కివీస్‌కు శుభాకాంక్షలు. ఈ మ్యాచ్‌లో వారు చాలా బాగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు. మేము మాత్రం మా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. మా ఫీల్డింగ్ చాలా చండాలంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఫీల్డింగ్‌తో రాణించడం చాలా కష్టం. మా ఆటగాళ్లు వదిలేసిన క్యాచ్‌లే మా కొంపముంచాయి. ఆ కారణంగానే న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగలిగింది. ఆఖరి 6 ఓవర్లలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఒకవేళ ఆ క్యాచ్‌లు పట్టినట్లయితే ప్రత్యర్ధి ఇంత స్కోర్ చేసేది కాదు. టామ్, ఫిలిప్స్‌ను మేము నిలువరించలేకపోయాం. పిచ్ చాలా స్లోగా ఉండింది. మేము బాగా బౌలింగ్ చేసాము కానీ, ఫీల్డింగ్ మా కొంపముంచింది. మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో మా లోపాలను అధిగమించి విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. -
CWC 2023: టీమిండియా చేతిలో ఓటమికి అదే కారణంగా: ఆఫ్ఘన్ కెప్టెన్
న్యూఢిల్లీ వేదికగా టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. బుమ్రా (4/39), హార్దిక్ (2/43), శార్దూల్ (1/31), కుల్దీప్ (1/40) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను నామమాత్రపు స్కోర్‌కు కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. విరాట్ కోహ్లి (55 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి గల ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. బరిలోకి దిగే ముందు 300కు పైగా పరుగులు సాధించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండింది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాపై ఒత్తిడి తేవాలనుకున్నాం. ఈ విషయంలో మేం విఫలమయ్యాం. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాం. 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన అజ్మతుల్లాకు డాట్ బాల్స్ గురించి ఆలోచించకు, క్రీజ్‌లో కుదురుకున్నాక పరుగులు వాటంతటవే వస్తాయని చెప్పాను. మేమిద్దం కుదురుకోవడంతో మేం ఓ మోస్తరు స్కోర్ చేయగలిగాం. అయితే తాము చేసిన స్కోర్‌ను డిఫెండ్ చేసుకునే అవకాశాన్ని రోహిత్ మా నుంచి లాగేసుకున్నాడు. రోహిత్ మా బౌలర్లపై ఎదురుదాడికి దిగి మా ఆశలను నీరుగార్చడు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలి జరుగబోయే మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. టోర్నీలో మాకు ఇంకా ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో విజయాల కోసం ప్రయత్నిస్తాం. గతంలో జరిగిన తప్పిదాలు మున్ముందు పునరావృతం కాకుండా చూసుకుంటాం.