వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో అఫ్గాన్ చిత్తు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం. ఈ చారిత్రత్మక విజయంలో అఫ్టాన్ బ్యాటర్లు గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) పరుగులతో కీలక పాత్ర పోషించారు.
ముఖ్యంగా 283 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ 130 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత రెహమత్ షా, కెప్టెన్ షాహిది మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హసన్ అలీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గానిస్తాన్ కెప్టెన్ షాహిది స్పందిచాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
"ఈ విజయం మాకెంతో ప్రత్యేకం. మేము చాలా ప్రొఫెషనల్‌గా ఛేజ్ చేశాం. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇదే ఆట తీరును మా తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తాము. మేము గత రెండేళ్లుగా క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నాం. ఆసియాకప్‌లో కూడా మేము మంచి క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తూ టోర్నీ నుంచి బయటకు వచ్చాం.
కానీ అదే పట్టుదలో భారత్‌కు వచ్చాం. మా దేశ ప్రజల కోసం ఈ టోర్నీని చరిత్రాత్మకం చేస్తామని ముందే చెప్పా. అందులో భాగాంగానే తొలుత ఇంగ్లండ్‌ను చిత్తు చేశాం.. ఇప్పుడు పాకిస్తాన్‌ను ఓడించాం. ఈ టోర్నీ అసాంతం ఇదే దృక్పథంతో ఆడుతాం. మా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. నూర్ అహ్మద్‌పై నమ్మకంతో ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చాం.
అతడు మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తన టాలెంట్ ఎంటో చూపించాడు. ఇక గుర్భాజ్, ఇబ్రహీం ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు మా చేతిలోనే ఉంది. నేను రహమత్ కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పడం ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో షాహిది పేర్కొన్నాడు.
చదవండి: AFG vs PAK: చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! క్రెడిట్ మాత్రం వారికే: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment