అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేయనున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా షార్జా వేదికగా అఫ్గన్ జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది.
ఆ ఇద్దరు దూరం
ఇందుకు సెప్టెంబరు 18- 22 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. హహ్మతుల్లా షాహిది కెప్టెన్సీలోని ఈ టీమ్‌లోకి రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే.. మరో కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సైతం చీలమండ నొప్పి వల్ల సెలక్షన్‌కు అందుబాటులోకి రాలేకపోయాడని వెల్లడించింది.
రషీద్ రావడం సంతోషం
వీరి స్థానాల్లో అబ్దుల్ మాలిక్, దార్విష్ రసూలీలను జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా వెన్నునొప్పి కారణంగా రషీద్ ఖాన్ కొన్నిరోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తాము ఆడబోతున్న ఏకైక జట్టుకు రషీద్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అఫ్గన్ బోర్డు గతంలో విచారం వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు అతడు జట్టుతో చేరడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసింది.
కివీస్‌తో టెస్టు మొదలుకాకుండానే
ఇక భారత్‌లోని నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఏకైక టెస్టుకు అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. నోయిడా స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో.. చిత్తడిగా మారిన అవుట్‌ఫీల్డ్ ఎండకపోవడంతో తొలిరెండు రోజుల ఆట రద్దైంది.
ఇక మూడో రోజు నుంచి వర్షం మొదలుకావడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో సోమవారం మొదలుకావాల్సిన టెస్టు మ్యాచ్ నాలుగు రోజులైనా.. కనీసం టాస్ కూడా పడలేదు. శుక్రవారం నాటి ఐదో రోజు ఆట కూడా రద్దైతే.. అఫ్గన్-కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోనుంది.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, దార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతి, అల్లా మొహమ్మద్ గజన్ఫర్, ఫజల్ హక్ ఫారూఖీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment