
అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. యాభై మూడేళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత వరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా ఐదు వికెట్లతో చెలరేగి రేర్ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకీ అదేంటంటారా?!..
అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య యూఏఈ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. వన్డేల్లో ప్రొటిస్‌పై మొదటి విజయం అందుకున్న హష్మతుల్లా బృందం.. రెండో వన్డేలో సంచలన విజయం సాధించింది. బవుమా సేనను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
షార్జా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై నెగ్గి.. అఫ్గన్ సిరీస్ గెలవడంలో 26 ఏళ్ల రషీద్ ఖాన్‌ది కీలక పాత్ర. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు బౌల్ చేసిన ఈ స్పిన్ మాంత్రికుడు కేవలం 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ డి జోర్జి(17), ఐడెన్ మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2) రషీద్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం(సెప్టెంబరు 20) రషీద్ ఖాన్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలో వన్డే చరిత్రలో పుట్టినరోజున ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఈ అఫ్గన్ స్టార్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు తమ బర్త్‌డే నాడు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వెర్నర్ ఫిలాండర్ 2007లో ఐర్లాండ్ మీద 4/12, ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 2010లో ఆస్ట్రేలియా మీద 4/44 గణాంకాలు నమోదు చేశారు.
High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE
— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024
Comments
Please login to add a commentAdd a comment