న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్‌లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది.
నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానే
అయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్‌కు కీలకం కానున్నారు.
రహ్మనుల్లా గుర్బాజ్‌కు నో ప్లేస్
అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్‌లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్‌ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు.
ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్‌దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట గెలిచింది.
న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టు
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.
Comments
Please login to add a commentAdd a comment