Ibrahim Zadran
-
కివీస్‌తో టెస్టుకు అఫ్గన్ జట్టు ప్రకటన.. రషీద్ లేకుండానే!
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్‌లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది. నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానేఅయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్‌కు కీలకం కానున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్‌కు నో ప్లేస్అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు. ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట గెలిచింది.న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్. -
చెలరేగిన అఫ్గాన్ ఓపెనర్లు.. ఉగండా ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్భాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్ సాధించాడు. -
నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్
షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్ ఇషాక్ (27), సెదీఖుల్లా అటల్ (19), ఇజాజ్ అహ్మద్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, కర్టిస్ క్యాంపర్, డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్.. 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-9-4), నవీన్ ఉల్ హక్ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ, రషీద్ ఖాన్, ఖరోటే తలో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ (28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాత్ డెలానీ (21), హ్యారీ టెక్టార్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఐర్లాండ్ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
ఓపెనర్లుగా బాబాయ్-అబ్బాయ్.. ఒకరు హిట్టు, ఒకరు ఫట్టు
ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ జట్ల మధ్య అబుదాబీ వేదికగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 28) ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన బాబాయ్-అబ్బాయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అబ్బాయ్ ఇబ్రహీం జద్రాన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. బాబాయ్ నూర్ అలీ జద్రాన్ 7 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. బాబాయ్-అబ్బాయ్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ మ్యాచ్ బాబాయ్ నూర్ అలీ జద్రాన్‌కు అరంగేట్రం మ్యాచ్ కాగా.. అబ్బాయ్ ఇబ్రహీం జద్రాన్‌కు అప్పటికే ఐదు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 35 ఏళ్ల వయసున్న బాబాయ్ నూర్ అలీ.. 22 ఏళ్ల అబ్బాయ్ ఇబ్రహీం చేతుల మీదుగా టెస్ట్ అరంగేట్రం క్యాప్‌ను అందుకున్నాడు. కాగా, ఇబ్రహీం బాబాయ్ నూర్ అలీ లేటు వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడో 15 ఏళ్ల కిందటే జరిగింది. నూర్ అలీ 2009లోనే వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో నూర్ అలీ రెగ్యులర్ సభ్యుడు. నూర్ అలీ ఇప్పటివరకు 51 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇతను వన్డేల్లో సెంచరీ, ఏడు అర్ధసెంచరీల సాయంతో 1216 పరుగులు.. టీ20ల్లో 4 అర్దసెంచరీల సాయంతో 586 పరుగులు చేశాడు. మరోవైపు అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ ఇప్పటివరకు 6 టెస్ట్‌లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడి 5 సెంచరీలు, 13 అర్దసెంచరీల సాయంతో దాదాపు 2500 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన కెరీర్లో చేసిన ఐదు సెంచరీలు వన్డేల్లో చేసినవే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ చేసిన 53 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా ఉంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ కరీం జనత్ (41 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (20), నవీద్ జద్రాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఐదేసిన అదైర్.. రహ్మత్ షా (0), రహ్మానుల్లా గుర్బాజ్ (5), నసీర్ జమాల్ (0), జియా ఉర్ రెహ్మాన్ (6), నిజత్ మసూద్ (0), జహీర్ ఖాన్ (0) దారుణంగా విఫలమయ్యారు. మార్క్ అదైర్ (5/39) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించగా.. కర్టిస్ క్యాంఫర్, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు, బ్యారీ మెక్‌కార్తీ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు కావడం మరో విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. పీటర్ మూర్ (12), ఆండ్రూ బల్బిర్నీ (2), కర్టిస్ క్యాంఫర్ (49), వాన్ వోర్కమ్ (1) ఔట్ కాగా.. హ్యారీ టెక్టార్ (32), పాల్ స్టిర్లింగ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
జయసూర్య మాయాజాలం.. పసికూనపై ప్రతాపం చూపించిన శ్రీలంక
కొలొంబో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రభాత్ జయసూర్య తన స్పిన్ మాయాజాలంతో (8/174) ఆఫ్ఘన్ల పని పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జయసూర్య.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించి ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. అషిత ఫెర్నాండో (3/24), విశ్వ ఫెర్నాండో (4/51), ప్రభాత్ జయసూర్య (3/67) ధాటికి 198 పరుగులకు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), చండిమల్ (107) సెంచరీలతో కదంతొక్కారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4, నిజత్ మసూద్, కైస్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత గట్టిగా ప్రతిఘటించింది. ఇబ్రహీం జద్రాన్ (114), రహ్మత్ షా (54) రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆ జట్టు పటిష్ట స్థితికి చేరేలా కనిపించింది. అయితే జయసూర్య ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 213 పరుగులకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన ఆ జట్టు తమ చివరి తొమ్మిది వికెట్లను 83 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. జయసూర్య (5/107), అషిత ఫెర్నాండో (3/63), రజిత (2/59) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. 56 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. వికెట్ కూడా నష్టపోకుండా సునాయాసంగా విజయం సాధించింది. కరుణరత్నే 32, మధుష్క 22 పరుగులతో శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. -
విరాట్ కోహ్లిని ఫాలో అవుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఆటగాడు, ఆ జట్టు ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తన ఆరాధ్య ఆటగాడు విరాట్ కోహ్లిని ఫాలో అవుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కిన జద్రాన్.. కోహ్లి స్టైల్లోనే సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కెరీర్లో తొలి టెస్ట్ శతకం సాధించిన జద్రాన్.. కోహ్లి తరహాలో సెంచరీ పూర్తయ్యాక మెడలో ఉన్న గొలుసును ముద్దాడాడు. జద్రాన్ పరిమిత ఓవర్లలో కోహ్లిలానే 18 నంబర్ జెర్సీని ధరిస్తాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్ చేసిన సెంచరీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది కేవలం నాలుగో సెంచరీ మాత్రమే. జద్రాన్‌కు ముందు హష్మతుల్లా షాహీది (200 నాటౌట్), ఆస్గర్ అఫ్ఘాన్ (164), రహ్మత్ షా (102) మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్ సెంచరీలు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 241 పరుగులు వెనుకపడి ఉన్నప్పుడు) జద్రాన్ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 217 పరుగులు ఎదుర్కొన్న జద్రాన్ 11 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జద్రాన్‌కు జతగా రహ్మత్ షా (46) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ మెరుగైన స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 42 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌తో జద్రాన్ బాబయ్ నూర్ అలీ జద్రాన్ (31, 47) టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఏకంగా నలుగురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు (నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం) టెస్ట్ అరంగేట్రం చేశాడు. కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 2న మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), చండీమల్ (107) సెంచరీలతో చెలరేగగా.. కరుణరత్నే అర్దసెంచరీతో (77) రాణించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4, నిజత్ మసూద్, కైస్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ చేతుల మీదుగా నూర్ అలీ జద్రాన్ టెస్ట్ అరంగేట్రం క్యాప్ అందుకున్నాడు. ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏముందని అనుకుంటున్నారా..? నూర్ అలీ జద్రాన్.. ఇబ్రహీం జద్రాన్‌ను స్వయానా బాబాయ్ అవుతాడు. ఇలా అబ్బాయి.. బాబాయ్‌ను జట్టులోకి ఆహ్వానించిన ఘటనలు క్రికెట్లో చాలా అరుదు. జద్రాన్ వయసు ప్రస్తుతం 22 ఏళ్లు కాగా.. నూర్ అలీ జద్రాన్ వయసు 35 సంవత్సరాలు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. బాబయ్, అబ్బాయిలు కలిసి శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. బాబాయ్-అబ్బాయిలు ఆఫ్ఘన్ ఓపెనింగ్ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బాబాయ్ నూర్ అలీ జద్రాన్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ డకౌటై నిరాశపరిచాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే సరికి పరిప్థితి మారిపోయింది. ఈసారి బాబాయి, అబ్బాయి ఇద్దరూ రాణించారు. బాబాయ్ నూర్ అలీ జద్రాన్ 47 పరుగులతో ఆకట్టుకోగా.. అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ 77 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించారు. బాబాయ్ నూర్ అలీ జద్రాన్ లేటు వయసులో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడో 15 ఏళ్ల కిందటే జరిగింది. నూర్ అలీ 2009లోనే వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో నూర్ అలీ రెగ్యులర్ సభ్యుడు. నూర్ అలీ ఇప్పటివరకు 51 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇతను వన్డేల్లో సెంచరీ, ఏడు అర్ధసెంచరీల సాయంతో 1216 పరుగులు.. టీ20ల్లో 4 అర్దసెంచరీల సాయంతో 586 పరుగులు చేశాడు. మరోవైపు అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ ఇప్పటివరకు 6 టెస్ట్‌లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడి 5 సెంచరీలు, 13 అర్దసెంచరీల సాయంతో దాదాపు 2500 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన కెరీర్లో చేసిన ఐదు సెంచరీలు వన్డేల్లో చేసినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 2న మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), చండీమల్ (107) సెంచరీలతో చెలరేగగా.. కరుణరత్నే అర్దసెంచరీతో (77) రాణించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4, నిజత్ మసూద్, కైస్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన ఆఫ్ఘన్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో గట్టిగా పుంజుకున్నారు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (82), రహ్మత్ షా (41) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్లు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 66 పరుగులు వెనుకపడి ఉన్నారు. -
Ind vs Afg: ఉత్కంఠ పోరులో అఫ్గన్‌పై భారత్ విజయం.. సిరీస్ కైవసం
India vs Afghanistan 3rd T20I- Updates: అఫ్గన్‌పై భారత్ విజయం సాధించింది. దాంతో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో సూపర్ ఓవర్లో తేలిన మ్యాచ్ ఫలితం. తొలి సూపర్ ఓవర్లో 16 పరుగులు చేసిన ఇరు జట్లు రెండో సూపర్ ఓవర్లో ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపొందింది. స్కోర్లు IND 212/4 (20), AFG 212/6 (20) మొదటి సూపర్ ఓవర్లో కూడా మ్యాచ్ టై అయింది. అఫ్గన్ ఆరు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్ టై అయింది (సూపర్ ఓవర్ ప్రోగ్రెస్‌లో ఉంది) 16.2: నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గన్ సుందర్ బౌలింగ్‌లో నబీ అవుట్.. స్కోరు 164/4 (16.3) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ 12.4: అజ్మతుల్లా అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 12.4: సుందర్ బౌలింగ్‌లో జద్రాన్ స్టంపౌట్. 10.6: తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గుర్బాజ్ అవుట్. వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 93-1(11 ఓవర్లలో). పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 51/0 (6) ►నిలకడగా ఆడుతున్న అఫ్గన్ ఓపెనర్లు.. ఇబ్రహీం జద్రాన్ 28, రహ్మనుల్లా గుర్బాజ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. శతక్కొట్టిన రోహిత్.. రింకూ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్ బెంగళూరు వేదికగా అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు రింకూ సింగ్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 212 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో చెలరేగగా.. రింకూ 39 బంతుల్లో 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా ఐదో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో తన అత్యధిక స్కోరు నమోదు చేసి దటీజ్ హిట్‌మ్యాన్ అనిపించుకున్నాడు. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 18.6: రింకూ సింగ్ హాఫ్ సెంచరీ రోహిత్ 104, రింకూ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. 18.4: శతక్కొట్టిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 5 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర. దటీజ్ హిట్‌మ్యాన్ అంటూ ప్రశంసల జల్లు దంచి కొడుతున్న రోహిత్, రింకూ.. టీమిండియా స్కోరు: 144/4 (17) రోహిత్ 57 బంతుల్లో 80, రింకూ సింగ్ 32 బంతుల్లో 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న రోహిత్, రింకూ సింగ్ 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 131/4 100 పరుగుల భాగస్వామ్యం 15.3: సలీం సఫీ నోబాల్.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. 12.6: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అఫ్గన్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన రోహిత్ శర్మ.. మూడో టీ20 అర్ధ శతకంతో మెరిశాడు. 13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 97-4. రింకూ 30 పరుగులతో రోహిత్‌కు తోడుగా ఉన్నాడు. నిలకడగా రోహిత్.. స్పీడు పెంచిన రింకూ 12: వరుసగా రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ . 12 వ ఓవర్ ముగిసే సరికి రోహిత్ 41, రింకూ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు- 61/4 రోహిత్ 27, రింకూ 19 పరుగులతో ఉన్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసే దిశగా వెళ్తున్నారు. ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 48-4 పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 30-4 రోహిత్ 13, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. సంజూ శాంసన్ డకౌట్ 4.3: ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంజూ. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వికెట్ కీపర్ బ్యాటర్. సంజూ స్థానంలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ 8 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 22-4 (5 ఓవర్లు) దూబే అవుట్.. మూడో వికెట్ డౌన్ 3.6: అజ్మతుల్లా బౌలింగ్‌లో శివం దూబే వికెట్ కీపర్ క్యాచ్‌గా అవుటయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అర్ధ శతకాలు బాదిన ఈ ఆల్‌రౌండర్.. బెంగళూరులో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. దూబే స్థానంలో సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-3(4) కోహ్లి డకౌట్.. టీమిండియా స్కోరు 19-2(3) 2.4: ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో కోహ్లి ఇలా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ కావడం ఇదే తొలిసారి. కాగా ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అతడి స్థానంలో శివం దూబే క్రీజులోకి వచ్చాడు. రోహిత్ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 2.3: యశస్వి జైస్వాల్(4) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియన్ చేరగా.. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 13-0 టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి, రోహిత్ 1.3: ఎట్టకేలకు రీఎంట్రీలో.. ఈ సిరీస్‌లోనూ పరుగుల ఖాతా తెరిచిన రోహిత్. అజ్మతుల్లా బౌలింగ్‌లో సింగిల్ తీసిన హిట్‌మ్యాన్. సంజూకు ఛాన్స్ తొలి రెండు మ్యాచ్‌లలో మొదట బౌలింగ్ చేశాం కాబట్టి.. ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.అదే విధంగా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు హిట్‌మ్యాన్ వెల్లడించాడు. నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా భిన్నమైన కాంబినేషన్లు ట్రై చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే.. అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్లకు తుదిజట్టులో చోటిచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. క్లీన్‌స్వీప్‌పై కన్ను కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు భారత జట్టు ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ఇది. ఇందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్ సేన... అఫ్గన్‌తో మూడో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌తో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అఫ్గనిస్తాన్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా తాము కూడా తుదిజట్టులో మూడు మార్పులు చేసినట్లు అఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్‌లను ఆడించనున్నట్లు వెల్లడించాడు. తుదిజట్లు టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్. అఫ్గనిస్తాన్ రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
Ind Vs Afg: దూబే ధనాధన్ ఇన్నింగ్స్.. టీమిండియాదే సిరీస్
India vs Afghanisthan 2nd T20I 2024 Updates: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇండోర్ మ్యాచ్‌లో జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 68 పరుగులతో దంచికొట్టగా.. ఆల్‌రౌండర్ శివం దూబే 30 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా రోహిత్ సేన అఫ్గన్‌తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 164/4 విజయానికి 9 పరుగుల దూరంలో టీమిండివయా. దూబే 62, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ 12.6: జితేశ్ శర్మ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా. శివం దూబే 12.3: కరీం జనత్ బౌలింగ్‌లో జైస్వాల్ ఔట్. 11.6: దూబే ధనాధన్ హాఫ్ సెంచరీ 22 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న శివం దూబే 9.1: జైస్వాల్ హాఫ్ సెంచరీ 27 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్న యశస్వి జైస్వాల్. మరో ఎండ్‌లో శివం దూబే(15 బంతుల్లో 34 పరుగులు) కూడా జోరుగా ఆడుతున్నాడు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 116/2. విజయానికి 57 పరుగుల దూరం ఉంది. 5.3: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో కోహ్లి పెవిలియన్ చేరాడు. 16 బంతులు ఎదుర్కొని 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దంచి కొడుతుండటంతో పవర్ ప్లేలో భారత్ 69-2 స్కోరు చేయగలిగింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు: 32-1 కోహ్లి 12, యశస్వి 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ మళ్లీ డకౌట్ 0.5: టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫజల్హక్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. కాగా తొలి టీ20లోనూ హిట్‌మ్యాన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. టార్గెట్ 173 టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ తీశారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో 4 వికెట్లు కోల్పోయిన అఫ్గనిస్తాన్ 19.6: ఫజల్హక్ రనౌట్ 19.6 వైడ్: తొమ్మిది బంతుల్లోనే 21 పరుగులు చేసిన ముజీబ్ రనౌట్ 19.5: నూర్ అహ్మద్ అవుట్(1). 19.1: ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గన్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో కరీం జనత్(20) అవుట్. నూర్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. నజీబుల్లా అవుట్ 17.1: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన నజీబుల్లా. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ముజీబ్ ఉర్ రహ్మాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 144-6(18). 15 ఓవర్లలో అఫ్గన్ స్కోరు: 109-5 నజీబుల్లా 4, కరీముల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గన్ 14.2: మహ్మద్ నబీ రూపంలో అఫ్గనిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి నబీ 14 పరుగుల వద్ద నిష్క్రమించాడు. కరీం జనత్ క్రీజులోకి వచ్చాడు. అర్ధ శతక వీరుడు అవుట్ 11.3: అర్ధ శతకంతో జోరు మీదున్న గుల్బదిన్‌ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు పంపాడు. 35 బంతుల్లో 57 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి గుల్బదిన్ అవుట్ అయ్యాడు. దీంతో అఫ్గన్ నాలుగో వికెట్ కోల్పోయింది. నజీబుల్లా జద్రాన్ క్రీజులోకి వచ్చాడు. గుల్బదిన్ హాఫ్ సెంచరీ 9.5: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గుల్బదిన్. 27 బంతుల్లోనే అతడు 50 పరుగుల మార్కును అందుకున్నాడు. మరోవైపు.. నబీ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు. స్కోరు: 81/3 (10). మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 6.5: శివం దూబే బౌలింగ్‌లో ఒమర్జాయ్(2) క్లీన్ బౌల్డ్. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్. మహ్మద్ నబీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 60-3(7) రెండో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 5.4: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్(8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58-2(6) హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అఫ్గనిస్తాన్ వన్‌డౌన్ బ్యాటర్ గుల్బదిన్ దంచికొడుతున్నాడు. 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి దూకుడు మీద ఉన్నాడు. దీంతో 5 ఓవర్లలోనే అఫ్గన్ 50 పరుగుల మార్కు అందుకుంది. గుల్బదిన్తో పాటు జద్రాన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్ 2.2: భారత స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి రహ్మనుల్లా గుర్బాజ్(14) అవుటయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రూపంలో అఫ్గన్ తొలి వికెట్ కోల్పోయింది. గుల్బదిన్ నైబ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 22-1 (3). బ్యాటింగ్ చేస్తున్న అఫ్గనిస్తాన్ టాస్ గెలిచిన టీమిండియా ఆహ్వానం మేరకు అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి అఫ్గన్ స్కోరు: 20/0. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ 4, రహ్మనుల్లా గుర్బాజ్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య రెండో టీ20 మొదలైంది. ఇండోర్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రన్‌మెషీన్ రీఎంట్రీ ఇక.. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. ఈ రన్‌మెషీన్ రాకతో హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై వేటు పడింది. గిల్‌కు నో ఛాన్స్ అదే విధంగా.. గజ్జల్లో గాయం కారణంగా మొదటి టీ20కి దూరమైన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తిరిగి వచ్చాడు. దీంతో శుబ్‌మన్ గిల్‌కు భారత తుదిజట్టులో చోటు దక్కలేదు. రోహిత్‌కు జోడీగా యశస్వి ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఈ మేరకు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగగా.. అఫ్గనిస్తాన్ ఒక మార్పుతో మైదానంలో దిగనుంది. రహ్మత్ షా స్థానంలో నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చినట్లు అఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ వెల్లడించాడు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే 1-0తో అఫ్గన్ కంటే ముందంజలో ఉంది. తుది జట్లు ఇవే టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్. అఫ్గనిస్తాన్ రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్. -
టీమిండియాతో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన జద్రాన్ బృందం
టీమిండియాతో తొలి టీ20లో అఫ్గనిస్తాన్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టుపై పొట్టి ఫార్మాట్లో తమకున్న రికార్డును జద్రాన్ బృందం తాజాగా బ్రేక్ చేసింది. టీ20 సిరీస్ ఆడేందుకు తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న అఫ్గనిస్తాన్‌కు 22 ఏళ్ల బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్నునొప్పి సర్జరీ కారణంగా ఆటకు దూరం కాగా.. అతడి స్థానంలో జద్రాన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో మొహాలీ వేదికగా మొదటి టీ20లో టాస్ ఓడిన అఫ్గనిస్తాన్ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(23), ఇబ్రహీం జద్రాన్(25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 29 పరుగులతో రాణించాడు. Nabi power 💪🔥 The Afghan veteran is striking them hard in the 1st #INDvAFG T20I! 🙌#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #GiantsMeetGameChangers pic.twitter.com/BMMMJEnB3G — JioCinema (@JioCinema) January 11, 2024 అరంగేట్ర ప్లేయర్ రహ్మత్ షా(3) విఫలం కాగా.. మహ్మద్ నబీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో నజీబుల్లా 11 బంతుల్లో 19, కరీం జనత్ 5 బంతుల్లో 9 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో అఫ్గన్ 158 పరుగులు స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. శివం దూబే ఒక వికెట్ దక్కించుకున్నాడు. రవి బిష్ణోయి 3 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియాపై టీ20లలో అఫ్గనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా అబుదాబిలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గన్ ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తాజాగా జద్రాన్ బృందం ఆ రికార్డును తిరగరాసి చరిత్ర సృష్టించింది. -
Ind vs Afg: రీఎంట్రీలో రోహిత్ డకౌట్! తప్పు తనదే అయినా..
Ind vs Afg 1st T20I Rohit Sharma Duck Out: అఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే సున్నా చుట్టి నిష్క్రమించాడు. దీంతో టీమిండియా తరఫున రీఎంట్రీలో రోహిత్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది. హిట్‌మ్యాన్ సైతం ఊహించని ఈ పరిణామంతో కంగుతిని గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డగౌట్ చేరాడు. ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్ శర్మ పేరు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో పాపం.. రోహిత్ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్ చేస్తున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో రెండో బంతికే టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. Nabi power 💪🔥 The Afghan veteran is striking them hard in the 1st #INDvAFG T20I! 🙌#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #GiantsMeetGameChangers pic.twitter.com/BMMMJEnB3G — JioCinema (@JioCinema) January 11, 2024 ఫజల్హక్ ఫారూకీ బౌలింగ్‌లో రోహిత్ మిడాఫ్ దిశగా షాట్‌కి యత్నించాడు. ఈ క్రమంలో పరుగు తీసేందుకు వెళ్లగా గిల్‌తో సమన్వయలోపం ఏర్పడింది. అప్పటికే అద్భుతరీతిలో డైవ్ చేసిన అఫ్గన్ కెపెన్ జద్రాన్ బంతి దాటిపోకుండా ఆపేశాడు. కానీ అప్పటికే క్రీజు వీడిన రోహిత్.. గిల్‌ను రమ్మని పిలవగా బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన అతడు అక్కడే ఉండిపోయాడు. అయితే, తాను అవుట్ కావడంతో రోహిత్ శర్మ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.మరోవైపు.. జద్రాన్, వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ కలిసి రోహిత్ రనౌట్‌లో పాలుపంచుకున్నారు. బిగ్‌వికెట్ దక్కడంతో అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. -
అఫ్గన్ బ్యాటింగ్ సంచలనం.. 22 ఏళ్ల కెప్టెన్! రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ!
ఇబ్రహీం జద్రాన్.. ఒకప్పుడు జట్టులో చోటే కరువు.. కానీ ఇప్పుడు.. అఫ్గనిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు.. కెప్టెన్‌గానూ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తద్వారా భారత్ వేదికగా పటిష్ట టీమిండియాతో తొలిసారిగా తలపడే టీ20 జట్టుకు సారథిగా వ్యవహరించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. రోహిత్ సేనను చూసి భయపడే ప్రసక్తే లేదని.. ఇలాంటి బలమైన జట్టుతో పోటీపడటం కంటే మజానిచ్చే సవాల్ మరొకటి ఉండదంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాడీ 22 ఏళ్ల యువ బ్యాటర్. టీమిండియాతో సిరీస్‌లో తాము కచ్చితంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తమ దేశ ప్రజలకు ప్రస్తుతం వినోదం అందించే ఏకైక అంశం క్రికెట్ మాత్రమే అని.. వారి ముఖాల్లో చిరునవ్వు నింపేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెబుతున్నాడు. ఇంతకీ సాదాసీదా ఇబ్రహీం జద్రాన్ బ్యాటింగ్ సెన్సేషన్‌గా ఎలా మారాడు?! జట్టులో తనకన్నా సీనియర్లు ఉన్నా తాత్కాలిక కెప్టెన్‌గా మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచడానికి కారణం ఏమిటి?! భారత్‌లోనే అరంగేట్రం భారత్ వేదికగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అఫ్గనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు జద్రాన్. విండీస్‌తో ఆఖరి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్న అతడు కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. పూర్తిగా విఫలం అయినప్పటికీ వెస్టిండీస్‌తో తదుపరి జరిగిన టీ20 సిరీస్‌లో జద్రాన్ ఆడించేందుకు సెలక్టర్లు నిర్ణయించారు. అయితే, ఈసారి కూడా అతడు పూర్తిగా నిరాశపరిచాడు. అరంగేట్ర టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 14 పరుగులు(2,11,1) మాత్రమే చేసి పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టులో సక్సెస్ అయినా.. డొమెస్టిక్ క్రికెట్ గణాంకాల దృష్ట్యా మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది.. అదే ఏడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది. ఈసారి తనపై సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. బంగ్లాదేశ్‌తో 2019లో జరిగిన మ్యాచ్‌లో జద్రాన్ 108 పరుగులతో సత్తా చాటాడు. వన్డేల్లో సంచలనాలు సృష్టిస్తూ ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌పై మరింత దృష్టి సారించిన ఇబ్రహీం జద్రాన్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో 2022లో జరిగిన సిరీస్ సందర్భంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 138 బంతుల్లోనే 162 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. జద్రాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. ప్రపంచకప్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ మ్యాచ్‌తో క్రికెట్ ప్రేమికుల దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ఇబ్రహీం జద్రాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇబ్రహీం జద్రాన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో శతకం బాదిన ఈ యువ బ్యాటర్.. అఫ్గనిస్తాన్ తరఫున వరల్డ్‌కప్ ఈవెంట్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత పిన్న వయసులో(21 ఏళ్ల 330 రోజులు) శతకం బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. సచిన్, కోహ్లిలను వెనక్కినెట్టి ఈ లిస్టులో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(22 ఏళ్ల 300 రోజులు), రన్‌మెషీన్ విరాట్ కోహ్లి(22 ఏళ్ల 106 రోజులు)లను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు అఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్కు అందుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అఫ్గన్ తరఫున ఏకైక సెంచరీ ఇక.. నాడు ముంబైలో ఆసీస్‌తో నువ్వా- నేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్ 143 బంతులు ఎదుర్కొని 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో అఫ్గనిస్తాన్ తమ అత్యధిక స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రపంచప్-2023లో మొత్తంగా ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 376 పరుగులు సాధించాడీ కుర్ర బ్యాటర్. అఫ్గన్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి ఆ జట్టు భవిష్యత్ ఆశాకిరణం అనే నమ్మకం కలిగించాడు. కెప్టెన్‌గా తొలి విజయం ఈ నేపథ్యంలో... ఈ మెగా టోర్నీ తర్వాత అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ ఆడేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లింది. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యం వహించాల్సింది. కానీ అతడు వెన్నునొప్పి కారణంగా దూరం కావడంతో ఇబ్రహీం జద్రాన్‌ను అదృష్టం వరించింది. రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ కెప్టెన్‌గా యూఏఈతో సిరీస్‌లో బరిలోకి దిగిన అతడు 2-1తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో టీమిండియాతో సిరీస్‌కు అందుబాటులో ఉన్నపటికీ రషీద్ పూర్తిగా కోలుకోకపోవడంతో మరోసారి కెప్టెన్‌గా జద్రాన్ వైపు మొగ్గు చూపింది మేనేజ్మెంట్. రోహిత్ సేనతో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌కు రషీద్ ఖాన్‌ను ప్లేయర్‌గా ఎంపిక చేసి సారథ్య బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్‌కు అప్పగించింది. ఈ టూర్లో గనుక 22 ఏళ్ల ఇబ్రహీం బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటితే అతడికి ఇక ఎదురు ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ కెరీర్లో ఇలా.. ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్లో సత్తా చాటిన అఫ్గనిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన ఇబ్రహీం జద్రాన్ ఇప్పటి వరకు 5 టెస్టులు, 28 వన్డేలు, 27 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 362, 1284, 616 పరుగులు సాధించాడు. పార్ట్‌టైమ్ రైటార్మ్ పేసర్ అయిన అతడి ఖాతాలో ఒక వికెట్ కూడా ఉందండోయ్!! అన్నట్లు ఇబ్రహీం జద్రాన్ అఫ్గనిస్తాన్‌లోని కోస్త్ ప్రాంతానికి చెందినవాడు. చదవండి: Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్ -
అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Afghanistan tour of India, 2024: టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో మూడు టీ20లలో పోటీపడనుంది. ఈ సిరీస్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో 14 నెలల తర్వాత పునరాగమనం చేస్తున్నారు. వీళ్లిద్దరి రాకతో.. పండుగ వేళ ఈ సిరీస్ మరింత హైలైట్ కానుంది. కాగా అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ గాయం కారణంగా మైదానంలో దిగే పరిస్థితి లేకపోవడంతో.. యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అఫ్గన్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇలా ఓవైపు స్టార్ల రాకతో టీమిండియా మరింత పటిష్టకాగా.. నంబర్ 1 జట్టుతో ఢీకొట్టేందుకు అఫ్గనిస్తాన్ కూడా సై అంటోంది. రోహిత్ సేనకు గట్టి పోటీనిచ్చి.. అండర్డాగ్స్ అనే ముద్రను చెరిపివేసుకోవడమే లక్ష్యంగా భారత్‌లో అడుగుపెడుతున్నట్లు చెబుతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు మీకోసం.. టీమిండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ►తొలి టీ20: జనవరి 11- పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలీ, పంజాబ్ ►రెండో టీ20: జనవరి 14- హోల్కర్ క్రికెట్ స్టేడియం- ఇండోర్, మధ్యప్రదేశ్ ►మూడో టీ20: జనవరి 17- ఎం. చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు, కర్ణాటక. మ్యాచ్ ఆరంభ సమయం భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? ►ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లను భారత్‌లో స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ►ఇక డిజిటల్ మాధ్యమంలో జియో సినిమా యాప్, వెబ్సైట్లో ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. మొహాలీ చేరుకున్న అఫ్గనిస్తాన్ జట్టు టీమిండియాతో సిరీస్ కోసం అఫ్గన్ జట్టు ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో మొహాలీకి చేరుకుంది. కాగా ఈ సిరీస్ కంటే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించిన అఫ్గనిస్తాన్ జట్టు 2-1తో ట్రోఫీ గెలిచింది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. చదవండి: #ExploreIndianIslands: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు: మాల్దీవులకు వెళ్లొద్దంటున్న క్రికెటర్లు! -
టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్‌కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్‌గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్‌ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్‌కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం
యూఏఈతో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తయ్యాక గుర్బాజ్ మరో రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. గుర్బాజ్‌కు టీ20ల్లో ఇది తొలి శతకం. ఆఫ్ఘనిస్తాన్ తరఫున 44 మ్యాచ్‌లు ఆడిన గుర్బాజ్.. సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 1143 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. గుర్బాజ్ ఐపీఎల్లో గుజరాత్, కేకేఆర్‌ల తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 133.53 స్ట్రయిక్‌రేట్‌తో 227 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుర్బాజ్‌తో పాటు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 18 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 173/2గా ఉంది. జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ, అయాన్ అఫ్జల్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్.. యూఏఈలో పర్యటిస్తుండగా, షార్జాలో ఇవాళ (డిసెంబర్ 29) తొలి టీ20 జరుగుతుంది. -
అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్..
యూఏఈతో జరగనున్న టీ20 సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు అఫ్గాన్ రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌కు జట్టు పగ్గాలను అఫ్గాన్ సెలక్టర్లు అప్పగించారు. అదే విధంగా ఈ జట్టులో పేసర్లు ఫజల్హక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్కు చోటు దక్కింది. కాగా వీరిద్దరిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అయితే వీరు అఫ్గాన్ సెంట్రల్ కాంట్రాక్టులను వదులకోనున్నారని వార్తలు వినిపించాయి. కానీ వీరు ఫ్రాంచైజీ క్రికెట్ కంటే జాతీయ జట్టు తరపున ఆడేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే యూఏఈ సిరీస్‌కు సెలక్టర్లు వీరిద్దరిని ఎంపిక చేశారు. డిసెంబర్ 29 నుంచి షార్జా వేదికగా జరగనున్న తొలి టీ20తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు షార్జా వేదికగానే జరగనున్నాయి. అఫ్గానిస్తాన్ టీ20 జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్, హజ్రతుల్లా జజాయ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, దర్విష్ రసూలీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మౌల్లా ఒమర్జాయ్, ఎఫ్ షరఫుద్దీనాల్, ఎఫ్. అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్ మరియు కైస్ అహ్మద్. చదవండి: IND vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. -
గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా
ICC WC 2023- Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ జట్టు ప్రదర్శన పట్ల అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి దాకా పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతమని ఆటగాళ్లను కొనియాడాడు. మెగా టోర్నీలో భాగం కావడం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని.. తమ భవిష్యత్తుకు అవెంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో పరాజయాలు చవిచూసిన అఫ్గనిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలిచి చరిత్ర సృష్టించిన అఫ్గన్.. అనంతరం శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లపై గెలిచింది. తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత ఈ నేపథ్యంలో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకున్న హష్మతుల్లా బృందం.. బంగ్లాదేశ్- శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత చాంపియన్ ట్రోఫీ-2025 బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలిచిన అఫ్గనిస్తాన్.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్‌డెర్ డసెన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) వాళ్లు అద్భుతం దీంతో పరాజయంతో ప్రపంచకప్ టోర్నీని ముగించింది. అయితే, ఇంతవరకు వరల్డ్‌కప్ చరిత్రలో తమకు సాధ్యం కాని విషయాలెన్నో ఈసారి చేసి చూపించింది అఫ్గనిస్తాన్ జట్టు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తొలిసారిగా వరల్డ్‌కప్‌లో అఫ్గన్ తరఫున సెంచరీ చేసి సత్తా చాటాడు. మరోవైపు.. బౌలింగ్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 97(నాటౌట్) పరుగులు చేయడం విశేషం. ఇక జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది బ్యాటర్‌గానూ రాణించాడు. టోర్నీలో మొత్తంలో 310 పరుగులు సాధించాడు. లోపాలు, బలహీనతలపై చర్చించాం ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లో తమ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన హష్మతుల్లా.. ‘‘టోర్నీ ఆసాంతం మా బ్యాటర్లు ఆడిన తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. ఆరంభంలో గెలుపు కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అయితే, లోపం ఎక్కడుంది.. మా బలహీనతలు ఏమిటన్న అంశంపై అందరం కూర్చుని చర్చించాం. దాని ఫలితమే ఈ విజయాలు. ఈ టోర్నీలో రాణించడం మాకు సానుకూలాంశం. మా స్పిన్ విభాగం పటిష్టమైందని అందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాటర్లు కూడా మెరుగ్గా ఆడటం మరింత ఉత్సాహాన్నిస్తోంది. అదొక్కటే షాకింగ్ ఈ టోర్నీ ద్వారా మేము పెద్ద జట్లపై కూడా గెలవగలమని.. గెలుపు కోసం ఆఖరి వరకు పోరాడగలమనే సందేశాన్ని క్రికెట్ ప్రపంచానికి అందించాం. అయితే, ఆస్ట్రేలియా విషయంలో ఆఖరి వరకు మ్యాచ్ మా చేతిలో ఉన్నా అనూహ్య రీతిలో చేజారిపోయింది. అదొక్కటే మాకు ఇప్పటికీ షాకింగ్‌గా ఉంది అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అఫ్గన్ విజయంపై ధీమాగా ఉన్న తరుణంలో.. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అజేయ ద్విశతకంతో ఆసీస్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. దీంతో అఫ్గనిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఇంటిబాట పట్టింది. చదవండి: ICC: శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత.. View this post on Instagram A post shared by ICC (@icc) -
జద్రాన్ సూపర్ ఇన్నింగ్స్.. అఫ్గన్ రికార్డు స్కోరు..
ICC WC 2023- Ibrahim Zadran: వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పటిష్ట పేస్ దళం ఉన్న కంగారూ జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని అజేయ శతకంతో మెరిశాడు. మొత్తంగా 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 129 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అఫ్గన్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసి తొలి బ్యాటర్‌గా నిలిచిన 21 ఏళ్ల ఇబ్రహీం.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో జింబాబ్వే ఆటగాడు నీల్ జాన్సన్ 132* పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ హ్యారిస్ 130 పరుగులతో రెండో స్థానం ఆక్రమించాడు. కష్టాల్లో ఆసీస్ కాగా అఫ్గనిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత ఆట తీరుతో అర్ధ శతకం పూర్తి చేసుకుని ఆసీస్ శిబిరంలో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు 1. నీల్ జాన్సన్(జింబాబ్వే)- 132* పరుగులు- 1999లో లార్డ్స్ మైదానంలో 2. క్రిస్ హ్యారిస్(న్యూజిలాండ్)- 130 పరుగులు- 1996లో చెన్నైలో 3. ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్)- 129* పరుగులు- 2003 ముంబైలో 4. శిఖర్ ధావన్(ఇండియా)- 117 పరుగులు- 2019లో ది ఓవల్‌లో 5. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్)- 116 పరుగులు- 2023లో ధర్మశాలలో. అఫ్గనిస్తాన్‌కు ఇదే భారీ స్కోరు: ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. అఫ్గనిస్తాన్ వరల్డ్‌కప్ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. జద్రాన్ అజేయ శతకం కారణంగా 291 పరుగులు సాధించి ఈ మేరకు తమ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్ సాధించిన టాప్-5 స్కోర్లు ఇవే ►ఆస్ట్రేలియా మీద- 2023లో ముంబైలో- 291/5. ►వెస్టిండీస్ మీద- 2019లో లీడ్స్‌లో- 288. ►పాకిస్తాన్ మీద- 2023లో చెన్నైలో- 286/2. ►ఇంగ్లండ్ మీద- 2023లో ఢిల్లీలో- 284. ►టీమిండియా మీద- 2023లో ఢిల్లీలో- 272/8. చదవండి: వరల్డ్‌కప్‌లో అఫ్గన్ తరఫున ఒకే ఒక్క సెంచరీ.. సచిన్, కోహ్లికి కూడా సాధ్యం కాని రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) -
సచిన్, కోహ్లికి కూడా సాధ్యం కానిది! ఇతడికి ఇలా!
ICC WC 2023: అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో అఫ్గన్ తరఫున శతకం బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ముంబైలోని వాంఖడే వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్.. మొత్తంగా 143 బంతులు ఎదుర్కొని 129 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జద్రాన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడీ రైట్‌హ్యాండ్ బ్యాటర్. గతంలో అఫ్గన్ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. అంతేకాదు.. ఈ ఎలైట్లిస్టులో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, పరుగుల యంత్రం రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్నవయసులో వన్డే వరల్డ్‌కప్‌లో శతకం బాదిన క్రికెటర్లు ►20 ఏళ్ల 196 రోజులు - పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్) నెదర్లాండ్స్ మీద- 2011లో కోల్‌కతాలో.. ►21 ఏళ్ల 76 రోజులు- రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా) వెస్టిండీస్ మీద- 1996లో జైపూర్‌లో.. ►21 ఏళ్ల 87 రోజులు- అవిష్క ఫెర్నాండో(శ్రీలంక) వెస్టిండీస్ మీద- 2019లో ఛెస్టెర్ లీ స్ట్రీట్‌లో ►21 ఏళ్ల 330 రోజులు- ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్) ఆస్ట్రేలియా మీద- ముంబైలో-2023లో ►22 ఏళ్ల 106 రోజులు- విరాట్ కోహ్లి(ఇండియా) బంగ్లాదేశ్ మీద- మీర్పూర్- 2011లో ►22 ఏళ్ల 300 రోజులు- సచిన్ టెండుల్కర్(ఇండియా)- కెన్యా మీద- కటక్‌లో- 1996లో.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే! ప్రపంచకప్-2023లో భాగంగా ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సెంచరీ హీరో, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 129 పరుగులతో చెలరేగాడు. మిగతా వాళ్లలో రహ్మత్ షా(30), రషీద్ ఖాన్(35- నాటౌట్) మాత్రమే ముప్పై పరుగుల మార్కును అందుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్, ఆడం జంపా ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా వరల్డ్‌కప్ చరిత్రలో అఫ్గనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. చదవండి: గిల్‌తో ఫొటో షేర్ చేసి ‘రిలేషన్’ కన్ఫర్మ్ చేసిందంటూ ప్రచారాలు.. వాస్తవం ఇదే -
WC 2023: వన్డేల్లో చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్ ఓపెనర్.. అరుదైన ఘనతలు
ICC WC 2023- Afg Vs Aus: అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అఫ్గన్ బ్యాటర్లెవరికీ గతంలో సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. కాగా ప్రపంచకప్-2023లో భాగంగా ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ 21 పరుగులకే పెవిలియన్‌కు పంపగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకంతో మెరిశాడు. అఫ్గన్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ ఐదో బంతికి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై రెండు పరుగులు పూర్తి చేసుకున్నాడు. అఫ్గన్ తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనతలు ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో ఒక ఏడాది(క్యాలెండర్ ఇయర్)లో అత్యధిక పరుగులు చేసిన అఫ్గనిస్తాన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా అఫ్గన్ తరఫున మెరుగైన రికార్డు ఉన్న బ్యాటర్ రహ్మత్ షాను వెనక్కినెట్టి అతడి రికార్డు బ్రేక్ చేశాడు. అదే విధంగా క్యాలెండర్ ఇయర్లో 50 కంటే ఎక్కువ పరుగులు ఏడుసార్లు సాధించిన అఫ్గన్ క్రికెటర్‌గా రహ్మత్ షా రికార్డును సమం చేశాడు. అంతేకాదు వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన అఫ్గన్ క్రికెటర్‌గా ఈ 21 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతర్జాతీయ వన్డేల్లో క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ►765* - ఇబ్రహీం జద్రాన్(2023) ►722 - రహ్మత్ షా (2018) ►646 - రహ్మత్ షా (2019) ►631 - రహ్మనుల్లా గుర్బాజ్ (2023) ►616 - రహ్మత్ షా (2022) . వన్డేల్లో అఫ్గన్ తరఫున అత్యధికసార్లు 50కి పైగా పరుగులు సాధించిన అఫ్గనిస్తాన్ బ్యాటర్లు ►7 - రహ్మత్ షా(2018) ►7 - ఇబ్రహీం జద్రాన్(2023) ►6 - రహ్మత్ షా (2017) ►6 - రహ్మత్ షా (2022) ►6 - హష్మతుల్లా షాహిది (2023). చదవండి: WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్! View this post on Instagram A post shared by ICC (@icc)