Ind Vs Afg: దూబే ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. టీమిండియాదే సిరీస్‌ | Ind Vs Afg 2nd T20I: Toss, Playing XI, Kohli Returns Updates And Highlights - Sakshi
Sakshi News home page

Ind Vs Afg: దూబే ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. టీమిండియాదే సిరీస్‌

Published Sun, Jan 14 2024 6:31 PM | Last Updated on Mon, Jan 15 2024 7:55 AM

Ind Vs Afg 2nd T20I: Toss Playing XI Kohli Returns Updates And Highlights - Sakshi

India vs Afghanisthan 2nd T20I 2024 Updates: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇండోర్‌ మ్యాచ్‌లో జద్రాన్‌ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 34 బంతుల్లో 68 పరుగులతో దంచికొట్టగా.. ఆల్‌రౌండర్‌ శివం దూబే 30 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా రోహిత్‌ సేన అఫ్గన్‌తో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 164/4 
విజయానికి 9 పరుగుల దూరంలో టీమిండివయా. దూబే 62, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్‌
12.6: జితేశ్‌ శర్మ రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా. శివం దూబే
12.3: కరీం జనత్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ ఔట్‌.

11.6: దూబే ధనాధన్‌ హాఫ్‌ సెంచరీ
22 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న శివం దూబే

9.1: జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ
27 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్న యశస్వి జైస్వాల్‌. మరో ఎండ్‌లో శివం దూబే(15 బంతుల్లో 34 పరుగులు) కూడా జోరుగా ఆడుతున్నాడు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 116/2. విజయానికి 57 పరుగుల దూరం ఉంది.

5.3: రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
విరాట్‌ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో కోహ్లి పెవిలియన్‌ చేరాడు. 16 బంతులు ఎదుర్కొని 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దంచి కొడుతుండటంతో పవర్‌ ప్లేలో భారత్‌  69-2 స్కోరు చేయగలిగింది. 

మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు: 32-1
కోహ్లి 12, యశస్వి 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రోహిత్‌ మళ్లీ డకౌట్‌
0.5: టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫజల్హక్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి వెనుదిరిగాడు. కాగా తొలి టీ20లోనూ హిట్‌మ్యాన్‌ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

టార్గెట్‌ 173
టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్తాన్‌ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్‌ పటేల్‌ రెండు, శివం దూబే ఒక వికెట్‌ తీశారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు దక్కాయి.

ఆఖరి ఓవర్లో 4 వికెట్లు కోల్పోయిన అఫ్గనిస్తాన్‌
19.6: ఫజల్హక్‌ రనౌట్‌
19.6 వైడ్‌: తొమ్మిది బంతుల్లోనే 21 పరుగులు చేసిన ముజీబ్‌ రనౌట్‌
19.5: నూర్‌ అహ్మద్‌ అవుట్‌(1).

19.1: ఏడో వికెట్‌ కోల్పోయిన అఫ్గన్‌
అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో కరీం జనత్‌(20) అవుట్‌. నూర్‌ అహ్మద్‌ క్రీజులోకి వచ్చాడు.

నజీబుల్లా అవుట్‌
17.1: అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన నజీబుల్లా. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్‌ అయ్యాడు. ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ క్రీజులో​కి వచ్చాడు. స్కోరు: 144-6(18).

15 ఓవర్లలో అఫ్గన్‌ స్కోరు: 109-5
నజీబుల్లా 4, కరీముల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన అఫ్గన్‌
14.2: మహ్మద్‌ నబీ రూపంలో అఫ్గనిస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి నబీ 14 పరుగుల వద్ద నిష్క్రమించాడు. కరీం జనత్‌ క్రీజులోకి వచ్చాడు. 

అర్ధ శతక వీరుడు అవుట్‌
11.3: అర్ధ శతకంతో జోరు మీదున్న గుల్బదిన్‌ను అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌కు పంపాడు. 35 బంతుల్లో 57 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి గుల్బదిన్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో అఫ్గన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. నజీబుల్లా జద్రాన్‌ క్రీజులోకి వచ్చాడు.

గుల్బదిన్‌ హాఫ్‌ సెంచరీ
9.5: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న గుల్బదిన్‌. 27 బంతుల్లోనే అతడు 50 పరుగుల మార్కును అందుకున్నాడు. మరోవైపు.. నబీ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు. స్కోరు: 81/3 (10).

మూడో వికెట్‌ కోల్పోయిన అఫ్గనిస్తాన్‌
6.5: శివం దూబే బౌలింగ్‌లో ఒమర్జాయ్‌(2) క్లీన్‌ బౌల్డ్‌. మూడో వికెట్‌ కోల్పోయిన అఫ్గనిస్తాన్‌. మహ్మద్‌ నబీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు:  60-3(7)

రెండో వికెట్‌ కోల్పోయిన అఫ్గనిస్తాన్‌
5.4: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అఫ్గన్‌ కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌(8) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58-2(6)

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అఫ్గనిస్తాన్‌
వన్‌డౌన్‌ బ్యాటర్‌ గుల్బదిన్‌ దంచికొడుతున్నాడు. 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి దూకుడు మీద ఉన్నాడు. దీంతో 5 ఓవర్లలోనే అఫ్గన్‌ 50 పరుగుల మార్కు అందుకుంది. గుల్బదిన్‌తో పాటు జద్రాన్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన అఫ్గన్‌
2.2: భారత స్పిన్నర్‌ రవి బిష్ణోయి బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్‌ ఇచ్చి రహ్మనుల్లా గుర్బాజ్‌(14) అవుటయ్యాడు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రూపంలో అఫ్గన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. గుల్బదిన్‌ నైబ్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు:  22-1 (3).

బ్యాటింగ్‌ చేస్తున్న అఫ్గనిస్తాన్‌
టాస్‌ గెలిచిన టీమిండియా ఆహ్వానం మేరకు అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి అఫ్గన్‌ స్కోరు: 20/0. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్‌ 4, రహ్మనుల్లా గుర్బాజ్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బౌలింగ్‌ ఎంచుకున్న రోహిత్‌
టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య రెండో టీ20 మొదలైంది. ఇండోర్‌ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 

రన్‌మెషీన్‌ రీఎంట్రీ
ఇక.. ఈ మ్యాచ్‌ ద్వారా దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. ఈ రన్‌మెషీన్‌ రాకతో హైదరాబాద్‌ స్టార్‌ తిలక్‌ వర్మపై వేటు పడింది.

గిల్‌కు నో ఛాన్స్‌
అదే విధంగా.. గజ్జల్లో గాయం కారణంగా మొదటి టీ20కి దూరమైన యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తిరిగి వచ్చాడు. దీంతో శుబ్‌మన్‌ గిల్‌కు భారత తుదిజట్టులో చోటు దక్కలేదు. రోహిత్‌కు జోడీగా యశస్వి ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు.

ఈ మేరకు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగగా.. అఫ్గనిస్తాన్‌ ఒక మార్పుతో మైదానంలో దిగనుంది. రహ్మత్‌ షా స్థానంలో నూర్‌ అహ్మద్‌ జట్టులోకి వచ్చినట్లు అఫ్గన్‌ కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ వెల్లడించాడు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌ ఇప్పటికే 1-0తో అఫ్గన్‌ కంటే ముందంజలో ఉంది.

తుది జట్లు ఇవే
టీమిండియా

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, ముకేష్ కుమార్.

అఫ్గనిస్తాన్‌
రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement