Ind vs Afg: ఉత్కంఠ పోరులో అఫ్గన్‌పై భారత్‌ విజయం.. సిరీస్‌ కైవసం | India Vs Afghanistan 3rd T20I Latest Updates And News In Telugu - Sakshi
Sakshi News home page

Ind vs Afg 3rd T20: ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం

Published Wed, Jan 17 2024 6:31 PM | Last Updated on Wed, Jan 17 2024 11:41 PM

Ind vs Afg 3rd T20I: Toss Playing XIs Updates And Highlights - Sakshi

India vs Afghanistan 3rd T20I- Updates: 

అఫ్గన్‌పై భారత్‌ విజయం సాధించింది. దాంతో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో సూపర్‌ ఓవర్‌లో తేలిన మ్యాచ్‌ ఫలితం. తొలి సూపర్‌ ఓవర్‌లో 16 పరుగులు చేసిన ఇరు జట్లు రెండో సూపర్‌ ఓవర్‌లో ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపొందింది.  స్కోర్లు IND 212/4 (20), AFG 212/6 (20)


మొదటి సూపర్‌ ఓవర్‌లో కూడా మ్యాచ్ టై అయింది.

అఫ్గన్‌ ఆరు వికెట్లు కోల్పోయిన తరువాత  మ్యాచ్ టై అయింది (సూపర్ ఓవర్ ప్రోగ్రెస్‌లో ఉంది) 

16.2: నాలుగో వికెట్‌ కోల్పోయిన అఫ్గన్‌
సుందర్‌ బౌలింగ్‌లో నబీ అవుట్‌.. స్కోరు 164/4 (16.3)

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన వాషింగ్టన్‌ సుందర్‌
12.4: అజ్మతుల్లా అవుట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన అఫ్గనిస్తాన్‌
12.4: సుందర్‌ బౌలింగ్‌లో జద్రాన్‌ స్టంపౌట్‌.

10.6: తొలి వికెట్‌ కోల్పోయిన అఫ్గన్‌
కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో గుర్బాజ్‌ అవుట్‌. వాషింగ్టన్‌ సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 93-1(11 ఓవర్లలో).

పవర్‌ ప్లేలో అఫ్గనిస్తాన్‌ స్కోరు: 51/0 (6)
►నిలకడగా ఆడుతున్న అఫ్గన్‌ ఓపెనర్లు.. ఇబ్రహీం జద్రాన్‌ 28, రహ్మనుల్లా గుర్బాజ్‌ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

శతక్కొట్టిన రోహిత్‌.. రింకూ సింగ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌
బెంగళూరు వేదికగా అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు రింకూ సింగ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 212 పరుగులు సాధించింది.

రోహిత్‌ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో చెలరేగగా.. రింకూ 39 బంతుల్లో 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఏకంగా ఐదో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో తన అత్యధిక స్కోరు నమోదు చేసి దటీజ్‌ హిట్‌మ్యాన్‌ అనిపించుకున్నాడు.

18.6: రింకూ సింగ్‌ హాఫ్‌ సెంచరీ
రోహిత్‌ 104, రింకూ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు.

18.4: శతక్కొట్టిన రోహిత్‌ శర్మ
అంతర్జాతీయ టీ20లలో 5 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర. దటీజ్‌ హిట్‌మ్యాన్‌ అంటూ ప్రశంసల జల్లు

దంచి కొడుతున్న రోహిత్‌, రింకూ..
టీమిండియా స్కోరు: 144/4 (17)
రోహిత్‌ 57 బంతుల్లో 80, రింకూ సింగ్‌ 32 బంతుల్లో 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న రోహిత్‌, రింకూ సింగ్‌
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 131/4

100 పరుగుల భాగస్వామ్యం
15.3: సలీం సఫీ నోబాల్‌..  రోహిత్‌ శర్మ, రింకూ సింగ్‌ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. 

12.6: రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
అఫ్గన్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ అయిన రోహిత్‌ శర్మ.. మూడో టీ20 అర్ధ శతకంతో మెరిశాడు. 13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 97-4. రింకూ 30 పరుగులతో రోహిత్‌కు తోడుగా ఉన్నాడు.

నిలకడగా రోహిత్‌.. స్పీడు పెంచిన రింకూ
12: వరుసగా రెండు సిక్సర్లు బాదిన రోహిత్‌ శర్మ . 12 వ ఓవర్‌ ముగిసే సరికి రోహిత్‌ 41, రింకూ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10 ఓవర్లలో టీమిండియా స్కోరు- 61/4
రోహిత్‌ 27, రింకూ 19 పరుగులతో ఉన్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసే దిశగా వెళ్తున్నారు.

ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 48-4 
పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 30-4

రోహిత్‌ 13, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సంజూ శాంసన్‌ డకౌట్‌
4.3: ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంజూ. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. సంజూ స్థానంలో రింకూ సింగ్‌ క్రీజులోకి వచ్చాడు. రోహిత్‌ 8 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 22-4 (5 ఓవర్లు)

దూబే అవుట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
3.6: అజ్మతుల్లా బౌలింగ్‌లో శివం దూబే వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా అవుటయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అర్ధ శతకాలు బాదిన ఈ ఆల్‌రౌండర్‌.. బెంగళూరులో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. దూబే స్థానంలో సంజూ శాంసన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-3(4)

కోహ్లి డకౌట్‌.. టీమిండియా స్కోరు 19-2(3)
2.4: ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో కోహ్లి ఇలా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్‌ కావడం ఇదే తొలిసారి.

కాగా ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అతడి స్థానంలో శివం దూబే క్రీజులోకి వచ్చాడు. రోహిత్‌ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
2.3: యశస్వి జైస్వాల్‌(4) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో నబీకి క్యాచ్‌ ఇచ్చి జైస్వాల్‌ పెవిలియన్‌ చేరగా.. విరాట్‌ కోహ్లి క్రీజులోకి వచ్చాడు.

రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 13-0

టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభించిన యశస్వి, రోహిత్‌
1.3: ఎట్టకేలకు రీఎంట్రీలో.. ఈ సిరీస్‌లోనూ పరుగుల ఖాతా తెరిచిన రోహిత్‌. అజ్మతుల్లా బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన హిట్‌మ్యాన్‌.

 సంజూకు ఛాన్స్‌
తొలి రెండు మ్యాచ్‌లలో మొదట బౌలింగ్‌ చేశాం కాబట్టి.. ఈసారి బ్యాటింగ్‌ ఎంచుకుంటున్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు.అదే విధంగా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు హిట్‌మ్యాన్‌ వెల్లడించాడు.

నామమాత్రపు మ్యాచ్‌ సందర్భంగా భిన్నమైన కాంబినేషన్లు ట్రై చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే.. అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌ల స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, ఆవేశ్‌ ఖాన్‌లకు తుదిజట్టులో చోటిచ్చినట్లు రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

క్లీన్‌స్వీప్‌పై కన్ను
కాగా టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు భారత జట్టు ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్‌ ఇది. ఇందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్‌ సేన... అఫ్గన్‌తో మూడో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌తో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

మరోవైపు.. కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అఫ్గనిస్తాన్‌ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా  తాము కూడా తుదిజట్టులో మూడు మార్పులు చేసినట్లు అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ తెలిపాడు.  షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్‌లను ఆడించనున్నట్లు వెల్లడించాడు.

తుదిజట్లు
టీమిండియా

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముకేశ్‌ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్.

అఫ్గనిస్తాన్‌
రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement