Afghanistan tour of India, 2024: టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో మూడు టీ20లలో పోటీపడనుంది. ఈ సిరీస్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో 14 నెలల తర్వాత పునరాగమనం చేస్తున్నారు.
వీళ్లిద్దరి రాకతో.. పండుగ వేళ ఈ సిరీస్ మరింత హైలైట్ కానుంది. కాగా అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ గాయం కారణంగా మైదానంలో దిగే పరిస్థితి లేకపోవడంతో.. యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అఫ్గన్ సారథిగా వ్యవహరించనున్నాడు.
ఇలా ఓవైపు స్టార్ల రాకతో టీమిండియా మరింత పటిష్టకాగా.. నంబర్ 1 జట్టుతో ఢీకొట్టేందుకు అఫ్గనిస్తాన్ కూడా సై అంటోంది. రోహిత్ సేనకు గట్టి పోటీనిచ్చి.. అండర్‌డాగ్స్ అనే ముద్రను చెరిపివేసుకోవడమే లక్ష్యంగా భారత్‌లో అడుగుపెడుతున్నట్లు చెబుతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు మీకోసం..
టీమిండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్
►తొలి టీ20: జనవరి 11- పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలీ, పంజాబ్
►రెండో టీ20: జనవరి 14- హోల్కర్ క్రికెట్ స్టేడియం- ఇండోర్, మధ్యప్రదేశ్
►మూడో టీ20: జనవరి 17- ఎం. చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు, కర్ణాటక.
మ్యాచ్ ఆరంభ సమయం
భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ?
►ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లను భారత్‌లో స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
►ఇక డిజిటల్ మాధ్యమంలో జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
మొహాలీ చేరుకున్న అఫ్గనిస్తాన్ జట్టు
టీమిండియాతో సిరీస్ కోసం అఫ్గన్ జట్టు ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో మొహాలీకి చేరుకుంది. కాగా ఈ సిరీస్ కంటే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించిన అఫ్గనిస్తాన్ జట్టు 2-1తో ట్రోఫీ గెలిచింది.
టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.
అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
చదవండి: #ExploreIndianIslands: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు: మాల్దీవులకు వెళ్లొద్దంటున్న క్రికెటర్లు!
Comments
Please login to add a commentAdd a comment