
టీమిండియా మజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. సోమవారం (April 28) రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో.. ఈ అవార్డును అశ్విన్ స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
కాగా భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను అశ్విన్‌కు ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ ప్రత్యేక గౌరవం పొందినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అశ్విన్‌ను ప్రశంసించింది. "భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్న అశ్విన్‌కు అభినందనలు.
ఇది అతడి కెరీర్‌లో సాధించిన అద్బుత విజయాలకు దక్కిన గౌరవమని" బీసీసీఐ ఎక్స్‌లో రాసుకొచ్చింది. అశ్విన్ తన 15 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరపున 287 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఉన్నాయి. 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా ఈ తమిళనాడు క్రికెటర్ కొనసాగుతున్నాడు. వన్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్‌తో పాటు భారత హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్‌ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం శ్రీజేష్ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Congratulations to @ashwinravi99 on being conferred the prestigious Padma Shri award by the Hon'ble President of India @rashtrapatibhvn, honouring his remarkable achievements and an illustrious career with #TeamIndia pic.twitter.com/8HlYQx3Dsl
— BCCI (@BCCI) April 28, 2025