
మన సాంప్రదాయ కళకు కొద్దిమంది ప్రాణం పోసి సజీవంగా నిలుపుతారు. వాటిని బావితరాలకు తెలిసేలా కృషి చేస్తారు. ప్రస్తుత ట్రెండ్ కాకపోయినా..ఎవ్వరో ఒక్కరైనా ఆదరించకపోదురా అనే ఆశతో కొనసాగిస్తున్న వారి ఓపిక, పట్టుదల ఎవ్వరినైనా కదిలిస్తాయి. దాన్ని ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారంతో గుర్తిస్తే..అది వారి కృషికి తగిన గుర్తింపే గాక, మరికొన్ని కళలు కనుమరగవ్వకుండా నిలుస్తాయి కూడా. అందుకు ఉదాహరణే ఈ కన్నడ బామ్మ భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార.
కర్ణాటకకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార(Bhimavva Doddabalappa Shillekyathara) షాడో తోలుబొమ్మలాట(shadow puppetry) కళాకారిణి. కన్నడకు చెందిన ఈ సాంప్రదాయ తోలుబొమ్మలాటను ప్రపంచానికి తెలిసేలా చాలాకృషి చేసింది. నీడ సాయంతో తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తారు. అది గొప్ప నైపుణ్యానికి సంబంధించిన కళ. దాన్ని వినోదాత్మకంగా అందరికి తెలిసేలా నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంది.
సుమారు 80 ఏళ్లుగా ఈ భీమవ్వ షాడో బొమ్మలాట కళా నైపుణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చేతులతో అద్భుతం సృష్టించే కళకు ఆధారం పురాణాలు. ప్రజలను ఆకట్టుకునేలా రంజింప చేసే సంగీతంతో కట్టిపడేసే కదలికలతో ప్రదర్శనలు ఇచ్చేది. ప్రజలు ఆదరించకపోతున్నా..తన కళా ప్రస్థానాన్ని ఆపకుండా..అవిరాళంగా ప్రదర్శిస్తూ..బావితరాలు గుర్తించి తెలుసుకునేలా ఈ విద్య గురించి బోధిస్తూనే ఉంది.
మన దేశంలోని జానపద మూలాలతో లోతైన సంబంధం ఉన్న కళ ఇది. పరిమిత వనురులే ఉన్న..అంతమేర మంచి కళాత్మకంగా ప్రదర్శంచేది. దీన్ని కన్నడలో 'తొగలు గొంబెయాట'గా పిలచే నీడ తోలుబొమ్మల నాటకం. భీమవ్వ సాంప్రదాయ నీడ తోలుబొమ్మలాటతో పౌరాణిక కథలు జానపద కథలను ప్రదర్శించేది. ముఖ్యంగా అది సంతానోత్పత్తికి ప్రతీకగా ముడిపడి ఉన్న కళ.

మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మన సంప్రదాయ తోలుబొమ్మలాటతో ముడిపడి ఉన్న షాడో తోలుబొమ్మలాట ఇది. మత సంబంధాలకు అతీతంగా కూడా ప్రదర్శనలిచ్చేవారు కూడా. ఇన్నాళ్లుకు ఆమె కృషికి తగిని గుర్తింపు లభించింది. సంప్రదాయ కళను బతికిస్తూ వస్తున్న భీమవ్వకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆమె భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మ శ్రీ'(Padma Shri ) అవార్డుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా అందుకున్నారామె. శతాబ్దాల నాటి కథలకు ప్రాణం పోసి.. తోలుబొమ్మలను పట్టుకున్న చేతులతో, ఆమె ఇప్పుడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని వణుకుతున్న చేతులతో అందుకుంది.
ఆమె ఆ రాష్ట్రపతి భవన్ హాలులోకి నిశబ్దంగా వస్తూ..ఆ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగానే ఒక్కసారిగా హాలంతా చప్పట్లతో మారుమ్రోగింది. అంతేగాదు ఆమె పురస్కారం తీసుకుంటుండగా..అంతా స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవించి మరీ సత్కరించారు. ఇది నిజంగా కళకు ప్రాణం పోసినవారికే దక్కే అసలైన గౌరవం కదా..! .
#WATCH | 96-year-old puppeteer Bhimavva Doddabalappa Shillekyathara receives Padma Shri award from President Droupadi Murmu for her contribution to the field of Art.
(Video Source: President of India/YouTube) pic.twitter.com/4PVvqSI9YL— ANI (@ANI) April 28, 2025
(చదవండి: Kilimanjaro Diet: 'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..)