puppet show
-
లేపాక్షి శిల్పకళ అద్భుతం
లేపాక్షి (శ్రీసత్యసాయి జిల్లా): చారిత్రక లేపాక్షి ఆలయంలో శిల్పకళా సంపద అద్భుతమని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. భారతీయ చరిత్ర, పురాతన వైభవం, విజయనగర సామ్రాజ్య సంస్కృతిని లేపాక్షి ఆలయ శిల్పకళా సంపద ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి నుంచి హెలికాప్టర్లో లేపాక్షి చేరుకుని స్థానిక పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించారు. ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో వీరభద్రస్వామి, పాపనాశేశ్వరస్వామి, దుర్గాదేవి అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. వీరభద్రస్వామికి స్వయంగా మహామంగళ హారతి ఇచ్చారు. గర్భగుడిలో పాపనాశేశ్వర లింగానికి అభిముఖంగా ప్రత్యేక పీఠంపై కూర్చుని ప్రధాని ధ్యానం చేశారు. టీటీడీ వేద విజ్ఞాన పాఠశాల ఆధ్వర్యంలో రంగనాథ రామాయణ పారాయణం నిర్వహించగా మహిళా కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. నిమ్మలకుంట కళాకారులు రామాయణంలో సీతాపహరణ ఘట్టాన్ని తోలుబొమ్మల రూపంలో ప్రదర్శించారు. వీటన్నింటినీ ఆస్వాదించిన ప్రధాని మోదీ తన్మయత్వం చెందారు. వేలాడే స్తంభం.. గర్భగుడి ప్రదక్షిణ అనంతరం మహా మంటపం పైకప్పు మీద చిత్రీకరించిన 25 గీ14 అడుగుల వీరభద్రస్వామి ఉగ్రరూపాన్ని ప్రధాని తదేకంగా తిలకించారు. పది చేతుల్లో వివిధ ఆయుధాలు, పొడవాటి కత్తి, దక్షయజ్ఞం సందర్భంగా దక్షుడి తలను దునుమాడటం లాంటి ఘట్టాలను చరిత్రకారుడు మైనాస్వామి వివరించారు. నాట్యమంటపంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాలను చూసిన ప్రధాని ముగ్దులయ్యారు. వేలాడే స్తంభాన్ని ఆసక్తిగా తిలకించారు. వేలాడే స్తంభం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. స్తంభం దిగువన మైనాస్వామి ఒక పలుచటి వ్రస్తాన్ని ఉంచగా ప్రధాని దాన్ని స్వయంగా స్తంభం నుంచి వెలుపలకు తీశారు. కిరాతార్జునీయ ఘట్టం, గిరిజా కల్యాణం, వీరభద్ర అనుగ్రహం పొందిన ఆలయ నిర్మాత విరుపణ్ణ, ఆయన పరివారం తైలవర్ణ చిత్రాలను తదేకంగా పరిశీలించారు. వటపత్రసాయి వర్ణచిత్రం గురించి చరిత్రకారుడు వివరించినప్పుడు బాలకృష్ణుడి కన్నులను చిత్రీకరించిన విధానాన్ని మూడు వైపుల నుంచి తిలకించారు. నాట్య మంటపంలోని భిక్షాటనమూర్తి సుందర రూపాన్ని తనివి తీరా చూశారు. భిక్షాటనమూర్తి విగ్రహాలలో భేదాల గురించి ఆసక్తిగా ఆలకించారు. ప్రధాని మోదీని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అర్చకులు, కళాకారులను ప్రధాని సన్మానించారు. ప్రధానిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
‘నాటు నాటు’ ఫీవర్: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్ మహీంద్ర
సాక్షి, హైదరాబాద్: సంచలనాలు నమోదు చేసిన టాలీవుడ్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట హవా ఇంకా ప్రపంచంలో ఎక్కడో ఒక మూలకొనసాగుతూనే ఉంది. ఆస్కార్ అవార్డుతో ప్రపంచవ్యాప్త కీర్తిని దక్కించుకున్న ఈ పాటకు పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇకసామాన్య ప్రజానీకి గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇప్పటికే ఆ సాంగ్‌పై రామ్ చరణ్ తో కలసి ఈ పాటకు స్టెప్స్ వేసిన పారిశ్రామిక వేత్త , ఎం అండ్ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఇదీ చదవండి: ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది? తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి మరింత ఆసక్తికరమైన కామెంట్ కూడా యాడ్ చేశారు. ఒకే ఒక్క. లాస్ట్ ట్వీట్. దీన్ని పోస్ట్ చేయకుండా నిలవరించుకోవడం నా వల్ల కావడంలేదు.. నాటునాటుపై హామీ ఇస్తున్నా.. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే కదా తార్కాణం. ఇప్పటికీ ఇది ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. Ok. One last tweet, I promise, about #NaatuNaatu But couldn’t resist this one. Real evidence of it being a global phenomenon since it now has the whole world on its ‘strings’ 😊 pic.twitter.com/ex1bmf4Boh — anand mahindra (@anandmahindra) March 22, 2023 మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు -
Tholu Bommalata: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు
ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా క్రమేణా టీవీలు రావడం, ఆ తర్వాత మొబైల్ ఫోన్ల ఆవిర్భావంతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాతి తరం బొమ్మలాట కళకు దూరమైంది. సాక్షి ప్రతినిధి, కడప: ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామాల్లో తిరుగులేని ఆదరణ ఉండేది. క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ 1980వ దశకం వరకు వైభవంగా నడిచింది. ఈ కళను గ్రామాలలో విపరీతంగా ఆదరించారు. బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా భారతంలో విరాటపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, పద్మవ్యూహం, సైంధవ వధ, దానవీర శూర కర్ణ, శల్య, శకుని, భీమ, దుర్యోధన యుద్ధం, అశ్వమేధ యాగం, ప్రమీలార్జునీయం, విభీషణ విజయం, బబ్రువాహన చరిత్ర తదితర ఘట్టాలను బొమ్మలాట ద్వారా ప్రదర్శించేవారు. ఇక రామాయణంలో సుందరకాండ, లక్ష్మణమూర్ఛ, సతీసులోచన, ఇంద్రజిత్తు మరణం, రామరామ యుద్ధం, మహిరావణ చరిత్ర తదితర పురాణ గాథలను కూడా తోలు బొమ్మలాటలో ప్రాధాన్యత పొందాయి. పది మంది కళాకారులతో నాటకం తోలు బొమ్మలాట ప్రదర్శనకు పది మంది కళాకారులు అవసరం. హార్మోనియం, తబలా, డబ్బా తదితర సంగీత వాయిద్యాలను వాయించేవారితోపాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడటం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు. రామాయణ, భారతంలోని మగ పాత్రలకు మగవాళ్లే పనిచేసేవారు. ఆడపాత్రలకు మహిళలు తెరవెనుక నాటకం వేసేవారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే, వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకుమించిన కళ. ఈ రెండింటి అనుసంధానంతోనే బొమ్మలాట నాటకాన్ని కళాకారులు రక్తి కట్టిస్తారు. ప్రమిదల వెలుగులో బొమ్మలాట నాటకం పూర్వం బొమ్మలాటను ప్రత్యేకమైన తెల్ల పంచె తెరగా ఏర్పాటు చేసుకుని చుట్టూ చీకటి ఉండేలా చూసుకుని తెరవెనుక ఆముదం పోసి వెలిగించిన ప్రమిదల సాయంతో తెరపైన తోలుబొమ్మలు కనబడేలా చేసేవారు. రానురాను పెట్రోమ్యాక్స్ లైట్లు, ఆ తర్వాత గ్యాస్ లైట్లు, విద్యుత్ బల్బుల సాయంతో బొమ్మలు తెరపైన కనబడేలా చేసేవారు. అప్పట్లో తెరపైన బొమ్మలు ఆడటం పాతతరం గ్రామీణ ప్రజలకు వింతగా, ఆసక్తిగా, సంబరంగా ఉండేది. పైపెచ్చు చదువులేకపోయినా వంట బట్టించుకున్న పౌరాణిక గాథలు కళ్ల ముందు కనిపించడం అప్పటి జనాన్ని మరింత ఆకట్టుకునేది. నాటకాల్లో సీరియస్ పాత్రలతోపాటు జుట్టుపోలిగాడు, బంగారక్క పాత్రలను సైతం సృష్టించి బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు. తోలు బొమ్మలాటకు తిరుగులేని ఆదరణ తోలుబొమ్మలాట కళకు 80వ దశకం వరకు తిరుగులేని ఆదరణ ఉండేది. ఒక్కో గ్రామంలో 15 రోజుల నుంచి నెలరోజులపాటు కూడా నాటకం ఆడేవారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆయా గ్రామాల ప్రజలు వచ్చి ళాకారులకు తాంబూలం ఇచ్చి తేదీని ఖరారు చేసుకునేవారు. ఇప్పటి సినిమా నటుల కాల్షీట్ల డిమాండ్ కంటే అప్పటి బొమ్మలాట కళాకారుల డిమాండ్ మూడింతలు ఉండేది. కళాకారులు తోలు బొమ్మలను వారి వాయిద్యాలతోపాటు ఇతర సామగ్రిని మూడు లేదా నాలుగు ఎద్దుల బండ్లలో సామాన్లు నింపుకుని నెలల తరబడి గ్రామాల్లోనే ఉండేవారు. ఒక్కోసారి ఆరు నెలలు లేదా ఏడాదిపాటు సంచార జీవనం గడుపుతూ ఇంటికి రాకుండా బొమ్మలాట ఆడేవారు. అప్పట్లో నాటకానికి రూ. 15 అప్పట్లో గ్రామంలో ఒకరోజు నాటకం ఆడేందుకు రూ. 15 చెల్లించేవారు. ఇది కాకుండా కళాకారులు గ్రామంలో ఉన్నన్నాళ్లు ఇంటింటికి వెళ్లి ధాన్యం సేకరించుకునేవారు. వారు ఎన్ని రోజులు ఉన్నా భోజన ఏర్పా ట్లు గ్రామ ప్రజలే చూసుకునేవారు. బొమ్మలాట కళాకారులను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు కళాకారులను ప్రశంసించడంతోపాటు సన్మానించారు. 80వ దశకం తర్వాత ఆదరణ కోల్పోయిన వైనం 80వ దశకం వరకు వైభవంగా నడిచిన తోలు బొమ్మలాట ఆ తర్వాత క్రమేణ ఆదరణ కోల్పోయి దాదాపుగా అంతరించిపోయింది. తొలుత సినిమాల రాకతో తోలు బొమ్మలాటకు ఆదరణ తగ్గింది. ఆ తర్వాత టీవీల రాక, వాటి తర్వాత మొబైల్ఫోన్ల పుట్టుకతో తోలుబొమ్మలాట పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటి తరానికి తోలు బొమ్మలాట అంటే ఏంటో తెలియని పరిస్థితి. వైఎస్సార్ జిల్లాలో బొమ్మలాట కళాకారులు జిల్లాలోని కలసపాడు మండలం సింగరాయపల్లె, పోరుమామిళ్ల మండలం అగ్రహారం, చిన్నాయపల్లె, పోరుమామిళ్ల పట్టణంలోని ఎస్టీ కాలనీ, మహబూబ్‌నగర్ ప్రాంతంలో 50 కుటుంబాలకు పైగా ఈ కళాకారులు ఉండేవారు. జిల్లాలో కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె వద్ద, అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం జిల్లాలోని పోరుమామిళ్లలో మూడు కుటుంబాల వారు మాత్రమే ఉన్నారు. బొమ్మలాట ప్రదర్శనకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మల తయారీ ఇలా.. మేక, గొర్రె, కొండగొర్రె తదితర జంతువుల చర్మాలను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టుకుని ఆ తర్వాత వాటిపైన గోరుగల్లు సాధనంతో రామాయణానికి సంబంధించి రాముడు, సీత, ఆంజనేయుడు, అంగధుడు, సుగ్రీవుడు, రావణాసురుడు తదితర బొమ్మలు, భారతానికి సంబంధించి పాండవులు, కౌరవుల బొమ్మల ఆకారాలను గీతల ద్వారా గీసుకునేవారు. తర్వాత నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రంగులు బొమ్మలకు వేసుకునేవారు. రోడ్డున పడ్డ కళాకారులు బొమ్మలాటకు ఆదరణ తగ్గడంతో కళాకారులు వీధిన పడ్డారు. వృత్తిని పక్కనపెట్టి బతుకుదెరువు కోసం రకరకాల వృత్తులను ఎన్నుకున్నారు. పెద్దమునిరావు కుమారులు ఖాదర్ రావు, వెంకటేశ్వర్లు పెయింటింగ్ పనులు, వాచ్‌మన్‌గా ఉంటుండగా, రమణరావు ముగ్గురు కుమారులు పాత ఇనుము సేకరించే వ్యాపారంలో పడ్డారు. నరసింహారావు కుమారులు సైతం చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దమునిరావు, నరసింహారావు, రమణరావులు గ్రామాలలో తెలిసిన వారి పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు వెళ్లి వారిచ్చే కొద్దోగొప్పో మొత్తం స్వీకరించి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొంతమంది కళాకారులకు పెన్షన్ ఇస్తుండడంతో వృద్ధ కళాకారులకు కొంతమేర ఆసరాగా ఉంటోంది. (క్లిక్ చేయండి: మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్ దర్గా) కళను ప్రోత్సహించాలి అంతరించిపోతున్న బొమ్మలాట కళను నిలబెట్టుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. కళాకారులను ఆదుకోవాలి. వారికి నాటకాలు వేసే అవకాశం కల్పించాలి. తద్వారా ఉపాధి అందించాలి. కళాకారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. ఇతరత్రా సంక్షేమ పథకాలను అందించాలి. ప్రభుత్వమే నాటకాలను ఆదరించాలి. – వనపర్తి పెద్దమునిరావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల తోలుబొమ్మల కేంద్రం ఏర్పాటు చేయాలి తోలుబొమ్మలాట కళను బతికించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. తోలు బొమ్మల తయారీ కేంద్రాలను నెలకొల్పాలి. తోలుబొమ్మలాట కళను భావితరాల వారికి నేర్పించాలి. ఉన్న బొమ్మలాట కళాకారులను గురువులుగా ఏర్పాటు చేసి యువతకు విద్యను నేర్పించాలి. గురువులకు, విద్య నేర్చుకునే వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. – వనపర్తి నరసింహారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బొమ్మలాట కళాకారులను ప్రోత్సహించేందుకు తోలు బొమ్మలాటను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించేందుకు చర్యలు చేపట్టాలి. బొమ్మలాట కళను విస్తృ తం చేసేందుకు కళను ఆసక్తిగల యువతకు నేర్పించాలి. కళాకారులందరికీ ప్రభుత్వం పెన్షన్లతోపాటు ఇంటి పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి. – వనపర్తి రమణారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల -
కొత్త ఆట మొదలైంది
రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు పడి ఉంటే... వెనక్కి వెళ్లడం పరిష్కారం కాదు. వాటిని రోడ్డుపై లేకుండా చేసి ముందుకెళ్లడమే అసలుసిసలు ప్రయాణం. ‘తోలుబొమ్మలాట అనేది పురుషులకు మాత్రమే పరిమితమైన కళ’ అనే నానుడిని ఛేదించి కొత్త ప్రయాణం మొదలు పెట్టింది రజితా రామచంద్రన్... రజిత తండ్రి రామచంద్రన్ పాలక్కడ్ (కేరళ)లో తోలుబొమ్మలాడించడంలో సుప్రసిద్ధుడు. ‘నేను నేర్చుకుంటాను నాన్నా’ అని తండ్రిని అడిగితే ‘ఆడపిల్లలకెందుకమ్మా ఈ ఆట’ అని చిన్నబుచ్చలేదు ఆ తండ్రి. ఎంతో శ్రద్ధగా కూతురికి ‘తోలుబొమ్మలాట’ నేర్పించాడు. ఆ సమయంలో రజితకు అది సరదా మాత్రమే. అయితే ఒకానొక సంఘటన తోలుబొమ్మలాటను సీరియస్‌గా తీసుకునేలా చేసింది. ఒకచోట తోలుబొమ్మలాట జరుగుతోంది. ఒక విదేశీ మహిళ ఈ ఆటను చూస్తూనే వివరాలు అడిగి తెలుసుకుంటోంది. ఇది చూసి కొందరు పురుషులు మండిపడ్డారు. బొమ్మలను ఆడించే చోట ఒక మహిళను ఎలా అనుమతిస్తారు? అనేది వారి కోపం. వారి దృష్టిలో మహిళలు ప్రేక్షకుల్లో మాత్రమే కూర్చోవాలి. తోలుబొమ్మలాట కళ అనేది పురుషుల సొంతం కాదు అని నిరూపించడానికి రజిత రంగంలోకి దిగింది. జిల్లా పంచాయత్ హాల్లో పెన్పవక్కోతు(మహిళల ఆధ్వర్యంలో జరిగే తోలుబొమ్మలాట) పేరుతో కొత్త చరిత్రకు శ్రీకారం జరిగింది. ఈ బృందంలోని సభ్యులు అందరూ మహిళలే. వీరిని ఒక తాటిపైకి తీసుకువచ్చింది రజిత. ఈ బృందంలోని సభ్యులు గురించి చెప్పుకోవాలంటే... సల్ఫి స్క్రిప్ట్ రాసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతను తలకెత్తుకుంది జాస్మిన్. రాజ్యలక్ష్మి, అశ్వతి, నిత్య, నైవేద్య, శ్రీనంద, సంధ్య... బొమ్మలను ఆడించారు. సాధారణంగా బొమ్మలాటలో వినోదం ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ బొమ్మలాటతో మహిళల సమస్యలను, భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు. ‘వినోదానికి అలవాటు పడిన వారికి ఇది నచ్చుతుందా’ అనే సంశయం రజితలో ఉండేది. అయితే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలి’ అంటూ ముక్తకంఠంతో కోరుకున్నారు ప్రేక్షకులు. ‘ఇదేం చోద్యమమ్మా’ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ, వారి విమర్శలకు రజిత బృందం ప్రాధాన్యత ఇవ్వ లేదు. బొమ్మలను ఆడించడానికి శ్రీనంద బయలుదేరే సమయంలో ఇంట్లో వాళ్లే అభ్యంతర పెట్టారు. మిగిలిన వారి పరిస్థితి కూడా అంతే. అయితే ప్రేక్షకలోకంలో మంచి స్పందన వచ్చిన తరువాత వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ‘చరిత్రలో గుర్తుండిపోయే కార్యక్రమంలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’ అంటుంది నిత్య. ‘ఒకప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లను బొమ్మల దగ్గరకు రానిచ్చేవారు కాదు. తాకడాన్ని తప్పుగా భావించేవారు. ఈ రకంగా చూస్తే రజిత బృందం కొత్త చరిత్రను సృష్టించిందని చెప్పుకోవాలి. మార్పు మొదలైనప్పుడు విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. అయితే తమ విమర్శలలో పస లేదనే విషయం వారికి త్వరలోనే అర్థమవుతుంది’ అంటుంది సుగుణ అనే బామ్మ. తొలితరం తోలుబొమ్మలాట మహిళా కళాకారుల బృందం ఈతరం అమ్మాయిలకు కూడా ఆ ప్రాచీన కళను నేర్పించి ఈ పరంపరను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. -
తాధిమి తకధిమి తోలుబొమ్మ..
తోలుబొమ్మలాట చూడటానికి తమాషాగా ఉంటుంది. తాతల నాడు నాలుగు దిక్కుల నడిమి సంతలో ఆడిపాడిన ఈ జానపద కళారూపం.. మళ్లీ పట్నంలో తైతక్కలాడుతోంది. మరమనుషులు ముస్తాబవుతున్న ఈ రోజుల్లో.. మళ్లీ తెరమీదకు వస్తున్నాయి తోలుబొమ్మలు. సాంకేతికత కలబోసుకున్న సినిమాలు ఇవ్వని సందేశాన్ని.. కళాత్మక తోలు బొమ్మలాట అందిస్తోంది.. ఆలోచింపచేస్తోంది. సినిమాలు, పబ్‌లు, మ్యూజిక్ నైట్స్.. ఆటవిడుపనుకునే సిటీవాసులకు అసలైన వినోదాన్ని అందిస్తున్నాయిపప్పెట్ షోలు. నీతి కథలు, కుటుంబంతో వ్యవహరించాల్సిన తీరు, సామాజిక సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి.. ఇలా అనేక సందేశాత్మక ప్రదర్శనలతో అదరహో అనిపించుకుంటున్నాయి. సలామ్ పప్పెట్స్.. పప్పెట్ షోస్‌కు సిటీ సలామ్ చేస్తోంది. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు చదువు ప్రాముఖ్యాన్ని తెలిపేలా ‘తోలు బొమ్మలాట’ ద్వారా అవగాహన కల్పించే ట్రెండ్ ఈ మధ్యే సిటీలో మొదలైంది. వినోదం, సాంకేతికత, హాస్యం, నృత్యం, సందేశం.. ఇలా అన్నీ కలగలసిన ఈ కళ ద్వారా శ్రోతలకు సరైన ఆనందంతో పాటు మానసిక వికాసానికీ దోహదం చేస్తుంది. లెదర్ షాడో పప్పెట్, రాడ్ పప్పెట్, స్ట్రింగ్ పప్పెట్, హ్యాండ్ పప్పెట్ వంటి షోలు పాతతరం ట్రెండ్‌కు కొత్త సొబగులు అద్దుతున్నాయి. ఇంకా ప్రోత్సాహం కావాలి... ‘పప్పెట్ షోలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. అందరూ నయా టెక్నాలజీ వైపే పరుగులు తీస్తుండటంతో వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియడం లేదు. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపై ఉంద’ని అంటున్నారు నోరీ ఆర్ట్ అండ్ పప్పెట్రీ సెంటర్ (ఎన్‌ఏపీసీ) వ్యవస్థాపకురాలు రత్నమాల నోరీ. ద లేడీ ఇన్ ద మిర్రర్.. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో శనివారం ఏఆర్డీఎస్ఐ హైదరాబాద్ డెక్కన్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ‘ద లేడీ ఇన్ ద మిర్రర్’ పప్పెట్ షో ఆద్యంతం హాస్యభరితంగా సాగింది. కథాంశంలోకి వెళ్తే అల్జీమర్స్ (మతిమరుపు) ఉండే ఓ పెద్దావిడ ఇంటికి పెళ్లి ఆహ్వానం అందుతుంది. ఆమెకు అద్దం ముందు నిలబడి మాట్లాడే అలవాటు ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎలాగైనా ఆమెని పెళ్లికి తీసుకురావాలని అనుకుంటారు. అప్పటి నుంచి ఆ పెద్దావిడ తనకింకా పెళ్లికాలేదని, ఆ పెళ్లి తనకేనని అనుకుంటుంది. ఆ గ్రాండ్‌మాను కుటుంబసభ్యులు ఎదుర్కొన్న తీరును కళ్ల ముందుంచింది ఈ షో. అల్జీమర్‌తో బాధపడుతున్న వారిని ప్రేమగా చూసుకోవాలన్న సందేశాన్ని ఇలా కళాత్మకంగా వివరించారు. ..:: వాంకె శ్రీనివాస్