Puppetry
-
మీకు తెలుసా? తాటాకు బొమ్మలకు చాలా డిమాండ్, ఉపాధి మార్గం
తాటాకులు ఇప్పటికీ మన పల్లెల్లో విస్తారం. కానీ తాటాకు విసనకర్రలు పోయాయి. తాటాకు చాపలు, తాటాకు బొమ్మలూ పోయాయి. ‘మన కళ ఇది. మన పిల్లలకు బార్బీ కంటే తాటాకు బొమ్మలే నచ్చుతాయి’ అంటుంది కోయంబత్తూరు మోహనవాణి. తాటాకు కళను పిల్లలకు నేర్చించి వారికై వారు తయారు చేసుకున్న బొమ్మలతో ఆడుకునేందుకు ప్రోత్సహిస్తోంది. స్త్రీలు సరిగా నేర్చుకుంటే ఉపాధి మార్గం అని కూడా చెబుతోంది. మన దేశంలో పశ్చిమ బెంగాల్లో తాటాకుతో చేసే బొమ్మలకు, బుట్టలకు చాలా డిమాండ్ ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. విశాఖ జిల్లా నక్కపల్లి, నర్సీపట్నంల నుంచి శ్రేష్టమైన తాటాకు గ్రేడింగ్ అయ్యి, రంగులు అద్దుకుని కోల్‌కతాకి ఎగుమతి అవుతుంది. అక్కడ వాటితో బొమ్మలు, బుట్టలు తయారు చేసి అమ్ముతున్నారు. పెద్ద ఆదాయం. విశాఖలో జరుగుతున్నట్టుగా మిగిలిన జిల్లాల్లో జరగడం లేదు. తాటాకులు మన తొలి కాగితాలు. తాటాకుతో ఒకప్పుడు ఇళ్లు కప్పేవారు, పందిళ్లు వేసేవారు, చాపలు, బుట్టలు, బొమ్మలు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ కళంతా ఎవరూ సాధన చేయడం లేదు. దానిని అందరికీ నేర్పించాలని కూడా అనుకోవడం లేదు. కాని తమిళనాడులో 34 ఏళ్ల మోహనవాణి అనే మహిళ పట్టుబట్టి తాటాకు బొమ్మల కళను అందరికీ నేర్పుతోంది. దక్షిణాదిలో విస్తారంగా ఉండే తాటి చెట్టు నుంచి ఆకు సేకరించి బొమ్మలు చేసి ఉపాధి పొందవచ్చంటున్నది. ఎనిమిదేళ్ల వయసులో.. మోహనరాణిది కోయంబత్తూరు. ఆమెకు ఎనిమిదేళ్లు ఉండగా మేనమామ ఆమెకు తాళపత్ర గ్రంథం చూపించాడు. రోజూ చూసే తాటాకుల మీద పుస్తకమే రాయవచ్చా అని మోహనరాణికి ఆశ్చర్యం వేసింది. తాటాకులతో చిన్న చిన్న బొమ్మలు చేసే ప్రయత్నం చేసిందిగాని పూర్తిగా రాలేదు. అప్పటినుంచి తాటాకు బొమ్మలు చేయాలనే కోరిక ఉండిపోయింది. ఐదేళ్ల క్రితం మదురైలో తాటాకు బొమ్మలు నేర్పించే వర్క్‌షాప్ జరుగుతున్నదని తెలిసి హాజరయ్యింది. మూడు రోజుల ఆ వర్క్‌షాప్‌లో తాటాకు బొమ్మలు చేయడం నేర్పించారు. పచ్చి ఆకుతో నేరుగా, ఎండిన ఆకైతే నీటితో తడిపి మెత్తగా చేసుకుని అప్పుడు బొమ్మలు చేయాలని తెలిసింది. ఎలా కత్తిరిస్తే ఏ షేప్ వస్తుందో అర్థమయ్యాక తన ఊహ కలిపి బొమ్మలు తయారు చేసింది. వాటికి పూసలు జత చేయడంతో స్పష్టమైన బొమ్మలు తయారయ్యాయి. మోహనవాణి తాటాకులతో చీమలు, చిలుకలు, నెమళ్లు, చేపలు... ఇలా చాలా బొమ్మలు చేస్తుంది. వాటితో గట్టి బుట్టలు కూడా అల్లుతుంది. పిల్లల లోకం అయితే ఈ బొమ్మలు తర్వాతి తరాలకు అందాలని నిశ్చయించుకుంది మోహనవాణి. కోయంబత్తూరులోని స్కూళ్లకు వెళ్లి తాటాకు బొమ్మలు నేర్పించింది. పిల్లలు ఎంతో హుషారుతో బొమ్మలు నేర్చుకున్నారు. కొత్త బొమ్మలు చేశారు. ‘ఆశ్చర్యం ఏమిటంటే మీరు తయారు చేసిన బొమ్మలతో కథ కల్పించి చెప్పండి అనంటే వాళ్లు చాలా విచిత్రమైన కథలు చెప్పారు. పిల్లలకు ఇదెంతో మానసిక వికాసం అనిపించి తరచూ అనేక స్కూళ్లకు వెళ్లి వర్క్‌షాపులు నిర్వహించి ఈ కళను నేర్పుతున్నాను’ అంది మోహనవాణి. ప్లాస్టిక్‌కు దూరం తాటాకు బొమ్మలు పర్యావరణ హితమైనవి. పిల్లల్ని, పర్యావరణాన్ని ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాదు తాటాకు బొమ్మలు దేశీయమైనవి. మనదైన కళ కావడం వల్ల పిల్లలు కృత్రిమ పాశ్చాత్య బొమ్మలతో కాకుండా అమాయకమైన ఈ బొమ్మలతో ఎక్కువ ఆనందం పొందుతారు. ‘పర్యావరణ స్పృహ పెరిగింది కాబట్టి తాటాకు బుట్టలను, బాక్సులను, విసనకర్రలను చాలామంది కొంటున్నారు. మహిళలు ఈ కళను నేర్చుకుంటే అతి తక్కువ పెట్టుబడితో మంచి ఉపాధి పొందవచ్చు’ అంటోంది మోహనవాణి. ఆమె ఇప్పుడు ముంబైలోని కొన్ని స్కూళ్లకు వెళ్లి ఈ విద్య నేర్పుతోంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా చాలా స్కూళ్లు ఆమెను ఆహ్వానిస్తున్నాయి. టీచర్లు ఈ క్రాఫ్ట్ నేర్చుకుంటే పిల్లలకు నేర్పించవచ్చని టీచర్లకు తాటాకు కళ నేర్పుతోంది మోహనవాణి. ‘తాటాకు బొమ్మలు చేయడం పెద్ద స్ట్రెస్‌బస్టర్. మీ ఒత్తిడి దూరం చేసుకోవడానికైనా తాటాకు అందుకుని బొమ్మలు చేయండి’ అంటోంది మోహనవాణి. -
Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ
ఆమె ఊహల్లో కథ అల్లుకుపోతే అవి బొమ్మలై మన ముందు కదలాడతాయి. చూసే పిల్లల మొహాల్లో ఆశ్చర్యానందాలను పెద్దల మెదళ్లలో ఆలోచనలను కొత్తగా వికసింపజేస్తాయి. ముప్పైఏళ్లుగా పప్పెట్రీతో స్నేహం చేస్తూ ‘మా బొమ్మల టీచర్’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పేరు నోరి రత్నమాల. హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలనీలో ఉంటున్న ఈ విశ్రాంత టీచరమ్మను కలిస్తే ఎన్నో అందమైన కథల మాలను మన ముందుంచుతారు. ‘విష్ణుశర్మ అడవి గుండా ప్రయాణిస్తుంటాడు. దారిలో బావిలోనుంచి మమ్మల్ని కాపాడండీ.. అని కేకలు విని అక్కడకు వెళ్లి లోపలకు చూస్తాడు. అందులో ఒక పులి, కోతి, పాముతో పాటు మనిషి ఉంటాడు. వారందరినీ కాపాడే సమయంలో ‘మనిషిని మాత్రం కాపాడవద్దు’ అని చెబుతాయి మిగతా జంతువులు...’ అంటూ మనిషిలో ఉండే స్వార్థం ప్రాణాపాయం ఎలా కలిగిస్తుందో చెబుతూనే నేటి సాయంత్రం హైదరాబాద్‌లో ప్రదర్శించబోతున్న కథనాన్ని, అందుకోసం చేసుకున్న ఏర్పాట్ల గురించి చెబుతూనే తనలో ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి దారి తీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ఈ టీచరమ్మ. ‘‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ టీచర్‌గా వర్క్ చేశాను. పిల్లలకు ఆసక్తి గొలిపేలా సృజనాత్మకతను పరిచయం చేసే ఆ సబ్జెక్ట్ నాకెంతగానో రచ్చింది, ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకోవడం ఎలా అని ఆలోచించినప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్న పప్పెట్రీ గురించి గుర్తొచ్చింది, నా చిన్నతనంలో మా నాయనమ్మ నన్ను తోలుబొమ్మలాటకు తీసుకెళ్లేది. అందులో రామాయణ భారత కథలను తెల్లవార్లూ ప్రదర్శించేవారు. బాల్యంలో నా మనసులో నాటుకుపోయిన ఆ కళ ఆ తర్వాత నాకు విద్యార్థులకు పరిచయం చేయడానికి తోడ్పడింది. స్కూల్ నుంచి మొదలు సంప్రదాయ తోలుబొమ్మల తయారీ అంటే అంత సులువు కాదు. అందుకని కాగితం, క్లాత్, ఇతర వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి పప్పెట్రీ బొమ్మలు తయారుచేసేదాన్ని. వాటిద్వారా పిల్లలకు పంచతంత్ర వంటి ఎన్నో కథలు చెప్పేదాన్ని. పిల్లలు కూడా ఈ బొమ్మల ద్వారా తమ ఆసక్తులను కనబరిచేవారు. అక్కడ నుంచి ఇతర టీచర్లకు శిక్షణ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. దూరదర్శన్లోనూ బాలల వికాసానికి పప్పెట్రీతో కార్యక్రమాలు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో సామాజిక అవగాహన కలిగించే అంశాలెన్నో కథలుగా రూపొందించి, ప్రదర్శించాను. కదిలించే కథనాలు.. స్వాతంత్య్రానికి ముందు మనకున్న అవగాహన కార్యక్రమాలలో ప్రధానమైనది తోలుబొమ్మలాటనే. ఇది దేశవ్యాప్త కళ. బొమ్మలను తెరముందు కదిలిస్తూ, దీపం వెలుతురు సాయంతో ప్రదర్శన ఉండేది. సంప్రదాయ బొమ్మల తయారీ ఇప్పుడు కొంచెం కష్టమే. ఇక ప్రదర్శన ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అలాగని నేర్చుకున్న కళను మన దగ్గరే ఉంచలేం. పదిమందికి తెలిసినప్పుడే ఆ కళ బతుకుతుంది. సామాజిక అవగాహనకు నా భాగస్వామ్యమూ ఉండాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయి. సంగీత నాటక అకాడమీ నుంచి ఇన్నేళ్లలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. విదేశాలలోనూ పప్పెట్రీ ప్రదర్శన చేయడం, అభినందనలు, అవార్డులు, మరచిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీమ్ వర్క్ విజయం బొమ్మల తయారీ, బొమ్మలు కదల్చడానికి, మంచి కథనానికి, పాటలకు, నేపథ్య సంగీతానికి.. ఇలా ఇదంతా టీమ్ వర్క్‌తో కూడుకున్నది. ఇందుకోసం మావారితోపాటు పిల్లలనూ ఆ తర్వాత వారి పిల్లలనూ ఈ పనిలో భాగస్థులను చేశాను. దీనివల్ల వారి లోపల ఉన్న వారికే తెలియని కళ బయటకు వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న మా పిల్లలు కూడా కథనానికి తగ్గ వాయిస్ డబ్బింగ్‌ను క్లిప్పింగ్స్ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఇందులో నా కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు, కొందరు స్వచ్ఛందంగానూ మేం చేసే పనిలో భాగమవుతుంటారు. ఈ కళ బతికుంది అనడానికి ఇంతకుమించి నిదర్శనాన్ని చూపలేం. డిజిటల్ మీడియాలోనూ.. కరోనా సమయంలో నోరి ఆర్ట్ అండ్ పప్పెట్రీ పేరుతో యూ ట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ చేశాను. పిల్లల కోసం పప్పెట్రీ ద్వారా కొన్ని వందల కథలను పరిచయం చేశాను. అవన్నీ ఒక్కదాన్నే చేశాను. పెద్దవాళ్లూ ఆస్వాదించారు. ఎంతోమంది అభినందనలు తెలియజేశారు. ఏ దేశానికి లేనన్ని సంప్రదాయ కళలు మన దగ్గర ఉన్నాయి. వాటికి పునరుజ్జీవం కలగాలంటే ప్రభుత్వాలు, సంస్థలు, ఆసక్తి కలవారు ముందుకు రావాలి. పిల్లల్లో ఈ కళలను బతికిస్తే చాలు– ముందు తరాలకు అవి వారసత్వంగా ప్రయాణిస్తాయి. ఏ దేశంలో ఉన్నా మన ప్రత్యేకతను ఈ కళలే చాటుతాయి. అందుకే ప్రాచీన కళలకు ప్రోత్సాహమిద్దాం’’ అని వివరించారు ఈ పప్పెట్రీ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి -
Tholu Bommalata: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు
ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా క్రమేణా టీవీలు రావడం, ఆ తర్వాత మొబైల్ ఫోన్ల ఆవిర్భావంతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాతి తరం బొమ్మలాట కళకు దూరమైంది. సాక్షి ప్రతినిధి, కడప: ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామాల్లో తిరుగులేని ఆదరణ ఉండేది. క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ 1980వ దశకం వరకు వైభవంగా నడిచింది. ఈ కళను గ్రామాలలో విపరీతంగా ఆదరించారు. బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా భారతంలో విరాటపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, పద్మవ్యూహం, సైంధవ వధ, దానవీర శూర కర్ణ, శల్య, శకుని, భీమ, దుర్యోధన యుద్ధం, అశ్వమేధ యాగం, ప్రమీలార్జునీయం, విభీషణ విజయం, బబ్రువాహన చరిత్ర తదితర ఘట్టాలను బొమ్మలాట ద్వారా ప్రదర్శించేవారు. ఇక రామాయణంలో సుందరకాండ, లక్ష్మణమూర్ఛ, సతీసులోచన, ఇంద్రజిత్తు మరణం, రామరామ యుద్ధం, మహిరావణ చరిత్ర తదితర పురాణ గాథలను కూడా తోలు బొమ్మలాటలో ప్రాధాన్యత పొందాయి. పది మంది కళాకారులతో నాటకం తోలు బొమ్మలాట ప్రదర్శనకు పది మంది కళాకారులు అవసరం. హార్మోనియం, తబలా, డబ్బా తదితర సంగీత వాయిద్యాలను వాయించేవారితోపాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడటం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు. రామాయణ, భారతంలోని మగ పాత్రలకు మగవాళ్లే పనిచేసేవారు. ఆడపాత్రలకు మహిళలు తెరవెనుక నాటకం వేసేవారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే, వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకుమించిన కళ. ఈ రెండింటి అనుసంధానంతోనే బొమ్మలాట నాటకాన్ని కళాకారులు రక్తి కట్టిస్తారు. ప్రమిదల వెలుగులో బొమ్మలాట నాటకం పూర్వం బొమ్మలాటను ప్రత్యేకమైన తెల్ల పంచె తెరగా ఏర్పాటు చేసుకుని చుట్టూ చీకటి ఉండేలా చూసుకుని తెరవెనుక ఆముదం పోసి వెలిగించిన ప్రమిదల సాయంతో తెరపైన తోలుబొమ్మలు కనబడేలా చేసేవారు. రానురాను పెట్రోమ్యాక్స్ లైట్లు, ఆ తర్వాత గ్యాస్ లైట్లు, విద్యుత్ బల్బుల సాయంతో బొమ్మలు తెరపైన కనబడేలా చేసేవారు. అప్పట్లో తెరపైన బొమ్మలు ఆడటం పాతతరం గ్రామీణ ప్రజలకు వింతగా, ఆసక్తిగా, సంబరంగా ఉండేది. పైపెచ్చు చదువులేకపోయినా వంట బట్టించుకున్న పౌరాణిక గాథలు కళ్ల ముందు కనిపించడం అప్పటి జనాన్ని మరింత ఆకట్టుకునేది. నాటకాల్లో సీరియస్ పాత్రలతోపాటు జుట్టుపోలిగాడు, బంగారక్క పాత్రలను సైతం సృష్టించి బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు. తోలు బొమ్మలాటకు తిరుగులేని ఆదరణ తోలుబొమ్మలాట కళకు 80వ దశకం వరకు తిరుగులేని ఆదరణ ఉండేది. ఒక్కో గ్రామంలో 15 రోజుల నుంచి నెలరోజులపాటు కూడా నాటకం ఆడేవారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆయా గ్రామాల ప్రజలు వచ్చి ళాకారులకు తాంబూలం ఇచ్చి తేదీని ఖరారు చేసుకునేవారు. ఇప్పటి సినిమా నటుల కాల్షీట్ల డిమాండ్ కంటే అప్పటి బొమ్మలాట కళాకారుల డిమాండ్ మూడింతలు ఉండేది. కళాకారులు తోలు బొమ్మలను వారి వాయిద్యాలతోపాటు ఇతర సామగ్రిని మూడు లేదా నాలుగు ఎద్దుల బండ్లలో సామాన్లు నింపుకుని నెలల తరబడి గ్రామాల్లోనే ఉండేవారు. ఒక్కోసారి ఆరు నెలలు లేదా ఏడాదిపాటు సంచార జీవనం గడుపుతూ ఇంటికి రాకుండా బొమ్మలాట ఆడేవారు. అప్పట్లో నాటకానికి రూ. 15 అప్పట్లో గ్రామంలో ఒకరోజు నాటకం ఆడేందుకు రూ. 15 చెల్లించేవారు. ఇది కాకుండా కళాకారులు గ్రామంలో ఉన్నన్నాళ్లు ఇంటింటికి వెళ్లి ధాన్యం సేకరించుకునేవారు. వారు ఎన్ని రోజులు ఉన్నా భోజన ఏర్పా ట్లు గ్రామ ప్రజలే చూసుకునేవారు. బొమ్మలాట కళాకారులను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు కళాకారులను ప్రశంసించడంతోపాటు సన్మానించారు. 80వ దశకం తర్వాత ఆదరణ కోల్పోయిన వైనం 80వ దశకం వరకు వైభవంగా నడిచిన తోలు బొమ్మలాట ఆ తర్వాత క్రమేణ ఆదరణ కోల్పోయి దాదాపుగా అంతరించిపోయింది. తొలుత సినిమాల రాకతో తోలు బొమ్మలాటకు ఆదరణ తగ్గింది. ఆ తర్వాత టీవీల రాక, వాటి తర్వాత మొబైల్ఫోన్ల పుట్టుకతో తోలుబొమ్మలాట పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటి తరానికి తోలు బొమ్మలాట అంటే ఏంటో తెలియని పరిస్థితి. వైఎస్సార్ జిల్లాలో బొమ్మలాట కళాకారులు జిల్లాలోని కలసపాడు మండలం సింగరాయపల్లె, పోరుమామిళ్ల మండలం అగ్రహారం, చిన్నాయపల్లె, పోరుమామిళ్ల పట్టణంలోని ఎస్టీ కాలనీ, మహబూబ్‌నగర్ ప్రాంతంలో 50 కుటుంబాలకు పైగా ఈ కళాకారులు ఉండేవారు. జిల్లాలో కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె వద్ద, అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం జిల్లాలోని పోరుమామిళ్లలో మూడు కుటుంబాల వారు మాత్రమే ఉన్నారు. బొమ్మలాట ప్రదర్శనకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మల తయారీ ఇలా.. మేక, గొర్రె, కొండగొర్రె తదితర జంతువుల చర్మాలను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టుకుని ఆ తర్వాత వాటిపైన గోరుగల్లు సాధనంతో రామాయణానికి సంబంధించి రాముడు, సీత, ఆంజనేయుడు, అంగధుడు, సుగ్రీవుడు, రావణాసురుడు తదితర బొమ్మలు, భారతానికి సంబంధించి పాండవులు, కౌరవుల బొమ్మల ఆకారాలను గీతల ద్వారా గీసుకునేవారు. తర్వాత నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రంగులు బొమ్మలకు వేసుకునేవారు. రోడ్డున పడ్డ కళాకారులు బొమ్మలాటకు ఆదరణ తగ్గడంతో కళాకారులు వీధిన పడ్డారు. వృత్తిని పక్కనపెట్టి బతుకుదెరువు కోసం రకరకాల వృత్తులను ఎన్నుకున్నారు. పెద్దమునిరావు కుమారులు ఖాదర్ రావు, వెంకటేశ్వర్లు పెయింటింగ్ పనులు, వాచ్‌మన్‌గా ఉంటుండగా, రమణరావు ముగ్గురు కుమారులు పాత ఇనుము సేకరించే వ్యాపారంలో పడ్డారు. నరసింహారావు కుమారులు సైతం చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దమునిరావు, నరసింహారావు, రమణరావులు గ్రామాలలో తెలిసిన వారి పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు వెళ్లి వారిచ్చే కొద్దోగొప్పో మొత్తం స్వీకరించి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొంతమంది కళాకారులకు పెన్షన్ ఇస్తుండడంతో వృద్ధ కళాకారులకు కొంతమేర ఆసరాగా ఉంటోంది. (క్లిక్ చేయండి: మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్ దర్గా) కళను ప్రోత్సహించాలి అంతరించిపోతున్న బొమ్మలాట కళను నిలబెట్టుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. కళాకారులను ఆదుకోవాలి. వారికి నాటకాలు వేసే అవకాశం కల్పించాలి. తద్వారా ఉపాధి అందించాలి. కళాకారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. ఇతరత్రా సంక్షేమ పథకాలను అందించాలి. ప్రభుత్వమే నాటకాలను ఆదరించాలి. – వనపర్తి పెద్దమునిరావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల తోలుబొమ్మల కేంద్రం ఏర్పాటు చేయాలి తోలుబొమ్మలాట కళను బతికించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. తోలు బొమ్మల తయారీ కేంద్రాలను నెలకొల్పాలి. తోలుబొమ్మలాట కళను భావితరాల వారికి నేర్పించాలి. ఉన్న బొమ్మలాట కళాకారులను గురువులుగా ఏర్పాటు చేసి యువతకు విద్యను నేర్పించాలి. గురువులకు, విద్య నేర్చుకునే వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. – వనపర్తి నరసింహారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బొమ్మలాట కళాకారులను ప్రోత్సహించేందుకు తోలు బొమ్మలాటను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించేందుకు చర్యలు చేపట్టాలి. బొమ్మలాట కళను విస్తృ తం చేసేందుకు కళను ఆసక్తిగల యువతకు నేర్పించాలి. కళాకారులందరికీ ప్రభుత్వం పెన్షన్లతోపాటు ఇంటి పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి. – వనపర్తి రమణారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల -
బొమ్మల కథావాహిని
బొమ్మతో అనుబంధం... బొమ్మతో ఆడుకోవడం మన బాల్య జ్ఞాపకం. బొమ్మను నేస్తంలా, బిడ్డలా హత్తుకునే చిట్టి మనసులకు ఆ బొమ్మతోనే పదేళ్లుగా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ సామాజిక సమస్యలపై అవగాహన కలిగిస్తూ ఉన్నారు పప్పెట్రీ కథకురాలు పద్మినీ రంగరాజన్. హైదరాబాద్‌లో ఇరవై ఏళ్లుగా బొమ్మలతో దోస్తీ చేసిన ఈ కథల నేస్తం గురించి... ‘పిల్లలూ.. ఇప్పుడు ఈ మల్లూ మీతో మాట్లాడతాడు..’ అని ఆసక్తిగా బొమ్మలతో కథలు చెప్పడమే కాదు, జానపద సాహిత్యాన్ని మన కళ్లకు కడతారు. సోషియాలజీలో పరిశోధకురాలుగా ఉన్నారు. పదేళ్ల పాటు అధ్యాపకురాలిగా పనిచేశారు. స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేరుతో సంస్థను నెలకొల్పిన పద్మిని రంగరాజన్‌ని కలిస్తే మనకు ఆసక్తికరమైన ఎన్నో విషయాలు పరిచయం అవుతాయి. పిల్లలకు తోలుబొమ్మల ద్వారా కష్టమైన గణితాన్ని, ఆంగ్లవ్యాకరణాన్ని సులువుగా నేర్పించవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, సామాజిక సమస్యలపై అవగాహన ఆసక్తి కలిగేలా చెప్పవచ్చనే విషయం స్పష్టం అవుతుంది. అనుకోకుండా మొదలైన పప్పెట్రీ తన జీవిత విధానంలో తీసుకువచ్చిన మార్పుల గురించి ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు పద్మినీ రంగరాజన్. ‘‘మల్లు అనేది నా మొదటి గ్లౌజ్ కోతి తోలుబొమ్మ. నేరుగా నేను కాకుండా బొమ్మ మాట్లాడుతుంటే పిల్లలు ఒళ్లంతా కళ్లు, చెవులు చేసుకుని వింటుంటారు. ఆ సమయంలో ఎంత ఉత్సాహంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇరవై ఏళ్ల క్రితం.. నా కొడుకు ఆసక్తి గా కథ వినడం కోసం ఈ బొమ్మల కళను ఎంచుకున్నాను. అలా మొదటిసారి తోలుబొమ్మతో మా అబ్బాయికి పురాణకథను చెప్పాను. ఆ తర్వాత్తర్వాత పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో తోలుబొమ్మతో కథలు చెప్పడం మొదలయ్యింది. స్నేహితుల సంఖ్య పెరిగింది. బొమ్మలతో పిల్లలకు లెక్కలు చెప్పడం, ఇంగ్లిష్ గ్రామర్ చెప్పడం సులువయ్యింది. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ పప్పెట్రీ నా జీవితంలో భాగమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అబ్బాయితోపాటు నాలోనూ ఈ కళ పట్ల ఇష్టం బాగా పెరిగిపోయింది. ఇంటినుంచి మొదలైన ఈ బొమ్మల కథ బయటి నా ప్రపంచాన్ని విస్తృతం చేసింది. స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌ను ఏర్పాటు చేసేలా చేసింది. పిల్లలే అభిమానులు తోలుబొమ్మలాట కళ అంతరించిపోతుందునుకున్న నాకు కథల ద్వారా ఈ కళను కాపాడవచ్చని, ఇంకా ఇష్టంతో కష్టపడేలా చేసింది. అందులో భాగంగానే వరంగల్ జిల్లాల్లోని అమ్మాపురంలో తీగతోలుబొమ్మలాట పునరుద్ధరణ గుర్తించిన వాటిలో ఒకటి. స్కూళ్లలోనూ పప్పెట్రీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. పిల్లలకోసమే వర్క్‌షాప్స్ నిర్వహించాను. ముందుకన్నా పిల్లలంతా ఈ కార్యక్రమాల్లో చాలా చురుకుగా మారడం గమనించాను. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకూ దగ్గరయ్యాను. నాన్న మార్గనిర్దేశం.. ఇంట్లో పురాణాలు, ఇతిహాసాలు కథలుగా మా పెద్దలు చెబుతుండేవారు. నేనూ నా తర్వాతి తరానికి అందించడానికి అదే ప్రయత్నం చేశాను. అయితే, తోలుబొమ్మలతో కథలు చెప్పడం మాత్రం మా నాన్న మార్గనిర్దేశం చేశారు. రామాయణ, మహాభారతం, పురాణాల నుండి మాత్రమే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో కథలు చెప్పడం ప్రారంభించాను. తోలుబొమ్మలాట శతాబ్దాలుగా మన జీవనంలో ఇమిడి ఉంది. ఇది వినోదం మాత్రమే కాదు అవగాహన నింపే విద్య కూడా. ఈ కళను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రస్తుత కాలానికి తగినట్టు ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తిగా వింటున్నారు. కథే స్ఫూర్తి స్ఫూర్తి థియేటర్ ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ 2005లో ప్రారంభించినప్పటి నుంచి గిరిజన విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఉట్నూర్‌లో ఆరోగ్య సమస్యల గురించి గోండు భాషలో వివరించిన కార్యక్రమం చాలా ప్రశంసలు పొందింది. టైప్ 1 డయాబెటిస్ పిల్లల ఆరోగ్య స్థితిపైనా పప్పెట్రీ వర్క్ చేస్తున్నాను. పుతాలికా మాస పత్రిక కరోనా సమయంలో పుతాలిక పేరుతో నెలవారీగా ఇ–మ్యాగజైన్ తీసుకువస్తున్నాను. ఇది ప్రపంచంలో ఉన్న తోలుబొమ్మల కళాకారులందరినీ పరిచయం చేస్తుంది. దీంతోపాటు పప్పెట్రీ గురించి ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాను. కిందటేడాది స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ లభించింది. దీంట్లో భాగంగా వ్యర్థాలతో ముఖ్యంగా ప్లాసిక్, ఖాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్లలోని దూది, కొబ్బరి చిప్పలు, పాత బట్టలు, పాత టీ స్ట్రెయినర్లు, వార్తాపత్రికలతో బొమ్మలను తయారు చేయిస్తుంటాను. దీనివల్ల వ్యర్థాలను అర్థాలుగా మార్చడం ఎలాగో పిల్లలకు తెలుస్తుంది. మనుగడకు పోరాటం మనదేశంలో తోలుబొమ్మలాట అనేది కుటుంబ సంప్రదాయం. దీనికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సంప్రదాయం అంతరించిపోయే అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఉన్నవాళ్లు తమ మనుగడ కోసం వేరే దారులను వెతుకుతున్నారు. అయినప్పటికీ ఇతర దేశాలలో తోలుబొమ్మలాటలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కళను బతికించడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నాను. ఇందుకోసం నా జీవితాంతం కృషి చేస్తూనే ఉంటాను’ అని వివరించారు పద్మినీ రంగరాజన్. తోలుబొమ్మల ద్వారా పురాణ కథలను ఆసక్తిగా చెప్పడమే కాదు బాల్యవివాహాలను అరికట్టడం, పరిశుభ్రత కోసం ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ.. వంటి సామాజిక సమస్యలపై సమర్థంగా పనిచేసే మాధ్యమం తోలుబొమ్మలు అని తెలిపే పద్మినీ రంగరాజన్ ‘తోలుబొమ్మ కఠినంగా మాట్లాడినా ఎవరూ అంతగా బాధపడరు’ అని నవ్వుతూ వివరిస్తారు. – నిర్మలారెడ్డి -
పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు
తోలుబొమ్మలాట కళాకారిణి మూళిక్కల్ పంకజాక్షికి గత ఏడాది పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎనభై నాలుగేళ్ల వయసులో ఈ పురస్కారం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘తోల్ పావకూథు, నూల్ పావకూథు’ శైలి తోలుబొమ్మలాటల ప్రదర్శనలు ఎక్కువగా ఉండేవి. తోలుబొమ్మలాటలో అత్యంత క్లిష్టమైన నొక్కు విద్య పావకళి సాధన చేసే కళాకారులు తక్కువే, ప్రదర్శనలు కూడా అరుదు. కేరళలోని ఓ కుగ్రామం మునిపల్లెలోని పంకజాక్షి నొక్కు విద్య పావకళిని సాధన చేసింది. పన్నెండేళ్ల వయసు నుంచి తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టింది. 2008లో పారిస్‌లో కూడా ప్రదర్శన ఇచ్చింది. అప్పటికే ఆమెకు ఇది అరుదైన కళ మాత్రమే కాదు, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నదనే అవగాహన కూడా వచ్చేసింది. విదేశీ వేదిక మీద ప్రదర్శన ఇచ్చిన సంతోషం కంటే తాను మరణించేలోపు ఈ కళను ఎవరికైనా నేర్పించి చనిపోవాలనే చిన్న ఆశ ఆమెలో కలిగింది. కళ్లు మసకబారడం మొదలైంది. ప్రదర్శనలో తొట్రుపాటు వస్తోంది. క్రమంగా తనది చిన్న ఆశ కాదు, చాలా పెద్ద ఆశ అని, బహుశా తీరని కోరికగా మిగిలిపోతుందేమోననే ఆవేదన కూడా మొదలైంది. ఒక్క మనుమరాలు ఇది పన్నెండేళ్ల కిందటి మాట. పారిస్ ప్రదర్శన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం. నొక్కు విద్య పావకళి అంతరించి పోకూడదనే కృతనిశ్చయంతో పంకజాక్షి తన ముగ్గురు మనవరాళ్లను కూర్చోబెట్టి నొక్కువిద్యకు అవసరమైన మహాభారత, రామాయణ కథలను చెప్పసాగింది. క్రమంగా వారిలో ఆసక్తి రేకెత్తించాలనేది ఆమె ప్రయత్నం. ఆ ముగ్గురిలో అమ్మమ్మ తాపత్రయాన్ని గమనించింది ఒక్క రంజని మాత్రమే. నొక్కు విద్య కథలను నోట్స్ రాసుకుంది. పంకజాక్షి భర్త బొమ్మల తయారీలో నిపుణుడు. తాత దగ్గర బొమ్మల డిస్క్రిప్షన్ కూడా సిద్ధం చేసుకుంది రంజని. ఆ తర్వాత బొమ్మలతో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కర్రను పై పెదవి మీద ఉంచి బాలెన్స్ చేస్తూ తాడుతో బొమ్మ వెనుక కట్టిన దారాలను కథనానికి అనుగుణం గా కదిలించాలి. ఇది మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. సంవత్సరాల సాధన తర్వాత రంజని నైపుణ్యం సాధించింది. ఇప్పుడు రంజనికి ఇరవై ఏళ్లు. కళను సాధన చేస్తూనే బీకామ్ డిగ్రీ చేసింది. బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనుంది. ‘‘తరతరాలుగా మా కుటుంబం ఈ కళతోనే గుర్తింపు పొందింది. కళను ప్రదర్శించిన తర్వాత ప్రేక్షకులు ఇచ్చిన కానుకలతోనే బతుకు సాగేది. క్రమంగా ప్రేక్షకాదరణ తగ్గిపోవడం తో ప్రదర్శనలూ తగ్గిపోయాయి. మా తల్లిదండ్రుల తరంలో ఇతర వృత్తుల్లో ఉపాధిని వెతుక్కోవడం మొదలైంది. అమ్మమ్మ బాధ పడడం చూసినప్పటి నుంచి ఈ కళను బతికించాలనే కోరిక కలిగింది. అందుకే నేర్చుకున్నాను. ఆ తరంలో వాళ్లకు ప్రదర్శించడం తప్ప ప్రాచుర్యం కల్పించడం తెలియదు. నేను దీనిని ప్రాచుర్యంలోకి తీసుకువస్తాను’’ అంటోంది రంజని. -
Puppetry: తోలు బొమ్మలాట.. బతుకు బొమ్మలాట
జీవం లేని ఆ మూగ బొమ్మలు ఎన్నో విన్యాసాలు చేస్తాయి. మరెన్నో మాటలు మాట్లాడతాయి. జీవ నిబద్ధమైన రామాయణ, మహాభారత కథలను, మానవ బతుకు చిత్రాల్లో నీతిని కళ్లెదుట ఆవిష్కరిస్తాయి. కేతిగాడు, బంగారక్క, జుట్టు పోలిగాడు రూపంలో హాస్యాన్నీ పండిస్తాయి. వీటి కదలికల వెనుక.. అవి చెప్పే ఊసుల వెనుక బయటకు కనిపించని ఓ జానపదుడి కళాత్మకత దాగి ఉంటుంది. ఆదరణ తగ్గిన ఆ కళనే నమ్ముకుని నేటికీ కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు తహతహలాడుతున్నాయి. అద్దంకి: తోలు బొమ్మలాట అత్యంత పురాతన కళ. విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ భారతీయ జానపద కళా రూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొందింది. మన రాష్ట్రంలోని ప్రాచీన ఓడ రేవులైన కళింగ పట్నం, భీముని పట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపటా్నల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు ఈ కళారూపం కూడా పయనించింది. పర్షియా, టర్కీ మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలు బొమ్మలు అక్కడ నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడి నుంచి ఫ్రాన్స్‌లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. కాలానుగుణంగా ఆయా దేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ దీనికి మాతృక మాత్రం భారత దేశమే. ఇంతటి విశిష్టత పొందిన ఆ కళకు నేడు ఆదరణ తగ్గిపోయింది. అయినప్పటికీ తర తరాలుగా వారసత్వంగా వస్తున్న కళను కాపాడుకునేందుకు కొందరు కళాకారులు నేటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిణుకు మిణుకుమంటూనే.. ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తోలు బొమ్మలాట ప్రదర్శనలిచ్చే కుటుంబాలు సుమారు 500 వరకు ఉన్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో 10 కుటుంబాలు, దర్శిలో 10 కుటుంబాలు, ముండ్లమూరు మండలంలోని ఈదర, భీమవరం గ్రామాల్లో 10 కుటుంబాలు, నరసరావుపేటలోని సాతులూరులో 20 కుటుంబాలు, కోటప్పకొండలోని చీమలమర్రి, కొండమోడు వద్ద కొన్ని కుటుంబాలు ప్రాచీన కళను బతికిస్తున్నాయి. ఈ కుటుంబాలు ప్రస్తుతం వినాయక విజయం, రామాయణంలోని సుందరకాండ, మహిరావణ చరిత్ర, లక్ష్మణ స్వామి మూర్చ, రామరావణ యుద్ధం, ఇంద్రజిత్ యుద్దం, సీతా కల్యాణం, మహాభారతంలో పద్మవ్యూహం, విరాటపర్వం, కీచక వధ, కర్ణ, శల్య, సైంధవ, నరకాసురవధ వంటి కథలను ప్రదర్శిస్తున్నాయి. తోలు బొమ్మలాటనే నమ్ముకుని అద్దంకిలో ఉంటున్న రేఖనార్ కోటిలింగం కుటుంబం నేటికీ జీవనం సాగిస్తోంది. ఈ ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆ కుటుంబం కోరుతోంది. ఈ కళను వదల్లేం తోలు బొమ్మలాట మా తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. మరో వృత్తి చేయలేం. మా తాతల తండ్రులు మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకు వలస వచ్చారు. కళలకు నిలయమైన అద్దంకిలో ఆదరించే వారు ఎక్కువగా ఉంటారని మేమిక్కడ స్థిరపడ్డాం. కుటుంబం మొత్తం కళాకారులమే. ప్రదర్శనకు అవసరమైన బొమ్మలను మేక, గొర్రె చర్మంతో మేమే తయారు చేసుకుంటాం. ఒక్కో బొమ్మ తయారీకి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. భారత, రామాయణ పాత్రలకు సంబంధించిన పాత్రల బొమ్మలను ఆకర్షణీయంగా తెరవెనుక ఆడించడానికి వీలుగా తయారు చేసుకుంటాం. వాటికి దారాలు కట్టి, రేకులకు బిగించి నటనకు అనుగుణమైన కదలికలిస్తాం. మేం బతికున్నంత కాలం ఈ కళను వదల్లేం. జీవన భృతి కోసం మా పిల్లలు ఊరూరా తిరుగుతూ బీరువాలు, సోఫాలు, గ్యాస్ స్టవ్ మరమ్మతులు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కళకు వైభవం తెచ్చేందుకు కృషి చేయాలి – రేఖనార్ కోటిలింగం, తోలు బొమ్మలాట కళాకారుడు, అద్దంకి -
తోలుబొమ్మల సిత్రాలు
‘‘సినిమా పుట్టుకకి బీజం తోలుబొమ్మలాట. ఈ కళ పేరుతో తోలుబొమ్మల సిత్రాలు అనే బ్యానర్ నెలకొల్పినందుకు యూనిట్‌ని అభినందిస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ బ్యానర్ పెద్ద సంస్థగా ఎదగాలని, ఈ బ్యానర్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. తోలుబొమ్మల సిత్రాలు బేనర్లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు ఓ సినిమా నిర్మించారు. తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ వీడియో, లోగోని ఎస్.బి. అంజాద్ బాషా విడుదల చేశారు. ఈ సందర్భంగా కొమారి జానకిరామ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథాంశాన్ని తెలుసుకున్న అంజాద్ బాషాగారు తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడం ఎంతో సంతోషం. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్, నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం యు.వి. నిరంజన్. -
మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని ఆరు రాజకీయపార్టీలు ఉమ్మడిగా చేసిన ‘గుప్కార్ డిక్లరేషన్’ను పాకిస్తాన్ స్వాగతించడంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గట్టిగా స్పందించారు. ‘మేం ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మలం కాము’ అంటూ వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పాకిస్తాన్‌కు అకస్మాత్తుగా ఇప్పుడు ఇష్టం పుట్టుకొచ్చింది. ఢిల్లీకి గానీ, సరిహద్దుల్లో ఉన్న వారికి గానీ.. మేం ఎవరి తొత్తులం కాదని స్పష్టం చేస్తున్నా’ అని తెలిపారు. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్, మరో మూడు పార్టీలు కలిసి ప్రకటించిన గుప్కార్ డిక్లరేషన్ సాధారణ ఘటన కాదు, కీలక రాజకీయ పరిణామం అంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. ‘సాయుధులను కశ్మీర్లోకి పంపడం పాక్ మానాలనీ, భారత్, పాక్‌లు చర్చలు ప్రారంభించాలని ఆయన కోరారు. కశ్మీర్‌లోని ఆరు రాజకీయ పార్టీలు ఆగస్టు 22న శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమై చేసిన ఉమ్మడి ప్రకటనను గుప్కార్ డిక్లరేషన్ అని అంటున్నారు. -
ప్రత్యేక కోర్సుగా ఆ కళ!
భారతీయ కళా సంపదకు పట్టుకొమ్మలు మన జానపద కళా సంస్కృతులు. మన దేశ పురాతన కళారూపాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తోలుబొమ్మలాట నేటికీ కొన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల్లో పలు రూపాల్లో బొమ్మలాటల ప్రదర్శన జరుగుతోంది. అయితే ఆ కళారూపాలు మరుగున పడిపోకుండా ఉండేందుకు, వాటి ప్రచారానికి ముంబై విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. దేశంలోనే తొలి అధికారిక వృత్తి విద్యా కోర్సుగా తొలుబొమ్మలాటలో ఓ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది. పురాతన కళారూపాలు కనుమరుగు కాకుండా ఉండేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు ముంబై విశ్వవిద్యాలయం నడుం బిగించింది. ప్రాచీన జానపద కళగా గుర్తింపు పొందిన తోలుబొమ్మలాటలో వృత్తి విద్యా కోర్సును అధికారికంగా ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో అనేక శైలుల్లో ప్రదర్శించే తోలుబొమ్మలాటను ఔత్సాహికులకోసం ఓ సర్టిఫికేట్ కోర్సుగా రూపొందించింది. మొదట్లో కర్నాటక రాష్ట్రంలోనే ఈ కళారూపం పుట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రదర్శనలో తెరపై సినిమా వీక్షించినట్లుగానే, తెరవెనుకనుంచి కళాకారులు పౌరాణిక గాధలను తోలు బొమ్మలతో ఆడించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటారు. ప్రాచీన గాథల్ని గానం చేస్తూ, అందులోని దేవతా మూర్తుల చిత్రాలను చర్మాలపై అందంగా తీర్చి దిద్ది, ఆయా పాత్రల్లో ఒదిగిపోయేట్లు మలుస్తారు. పద్యాలు, సంభాషణలకు అనుగుణంగా వాయిద్యాన్ని జోడించి, కళాత్మక దృశ్యరూపాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తారు. ఒక్క పురాణ గాథలే కాక, హాస్య పాత్రలను సైతం జోడించి చూపరులకు ఆనందాన్ని అందిస్తారు. అన్ని ప్రత్యేకతలున్న ప్రాచీన కళారూపం మరుగున పడిపోకుండా ఉండేందుకు ముంబై విశ్వవిద్యాలయం ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. -
తాధిమి తకధిమి తోలుబొమ్మ..
తోలుబొమ్మలాట చూడటానికి తమాషాగా ఉంటుంది. తాతల నాడు నాలుగు దిక్కుల నడిమి సంతలో ఆడిపాడిన ఈ జానపద కళారూపం.. మళ్లీ పట్నంలో తైతక్కలాడుతోంది. మరమనుషులు ముస్తాబవుతున్న ఈ రోజుల్లో.. మళ్లీ తెరమీదకు వస్తున్నాయి తోలుబొమ్మలు. సాంకేతికత కలబోసుకున్న సినిమాలు ఇవ్వని సందేశాన్ని.. కళాత్మక తోలు బొమ్మలాట అందిస్తోంది.. ఆలోచింపచేస్తోంది. సినిమాలు, పబ్‌లు, మ్యూజిక్ నైట్స్.. ఆటవిడుపనుకునే సిటీవాసులకు అసలైన వినోదాన్ని అందిస్తున్నాయిపప్పెట్ షోలు. నీతి కథలు, కుటుంబంతో వ్యవహరించాల్సిన తీరు, సామాజిక సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి.. ఇలా అనేక సందేశాత్మక ప్రదర్శనలతో అదరహో అనిపించుకుంటున్నాయి. సలామ్ పప్పెట్స్.. పప్పెట్ షోస్‌కు సిటీ సలామ్ చేస్తోంది. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు చదువు ప్రాముఖ్యాన్ని తెలిపేలా ‘తోలు బొమ్మలాట’ ద్వారా అవగాహన కల్పించే ట్రెండ్ ఈ మధ్యే సిటీలో మొదలైంది. వినోదం, సాంకేతికత, హాస్యం, నృత్యం, సందేశం.. ఇలా అన్నీ కలగలసిన ఈ కళ ద్వారా శ్రోతలకు సరైన ఆనందంతో పాటు మానసిక వికాసానికీ దోహదం చేస్తుంది. లెదర్ షాడో పప్పెట్, రాడ్ పప్పెట్, స్ట్రింగ్ పప్పెట్, హ్యాండ్ పప్పెట్ వంటి షోలు పాతతరం ట్రెండ్‌కు కొత్త సొబగులు అద్దుతున్నాయి. ఇంకా ప్రోత్సాహం కావాలి... ‘పప్పెట్ షోలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. అందరూ నయా టెక్నాలజీ వైపే పరుగులు తీస్తుండటంతో వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియడం లేదు. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపై ఉంద’ని అంటున్నారు నోరీ ఆర్ట్ అండ్ పప్పెట్రీ సెంటర్ (ఎన్‌ఏపీసీ) వ్యవస్థాపకురాలు రత్నమాల నోరీ. ద లేడీ ఇన్ ద మిర్రర్.. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో శనివారం ఏఆర్డీఎస్ఐ హైదరాబాద్ డెక్కన్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ‘ద లేడీ ఇన్ ద మిర్రర్’ పప్పెట్ షో ఆద్యంతం హాస్యభరితంగా సాగింది. కథాంశంలోకి వెళ్తే అల్జీమర్స్ (మతిమరుపు) ఉండే ఓ పెద్దావిడ ఇంటికి పెళ్లి ఆహ్వానం అందుతుంది. ఆమెకు అద్దం ముందు నిలబడి మాట్లాడే అలవాటు ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎలాగైనా ఆమెని పెళ్లికి తీసుకురావాలని అనుకుంటారు. అప్పటి నుంచి ఆ పెద్దావిడ తనకింకా పెళ్లికాలేదని, ఆ పెళ్లి తనకేనని అనుకుంటుంది. ఆ గ్రాండ్‌మాను కుటుంబసభ్యులు ఎదుర్కొన్న తీరును కళ్ల ముందుంచింది ఈ షో. అల్జీమర్‌తో బాధపడుతున్న వారిని ప్రేమగా చూసుకోవాలన్న సందేశాన్ని ఇలా కళాత్మకంగా వివరించారు. ..:: వాంకె శ్రీనివాస్