ప్రత్యేక కోర్సుగా ఆ కళ! | University of Mumbai Launches Certificate Course in Puppetry | Sakshi
Sakshi News home page

ప్రత్యేక కోర్సుగా ఆ కళ!

Published Mon, Jun 13 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

ప్రత్యేక కోర్సుగా ఆ కళ!

ప్రత్యేక కోర్సుగా ఆ కళ!

భారతీయ కళా సంపదకు పట్టుకొమ్మలు మన జానపద కళా సంస్కృతులు. మన దేశ పురాతన కళారూపాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తోలుబొమ్మలాట నేటికీ కొన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల్లో పలు రూపాల్లో బొమ్మలాటల ప్రదర్శన జరుగుతోంది. అయితే ఆ కళారూపాలు మరుగున పడిపోకుండా ఉండేందుకు, వాటి ప్రచారానికి ముంబై విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. దేశంలోనే తొలి అధికారిక వృత్తి విద్యా కోర్సుగా తొలుబొమ్మలాటలో ఓ సర్టిఫికేట్  కోర్సును ప్రారంభించింది. 
 
పురాతన కళారూపాలు కనుమరుగు కాకుండా ఉండేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు ముంబై విశ్వవిద్యాలయం నడుం బిగించింది. ప్రాచీన జానపద కళగా గుర్తింపు పొందిన తోలుబొమ్మలాటలో వృత్తి విద్యా కోర్సును అధికారికంగా ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో అనేక శైలుల్లో ప్రదర్శించే తోలుబొమ్మలాటను ఔత్సాహికులకోసం ఓ సర్టిఫికేట్ కోర్సుగా రూపొందించింది. మొదట్లో  కర్నాటక రాష్ట్రంలోనే ఈ కళారూపం పుట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రదర్శనలో తెరపై సినిమా వీక్షించినట్లుగానే, తెరవెనుకనుంచి కళాకారులు పౌరాణిక గాధలను తోలు బొమ్మలతో ఆడించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటారు.  ప్రాచీన గాథల్ని గానం చేస్తూ, అందులోని దేవతా మూర్తుల చిత్రాలను చర్మాలపై అందంగా తీర్చి దిద్ది, ఆయా పాత్రల్లో ఒదిగిపోయేట్లు మలుస్తారు. పద్యాలు, సంభాషణలకు అనుగుణంగా వాయిద్యాన్ని జోడించి, కళాత్మక దృశ్యరూపాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తారు.  ఒక్క పురాణ గాథలే కాక, హాస్య పాత్రలను సైతం జోడించి చూపరులకు ఆనందాన్ని అందిస్తారు. అన్ని ప్రత్యేకతలున్న  ప్రాచీన కళారూపం మరుగున పడిపోకుండా ఉండేందుకు ముంబై విశ్వవిద్యాలయం ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement