తోలుబొమ్మల సిత్రాలు | Tholu Bommala Sithralu banner logo launch | Sakshi
Sakshi News home page

తోలుబొమ్మల సిత్రాలు

Published Mon, Sep 7 2020 4:47 AM | Last Updated on Mon, Sep 7 2020 4:47 AM

Tholu Bommala Sithralu banner logo launch - Sakshi

‘‘సినిమా పుట్టుకకి బీజం తోలుబొమ్మలాట. ఈ కళ పేరుతో తోలుబొమ్మల సిత్రాలు అనే బ్యానర్‌ నెలకొల్పినందుకు యూనిట్‌ని అభినందిస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ బ్యానర్‌ పెద్ద సంస్థగా ఎదగాలని, ఈ బ్యానర్‌లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా అన్నారు. తోలుబొమ్మల సిత్రాలు బేనర్‌లో కొమారి జానకిరామ్‌ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు ఓ సినిమా నిర్మించారు.

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌ వీడియో, లోగోని ఎస్‌.బి. అంజాద్‌ బాషా విడుదల చేశారు. ఈ సందర్భంగా కొమారి జానకిరామ్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథాంశాన్ని తెలుసుకున్న అంజాద్‌ బాషాగారు తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడం ఎంతో సంతోషం. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్, నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం యు.వి. నిరంజన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement