LOGO LAUNCH
-
Gujarat Giants: గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధం
WPL 2023: మహిళల ఐపీఎల్లో అహ్మదాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్ ఆదివారం (ఫిబ్రవరి 12) నాడు తమ జట్టు లోగోను ట్విటర్ వేదికగా ఆవిష్కరించింది. వేలానికి ఓ రోజు ముందే గుజరాత్ జెయింట్స్ లోగోను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రికెట్ అభిమానులను, ముఖ్యంగా గుజరాత్ ప్రాంత వాసులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లోగోలో గర్జిస్తున్న ఆసియా సింహం (సివంగి) చిహ్నాన్ని పొందుపర్చింది ఫ్రాంచైజీ యాజమాన్యం. Presenting the Gujarat Giants @wplt20 team logo: the Asiatic Lioness roaring and looking forward to any challenge! The Asiatic Lion, found only in Gujarat's Gir National Park, is an enduring symbol of the state. [1/2] pic.twitter.com/SAntd2Lrev — Gujarat Giants (@GujaratGiants) February 12, 2023 ఈ లోగోకు గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధం అన్న కామెంట్స్‌ను జోడించారు. ఈ రకం ఆసియా సింహం (సివంగి) గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లో మాత్రమే కనిపిస్తుంది. గర్జించే సింహం యొక్క చిహ్నం గుజరాత్ రాష్ట్ర గౌరవానికి ప్రతీక అంటూ ట్వీట్లో పేర్కొంది గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం. గుజరాత్ జెయింట్స్ లోగో ప్రస్తుతం సోషల్‌మీడియాలో, క్రికెట్ సర్కిల్స్‌లో వైరలవుతోంది. కాగా, అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అహ్మదాబాద్ ఆధారిత సంస్థ గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీను 1289 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చింది సొంతం చేసుకుంది. WPLలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ. దీని తర్వాత ముంబై ఇండియన్స్ (ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 912.99 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 901 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, 810 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 757 కోట్లు) ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగబోయే WPL తొలి వేలంలో కూడా గుజరాత్ జెయింట్స్ తమ హవా చూపనుందని సమాచారం. కొందరు దేశీయ ఆటగాళ్ల కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మెంటార్‌గా వ్యవహరిస్తుంది. -
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ 'మరువ తరమా' టైటిల్ లోగో రిలీజ్
మంచి ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇలాంటి తరుణంలోనే మరో ఫీల్‌గుడ్ మ్యూజికల్ లవ్‌స్టోరీ రాబోతుంది. హరీష్ ధనుంజయ్ హీరోగా, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా 'మరువ తరమా' అనే చిత్రం రాబోతోంది.సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుటూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. న్యూఇయర్ సందర్భంగా ఈ మూవీ లైటిల్ లోగోను విడుదల చేశారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నట్టు మేకర్లు తెలిపారు. -
సక్సెస్ఫుల్ సినిమా తీయడం అంత ఈజీ కాదు
‘‘సినిమా తీయడం సులభం. కానీ సక్సెస్ఫుల్ సినిమా తీయడం అంత ఈజీ కాదు. సరైన నిర్ణయాలు తీసుకోగలగడం, కష్టపడటం, పరిశీలన, సమాచార సేకరణ వంటి అంశాలు ఓ సినిమా సక్సెస్ కావడానికి దోహదపడతాయి. అయితే ప్రతి సినిమాకీ మేం ఒకేలా కష్టపడతాం. అందుకే మా ఎస్వీసీసీ బేనర్లో డెబ్బై శాతానికి పైగా సక్సెస్ రేట్ ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్స్ (డీఆర్పీ) పతాకంపై హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ చిత్రంతో నటుడు వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం డీఆర్పీ బ్యానర్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బొమ్మరిల్లు’, ‘శతమానంభవతి’ చిత్రాలు మా ఎస్వీసీసీకి డబ్బుతో పాటు మంచి కుటుంబ ప్రేక్షకాదరణను తీసుకువచ్చాయి. అలా ఈ డీఆర్పీ బ్యానర్‌కు ‘బలగం’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘తెలంగాణలోని సిరిసిల్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది’’ అన్నారు వేణు. ‘‘ఈ చిత్రంతో దర్శకుడిగా వేణు ప్రతిభను చూస్తారు’’ అన్నారు ప్రియదర్శి. ‘‘కొత్త కథలను అందిస్తూ, ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే, లక్ష్యంతో ఈ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు హన్షిత రెడ్డి. ఇటీవల నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల్లో (తమిళ హీరోలను ఉద్దేశించి) కొన్ని సెకన్ల వీడియోను కట్ చేసి, ప్రచారం చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఒకర్ని ఎక్కువ మరొకర్ని తక్కువ చేయడం నాకిష్టం ఉండదు. – ‘దిల్’ రాజు -
పర్యావరణానికి ‘లైఫ్’
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందిదే..! ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లడానికి పెట్రోల్‌తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్‌పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్ఈడీ బల్బులు వాడితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు. ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్ ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. -
మహిళలకు గొప్ప సందేశాత్మకంగా 'లవ్'
Love Movie Logo Launched By Director Nag Ashwin: రామరాజు, సోనాక్షీ వర్మ, అభి, ప్రీతీ సింగ్, శ్రీకృష్ణ, డాక్టర్ మారుతి సకారం ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘లవ్’. శ్రీనారాయణ దర్శకత్వంలో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – ‘‘గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథతో రానున్న సినిమా ఇది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుతున్నా. అలాగే ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశా’’ అని తెలిపారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. మహిళలకు సంబంధించిన ఓ గొప్ప సందేశం అంతర్లీనంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. చదవండి: రొమాంటిక్ వెబ్‌సిరీస్‌గా 'ఎమోజీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన లవ్‌బర్డ్స్! -
అనసూయ కొత్త సినిమా 'అరి' లోగో లాంచ్ ఫోటోలు
-
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ లోగోలో పెద్ద పొరపాటు.. అదేంటంటే..?
కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. తమ ఫ్రాంచైజీ లోగోను సోమవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. లగోను రూపొందించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రణాళికా బద్దంగా డిజైన్ చేశామని ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా వెల్లడించారు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) లోగోలో ఓ పెద్ద పొరపాటు దొర్లిందని, బడా బిజినెస్ మ్యాన్ అయిన సంజీవ్ గొయెంకా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే.. గరుడ పక్షిని పోలి ఉన్న ఎల్ఎస్జీ లోగోను త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో(కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) కూడిన రెక్కలు, మధ్యలో బంతి, బ్యాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా. ఇదంతా బాగానే ఉన్నా లోగోలో ఓ పొరపాటు కొట్టొచ్చినట్లు కనిపించింది. క్రికెట్లో ఫార్మాట్‌ను బట్టి బంతి రంగు మారుతుందన్న లాజిక్‌ను మిసయ్యాడు గొయెంకా. ఐసీసీ రూల్స్ ప్రకారం టెస్ట్ క్రికెట్లో ఎరుపు రంగు బంతి, డే అండ్ నైట్ టెస్ట్‌లకు పింక్ కలర్ బంతి, వన్డే, టీ20లకు తెలుపు రంగు బంతిని ఉపయోగిస్తారు. అయితే, ఎల్ఎస్జీ లోగోలో తెలుపు రంగు బంతి స్థానంలో ఎరుపు బంతి కనిపించడం ట్రోలింగ్‌కు కారణమైంది. ఐపీఎల్.. టీ20 టోర్నీ అనుకుంటున్నారా లేక టెస్ట్ క్రికెట్ అనుకుంటున్నారా అంటూ పంచ్‌లు వేస్తున్నారు నెటిజన్లు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. లక్నో జట్టు రూ. 17 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించుకోగా.. అహ్మదాబాద్ రూ. 15 కోట్లు వెచ్చించి హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. లక్నో జట్టు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్‌కు 15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. మరోవైపు అహ్మదాబాద్.. తమ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది. చదవండి: IPL 2022: అందుకే గరుడ పక్షి, త్రివర్ణాలు, నీలం రంగు బ్యాట్: లక్నో -
లక్నో సూపర్ జెయింట్స్ లోగో ఆవిష్కరణ
ముంబై: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ అధికారిక లోగోను ఆవిష్కరించింది. ‘గరుడ’ పక్షి రెండు రెక్కల మధ్య బ్యాట్ బాల్‌తో ఈ లోగో రూపుదిద్దుకుంది. ట్విట్టర్లో ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్పీఎస్జీ గ్రూప్ ఈ లోగో వీడియోను విడుదల చేసింది. రెక్కలకు జాతీయ జెండా రంగులద్దారు. ‘రెక్కలు విప్పుకొని మరింత ఎత్తుకు ఎగురుతాం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో రూపొందింది. ఇదివరకే తమ జట్టు కెప్టెన్‌గా లోకేశ్ రాహుల్‌ను ప్రకటించిన ఫ్రాంచైజీ ఇటీవల జట్టు పేరును లక్నో సూపర్ జెయింట్స్‌గా ఖరారు చేసింది. -
IPL 2022: కేఎల్ రాహుల్ జట్టుకు సంబంధించి కీలక అప్డేట్
Lucknow Super Giants Logo Unveil: కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్న ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఆ జట్టు అధికారిక లోగోను ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా సోమవారం సాయంత్రం విడుదల చేశాడు. పక్షిని పోలి ఉన్న ఈ లోగో.. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో(కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) కూడిన రెక్కలు, మధ్యలో బంతి, బ్యాట్‌తో కనిపించింది. గరుడ పక్షి నుంచి ప్రేరణ పొంది ఈ లోగోను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. లక్నో జట్టు రూ. 17 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించుకోగా.. అహ్మదాబాద్ రూ. 15 కోట్లు వెచ్చించి హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. Here's the story behind our identity. 🙌#LucknowSuperGiants #IPL pic.twitter.com/4qyuFeNgsR — Lucknow Super Giants (@LucknowIPL) January 31, 2022 లక్నో జట్టు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్‌కు 15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. మరోవైపు అహ్మదాబాద్.. తమ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది. చదవండి: అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్ -
డాక్టర్ సాబ్ టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్లో శోభన్ హీరోగా డీఎస్బీ దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ సాబ్. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ సంగీతం అందిస్తుండగా ఎన్. ప్రభాకర్ రావు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1400 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన విక్కీ మాస్టర్ ఈ సినిమాకు సమర్ఫిస్తుండటం విశేషం. కాగా శుక్రవారం ఈ సినిమాకు సంబందించిన టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవని మరువలేం. వారు నిజమైన దేవుళ్ళు. అలాంటి డాక్టర్స్‌లో ఒకరు శోభన్. అయన హీరోగా నిర్మాతగా చేస్తున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ మూవీ లోగోని నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు విక్కీ మాస్టర్ ఈ సినిమాను సమర్పిస్తుండం సినిమాపై అంచనాలను పెంచుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మూవీ యూనిట్‌కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విక్కీ మాస్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ సాబ్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన నా మిత్రుడు సురేష్‌కు ధన్యవాదాలు. తన శిష్యులైనా శోభన్, సురేష్‌లు ఈ చిత్రానికి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రాశాన్నారు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆయన అన్నారు. అలాగే దర్శకుడు డీఎస్బీ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. తనను నమ్మి ఈ సినిమాని తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాత, హీరో శోభన్ కృతజ్ఞతలు తెలిపారు. మా కోరికను మన్నించి ఈ సినిమా టైటిట్‌ను ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందన్నారు. హీరో శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే హీరోగా చేయాలనిపించిందని అన్నాడు. ఈ సినిమా చేయడానికి కారణం విక్కీ మాస్టర్ అని, అయన సినిమాకు మొదటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నాడు. దర్శకుడు సురేష్ సహకారం బాగా ఉందని, సినిమా బాగా చేశాడని తెలిపాడు. అలాగే తమ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. -
తోలుబొమ్మల సిత్రాలు
‘‘సినిమా పుట్టుకకి బీజం తోలుబొమ్మలాట. ఈ కళ పేరుతో తోలుబొమ్మల సిత్రాలు అనే బ్యానర్ నెలకొల్పినందుకు యూనిట్‌ని అభినందిస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ బ్యానర్ పెద్ద సంస్థగా ఎదగాలని, ఈ బ్యానర్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. తోలుబొమ్మల సిత్రాలు బేనర్లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు ఓ సినిమా నిర్మించారు. తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ వీడియో, లోగోని ఎస్.బి. అంజాద్ బాషా విడుదల చేశారు. ఈ సందర్భంగా కొమారి జానకిరామ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథాంశాన్ని తెలుసుకున్న అంజాద్ బాషాగారు తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడం ఎంతో సంతోషం. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్, నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం యు.వి. నిరంజన్. -
ఆన్లైన్లో సంగీత పోటీలు
తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్ ఐడల్’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు. మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు. -
మహిళలూ జాగ్రత్త
నవీన్ .కె. చారి, ప్రియాన్స్, మేఘనా చౌదరి, సుమయ, కావ్య, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో వడ్ల జనార్థన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో మేడమ్’. వడ్ల నాగశారద సమర్పణలో కార్తీక్ మూవీ మేకర్స్ పతాకంపై వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రం లోగోని ప్రముఖ దర్శకుడు సాగర్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజయం సాధించాలి’’ అన్నారు సాగర్. ‘‘చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉంది అనేది వాస్తవం. ఎక్కువ థియేటర్లు దక్కేలా నా వంతు సహకారం అందిస్తా’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘తండ్రిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొడుకు సినిమా తీయడం గ్రేట్’’ అన్నారు నిర్మాత టి. రామసత్యనారాయణ. వడ్ల జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది’’ అన్నారు. ‘‘దిశా ఘటనకు ముందే ఈ సినిమా చేశాం. అమ్మాయిలపై ఓ సైకో చేసే కిరాతకాలను తెలియజేస్తున్నాం’’ అన్నారు ఘటికాచలం. -
హలో మేడమ్ లోగో ఆవిష్కరణ..
నవీన్.కె.చారి, ప్రియాన్స, మేఘన చౌదరి, సుమాయ, కావ్య, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హలో మేడమ్’. వడ్ల జనార్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా చిత్ర లోగోను ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫిలించాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిలుగా హాజరైన దర్శకుడు సాగర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్లు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. చిత్ర యూనిట్‌కు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వడ్ల జనార్థన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత సమాజంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రం. ఘటికా చలం మంచి కథ, స్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు’ తెలిపారు. సాయి, జియో, లక్షన్, శీలం శ్రీను, వెంకటేష్ తాతిరాజు, ముప్పిడి వాసుదేవరాజు, లక్ష్మిదేవి, కాకినాడ గుప్త, వాస్తుప్రకాష్, హల్లాఫ్, జూ.బాబుమోహన్, మల్లాది శాస్త్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, సంగీతం ఘటికా చలం అందించారు. -
ఒక అమ్మ ప్రయాణం
రేవతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు అమ్మ’. ‘మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్’ అనేది ఉపశీర్షిక. ‘అంకురం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన సి. ఉమామహేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. బొమ్మక్ క్రియేష¯Œ ్స పతాకంపై బొమ్మక్ మురళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘అంకురం’ సినిమా చూసి ఆ దర్శకుడు ఎలా ఉంటారో చూడాలనుకున్నాను. నేను అలా అనుకున్న మరో దర్శకుడు బాలచందర్. ‘అంకురం’ సినిమా నాకిప్పటికీ గుర్తుంది. కొంతమంది మాత్రమే ఉమా మహేశ్వరరావుగారిలా సమాజం కోసం కథలు రాసి సినిమాలు రూపొందిస్తుంటారు’’ అన్నారు. ‘‘చెడు మార్గంలో పయనిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని మా చిత్రం ఇస్తుంది’’ అన్నారు ఉమామహేశ్వరరావు. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది’’ అన్నారు బొమ్మక్ మురళి. ‘‘ఒక అమ్మ ప్రయాణమే ఈ సినిమా. జీవితం ఎలా సాగుతుందో అంతే సహజత్వంతో దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు’’ అన్నారు రేవతి. సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగులపల్లి కనకదుర్గ, దేవి, విమల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎంఆర్. -
రిస్క్ ఎందుకన్నా అన్నాను
‘‘నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అందుకనే నా సినిమాల్లో తనుంటాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మాత్రం మిస్సయ్యాడు. మా సినిమాల షూటింగ్స్‌లో తను ఆర్టిస్ట్‌గాకంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కష్టపడుతుంటాడు’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి దర్శక నిర్మాతగా ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బ్యానర్ లోగోను అనిల్ రావిపూడి, టైటిల్ యానిమేషన్‌ను సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పగానే ‘ఎందుకన్నా.. రిస్క్ ఏమో!’ అన్నాను. తను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు.. సినిమా చాలా బాగుంది’’ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు వేరే డైరెక్టర్‌ను పెట్టినా ఆయన వెనక నేను నిలబడాల్సి వచ్చేది. అందుకే నేనే డైరెక్ట్ చేశాను. దర్శకుడు కావాలనే కోరిక అలా తీరింది. సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు.. ఇంకొంతమంది చిన్న కరెక్షన్స్ చెప్పారు. అవెంతో ఉపయోగపడ్డాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు తమన్. నిర్మాత పద్మనాభ రెడ్డి, నటులు ‘సత్యం’ రాజేష్, ‘షకలక’ శంకర్, సంగీత దర్శకుడు సాకేత్ తదితరులు మాట్లాడారు. -
ప్రతీకారం నేపథ్యంలో...
‘పరిచయం’ చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా త్వరలో ప్రారంభం కానుంది. నితిన్ జి.దర్శకత్వం వహించనున్నారు. ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్ లోగో ఆవిష్కరించారు. నితిన్ జి. మాట్లాడుతూ– ‘‘రివెంజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవు తుంది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. నితిన్‌లాంటి ప్రతిభావంతుడితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు విరాట్. నిర్మాతల్లో ఒకరైన సంతోష్ మాట్లాడుతూ... ‘‘నితిన్ చెప్పిన స్టోరీ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జైపాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నగేష్ పూజారి, సహ నిర్మాత: అతుల్ పాటిల్. -
నవ్వించి ఏడిపిస్తాం
‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్‌లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి. ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్’. కారుణ్య చౌదరి కథానాయిక. ఓరుగుల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ జి. దర్శకత్వంలో నగేశ్ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్‌ను శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్ చూస్తాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్. 90 రకాల గెటప్‌లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్‌తో అతను అలరిస్తాడు’’ అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ అన్నారు. ‘‘ఫస్టాఫ్‌లో నవ్విస్తాం, సెకండాఫ్‌లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్ కుమార్. ‘‘స్క్రిప్ట్ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్. -
మూడు రూపాలు
ఉపేంద్ర, మురళీమోహన్ల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్కృష్ణ దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘నా పేరు రాజా’. రాజ్ సూరియన్ హీరోగా, ఆకర్షిక, నస్రీన్ హీరోయిన్లుగా నటించారు. అమోఘ్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం లోగో, టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాజ్ సూరియన్ మాట్లాడుతూ– ‘‘తిరుగుబోతు, జటాయువు’ సినిమాలు చేశాను. ‘నా పేరు రాజా’ నా మూడో చిత్రం. అశ్విన్ మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ మెండుగా ఉన్నాయి. మనాలి, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశాం’’ అన్నారు కిరణ్ రెడ్డి. ‘‘దర్శకత్వ శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న నేను తొలిసారి ‘నా పేరు రాజా’ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. హీరో క్యారక్టర్లో మూడు రూపాలుంటాయి. అవి ఏంటనేది తెరపైనే చూడాలి. కథానాయికల పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అని అశ్విన్కృష్ణ అన్నారు. కెమెరామేన్ వెంకట్, ఆకర్షిక, నస్రీన్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్ జాషువా. -
మహిళల గురించి చెప్పే సినిమా
‘మైనే ప్యార్ కియా’ (‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్యశ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, ‘జయం’ ఫేమ్ సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘కిట్టిపార్టీ’. ఈ సినిమాతో సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. సుందర్ పవన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని మహిళలకు సంబంధించిన సినిమా కాదు. కానీ, సినిమాలో మహిళలే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ సినిమాకూ రీమేక్ కాదు. ఆరుగురు మహిళల చుట్టూ కథ తిరుగుతుంది. భోగేంద్ర గుప్తా లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. అతిత్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన నటీనటులకు థ్యాంక్స్’’ అన్నారు భోగేంద్ర గుప్తా. ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని. మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి’’ అన్నారు భాగ్యశ్రీ (నవ్వుతూ). ‘‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో.. హీరో లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఈ చాన్స్ ఇచ్చినందుకు పవన్, గుప్తాగారికి థ్యాంక్స్’’ అన్నారు మధుబాల. ‘‘మహిళల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు సదా. ‘‘20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రావడం హ్యాపీగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి’’ అన్నారు దీప్తీ భట్నాగర్. సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని, కెమెరా: సాయిశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. రమణారెడ్డి, సహ నిర్మాత: శివ తుర్లపాటి. -
లవ్ ట్వంటీ ట్వంటీ
అరవింద్, మోహిని జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ 20–20’. జోశర్మ, మెక్విన్ గ్రూప్ సహకారంతో మోహన్ మీడియా క్రియోషన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల, మహేంద్ర వడ్లపట్ల నిర్మిస్తున్నారు. వడ్లపట్ల సినిమాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఈ చిత్రం లోగో లాంచ్‌ను శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘నాలుగు నెలల క్రితం బెంగళూరులో చిత్రదర్శకుడు సెంథిల్ పరిచయమయ్యారు. ఆయన అరగంటలో నాకొక కథ చెప్పారు. కథ నచ్చి వెంటనే ఓకే చేశాను. నటీనటులందరూ బాగా నటించారు. ఈ చిత్రకథానాయిక మోహిని 2011లో మిస్ టీన్ యూ.ఎస్‌కు పోటీ చేశారు. అలాగే 2012లో మిస్ టీన్ కెనడా, మిస్ టీన్ ఇండియా కాంటెస్ట్లలోనూ పాల్గొన్నారు. సంగీతం, కెమెరా వర్క్ బాగా కుదిరాయి’’ అన్నారు. సెంథిల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా పరిశ్రమకు నన్ను పరిచయం చేస్తున్నందుకు మోహన్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘హుషారు’ చిత్రంలో ‘ఉండిపోరాదే...’ లాంటి సూపర్‌హిట్ పాటను రాశాను. ఆ పాట రాయటానికి అవకాశం ఇచ్చిన బెక్కం వేణుగోపాల్‌ను నాకు పరిచయం చేసింది మోహన్ వడ్లపట్ల గారే. మళ్లీ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు లిరిక్ రైటర్ కిట్టు. ‘‘నేను మాట్లాడటం కంటే నా మ్యూజిక్ మాట్లాడితే బావుంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు సత్యన్. ‘‘ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్‌గారికి కృతజ్ఞతలు. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ చిత్రంలోని పాటలు బావుంటాయి’’ అన్నారు మోహిని. దర్శక, నిర్మాత సాగర్, మహేంద్ర వడ్లపట్ల, ఎమ్.ఆర్.సి వడ్లపట్ల, నటులు క్రాంత్ రిసా తదితరులు పాల్గొన్నారు. -
చెలీ... రావే
‘‘కథ బాగుంటే చిన్న సినిమా అయినా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. ‘రావే నా చెలియ’ టైటిల్ అట్రాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా కంటెంట్ కూడా బాగుంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రానికి పని చేస్తున్న వారందరికీ అభినందనలు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. నెమలి అనిల్, సుబాంగి పంథ్ జంటగా ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావె నా చెలియ’. నెమలి సురేశ్ సమర్పణలో సూర్యచంద్ర ప్రొడక్షన్లో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ రూపొందిస్తున్న ఈ చిత్రం లోగోని రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. హీరో నెమలి అనిల్ మాట్లాడుతూ– ‘‘ఇది మా బ్యానర్‌కి, నాకు మొదటి సినిమా. మా నాన్న, బాబాయి ఎంతో నమ్మకంతో ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టీమ్ అంతా ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. నిర్మాతలు, అనిల్ నన్ను చాలా నమ్మి సపోర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్నారు ఎన్. మహేశ్వర రెడ్డి. నిర్వాహకుడు నెమలి సురేశ్, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కుమార్, కెమెరామేన్ విజయ్ దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిది గంటలు... తొమ్మిది నేరాలు
‘నైన్ బ్రెయిన్స్, నైన్ క్రైమ్స్, నైన్ అవర్స్.. ఇది సినిమా క్యాప్షన్. సినిమా పేరు ‘హవా’. ఆ తొమ్మిది మంది ఎవరు? వాళ్లు చేసిన నేరాలేంటి? తొమ్మిది గంటల్లో వారి జీవితాలు ఎలా మారాయి? అనే కాన్సెప్ట్‌తో తయారైన చిత్రం ‘హవా’. ఫిల్మ్ అండ్ రీల్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి మహేశ్ రెడ్డి దర్శకుడు. చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటించారు. ‘హవా’ లోగో అండ్ టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. కాన్సెప్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘సినిమా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘క్రైమ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాల్లో మా సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. -
బిగ్‌సీ కొత్త లోగోని ఆవిష్కరించిన సమంతా
-
సుధీర్‌బాబు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్