ఆకర్షిక, రాజ్, నస్రీన్
ఉపేంద్ర, మురళీమోహన్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్‌కృష్ణ దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘నా పేరు రాజా’. రాజ్ సూరియన్ హీరోగా, ఆకర్షిక, నస్రీన్ హీరోయిన్లుగా నటించారు. అమోఘ్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం లోగో, టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాజ్ సూరియన్ మాట్లాడుతూ– ‘‘తిరుగుబోతు, జటాయువు’ సినిమాలు చేశాను. ‘నా పేరు రాజా’ నా మూడో చిత్రం. అశ్విన్ మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ మెండుగా ఉన్నాయి. మనాలి, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశాం’’ అన్నారు కిరణ్ రెడ్డి. ‘‘దర్శకత్వ శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న నేను తొలిసారి ‘నా పేరు రాజా’ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. హీరో క్యారక్టర్‌లో మూడు రూపాలుంటాయి. అవి ఏంటనేది తెరపైనే చూడాలి. కథానాయికల పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అని అశ్విన్‌కృష్ణ అన్నారు. కెమెరామేన్ వెంకట్, ఆకర్షిక, నస్రీన్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్విన్ జాషువా.
Comments
Please login to add a commentAdd a comment