
మంచి ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇలాంటి తరుణంలోనే మరో ఫీల్‌గుడ్ మ్యూజికల్ లవ్‌స్టోరీ రాబోతుంది. హరీష్ ధనుంజయ్ హీరోగా, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా 'మరువ తరమా' అనే చిత్రం రాబోతోంది.సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుటూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. న్యూఇయర్ సందర్భంగా ఈ మూవీ లైటిల్ లోగోను విడుదల చేశారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నట్టు మేకర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment