కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఒక్క అక్షరంతో టైటిల్ | Kiran Abbavaram New Movie Titled As KA | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఒక్క అక్షరంతో టైటిల్

Published Wed, Jul 10 2024 1:02 PM | Last Updated on Wed, Jul 10 2024 5:39 PM

Kiran Abbavaram New Movie Titled As KA

టాలీవుడ్ యువహీరో కిరణ్ అబ్బవరం చాలారోజుల తర్వాత కొత్త మూవీని ప్రకటించారు. 'క' అనే ఒక్క అక్షరం మాత్రమే టైటిల్ పెట్టినట్లు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశాడు. పీరియాడికల్ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)

దర్శక ద్వయం సుజీత్, సందీప్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా..  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. 2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్. ఇకపోతే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఎస్ఆర్ కల్యాణ మండపం'తో పర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాతే వరస సినిమాలు చేశాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త టైమ్ తీసుకుని ఇప్పుడు 'క' చిత్రాన్ని ప్రకటించాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement