సక్సెస్‌ఫుల్‌ సినిమా తీయడం అంత ఈజీ కాదు | DilRaju Logo Release About Balagam Movie | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ఫుల్‌ సినిమా తీయడం అంత ఈజీ కాదు

Published Sat, Dec 17 2022 12:55 AM | Last Updated on Sat, Dec 17 2022 12:55 AM

DilRaju Logo Release About Balagam Movie - Sakshi

శిరీష్, హర్షిత్, హన్షిత, ‘దిల్‌’ రాజు, వేణు, ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌

‘‘సినిమా తీయడం సులభం. కానీ సక్సెస్‌ఫుల్‌ సినిమా తీయడం అంత ఈజీ కాదు. సరైన నిర్ణయాలు తీసుకోగలగడం, కష్టపడటం, పరిశీలన, సమాచార సేకరణ వంటి అంశాలు ఓ సినిమా సక్సెస్‌ కావడానికి దోహదపడతాయి. అయితే ప్రతి సినిమాకీ మేం ఒకేలా కష్టపడతాం. అందుకే మా ఎస్‌వీసీసీ బేనర్‌లో డెబ్బై శాతానికి పైగా సక్సెస్‌ రేట్‌ ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా నటించిన చిత్రం ‘బలగం’.

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ (డీఆర్‌పీ) పతాకంపై హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ చిత్రంతో నటుడు వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం డీఆర్‌పీ బ్యానర్‌ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘బొమ్మరిల్లు’, ‘శతమానంభవతి’ చిత్రాలు మా ఎస్‌వీసీసీకి డబ్బుతో పాటు మంచి కుటుంబ ప్రేక్షకాదరణను తీసుకువచ్చాయి. అలా ఈ డీఆర్‌పీ బ్యానర్‌కు ‘బలగం’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎమోషనల్‌ అండ్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు. ‘‘తెలంగాణలోని సిరిసిల్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది’’ అన్నారు వేణు. ‘‘ఈ చిత్రంతో దర్శకుడిగా వేణు ప్రతిభను చూస్తారు’’ అన్నారు ప్రియదర్శి. ‘‘కొత్త కథలను అందిస్తూ, ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే, లక్ష్యంతో ఈ బ్యానర్‌ను స్టార్ట్‌ చేశాం’’ అన్నారు హన్షిత రెడ్డి.

ఇటీవల నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల్లో (తమిళ హీరోలను ఉద్దేశించి) కొన్ని సెకన్ల వీడియోను కట్‌ చేసి, ప్రచారం చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఒకర్ని ఎక్కువ మరొకర్ని తక్కువ చేయడం నాకిష్టం ఉండదు.
– ‘దిల్‌’ రాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement