priyadarsi
-
సత్యమేవ జయతే
‘సార్... నా పేరు షణ్ముఖ్ రెడ్డి. మేం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. మా కేసు గురించి మోహన్రావుగారితో మాట్లాడాలి, మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి... ఎలాగూ శాటర్డే, సండే కోర్టు హాలిడేస్ కాబట్టి సార్ మీతో డీటైల్డ్‌గా మాట్లాడతారు. అయితే మేం శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్’ అనే సంభాషణలు ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా ట్రైలర్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ వీడియోలో ఉన్నాయి. ఈ విజువల్స్‌తో పాటు ‘సత్యమేవ జయతే’ అని కూడా కనపడుతుంది. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. నాని సమర్పణలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 7న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, ట్రైలర్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. -
కొత్త ఊపిరి వచ్చినట్లుంది
‘‘వంద కోట్ల రూపాయల పోస్టర్స్, వంద రోజుల ఫంక్షన్స్ చూశాను. కానీ తొలిసారి వంద అవార్డుల ఫంక్షన్‌ను ‘బలగం’తో చూస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న విడులైంది. ‘బలగం’కు ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా విశ్వ విజయ శతకం ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మా పిల్లలు హన్షిత, హర్షిత్ నిర్మించిన తొలి సినిమానే వంద అంతర్జాతీయ అవార్డులు సాధించడం గొప్ప విషయం. పెద్ద బడ్జెట్‌తో రాజమౌళి తీసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లకు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ ‘బలగం’ చిన్న ఊర్లో నేటివిటీతో తీశాం. అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. ఇటీవల హిట్టయిన ‘సామజ వరగమన’, ‘బేబీ’ వంటి చిత్రాలతో చిన్న, ఫ్యామిలీ చిత్రాలు ఆడతాయనే నమ్మకం మళ్లీ వచ్చింది. కొత్త ఊపిరి వచ్చినట్లయింది’’ అన్నారు. ‘‘బలగం’ తెలంగాణ సినిమాగా ప్రచారమైంది. కానీ తెలుగు సినిమా’’ అన్నారు వేణు. ‘‘నేను, అన్న నిర్మించిన తొలి చిత్రానికి వంద అంతర్జాతీయ అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు హన్షిత. -
‘బలగం’కి మరో రెండు అవార్డులు
ఓ కుటుంబ పెద్ద చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల భావోద్వేగం, అనుబంధాలతో సాగే ‘బలగం’కి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. తాజాగా ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. -
నీ మొహానికి హీరోయిన్ అవుతావా?.. అని ఎగతాళి చేశారు!
బలగం సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పల్లె సెంటిమెంట్‌ను తెరపై ఆవిష్కరించిన దర్శకుడు వేణు యెల్దండిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటీనటులకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారంటే ఆ సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేని పాత్ర ఒకటుంది. ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. బలగం సినిమాలో ఆ సీన్ మీకు గుర్తుందా? 'అదేనండి ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి థమ్స్ అప్ బాటిల్ తెచ్చి ఇవ్వడం.. ఆ తర్వాత ప్రియదర్శి సిగ్గుపడడం.. అది చూసి ముసలావిడ ముఖం తిప్పుకోవడం' ఆ సీన్లో బొద్దుగా కనిపించిన అమ్మాయి గురించి మీకు తెలుసా? ఇంతవరకు ఒక్క సినిమా చేయకుండానే అద్భుతంగా నటించింది. ఒక్క డైలాగ్ లేకపోయినా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. ఆ అమ్మాయి పేరే సౌదామిని. ఆర్టిస్ట్ కావాలన్న కోరికతో టాలీవుడ్లో తొలి అవకాశం అందుకున్న సౌదామిని తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (చదవండి: Hollywood Actor: సింగర్‌లా కనిపించేందుకు సర్జరీలు.. యువ నటుడు మృతి!) సౌదామిని మాట్లాడుతూ.. ' వేణు సర్ ఆఫీసుకు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలెక్ట్ చేశారు. వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ సినిమాలో ప్రియదర్శి చాలా సపోర్టింగ్‌గా ఉంటారు. సినిమా కోసం పది కేజీలు పెరిగా. కేకులు తినేసి బరువు పెరిగాను. నాకు ఫన్ జోనర్ అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఇదే. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఎక్కడికైనా వెళ్లాలంటే నాకు భయం. అన్నయ్యను తీసుకెళ్లేవాణ్ని. కొందరు నన్ను చూసి నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాళ్లు. నేను ఈ స్థాయికి రావడానికి వేణు సర్ కారణం. వేణు సర్ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. బలగం సినిమా తర్వాత జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాల్ చేశారు. మా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. వేణు సర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. తెలుగులో అల్లు అర్జున్, చిరంజీవి నా ఫేవరేట్.' అని చెప్పారు. (చదవండి: Pooja Hegde: బుట్టబొమ్మను వదలని ఫ్లాపులు.. ఆ సినిమాతోనైనా మారేనా!) -
మేము సినిమాను అడ్డుకోవడం లేదు.. బలగంపై దిల్ రాజు కామెంట్స్
గ్రామాల్లో బలగం సినిమా ప్రదర్శనను తాము అడ్డుకోవడం లేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మా సినిమా చూసిన ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఉన్న మనస్పర్థలు మరిచిపోయి కలుసుకుంటున్నారని వెల్లడించారు. ఒక నిర్మాతగా తనకు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని అన్నారు. ప్రజలు వివాదాలు పక్కనపెట్టి కలుస్తున్నారంటే తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్న మాట అంటేనే తట్టుకోలేను మీరు రాజకీయాల్లో వస్తారన్న ప్రశ్నపై దిల్ రాజు స్పందించారు. నేను రాజకీయాల్లో వస్తానా లేదా అన్నది అప్రస్తుతమని కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఎన్నో అడ్డుంకులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్నమాట అంటేనే నేను తట్టుకోలేనని తెలిపారు. అలాంటిది నేను రాజకీయాల్లోకి వస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కాగా.. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన 'బలగం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా మానవ సంబంధాలను హృదయాలకు హత్తుకునేలా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ పల్లెల్లో జరిగే సంప్రదాయాలే కథాంశంగా ఈ సినిమాను రూపొందించారు. -
'బలగం' మూవీకి మరో అంతార్జాతీయ అవార్డు.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులంటే
అంతర్జాతీయ వేదికపై ‘బలగం’ సినిమా మరోసారి సత్తా చాటింది. ఉక్రెయిన్‌లో జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ మూవీకి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు లభించింది. ప్రియదర్శి, కావ్య జంటగా వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ సమర్పణలో హన్షిత, హర్షిత్ నిర్మించిన ఈ మూవీ మార్చి 3న విడుదలైంది. -
అంతర్జాతీయ పురస్కార బలగం
హాస్య నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించారు. ‘దిల్’ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై, మంచి విజయం సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీతోపాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులకు ఎంపికైన విషయాన్ని చిత్రదర్శకుడు వేణు వెల్లడించారు. ‘నా బలగం’కు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరుస్తోంది’’ అన్నారు. ఈ అవార్డును ఛాయాగ్రాహకుడు ఆచార్య వేణు, దర్శకుడు వేణు అందుకోనున్నారు. -
ఫస్ట్ టైం మా నాన్న నా భుజంపై చేయి వేసి అభినందించారు: ప్రియదర్శి
‘‘నా కెరీర్లో ‘బలగం’ ఓ మైలురాయి. నేను నటించిన సినిమాలు చూసిన మా నాన్నగారు(సుబ్బాచారి) ఎప్పుడూ నన్ను అభినందించలేదు. కానీ, ‘బలగం’ చూసి నా భుజంపై చేయి వేసి, ‘చాలా బాగా చేశావురా’ అన్నారు.. అదే నాకు పెద్ద ప్రశంస’’ అని నటుడు ప్రియదర్శి అన్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్, శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ మూవీ ఈ నెల 3న విడుదలైంది. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘బలగం’కి అందరూ కనెక్ట్ అవుతున్నారు. ‘చిన్న మనస్పర్థల వల్ల మా అన్న, నేను రెండేళ్లుగా మాట్లాడుకోలేదు.. ‘బలగం’ చూశాక మా అన్నకి నేనే ఫోన్ చేశాను.. ఇద్దరం మాట్లాడుకున్నాం’ అని ఒకతను ఫోన్ చేసి చెప్పడంతో ఎంతో ఆనందం వేసింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో హీరోగా, వేరే హీరోల చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు. -
సక్సెస్ఫుల్ సినిమా తీయడం అంత ఈజీ కాదు
‘‘సినిమా తీయడం సులభం. కానీ సక్సెస్ఫుల్ సినిమా తీయడం అంత ఈజీ కాదు. సరైన నిర్ణయాలు తీసుకోగలగడం, కష్టపడటం, పరిశీలన, సమాచార సేకరణ వంటి అంశాలు ఓ సినిమా సక్సెస్ కావడానికి దోహదపడతాయి. అయితే ప్రతి సినిమాకీ మేం ఒకేలా కష్టపడతాం. అందుకే మా ఎస్వీసీసీ బేనర్లో డెబ్బై శాతానికి పైగా సక్సెస్ రేట్ ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్స్ (డీఆర్పీ) పతాకంపై హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ చిత్రంతో నటుడు వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం డీఆర్పీ బ్యానర్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బొమ్మరిల్లు’, ‘శతమానంభవతి’ చిత్రాలు మా ఎస్వీసీసీకి డబ్బుతో పాటు మంచి కుటుంబ ప్రేక్షకాదరణను తీసుకువచ్చాయి. అలా ఈ డీఆర్పీ బ్యానర్‌కు ‘బలగం’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘తెలంగాణలోని సిరిసిల్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది’’ అన్నారు వేణు. ‘‘ఈ చిత్రంతో దర్శకుడిగా వేణు ప్రతిభను చూస్తారు’’ అన్నారు ప్రియదర్శి. ‘‘కొత్త కథలను అందిస్తూ, ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే, లక్ష్యంతో ఈ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు హన్షిత రెడ్డి. ఇటీవల నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల్లో (తమిళ హీరోలను ఉద్దేశించి) కొన్ని సెకన్ల వీడియోను కట్ చేసి, ప్రచారం చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఒకర్ని ఎక్కువ మరొకర్ని తక్కువ చేయడం నాకిష్టం ఉండదు. – ‘దిల్’ రాజు -
ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే చాలా జరిగిపోతాయి: ప్రియదర్శి
‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించాడు నటుడు ప్రియదర్శి. తనదైన నటన, కామెడీతో మెప్పించాడు. ‘నా చావు నేను చస్తా నీకెందుకు’ అనే డైలాగ్‌తో ప్రేక్షకులను కడుబ్బా నవ్వించాడు. ఈ ఒక్క డైలాగ్‌తో ప్రియదర్శి రాత్రి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కమెడియన్‌గా, నటుడి వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. చదవండి: అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ ఈ నేపథ్యంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణతో కలిసి ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను పంచుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో మనకు నచ్చనిది నచ్చలేదని చెప్పడం చాల కష్టమని, నో చెప్పడం కూడా ఓ కళ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను నాకు తగిన పాత్రలే చేస్తూ వచ్చాను. నాకు నచ్చకపోతే సున్నితంగానే నో చెప్పేస్తా. కానీ, ఇక్కడ నో చెప్పడం పెద్ద కళనే. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? మనకు నచ్చనిది.. నచ్చలేదని చెప్తే వాడికి తలపొగరంటూ ప్రచారం చేస్తారు. ఇతనో పెద్ద ఆర్టిస్ట్.. ఇతనికి నచ్చాలట.. అని అవేవో అనేసుకుంటారు’ అని చెప్పుకొచ్చాడు. అందుకే ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని, లేదంట మనకు ప్రమేయం లేకుండానే చాలా జరిపోతాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తన నచ్చని సినిమాలకు చెప్పడం ఇబ్బంది అనిపిస్తే తన మేనేజర్ హ్యాండిల్ చేస్తాడని చెప్పాడు. ఇక నటుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత కోపాన్ని తగ్గించుకుని, మరింత జాగ్రతగా ఉండటం నేర్చుకుంటున్నానని అన్నాడు. -
అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రాహుల్. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్‌లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్ రోల్‌కు అప్పటికే తరుణ్ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. -
ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు దారుణంగా అవమానించారు: ప్రియదర్శి
పెళ్లి చూపుల సినిమాతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించాడు నటుడ ప్రియదర్శి. ఈ సినిమాలో నా చావు నేను చస్తా నీకెందుకు అనే డైలాగ్ ప్రేక్షకులను కడుబ్బా నవ్వించాడు. ఈ డైలాగ్ అతడు రాత్రి రాత్రే ప్రయదర్శి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించాడు. కమెడియన్‌గా, నటుడి వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. చదవండి: నన్ను అలా అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి అలాగే మల్లేశం సినిమాలో లీడ్ రోల్ పోషించిన ప్రియదర్శి తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాదు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ టాక్‌లో షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా తన కెరీర్, మూవీస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు ప్రియదర్శి మాట్లాడుతూ.. టెర్రర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాడు. సినిమాటోగ్రాఫ్ అవుతానని ఇంట్లో చెప్పి వచ్చాననన్నాడు. చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ అయితే ఇక్కడికి వచ్చాక నటుడిగా ఆడిషన్స్ ఇస్తున్న క్రమంలో తనని ఘెరంగా అవమానించేవారంటూ చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నానంటూ విమర్శించేవారు. కొన్ని సార్లు హీరో కంటే పొడుగ్గా ఉన్నానని కూడా నన్ను రిజెక్ట్ చేశారు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. ఆ సమయంలో టెర్రర్లో ఓ పాత్రకు నేనే సరిగ్గా సరిపోతానని వారే నాకు ఫోన్ చేశారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా పెళ్లి చూపులు సినిమాకి గానూ ఉత్తమ హాస్యనటుడిగా ప్రియదర్శి సైమా, ఐఫా అవార్డులు అందుకున్నాడు. -
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి: నిర్మాత సుప్రియ
‘‘సినిమా కథలకు, ఓటీటీ కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేశ్, షాయాజీ షిండే, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘లూజర్ 2’. అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకులు. అభిలాష్ రెడ్డి క్రియేటర్, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్‌వర్క్స్‌పై సుప్రియ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సుప్రియ మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థులే ‘లూజర్ 2’కి పని చేశారు.. అందుకే వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి కథ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘లూజర్ 2’కి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అభిలాష్ రెడ్డి. పావని, కల్పిక, గాయత్రి, ప్రియదర్శి, శశాంక్ పాల్గొన్నారు. -
'లూజర్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Zee5 Original Loser Season 2 Pre Release Event In Hyderabad: కరోనా, లాక్డౌన్ కారణంగా థియేటర్లన్ని మూత పడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులంతా ఓటీటీ బాట పట్టారు. అలాంటి ఓటీటీలో 'జీ5' ఒకటి. జీ5 ఓటీటీ అంటే వినోదం మాత్రమే కాదు, అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతోంది. అనేక జోనర్లలో సినిమాలు అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్'. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఆ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా లూజర్ 2ను రూపొందించారు మేకర్స్. అయితే ఈ రెండో సీజన్‌కు అభిలాష్ రెడ్డితోపాటు శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా 'లూజర్ 2' ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ5 హెడ్‌తోపాటు మార్కెటింగ్ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ తదితరులు హాజరయ్యారు. ఈ 'లూజర్ 2' సిరీస్ జనవరి 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఓటీటీ అనేది న్యూ రెవల్యూషన్ అని నాగార్జున పేర్కొన్నారు. 'ఓటీటీలో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. సినిమా లాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలగాలి. అలాంటిది లూజర్ వెబ్ సిరీస్‌ను ఆడియన్స్‌కు థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. 'లూజర్ 2' ట్రైలర్ చూశాను. ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. అలాగే చేతన్ ఆనంద్ గొప్ప ప్లేయర్. తనను చూసి భారతదేశం గర్వపడుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో మంచి టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాం. అలాగే జీ 5 స్టూడియోతో మా ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది.' అని నాగార్జున తెలిపారు. ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్‌లో చాలా సపోర్ట్ చేశారు. నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్ డైరెక్ట్ చేశాడు. అలాగే మాకు సపోర్ట్‌గా నిలుస్తూ 90% ఇన్పుట్స్ ఇచ్చిన సుప్రియ గారికి, మాకు ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందించిన స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ వారికి మా ధన్యవాదాలు. అని డైరెక్టర్ అభిలాష్ పేర్కొన్నారు. 'అన్నపూర్ణ బ్యానర్లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము 'లూజర్' కోసం చాలా టెక్నిషీయన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది. మాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోకు, నిర్మాత సుప్రియ గారిగి జీ 5 వారికి మా ధన్యవాదాలు' అని నటుడు ప్రియదర్శి చెప్పాడు. ఈ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, షాయాజీ షిండే, శశాంక్, హర్షిత్ రెడ్డి తదితరులు నటించి మెప్పించారు. ఇదీ చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు -
సరికొత్తగా శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్‌లుక్
నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ 30వ చిత్రంగా ‘ఒకే ఒక జీవితం’ తెరకెక్కతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ఫ్రభులు నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీకి ఒకే ఒక లోకం అనే టైటిల్‌ను మేకర్స్ చేశారు. శర్వానంద్ గిటార్‌తో దర్శనం ఇచ్చాడు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుంది. ఇక సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్‌లో పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరోవైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్స్‌తో ఉన్న ఈ పోస్టర్‌ను చూస్తుంటే ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఇందులో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి సహానటులుగా కాగా అక్కినేని అమల ఒక కీలక పాత్ర పోషించనుండటం విశేషం. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. -
రివ్యూ: ఇన్ ది నేమ్ ఆఫ్... వెబ్ సిరీస్ ఇలాగా?
వెబ్ సిరీస్: ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’; తారాగణం: ప్రియదర్శి, నందినీ రాయ్; మాటలు: ప్రదీప్ ఆచార్య; కాన్సెప్ట్: ఆదిత్యా ముత్తుకుమార్; రచన, దర్శకత్వం: విద్యాసాగర్ ముత్తుకుమార్; ఓటీటీ: ఆహా ‘బాషా’, ‘మాస్టర్’ లాంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు సురేశ్ కృష్ణ తెలుగులో నిర్మించిన తొలి వెబ్‌సిరీస్ ఇది. ట్రైలర్ దశ నుంచి ఆసక్తి రేపింది. క్రైమ్ అండ్ సెక్స్ కలగలిపి కథ రాసుకోవడం డిజిటల్ కంటెంట్‌కు పేయింగ్ ఎలిమెంటే. కానీ, అవి ఉంటే సరిపోతుందా? అసలు కథ, కథనం గాడి తప్పితే? ఏ పాత్రా, ఏ సంఘటనా మనసుకు హత్తుకోకపోతే? సెన్సార్ లేని వెబ్ సిరీస్ కదా అని విశృంఖలంగా తీయాలనుకుంటే? ఇవేమంత జవాబు చెప్పలేని బేతాళ ప్రశ్నలు కాదు. కథేమిటంటే..: మనిషిలో ఉండే సహజమైన మోహం, దురాశ, కామం, పశుప్రవృత్తి లాంటి గుణాలతో అల్లుకున్న కథ ఇది. రాజమండ్రిలో ట్రావెల్స్ డ్రైవర్‌గా పనిచేసే ఆది (ప్రియదర్శి)కి ఓ రిసార్ట్ కొనుక్కోవాలని ఆశ. బూతు ‘బిట్ సినిమాలు’ తీసే అయ్యప్ప (పోసాని). ఆ దర్శకుడు కట్టుకున్న పడుచు పెళ్ళాం మీనా (నందినీరాయ్) వైపు ఆది ఆకర్షితుడవుతాడు. గంజాయి అమ్ముతూ తప్పుదోవ పట్టిన థామస్(వికాస్)తో సంబంధం పెట్టుకున్న మీనా అనుకోని పరిస్థితుల్లో భర్తనే చంపేస్తుంది. అప్పటికే ఓ దాదా ఇచ్చిన హవాలా సొమ్ము తమ్ముడి ద్వారా అయ్యప్పకు చేరి ఉంటుంది. ఇటు అయ్యప్ప హంతకుల కోసం అన్వేషణ. అటు ఆ 5 కోట్ల హవాలా మనీ ఏమైందని దాదాల వెతుకులాట. మీనా మోజులో పడి, అయ్యప్ప హత్యోదంతంలో ఇరుక్కున్న హీరో. అతని చుట్టూ రోసీ (మహమ్మద్ అలీ బేగ్) పాత్రలు. హీరో ఈ సమస్యల నుంచి బయటపడ్డాడా? డబ్బు సూట్కేసేమైంది లాంటి వాటికి జవాబు కోసం 7 భాగాలు చూడాలి. ఎలా చేశారంటే..: తెలంగాణ యాక్టర్‌గా ముద్రపడ్డ ప్రియదర్శి రాజమండ్రి నేపథ్యంలో మొదలై, అక్కడే ఎక్కువగా జరిగే ఈ కథలో కోస్తాంధ్ర యాసతో వినిపించారు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించారు. నందినీ రాయ్ బోల్డ్‌గా చేశారు. పోసాని కనిపించేది ఒక్క ఎపిసోడ్‌లోనే! ఆ పాత్రలో, ఆ రకమైన సంభాషణల్లో ఒదిగిపోయారు. రోసీగా రంగస్థల నటుడు మహమ్మద్ అలీ బేగ్ చేసిందీ, చేయగలిగిందీ లేవు. అలాగే, ఫకీర్ దాదా (ఉమా మహేశ్వరరావు), హత్యకు గురైన దర్శకుడి తమ్ముడు విష్ణు (చంద్రకాంత్) – ఇలా చాలా పాత్రలు తెరపై వస్తుంటాయి. ఆ పాత్రలు, నటీనటులు విగ్రహపుష్టితో ఉన్నా కథలోని కన్ఫ్యూజన్ ఆ పాత్రల్లో, పాత్రధారణలో ఉంది. ఎలా తీశారంటే..: తొలుత టెక్నికల్ ఫాల్ట్‌తో 5 భాగాలే అప్లోడ్ అయి, ఆనక ఆలస్యంగా మొత్తం 7 భాగాలూ నెట్లో కనిపించిన సిరీస్ ఇది. అన్ని భాగాల్లోనూ ఒకటి రెండు శృంగార సన్నివేశాలు, బూతులు, హింస, హత్యాకాండ తప్పనిసరి. ప్రతి పాత్ర నోటా అదుపు లేని అసభ్య భాష. వెబ్ సిరీస్ అంటే ఇలాగే రాయాలని రచయిత ఫిక్సయినట్టున్నారు. పొడి పొడి డైలాగ్స్, అర్థం లేని పాత్రల ప్రవర్తన ఈ సిరీస్‌కు దెబ్బ. ఒకట్రెండు భాగాల తరువాత కథ, కథనం గాడి తప్పేశాయి. దానికి తోడు నిర్ణీతమైన లక్ష్యం, లక్షణం లేని బోలెడన్ని పాత్రలు వచ్చి పడుతుంటాయి. అందుకే, మూడో ఎపిసోడ్ నుంచి బోరెత్తించి, ఆపైన ఈ వెబ్ సిరీస్ ఎటెటో వెళ్ళిపోతుంది. అటు హత్య మీద కానీ, ఇటు డబ్బున్న సూట్‌కేస్ మీద కానీ దృష్టి లేకుండా పోయింది. ఆ బరువంతా ఆఖరి ఎపిసోడ్ మీద పడి, కథను హడావిడిగా ముగించాల్సి వచ్చింది. గతంలో ‘లూజర్’ వెబ్ సిరీస్‌లో చేసిన ప్రియదర్శికి ఇది కొత్త కోణం. కామం, కోపం, భయం అన్నీ పలికించారు. ఆయనే ఈ సిరీస్‌కు రిలీఫ్. కానీ కథలోని లోటుపాట్లు ఆ పాత్రనూ కిందకు గుంజేశాయి. నిర్మాణ విలువలు, కెమేరా వర్క్ బాగున్నాయి. వాటికి తగ్గట్టు స్క్రిప్టులోనూ, ఫైనల్ ప్రొడక్ట్‌లోనూ ఎడిటింగూ ఉండాల్సింది. ఇది కచ్చితంగా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళే చూడాల్సిన సెక్సువల్, క్రైమ్ సిరీస్. ఓటీటీ వచ్చి జనం అభిరుచిని మార్చినమాట నిజమే కానీ, బోల్డ్‌గా చెప్పడం, చూపించడం అనే ఒక్కదాని మీదే ఆధారపడి వెబ్ సిరీసులు తీస్తే కష్టం. ఆ సంగతి ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ గుర్తు చేస్తుంది. ఈ మధ్య ‘లెవన్త్ అవర్’ వెబ్ సిరీస్, ‘అర్ధ శతాబ్దం’ లాంటివి ‘ఆహా’లో నిరాశపరిచాయి. ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ఆ కోవలోనే చేరడం ఓ విషాదం. మొత్తం చూశాక ఇంతకూ ఏం చెప్పదలుచుకున్నారో తేల్చిచెప్పడం కష్టమే. ‘సైతాను నీ లోని కోరికను రెచ్చగొట్టి, నువ్వు తప్పు చేసేలా చేసి, కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడు. కానీ, దేవుడు తప్పు చేసినప్పుడే క్షణంలో శిక్షిస్తాడు’ అని హీరో అంటాడు. కానీ, దర్శకుడి అనుభవ రాహిత్యంతో... ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్... కథ అతి నిదానంగా నాలుగున్నర గంటలు సాగి, చూస్తున్న ప్రతి క్షణం శిక్షిస్తుంది. బలాలు: ∙భిన్నమైన పాత్రలో ప్రియదర్శి నటన ♦కెమేరా వర్క్ ♦నిర్మాణ విలువలు బలహీనతలు: రచనా లోపం, స్లో నేరేషన్ ♦కథకూ, పాత్రలకూ తీరూతెన్నూ లోపించడం ♦మితిమీరిన సెక్స్, వయొలెన్స్ కంటెంట్ కొసమెరుపు: సీరియల్ కన్నా స్లో... సిరీస్! – రెంటాల జయదేవ -
In The Name Of God: సైతాన్‌కి, దేవుడికి ఉన్న తేడా ఏంటో తెలుసా!
ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 న ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. అరేయ్..నీకు సైతాన్‌కి, దేవుడికి ఉన్న తేడా ఏంటో తెలుసా! సైతాన్ నీలో ఉన్న కోరికను రెచ్చగొట్టి.. నువ్వు తప్పు చేసేలా చేసి.. నువ్వు కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడురా. కానీ దేవుడు అలా కాదు.. చాలా సింపుల్. నువ్వు తప్పు చేసినప్పుడే చంపేస్తాడు’ అంటూ ప్రియదర్శి చెప్పే భారీ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది. ప్రియదర్శి ఇలాంటి పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. లిప్‌లాక్, ఫైట్స్ సీన్స్‌తో హాట్ హాట్‌గా ఉన్న ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. -
నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే..
'పెళ్లిచూపులు' సినిమాలో 'నా సావు నేను చస్తా నీకెందుకు' అంటూ ఒక్క డైలాగ్‌తో క్రేజ్ సంపాదిచుకున్న నటుడు ప్రియదర్శి. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ పెళ్లిచూపులు సినిమాలో తెలంగాణ యాసలో ప్రియదర్శి చెప్పిన డైలాగులు బాగా పాపులర్ అవడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత జై లవకుశ, స్పైడర్ సినిమాల్లోనూ తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. అయితే 2019లో వచ్చిన 'మల్లేశం' సినిమాలో లీడ్ రోల్ పోషించి సత్తా చాటుకున్నాడు. ఎమోషనల్గానూ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మధ్యే వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ఈతరం కమెడియన్స్‌లో ప్రియదర్శికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రియదర్శి ప్రొఫెషనల్ లైఫ్ గురించి అందరికి తెలిసినా ఆయన వ్యక్తిగత విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియదర్శి.. తనకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. గతంలో ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు బట్టలు కొనుక్కోడానికి తన భార్య రిచానే డబ్బులు ఇచ్చేదని, అంతేకాకుండా తన మొబైల్, ట్రావెల్ ఖర్చులు కూడా ఆమే కట్టేదని పేర్కొన్నాడు. ప్రియదర్శి భార్య రిచా శర్మ నవలా రచయిత్రి. ఇప్పటికే ఆమె పలు నవలలు రాసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రియదర్శి నాన్నపులికొండ సుబ్బచారి ప్రొఫెసర్‌గా పనిచేశారట. ఆయన పలు పద్యాలు, కవితలు కూడా రాసేవారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా..ప్రస్తుతం ప్రియదర్శి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఎప్పుడూ కామెడీ పండించే పాత్రలు ఎంచుకునే అతడు ఈసారి మాత్రం క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. చదవండి : 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! 'దమ్ము' హీరోయిన్ కార్తీక ఏం చేస్తుందో తెలుసా? -
ప్రియదర్శి కాలికి గాయం, అయినా లెక్క చేయకుండా..
'మల్లేశం' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రియదర్శి. ఈ మధ్యే వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. అయితే ఎప్పుడూ కామెడీ పండించే పాత్రలు ఎంచుకునే అతడు ఈసారి మాత్రం డిఫరెంట్ ట్రాక్ ఎక్కాడు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. విద్యాసాగర్ ముత్తు కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను బాషా, మాస్టర్, డాడీ చిత్రాల దర్శకుడు సురేశ్ కృష్ణ నిర్మిస్తున్నాడు. Our Aadhi is gonna leave you 🤯 Watch out for #InTheNameofGod to spot this scene. ComING Soon.@priyadarshi_i @ImNandiniRai @Suresh_Krissna #VidyasaagarMuthukumar @RangaYali pic.twitter.com/pPmpZ979Qo — ahavideoIN (@ahavideoIN) June 8, 2021 ఈ వెబ్ సిరీస్‌లో కీలకమైన సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో ప్రియదర్శి కాలికి గాయమైందట. అయినప్పటికీ తన గాయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్ పూర్తి చేశాడట. కానీ ఆ గాయం నుంచి కోలుకోవడానికి ప్రియదర్శికి మూడు నెలలు పట్టిందట. ఈ విషయం తెలిసిన అభిమానులు ప్రియదర్శి అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్చి త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది. చదవండి: ఆ లెజెండ్స్‌తో పనిచేయడంతో నా కల నిజమైంది: ప్రియదర్శి Aha : జూన్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే -
4 వారాలు..4 సినిమాలు..కట్టిపడేసే కంటెంట్‌తో ‘ఆహా’ రెడీ
సూపర్ హిట్ కంటెంట్‌తో లాక్డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. అల్లు అరవింద్ ఈ ఓటీటీ కోసం మంచి టీమ్ ను రెడీ చేశాడు. ఇప్పటికే ‘క్రాక్’,‘గాలి సంపత్’, ‘నాంది’, ‘జాంబి రెడ్డి’, ‘సుల్తాన్’, ‘చావు కబురు చల్లగా’, ‘థ్యాంక్ యు బ్రదర్’,‘అనుకోని అతిథి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లను అందించిన ఆహా.. ఇక జూన్ నెలలో కూడా సరికొత్త సినిమాలలో అలరించేందుకు రెడీ అవుతుంది. వారానికి ఒక సినిమా చొప్పు నాలుగు డిఫరెంట్ మూవీస్‌ని జూన్‌లో నెలలో విడుదల చేయబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా అడ్డాగా మారిపోయింది. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలకు సైతం పచ్చ తివాచీ పరుస్తోంది. అందులో భాగంగా తాజాగా మలయాళ హిట్ మూవీ కాలా తెలుగులో అనువాదమవుతోంది.టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే ‘కాలా’. ఓ కుక్క కారణంగా మొదలైన వివాదం చినికి చినికి గాలీవానగా మారుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ తో మూవీ సాగుతుంది. ఫారెస్ట్ హౌస్ లో ఒక రోజులో జరిగే కథ ఇది. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు ఇటీవల రానా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ గ్లింప్స్, సాయి కుమార్ లుక్, కార్తిక్ రత్నం లుక్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. జూన్ 11 నుండి ‘ఆహా’లో ‘అర్ధ శతాబ్దం’ అందుబాటులోకి రానుంది.. ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన స్క్రిప్ట్ లను ఎంపికల చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ కమెడియన్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18న ఆహాలో ప్రసారం అవుతుంది. మలయాళి మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘వన్’. ఈ చిత్రాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయింది ఆహా. సంతోష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 25న స్ట్రీమింగ్ కానుంది. ఇలా ప్రతి వారం ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులను వినోదాన్ని అదించబోతుంది ఆహ. చదవండి: Kala: జంతువు కోసం మనిషి జంతువుగా మారితే! In The Name of God : తొలిసారి ప్రియదర్శి అలా.. -
In The Name of God : తొలిసారి ప్రియదర్శి అలా..
సూపర్ హిట్ కంటెంట్‌లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ఆహ.. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్జీ) తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది. ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరీస్‌కి విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఈ ఉడతని ఎలా పట్టుకుంటారో తెలుసా?ఒక చెట్టుకి చిన్న తొర్ర చేసి అందులో దానికి ఆహారం వేస్తారు. ఉడత అందులో తల దూరుస్తుంది. తిరిగి బయటకు రాలేదు. అప్పుడు దాన్ని ఈజీగా బయటకు తీస్తారు’ అంటూ జగపతి బాబు చెప్పిన వాయిస్ ఓవర్‌తో ప్రారంభయ్యే ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ప్రియదర్శి ఇప్పటి వరకు కనిపించని పాత్రలో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సురేశ్ కృష్ణ సంస్థ నిర్మిస్తోన్న ఈ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ‘రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే ‘పెళ్లి సందD’ కి క్రేజీ ఆఫర్... ఓటీటీలో విడుదలకు సిద్దం! -
నా కల నిజమైంది: ప్రియదర్శి
ప్రియదర్శి, నందిని రాయ్ పోసాని కృష్ణుమరళి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్’(ఐఎన్జీ). విద్యాసాగర్ ముత్తు కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌కు రంగా యాలి షో రన్నర్‌గా వ్యవహిరిస్తున్నాడు. బాషా, ప్రేమ, మాస్టర్, డాడీ చిత్రాల దర్శకుడు సురేశ్ కృష్ణ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సురేశ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ తననే నిర్మించమని ఆహా అధినేత అల్లు అరవింద్ చెప్పారన్నాడు. క్రైం థ్రీల్లర్ బ్యాక్ డ్రాప్‌తో విద్యాసాగర్ చెప్పిన ఈ కథ నచ్చడంతో సిరీస్‌ను నిర్మించానని, దర్శకుడిగా చేసిన తనకు నిర్మాతగా ఈ ప్రయాణం కొత్తగా ఉందని పేర్కొన్నాడు. ఇక నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాషా మూవీ చూశాక సురేశ్ కృష్ణతో పనిచేయాలనుకున్నాను, అందుకే ఆయనతో కలిసి మా బ్యానర్లో(గీతా ఆర్ట్స్) మాస్టర్, డాడీ చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు ఆహా కోసం సురేశ్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్‌ను నిర్మించాడు’ అని ఆయన చమత్కరించాడు. చివరగా ప్రియదర్శి మాట్లాడుతూ.. తను నటించిన ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక అల్లు అరవింద్, సురేశ్ కృష్ణ వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేయడంతో తన కల నిజమైందంటూ చెప్పుకొచ్చాడు. How far will you go #InTheNameofGod? This original crime thriller is comING soon to shock you, only on #ahavideoIN. 🔥@priyadarshi_i @ImNandiniRai @Suresh_Krissna #VidyasaagarMuthukumar @RangaYali pic.twitter.com/N8KGBLj3A6 — ahavideoIN (@ahavideoIN) May 18, 2021 -
మరో తెలుగు చిత్రానికి అరుదైన ఘనత
అది 2000 సంవత్సరం అప్పుడప్పుడే కంప్యూటర్ వచ్చిన రోజులవి. గ్రామంలోకి అప్పుడే అడుగులు వేసుకుంటూ వచ్చిందో వయ్యారి కంప్యూటర్. అమ్మాయి వెంట చూసే దిక్కులను కంప్యూటర్ వైపు చూసి, ఈ కంప్యూటర్ను ఎలాగైనా నేర్చుకోవాలనే తాపత్రాయంతో ఉండే ఓ అబ్బాయి. ఆ కంప్యూటర్లో వచ్చే ఒక మెయిల్‌తో మోసపోయే అబ్బాయిల అమాయకత్వం. ప్రతిసారి లాగా ఈ సారి తను నేర్పించే శిక్షణతో ఎవరు నాకు పొటీ రాకుండా నేర్చుకోవడానికి వచ్చిన వారికి ముందుగానే షరతు పెట్టి, తను మోసపోయానని చెప్పే అమాయకత్వం ఇంకోకరిది. ఇప్పటికీ మీ అందరికీ గుర్తువచ్చే ఉంటుంది. మాకు ఎందుకు తెలియదు..! మరీ ఇంతా అమాయకులు ఉంటారా..అని అనుకున్న చిత్రమే..కంబాలకథలు ‘మెయిల్’. ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకొని, అద్భుత విజయం సాధించింది. కాగా తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ చిత్రం ‘న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021’ కు ఎంపిక చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాతలు శనివారం తెలిపారు. జూన్ 4 న ప్రారంభమయ్యే న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం ఓటీటి ప్లాట్‌ఫాం ఆహాలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించగా, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు. #Mail has been now an 'Official selection at the New York Indian Film Festival'. A big thanks to each and everyone who made it possible♥️ #ReasonToSmile @SwapnaCinema @ahavideoIN #UdayGurrala pic.twitter.com/Rl2Y41q75N — Priyadarshi (@priyadarshi_i) May 8, 2021 -
ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్ కాదు!
చాలా రోజులకు థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు వెలిశాయంటే అది కేవలం జాతిరత్నాలు సినిమా వల్లే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించి మెప్పించింది. రాహుల్, ప్రియదర్శి, నవీన్‌ల కామెడీకి నవ్వుకోని ప్రేక్షకుడే లేడంటే అతిశయోక్తి కాదు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజైనప్పటి నుంచి థియేటర్లో ఆడుతూనే ఉంది. మధ్యలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ వాటికి గట్టి పోటీనిస్తూ నిలదొక్కుకుంది. కలెక్షన్ల పరంగా ఓవర్సీస్లోనూ దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జాతిరత్నాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 10 నుంచి ప్రసారం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. గతంలోనూ ఈ సినిమా ఓటీటీ బాట పడుతోందని, ఇదే నెలలో ప్రసారం కానుందని వార్తలు రాగా వీటిని చిత్రయూనిట్ ఖండించింది. మరి వచ్చే నెలలో జాతిరత్నాలు ఓటీటీలోకి వస్తుందన్న ఊహాగానాల్లో ఎంతవరకు నిజముందనేది తేలాల్సి ఉంది! చదవండి: గోదావరి తీరంలొ నాని సినిమా షూటింగ్ చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది -
‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్
కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం జాతిరత్నాలు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ జాతిరత్నాలు 20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చారు. భారీ లాభాలు రావడంతో సక్సెన్ టూర్‌ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సక్సెస్ టూర్లో భాగంగా నవీన్, ప్రియదర్శి అమెరికాకు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు అన్ని చోట్ల తిరుగుతున్నారు. వారి ప్రయాణంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం నవీన్, ప్రియదర్శి అమెరికా టూర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన రాహుల్ రామకృష్ణ.. తనను అమెరికా తీసుకెళ్లకుండా మోసం చేశారంటూ.. ప్రియదర్శి, నవీన్‌లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్ కార్డ్ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..!’అంటూ ఓ సరదా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Scandalous video response to #JathiRatnalu team’s USA success tour by @eyrahul @NaveenPolishety @priyadarshi_i https://t.co/vZpJocELTI pic.twitter.com/67Upo8Gl1m — Rahul Ramakrishna (@eyrahul) March 20, 2021 -
త్వరలోనే సీక్వెల్ ఉంటుంది
‘‘జాతి రత్నాలు’ సినిమా చూడమని నా స్నేహితులు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల చూడలేకపోయాను. నవీన్, ప్రియదర్శి, రాహుల్ దగ్గర ఎంతో కళ ఉంది.. ఇప్పుడు వారికి సమయం వచ్చింది’’ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘థియేటర్లలో నవ్వులు పూయించేందుకు చేసిన మా ప్రయత్నం ఫలించింది’’ అన్నారు అనుదీప్. ‘‘చిత్రం భళారే విచిత్రం’ విడుదలైనప్పుడు వచ్చిన క్రేజ్‌ని మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’’ అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. ‘‘త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. -
వ్యాక్సిన్ వద్దు.. మీ సినిమా చాలన్నారు
‘‘కమెడియన్, హీరో, విలన్ అని కాదు... ఓ మంచి నటుడిగా నన్ను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటే చాలు. అయినా కామెడీ చేయడం అంత సులువేం కాదు’’ అన్నారు ప్రియదర్శి. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వం వహించిన సినిమా ‘జాతిరత్నాలు’. స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన శేఖర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. సినిమాను, నా పాత్రను అభినందిస్తూ చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. ఒకరైతే వ్యాక్సిన్ వద్దు. మీ సినిమా చాలు అన్నారు. సరదాగా అనిపించింది. మొదట రాహుల్ రామకృష్ణకు కథ నచ్చి నన్ను కూడా వినమన్నాడు. అనుదీప్ ఈ కథ చెబుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. రెండేళ్ళుగా నవీన్ నాకు తెలుసు. పదేళ్లుగా రాహుల్ తెలుసు. మా స్నేహం స్క్రీన్ పై ప్రతిబింబించిందని అనుకుంటున్నా. నాగ్ అశ్విన్ , స్వప్న అక్క బాగా సహాయం చేశారు. ‘మొదట్లో ఇండస్ట్రీలో ప్లేస్ కోసం ప్రయత్నించాను. ‘టెర్రర్’లో విలన్ గా చేశా. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’తో కమెడియన్ గా మారాను. నాకు ఎస్వీఆర్, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌గార్ల యాక్టింగ్ అంటే ఇష్టం. నా భార్య రైటర్. తనతో నా సినిమాలు కొన్ని డిస్కస్స్ చేస్తుంటా. ప్రస్తుతం రెండు సినిమాలతో పాటు ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నా. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. డైరెక్షన్ ఆలోచన ఉంది. కానీ డైరెక్షన్ చాలా టఫ్. భవిష్యత్తులో చూడాలి’’ అని అన్నారు. -
అంతకు మించిన పేమెంట్ లేదు!
‘‘నేను చేసే ప్రతి సినిమాలో కొత్త పాయింట్ ఉందో లేదో చూసుకుంటాను. అన్ని రకాల పాత్రలు, డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. నవీన్ మాట్లాడుతూ – ‘‘‘జాతిరత్నాలు’ కథ విన్నప్పుడు ఎంజాయ్ చేశాను. సాధారణంగా గొప్పవారిని జాతిరత్నాలు అంటారు. కానీ మా ‘జాతిరత్నాలు’ సెటైరికల్ మూవీ. మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ల నుంచి వస్తే నాకు అంతకు మించిన పేమెంట్ లేదు. నేను ముంబైలో ఉన్నప్పుడు నా వీడియోలు నాగీకి పంపేవాడిని. మాలాంటి కొత్తవారికి ఇలాంటి నిర్మాతలు అవకాశాలు ఇస్తే ప్రతి ఇంట్లో ఓ నవీన్ ఉంటాడు. నాకు యాక్సిడెంట్ అయ్యింది. లేకపోతే ‘జాతిరత్నాలు’ను థియేటర్లో పదిసార్లు చూసేవాడిని’ అని ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. అతనికి సినిమా చూపిస్తే, హిలేరియస్‌గా ఉందని చెప్పాడు’’ అని అన్నారు. -
అందుకే ప్రభాస్ కూల్: నాగ్ అశ్విన్
‘‘అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్తుతుందనే నమ్మకం ఉంది. ‘బాహుబలి’ సినిమా వల్ల కొత్త దారులు ఏర్పడ్డాయి. స్పైడర్‌మ్యాన్, జేమ్స్‌బాండ్ వంటి చిత్రాలు మన దగ్గర విడుదలవుతున్నాయి. మన సినిమాలు కూడా ఆ స్థాయిలో అక్కడ రిలీజ్ అయ్యే తరుణం వస్తుంది’’ అని దర్శక -నిర్మాత నాగ్ అశ్విన్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకుడు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు... ► నాకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ హిలేరియస్ మూవీ చేద్దామనుకున్నాను. అనుదీప్ చేసిన ఓ కామెడీ షార్ట్‌ఫిల్మ్ చూసి ఓ హిలేరియస్ సినిమా చేద్దామని నేనే అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లా. అతను చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. అలా ‘జాతిరత్నాలు’ మొదలైంది. ఈ సినిమాలో కామెడీ, స్టోరీ ఐడియా అనుదీప్‌దే. ఎక్కువకాలం ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అనిపించిన ఇన్ పుట్స్ కొన్ని ఇచ్చాను. ► విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా నుంచి పరిచయం. విజయ్, నవీన్ ల కాంబినేషన్లోనే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూటింగ్ సమయంలో నవీన్ కు ‘జాతిరత్నాలు’ కథ పంపా. అతనికి కథ నచ్చింది. నవీన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. రాహుల్, ప్రియదర్శి కూడా చాలా బాగా చేశారు. ఒక స్క్రిప్ట్ రాయాలన్నా.. సినిమా తీయాలన్నా బ్రెయిన్ కావాలి. కానీ మంచి కామెడీ తీయాలంటే మాత్రం హార్ట్ ఉండాలి. అనుదీప్‌కి మంచి హార్ట్ ఉంది. అందుకే సినిమా ఇంత హిలేరియస్‌గా వచ్చింది. ► ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ. ‘మనీ మనీ..’, ‘అనగనగా..’ తరహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ. రెండు మూడు టైటిల్స్ అనుకున్న తర్వాత ‘జాతిరత్నాలు’ ఫిక్స్ చేశాం. నవీన్ కు హిందీలో మార్కెట్ ఉంది. కాబట్టి దీన్ని హిందీలో డబ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ► నాకు నిర్మాతగా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మంచి కంటెంట్ సినిమాలు వస్తే స్వప్న సినిమాస్ ద్వారా ప్రోత్సహిస్తాను. ► నా గత చిత్రాలు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లో హ్యూమర్ ఉంది. అలాగే ప్రభాస్‌తో నేను చేయబోయే సినిమాలో కూడా కొంత హ్యూమర్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. అందుకే సమయం పడుతోంది. జూలైలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ► ప్రభాస్ దగ్గరకి ఒక పెద్ద స్టార్‌గా భావించి వెళతాం. కానీ ఆయన సరదాగా ఉంటారు. సినీ లెక్కలు, బాక్సాసీఫ్ ఓపెనింగ్స్ పట్టించుకోరు. సోషల్ మీడియాపై ఆసక్తి చూపించరు. ఎప్పుడైనా మాట్లాడితే మేం చేయాల్సిన సినిమాలు, ఆయన చేస్తున్న ఇతర సినిమాల గురించే మాట్లాడతారు. అందుకే ప్రభాస్ అంత కూల్‌గా ఉంటారేమో! - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
ఈ హీరోయిన్ నాకన్నా పొడవుగా ఉందేంటి!: ప్రభాస్
సెక్యూరిటీ గార్డుతో లొల్లి పెట్టుకుంటూ, లిఫ్టులో అంత్యాక్షరి ఆడుతూ ఆగమాగం చేస్తోంది జాతి రత్నాలు టీమ్. ఈ రోజు ట్రైలర్ లాంచ్ కోసం ఈ మూవీ యూనిట్ ముంబై వెళ్లింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో చిత్రయూనిట్ ప్రభాస్ అన్నను కలవాలంటూ సెక్యూరిటీ గార్డుతో సరదాగా గొడవకు దిగింది. ఎలాగోలా బిల్డింగ్ లోపలకు చేరుకున్నాక ప్రభాస్ అన్న వస్తుండు, మడత మంచాలు కాదు, మంచి సోఫా సెట్టేయండి అంటూ నవీన్ పొలిశెట్టి అక్కడున్నవాళ్లకు ఆర్డర్లు వేస్తున్నాడు. అసలు డార్లింగ్ నాకెంత క్లోజ్ అనుకుంటున్నారు? అతడు నా చిన్ననాటి ఫ్రెండు అని పోజులు కొడుతూ ఏ నంబరూ డయల్ చేయకుండానే ఫోన్లో పిచ్చాపాటీగా కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో ప్రభాస్ వెనక నుంచి చెయ్యి వేయగానే ఖంగు తిన్న నవీన్ ఒక్క సెల్ఫీ అంటూ హీరోను అర్థించాడు. ప్రియదర్శి కూడా ప్రభాస్‌ను చూడగానే ఇది కలా? నిజమా? అన్నట్లు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను చూసి ఈ హీరోయిన్ ఏంటి? నాకన్నా పొడవుగా ఉంది? అని ప్రభాస్ ఆశ్చర్యపోవడం గమనార్హం. మొత్తానికి ప్రభాస్ చేతుల మీదుగా నేడు సాయంత్రం 4.20 గంటలకు జాతి రత్నాలు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆ ట్రైలర్ చూసిన ప్రభాస్ సూపర్‌గా ఉందని మెచ్చుకున్నారు. ఈ కొద్ది సేపటికే ఇంత నవ్వుకుంటే సినిమా ఇంకెంత బాగుంటుందోనని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. చదవండి: సైకోగా చేయాలని ఉంది!: జాతి రత్నాలు హీరోయిన్ -
టీజర్: నవ్వులు పూయిస్తున్న ‘జాతి రత్నాలు’
‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితిలో కూడా ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ నవ్వులు పూయిస్తున్నారు. వారు ముఖ్యపాత్రలుగా ‘జాతి రత్నాలు’ అనే సినిమా తెరకెక్కుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఖైదీల వేషంలో నవీన్, ప్రియదర్శి, రాహుల్ కనిపించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నవీన్ పోలిశెట్టికి జోడీగా నటిస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 11వ తేదీన ‘జాతి రత్నాలు’ థియేటర్లలో విడుదల కానుంది. మురళీ శర్మ రూ.500 కోట్ల ప్రాజెక్టుతో ఈ ముగ్గురు హీరోలకు ఉన్న సంబంధమే చిత్ర కథగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. అదే ఈ ముగ్గురి జీవితంలో ‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితి ఏర్పడటానికి కారణంగా కనిపిస్తోంది. ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ టీజర్‌ను చూడండి. సినిమాటోగ్రఫీ సిద్దం మనోహర్, సంగీతం రాధన్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వీకే నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మా స్నేహం అలానే ఉంది
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో స్వప్నా సినిమాస్ పతాకంపై స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ నెల 12న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను, అశ్వినీదత్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు అవుతోంది. మాతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా సినిమాలు తీస్తున్నది మేం మాత్రమే. ఇది మా గొప్పతనం అనటం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవటం వల్లే మాకు ఉత్సాహం వచ్చింది. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. సినిమాలు వచ్చాయి.. పోయాయి. మా స్నేహం మాత్రం అలానే ఉంది. స్వప్నను పిలిచి ఆహా కోసం వెబ్ సిరీస్ చేయమన్నాను. ఉదయ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ రష్ చూపించింది. నాకు నచ్చింది.. త్వరలోనే ఆహాలో వస్తుంది’’ అన్నారు. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాకు పరిశ్రమలో ఎవరు ఆత్యంత ఆప్తులు అంటే ముగ్గురు పేర్లు చెప్తాను. చిరంజీవిగారు, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు. అరవింద్ గారు పిలిచి వెబ్ సిరీస్ చేయమన్నారని మా అమ్మాయి స్వప్న చెప్పింది. అప్పుడు నేను నీకిది గోల్డెన్ చాన్స్ అని చెప్పాను’’ అన్నారు. స్వప్నాదత్ మాట్లాడుతూ– ‘‘పార్టనర్షిప్ గురించి నాన్నతో మాట్లాడితే ‘నేను, అరవింద్ ముప్ఫై ఏళ్లుగా సినిమాలు చేశాం. హిట్స్ తీశాం, ఫ్లాపులు తీశాం. ఏ రోజూ ఒక్క మాట అనుకోలేదు. అదీ నిజమైన పార్టనర్షిప్ అంటే’ అన్నారు. మా హృదయానికి దగ్గరైన కథ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోనే అందరూ కూర్చుని చూసే సినిమా’’ అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథను నేను ఇండిపెండెంట్‌గా చేద్దామనుకుంటున్న సమయంలో స్వప్నగారు కథ విని ఓకే చేశారు. మాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్‌గారు, అశ్వనీదత్‌గారితో సినిమా చేయటం ఆనందంగా ఉంది. వరల్డ్ సినిమా స్టైల్లో ఉదయ్ ‘మెయిల్’ను తెరకెక్కించారు’’ అన్నారు. -
ఇది ఓ సిల్లీ రోబో!
చిత్రం: ‘బొంభాట్’; తారాగణం: సాయిసుశాంత్ రెడ్డి, చాందినీ చౌదరి, ప్రియదర్శి, శిశిర్ శర్మ, తనికెళ్ళ భరణి; సంగీతం: జోష్ బి.; నిర్మాత: విశ్వాస్ హన్నూర్కర్; దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ ఇందుకూరి; ఓ.టి.టి: అమెజాన్ ప్రైమ్. సైన్స్ ఫిక్షన్ సినిమా, అందులో మనిషికీ, మర మనిషికీ మధ్య ఓ ప్రేమ. ఈ కాన్సెప్ట్ వింటుంటే, ఎక్కడో విన్నట్టు, చూసినట్టు అనిపిస్తోందా? తాజాగా రిలీజైన కొత్త తెలుగు సినిమా ‘బొంభాట్’ అచ్చం ఇలాంటిదే. కాకపోతే, ఇటు ప్రేమకథకూ, అటు సైన్స్ ఫిక్షన్కూ మధ్య ఇరుక్కుపోయి, కథాకథనం ఎటూ కాకుండా పోవడమే విషాదం. కథేమిటంటే..: లైఫ్‌లో ఎప్పుడూ ఏ మంచీ జరగని కుర్రాడు విక్కీ (సాయిసుశాంత్ రెడ్డి). ఏ కొద్ది మంచి జరిగినా, ఆ వెంటనే చెడు జరిగిపోతుంటుంది. ఇలాంటి అన్‌లక్కీ హీరోకు, చైత్ర (చాందినీ చౌదరి) అనే అమ్మాయితో ప్రేమ. హీరోకి చిన్నప్పటి నుంచి అనుకోకుండా కాలేజీ ప్రొఫెసర్ ఆచార్య (శిశిర్ శర్మ)తో అనుబంధం ఏర్పడుతుంది. పెరిగి పెద్దయిన తరువాత కూడా ఆ ప్రొఫెసర్‌తో హీరో బంధం కొనసాగుతుంటుంది. అనుకోని ఓ ప్రమాదంలో ప్రొఫెసర్ చనిపోతాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు విదేశాల్లోని తన కుమార్తెలానే కనిపించే, ప్రవర్తించే ఓ హ్యూమనాయిడ్ రోబోను ప్రొఫెసర్ తయారుచేస్తాడు. ప్రొఫెసర్ కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) కోసం వెతుకుతూ ఉంటాడు మరో వెర్రి సైంటిస్ట్ సాహెబ్ (మకరంద్ దేశ్‌పాండే). ఇంతకీ, ఈ ఇద్దరు సైంటిస్టుల మధ్య గొడవేంటి, మిగతా కథేమిటన్నది చివరి అరగంటలో చూస్తాం. ఎలా చేశారంటే..: గతంలో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కనిపించిన హీరో సాయిసుశాంత్ రెడ్డి, తాజా ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి ఈ స్క్రిప్టులోని పాత్రచిత్రణకు తగ్గట్టు తెరపై కనిపించడానికి బాగానే శ్రమపడ్డారు. సిమ్రాన్ చౌదరి ఓకె. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శిది కాసేపు కామెడీ రిలీఫ్ వేషం. మన కంటికి కనిపించని అదృష్టంగా హీరో సునీల్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలోని ఇద్దరు శాస్త్రవేత్తల పాత్రలకూ సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ అద్భుతంగా గొంతునివ్వడం విశేషం. ఆ పాత్రలు ఎంతో కొంత బాగున్నాయంటే, ఆ వాచికానికే ఎక్కువ మార్కులు పడతాయి. ఎలా తీశారంటే..: రజనీకాంత్ ‘రోబో’ మొదలు అనేక చిత్రాల నుంచి దర్శక, రచయిత తీసుకున్న అంశాలు ఈ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది ప్రేమకథో, సైంటిఫిక్ సినిమానో తెలియనివ్వకుండా మొదటి గంట సేపు సాగదీతతో, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సుదీర్ఘమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ కీలక మలుపు దగ్గర ఇంటర్వెల్ అయ్యాక, సెకండాఫ్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందనుకుంటాం. ఆ పైన కూడా అసలు కథను ఒక పట్టాన ముందుకు సాగనివ్వకుండా పక్కన చెవిటి దాదా (వినీత్ కుమార్) కథ సహా అనేకం పక్కనే నడుస్తుంటాయి. హీరోతో హీరోయిన్ ఎందుకు, ఎలా ప్రేమలో పడిందో అర్థం కాదు. దానికి బలమైన రీజనింగూ కనిపించదు. ప్రొఫెసర్‌తో అంతకాలంగా అనుబంధం ఉన్నా సరే, హీరోకు ఆ ప్రొఫెసర్ అసలు సంగతి ఎందుకు చెప్పడో అర్థం కాదు. సినిమా దాదాపు చివర ముప్పావుగంటకు వచ్చేసినా, వెర్రి సైంటిస్టుకూ, ప్రొఫెసర్‌కూ మధ్య గొడవేమిటో దర్శకుడు చెప్పడు. ప్రియదర్శి లవ్ ట్రాక్ సినిమాకు మరో పానకంలో పుడక. రోబో తాలూకు ప్రేమ, తదితర ఫీలింగ్స్‌కు సరైన ఎస్టాబ్లిష్మెంటూ కనిపించదు. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది – బాణీలు, రీరికార్డింగ్ విషయంలో ప్రత్యేకత చూపిన సంగీత దర్శకుడి ప్రతిభ. నాలుగు పాటలనూ నాలుగు విభిన్న పంథాల్లో అందించడం విశేషం. సినిమా మొదట్లో వచ్చే పాట సంగీత దర్శకుడి శాస్త్రీయ సంగీత నైపుణ్యాన్ని తెలియజేస్తూ, వినడానికి బాగుంది. అలాగే హీరోయిన్ జెలసీతో పాడే ‘చుప్పనాతి..’ పాట మరో డిఫరెంట్ కాన్సెప్టుతో, డిఫరెంట్ సౌండ్‌తో వినిపిస్తుంది. నిర్మాణవిలువలు, అక్కడక్కడా డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ఇలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్లున్నా, అక్కడక్కడే అనేక సీన్లుగా సుదీర్ఘమైన సినిమాగా సా...గుతూ ఉంటే, ప్రేక్షకులు భరించడం కష్టమే. అందులోనూ ప్రేక్షకుడి చేతిలో రిమోట్ చేతిలో ఉండే ఓటీటీ షోలలో మరీ కష్టం. కొసమెరుపు: రెండోసారి రెండు గంటల రోబో వెర్షన్! బలాలు: ► కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ► సంగీత దర్శకుడి ప్రతిభ ► శుఖలేఖ సుధాకర్ డబ్బింగ్ బలహీనతలు: ► కలవని ప్రేమ, సైన్స్ ఫిక్షన్ స్టోరీ ► సాగదీత కథనం, పండని ఎమోషన్లు ► అతకని సీన్లు, లాజిక్కు అందని పాత్రచిత్రణ – రెంటాల జయదేవ -
పునః ప్రారంభ సంబరం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తమ సీరియల్స్, ప్రోగ్రామ్స్ చిత్రీకరిస్తున్నట్లు ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. గత కొంత కాలంగా నిలిచిపోయిన తమ కార్యక్రమాల ప్రసారం సోమవారం నుంచి పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ పునః ప్రారంభ సంబరంలో రేణూదేశాయ్, ప్రియదర్శి తదితర సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. -
కేటీఆర్ అన్నా మీకు థ్యాంక్స్: ప్రియదర్శి
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. అదేవిధంగా ఆయన రచించిన తెలుగాంగ్ల మిశ్రసమాస నిఘంటువును కూడా ఆవిష్కరించినట్లు మంత్రి తన అధికారిక ట్విటర్లో పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో జరిగిన పాట విడుదల కార్యక్రమంలో ప్రియదర్శి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ పాటకు వి.రాధ సంగీతాన్ని సమకూర్చగా సినీ నేపథ్య గాయకులు కృష్ణచైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్‌లు ఆలపించిన ఈ గీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసే అవకాశం లభించింది ఈ రోజు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట మనసుని హత్తుకుంది. అలాగే వారు రచించిన తెలుగాంగ్ల మిశ్రసమాస నిఘంటువును కూడా ఆవిష్కరించడం జరిగింది. భారతీయ భాషలలో ఇటువంటి రచనలలో ఇది మొదటిది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలతో పాటు పాట యూట్యూబ్ లింక్‌ను కూడా షేర్ చేశారు. ఇక తన తండ్రి రచించిన పాటను ఆవిష్కరించిన కేటీఆర్‌కు ప్రియదర్శి ధన్యవాదాలు తెలిపాడు. ‘అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా నాన్నగారి పాటను నిఘంటువును ఆవిష్కరించారు. కవులను విద్యావంతులను ఇలా ఇంతగా గౌరవించే మీ సంస్కారానికీ సభ్యతకూ బహుథా కృతజ్ఞతలము’ అంటూ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా నాన్నగారి పాటను నిఘంటువును ఆవిష్కరించారు. కవులను విద్యావంతులను ఇలా ఇంతగా గౌరవించే మీ సంస్కారానికీ సభ్యతకూ బహుథా కృతజ్ఞతలము🙏 https://t.co/V3zte4JceM — Priyadarshi (@priyadarshi_i) June 12, 2020 -
వినోదాల జాతిరత్నాలు
‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్అశ్విన్ ‘జాతిరత్నాలు’ సినిమాతో నిర్మాతగా మారారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న తర్వాత స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రమిది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రియదర్శి 210, నవీన్ పొలిశెట్టి 420, రాహుల్ రామకృష్ణ 840 నంబర్లతో ఖైదీల దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఫరియా అబ్దుల్లా, మురళీశర్మ, వి.కె.నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ‘శుభలేఖ’ సుధాకర్, ‘వెన్నెల’ కిషోర్, ‘మిర్చి’ కిరణ్, గిరిబాబు, ‘మహానటి’ ఫేమ్ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: హర్ష గారపాటి, సంగీతం: రధన్, కెమెరా: సిద్ధాన్ మనోహార్. -
‘నిను వీడని నీడను నేనే’ సక్సెస్‌మీట్
-
బెడిసి కొట్టిన ప్రమోషన్.. సారీ చెప్పిన హీరో
యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నిను వీడని నీడను నేనే. హారర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సందీప్ నిర్మాతగానూ మారుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు విమర్శలకు కారణమైంది. కమెడియన్ ప్రియదర్శి తన బైక్‌ను ఎవరో కొట్టేశారంటూ నిన్న తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావటంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించింది. దీంతో ప్రియదర్శి ఆ వీడియోను తన ట్విటర్ అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన హీరో సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రేక్షకులను క్షమాపణ కోరిన సందీప్ అది సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో అని చెప్పాడు. సినిమా నటించేందుకు ప్రియదర్శి డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో అతని బైక్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిందన్నాడు సందీప్. ఇటీవల మలయాళ నటి ఆశా శరత్ ఇలా ప్రమోషన్ వీడియోతో చిక్కుల్లో పడ్డారు. తన భర్త కనిపించటం లేదంటూ ఆశా పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావటంతో చిత్రయూనిట్ అది ప్రమోషనల్ వీడియోఅధికారిక ప్రకటన విడువల చేయాల్సి వచ్చింది. Sorry this got more serious than we expected..it's a fun promotional campaign that we are doing for #NinuVeedaniNeedaniNene .. As we dint get @priyadarshi_i dates..we had his bike make a special appearance in our film.. PS: I loved riding it ❤️ Love you Darshi boy 😘😘😘 pic.twitter.com/sx6DbUN4Sh — #NVNN 12th July (@sundeepkishan) 8 July 2019 -
ఎంత బాగా చేసిండ్రు అన్నారు
‘‘ఎంత మంచి పాత్ర చేసినా, ఆ పాత్ర నిడివి ఎంత ఉన్నా ఆ సినిమా ఆడితేనే ఆర్టిస్టుకి గుర్తింపు వస్తుంది. ‘మల్లేశం’ చిత్రం నాకా గుర్తింపును తీసుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నా లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు ఆనంద చక్రపాణి. ఆసు యంత్ర ఆవిష్కర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’లో టైటిల్ పాత్రధారి ప్రియదర్శికి తండ్రిగా నటించారు చక్రపాణి. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేసిన చక్రపాణి తన గురించి పలు విశేషాలు చెప్పారు. ► నటుడిగా ‘దాసి’ నా తొలి చిత్రం. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ‘మల్లేశం’ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసిన ఆర్టిస్టు కమ్ పెయింటర్ లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది నాకు. ► ఈ సినిమా ప్రివ్యూ చూసి మల్లేశంగారు.. ‘అన్నా ఎంత బాగా చేసిండ్రు. మా నాయన గుర్తొచ్చారు, ఆయనతో ఉన్న అనుబంధం గుర్తొచ్చింది’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమాలోని నా నటనను చూసి పలువురు దర్శక–నిర్మాతలు ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని కొనియాడారు. నాలో గుమ్మడిని, యస్వీ రంగారావును చూసుకున్నామని కొందరు ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టారు. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ చిత్రంలో ప్రియదర్శి నిరూపించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపన ఉన్న ఈ చిత్రదర్శకుడు రాజు ‘మల్లేశం’ని అద్భుతంగా తెరకెక్కించారు. ► ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకపోవడం, కాంటాక్ట్ బేస్ సరిగా లేకపోవడానికి తోడు నా ఆర్థిక పరిస్థితులు నన్ను కొంతకాలం ఇండస్ట్రీకి దూరం చేశాయి. అడ్వటైజింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యాను. కాపీరైటర్‌గా, విజువలైజర్‌గా చేశాను. యాడ్‌ఫిల్మ్ చేసేప్పుడు వాటిలో కొన్నింటికి డైరెక్ట్ చేయడం, స్క్రిప్ట్ రాయడం చేశాను. కానీ సినిమాల పట్ల ఉన్న ప్రేమ నాతో పాటే పెరుగుతూనే ఉంది. నాకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా డైరెక్షన్, స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేయడం లాంటివి చేశాను. ► ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాను. రానా ‘విరాటపర్వం’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తాను. -
మల్లేశం చూశాను.. హృదయాన్ని హత్తుకుంది : సమంత
సాక్షి, హైదరాబాద్: ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ నటి సమంత అక్కినేని చూశారు. వాస్తవికతతో హృదయాన్ని హత్తుకునే కథతో మల్లేశం సినిమా తనకు ఎంతగానో నచ్చినట్టు ట్విటర్లో ఆమె తెలిపారు. ‘మల్లేశం సినిమాను చూశాను. అత్యంత వాస్తవికతతో, హృదయాన్ని హత్తుకునే కథతో తెరకెక్కిన సినిమాల్లో మల్లేశం ఒకటి. తెలంగాణ సంస్కృతిని, తల్లి కోసం ఓ కొడుకు పడే తపనను, ప్రేమను ఎంతో హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి, ఝాన్సీల అభినయం అద్భుతంగా ఉంది’ అంటూ సమంత ట్వీట్ చేశారు. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె చేనేతగా మద్దతుగా ‘హ్యాండ్లూమ్’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. చేనేత రంగంలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి.. ఆమె కష్టాన్ని తొలగించేందుకు ఆసుయంత్రాన్ని రూపొందించిన తెలంగాణ చేనేత వృత్తిదారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
‘మల్లేశం’ మూవీ రివ్యూ
-
ఇమేజ్ అన్నది నటులకు శాపం
‘‘నటీనటులను ఎప్పుడూ ఒకే కోణంలో చూడకూడదు. అన్ని పాత్రల్లోనూ చూడాలి. ఫలానా పాత్రలే చేయగలుగుతామనే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకూడదు. నటీనటులకు ఇమేజ్ అనేది శాపం అని నా అభిప్రాయం. అందుకే కథ నచ్చితే ఏ పాత్ర అయినా చేస్తా’’ అన్నారు ప్రియదర్శి. ఆయన లీడ్ రోల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజ్.ఆర్ దర్శకత్వంలో రాజ్.ఆర్, శ్రీ అధికారి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా ప్రియదర్శి చెప్పిన విశేషాలు. ► కమెడియన్, విలన్, హీరో... ఇలా ఏదీ నేను ప్లాన్ చేసుకోలేదు. ఇండస్ట్రీలో ఏదో ఒక పని దొరికితే చాలనుకున్నా. తమ్మారెడ్డి భరద్వాజ, యుగంధర్గారి సంస్థలో యాడ్ ఫిల్మ్స్‌కి అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా చేశా. ఇండస్ట్రీ అంటే ఏంటి? అనేది అక్కడే నేర్చుకున్నా. ఏడాదిన్నర తర్వాత మానేయాల్సి వచ్చింది. ► నటుడు అవుదామని ఫిక్స్ అయ్యాక పోర్ట్‌ఫోలియో పట్టుకుని స్టూడియోలు తిరగడానికి నేను అంత అందగాణ్ణి కాదు.. అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేశా. ‘అనుకోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్‌కి 10 లక్షల వ్యూస్ వచ్చాయి. నాకు అది ‘బాహుబలి’ రేంజ్ అన్నమాట. ఐదేళ్ల పాటు ఎక్కడ ఆడిషన్స్ ఉంటే అక్కడికి వెళ్లా. దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చా. ‘జున్ను’ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో కరీంనగర్‌కి చెందిన వాళ్లు ఓ సినిమా అవకాశం ఇచ్చి, రూ. 5000 డబ్బులు కూడా ఇచ్చారు. కానీ, అది విడుదలవలేదు. మూడు నాలుగు సినిమాల తర్వాత ‘బొమ్మల రామారం’ సినిమాలో విలన్‌గా చేశా. ఆడిషన్స్‌కి వెళ్లి ‘పెళ్లిచూపులు, ఘాజీ’ సినిమాలకు ఎంపికయ్యాను. ‘పెళ్లిచూపులు’ సినిమా నన్ను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ► ‘అ’ సినిమా చేస్తున్నప్పుడు రాజ్. ఆర్‌గారు చింతకింది మల్లేశం బయోపిక్ ‘మల్లేశం’లో లీడ్ రోల్ చేస్తావా? అని అడిగారు. కథ బాగా నచ్చడంతో ఓకే అన్నా. పైగా ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా చేశాక సీరియస్ పాత్రలు చేయగలం అనే నమ్మకం కుదిరింది. ► మల్లేశం 6వ తరగతి వరకే చదువుకున్నారు. మగ్గం నేసే పనిలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తాడు. మల్లేశం భార్య కూడా కష్టంగా ఉందని మగ్గం పని మానేస్తుంది. దీంతో ఆ పని సులువు కావడానికి 1999లో ‘ఆసు’ యంత్రాన్ని కనుగొన్నారు మల్లేశం. అప్పటికే చాలామంది మగ్గం పనులు మానేసి ఉంటారు. ‘ఆసు’ యంత్రం రావడంతో వారందరూ మళ్లీ మగ్గం పనులు మొదలు పెట్టారు. మగ్గం నేసే ప్రతి ఇంట్లో ‘ఆసు’ యంత్రం ఉండాలన్నది మల్లేశం విజన్. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో ‘పద్మశ్రీ’ అవార్డు ఇచ్చింది. ► ‘మల్లేశం’ ప్రివ్యూ చూసిన వాళ్లంతా తెరపై ప్రియదర్శి కాదు.. మల్లేశం కనిపించాడని అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్‌గారు ఎప్పుడూ ముందుంటారు. మా సినిమాని కూడా ఆయన ఎంతో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా చేశాక చేనేతల కష్టం ఏంటో తెలిసింది. అప్పటి నుంచి నేను కొనే బట్టల్లో 30 శాతం చేనేత వస్త్రాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్‌కి కూడా చెబుతున్నా. -
మనసును తాకే ‘మల్లేశం’
-
‘మల్లేశం’ మూవీ రివ్యూ
టైటిల్ : మల్లేశం జానర్ : బయోపిక్ నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు సంగీతం : మార్క్ కె.రాబిన్ దర్శకత్వం : రాజ్ ఆర్ నిర్మాత : రాజ్ ఆర్, శ్రీ అధికారి అన్నివేళలా వెండితెరపై బయోపిక్స్ మెరిసిపోతాయా అంటే చెప్పలేము.. అందుకు చాలా కారణాలుంటాయి. వారి జీవితంలో పడిన సంఘర్షణ, వాటిని తెరపై ఆసక్తిగొల్పేలా, గుండెకు హత్తుకునేలా తెరకెక్కించినప్పుడే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు. చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించు కున్న చింతకింది మల్లేశం.. జీవితచరిత్రను ‘మల్లేశం’ గా రూపొందించారు. ఇప్పటివరకు కామెడీ పాత్రలను, హీరో ఫ్రెండ్ పాత్రలను చేస్తూ వచ్చిన ప్రియదర్శి.. మొదటిసారి మల్లేశం పాత్రలో హీరోగా నటించాడు. మరి ‘మల్లేశం’ ప్రియదర్శికి కలిసివచ్చిందా? అసలు మల్లేశం కథేంటో చూద్దాం. కథ : ఈ సినిమా 1980-1990ల మధ్య కాలం జరుగుతుంది. నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామం. ఆ గ్రామస్తుల్లో మల్లేశం కుటుంబం నేతపని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా ఆ గ్రామంలో చాలా మంది ఇదే వృత్తిలో జీవనం సాగిస్తూ అప్పుల్లో కూరుకుపోతారు. అయితే మల్లేశం చిన్నతనం నుంచి అమ్మ లక్ష్మీ (ఝాన్సీ) ఆసు పనిచేయడంతో చేయి నొప్పిలేస్తుంటుంది. భుజం కూడా పడిపోయేస్థితికి వస్తుంది. ఆ ఊర్లో చాలా మందిది అదే పరిస్థితి. అమ్మ పడే కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని చిన్నప్పటీ నుంచే ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. మల్లేశం పెద్దయ్యాక ఒక్కొక్క ఆలోచనతో ఆసుయంత్రం వైపు అడుగులు వేస్తాడు. ఆ యంత్రాన్ని తయారుచేయడానికి ఊర్లో అప్పులు చేస్తాడు. ఆసు యంత్రం చేస్తున్న మల్లేశంను ఊర్లో అందరూ ఎగతాళి చేస్తారు. పిచ్చొడు అంటూ గెలీచేస్తారు. ఇలాగే మల్లేశంను వదిలేస్తే.. నిజంగానే పిచ్చొడు అయిపోతాడేమో అని తల్లిదండ్రులు భయపడి పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని భావిస్తారు. ముందు పెళ్లి వద్దని వారించినా.. తను ప్రేమిస్తున్న మరదలు పద్మ(అనన్య) పెళ్లి కూతురు అనే సరికి మల్లేశం పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక పెళ్లి అయినాసరే ఆసుయంత్రం తయారు చేయాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తాడు. పద్మ కూడా ఆసుయంత్రం చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే ఓసారి ఆసుయంత్రాన్ని పరీక్షించబోతే మోటార్ పేలిపోతుంది. ఇక ఆ విషయం తెలిసి అప్పులోల్లు అందరూ ఇంటి మీదకు వస్తారు. ఈ విషయంపై మొదటిసారి మల్లేశం అమ్మ కూడా మందలిస్తుంది. అయినా సరే ఆసుయంత్రం చేయాల్సిందేనని, అందుకు డబ్బు కావాలని భార్య పద్మను గాజులు, నగలు ఇవ్వమని అడుగుతాడు. అవి తన పుట్టింటి వారు ఇచ్చినవి, తనకు ఇవొక్కటే మిగిలాయని అంటుంది. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మల్లేశం.. అప్పుల బాధలు తట్టుకోలేక, తల్లి కూడా మందలించడం, భార్య కూడా సాయం చేయకపోవడంతో ఆత్మహత్యయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లేశం అసలు ఆసు యంత్రాన్ని ఎలా తయారుచేశాడు? అనేది మిగతా కథ నటీనటులు : గాలిపటం ఎగరడానికి దారం ఎంత అవసరమో.. కథను నడిపించడానికి నటీనటులు అంత అవసరం. తమ నటనతో ప్రేక్షకులను కూడా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించాలి. అలాంటి నటులే ఈ సినిమాకు దొరికారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి.. పద్మ పాత్రలో అనన్య.. లక్ష్మీ పాత్రలో ఝాన్సీ.. ఎవరికి వారే అన్నట్లు పోటాపోటీగా నటించారు. ఝాన్సీ తన అనుభవంతో మెప్పిస్తే.. ప్రియదర్శి, అనన్య మాత్రం ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇంతవరకు నవ్వించడమే మాత్రమే ప్రియదర్శికి.. తెలుసు అనుకున్న ప్రేక్షకుడి చేత కంటతడిపెట్టిస్తాడు. మల్లేశంకు అవమానాలు ఎదురైతే ప్రేక్షకుడికి కోపం వచ్చేంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ప్రియదర్శి. తన నటనకు వంకపెట్టకుండా మల్లేశం పాత్రకు న్యాయం చేశాడు. ఇక అనన్య అయితే కళ్లతోనే ఎన్నో భావాలను పలకించింది. ఆటపట్టించే భార్యగా, ఆటుపోట్లలో తోడుగా నిలిచే ఇల్లాలిగా అందర్నీ మెప్పిస్తుంది. వెండితెరపై అందగానే కనబడటమే కాకుండా, తన హావాభావాలతోనూ పద్మ పాత్రను గుర్తుండేలా చేసింది. ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిది మేరకు మెప్పించారు. విశ్లేషణ : బయోపిక్ తీయడం అంటేనే కత్తిమీద సాము. ఎన్నో ఆంక్షల మధ్య తీయాల్సి వస్తుంది. పైగా ఆ కథను నడిపించేవాడు సరిగ్గా ఉండాలి. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే మొదటి విజయం ఉంటుంది. అందులోనే మల్లేశం దర్శకుడు రాజ్ ఆర్ ప్రతిభ కనపడుతుంది. మొదటిసారి పూర్తిగా తెలంగాణ నేతన్నల సమాజాన్ని తెరపై ఆవిష్కరించాడు. తెలంగాణ యాస అంటే కేవలం నవ్వించిడమే కాదు.. ఏడిస్తుంది, దానికి కూడా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని చూపించాడు. చిన్నతనం నుంచే అమ్మ కష్టాలను దూరం చేయాలని ఆలోచన నుంచి.. ఆసు యంత్రం కనిపేట్టే వరకు మల్లేశం జీవితంలో జరిగిన అంతర్మథనం, పడిన కష్టాలు అన్నింటిని ఒక సినిమాలో చూపించడం అసాధ్యం. అయినా దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. అప్పుల బాధలు తట్టుకోలేక, ఇంట్లో చీరలు నేయడం మానేసి హైదరాబాద్‌కు వచ్చి జీవనం సాగిస్తాడు మల్లేశం. ఊరి మనుషులు, అక్కడి వాతావరణం తప్ప ఇంకోటి తెలియని మల్లేశం అక్కడ ఎలా జీవనం సాగించాడనే విషయాలు బాగా చూపించాడు. కనీసం పూలు అమ్మడం కూడా రాని మల్లేశంను చూస్తే నవ్వొచ్చినా.. ఆ తరువాత జాలేసేలా చూపించాడు దర్శకుడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మల్లేశంతో పాటే ప్రయాణించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కమర్షియల్ చిత్రాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి. మార్క కె రాబిన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. అప్పటి పల్లెవాతావరణాన్ని తెరపై సినిమాటోగ్రఫర్ అందంగా చూపించాడు. మల్లేశం జీవితాన్ని గుండెకు హత్తుకునేలా చూపించేందుకు ఎడిటర్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ నటీనటులు దర్శకత్వం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్. -
ఈ సినిమా ఎంతో హృద్యంగా ఉంది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశంసించారు. మల్లేశం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా..‘మల్లేశం’ సినిమా రూపొందిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుందని కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. మల్లేశం సినిమా ఎంతో హృద్యంగా, మానవీయంగా ఉందని పేర్కొన్నారు. అంతరించిపోతున్న చేనేత కళకు మల్లేశం చిత్రం జీవం పోసిందని మూవీ యూనిట్‌ను అభినందించారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. నవీన ఆవిష్కరణల రూపకల్పనలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. మల్లేశం వాటిని అధిగమించి ఆసుయంత్రం తయారుచేసి ఎంతో మంది తల్లులకు ఉపశమనం కల్పించారని కేటీఆర్ కొనియాడారు. ఈ సినిమా మాటల రచయిత పెద్దింటి అశోక్ కుమార్ అజ్ఞాతసూర్యుడు అంటూ ప్రశంసించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందన్నారు. ఇక ఈ సినిమా తర్వాత చేనేత వస్త్రాలు ధరించడం మరింత పెరుగుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నా కథను నేను చూసుకోవడం నా అదృష్టం
‘‘ఒకరోజు రాజ్‌గారు ఫోన్ చేసి యూ ట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దానిపై సినిమా తీయాలనుకుంటున్నాను అన్నారు. రెండున్నరేళ్లు కష్టపడి ‘మల్లేశం’ కథను సిద్ధం చేసుకుని, సినిమా తీశారు’’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. ప్రియదర్శి లీడ్ రోల్ చేశారు. రాజ్. ఆర్ దర్శకత్వంలో రాజ్.ఆర్, శ్రీఅధికారి నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జూన్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చింతకింది మల్లేశం మాట్లాడుతూ– ‘‘ప్రపంచానికి మల్లేశం గురించి చెప్పాలనే రాజ్‌గారి సంకల్పం నేరవేరింది. సినిమా చూశాను, ప్రియదర్శిగారు అద్భుతంగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు ఓసారి కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. నా కథను నేను తెరపై చూసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. రాజ్.ఆర్ మాట్లాడుతూ– ‘‘ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు. కమర్షియల్ మూవీ. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, నానీలను హీరోలుగా అనుకున్నాను. కానీ డేట్స్ సమస్య రావడంతో ప్రియదర్శిని తీసుకున్నాం. తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమాను డైరెక్ట్ చేయమని అడిగాను కానీ కుదరలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆరో తరగతి డ్రాప్ అవుట్ అయినా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన మల్లేశంగారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు సహకరించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ ఏలే, మహేష్‌లకు థాంక్స్’’ అన్నారు. ‘పల్లెసృజన’ నిర్వాహకులు గణేశం, శ్రీ అధికారి, గాయకుడు గోరెటి వెంకన్న, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్స్, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లేశం ట్రైలర్‌కు కేటీఆర్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా రూపొందుతున్న మల్లేశం సినిమా ట్రైలర్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తాను మల్లేశం ట్రైలర్ చూశానని తెలిపారు. ‘ఆసుయంత్రాన్ని ఆవిష్కరించిన గ్రామీణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం స్ఫూర్తిదాయకం. అద్భుత ఆవిష్కరణతో చింతకింది మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. మల్లేశం సినిమా బృందానికి శుభాకాంక్షలు’అని కేటీఆర్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. -
అదరగొట్టిన ‘మల్లేశం’
హైదరాబాద్: నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేశారు. రాజ్. ఆర్ దర్శకత్వంలో రాజ్. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం తాజాగా ‘మల్లేశం’ ట్రైలర్‌ను విడుదల చేసింది. చేనేత కార్మికుడైన మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? అవమానాల నుంచి పద్మశ్రీ వరకు ఎలా ఎదిగారు?చేనేత రంగంలో అతడు సాధించిన ఘనత ఏమిటి? అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను నేచి ప్రపంచాన్ని ఎలా అబ్బుర పరిచారు? అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనే విషయాలు ఫోకస్ చేస్తూ సినిమా సాగుతుంది. అచ్చమైన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో చాలా సీరియస్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియదర్శిని నటుడిగా మరో మెట్టు ఎక్కించేలాగే వుంది ట్రైలర్. ఇక ప్రియదర్శితో పాటు అనన్య, యాంకర్ ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. మార్క్ కె. రాబిన్ స్వరాలందించిన ఈ చిత్రానికి బాలు శాండిల్య సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. -
నేత కార్మికుల కోసం..
నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేశారు. రాజ్. ఆర్ దర్శకత్వంలో రాజ్. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ప్రియదర్శితో పాటు, అనన్య, యాంకర్ ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. త్వరలోనే పాటలను. టీజర్‌ను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర దర్శక–నిర్మాతలు తెలిపారు. మార్క్ కె. రాబిన్ స్వరాలందించిన ఈ చిత్రానికి బాలు శాండిల్య సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్ లతో పాటు సత్యదేవ్, నివేదా పేతురాజ్‌లను టీజర్లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
సినిమా సక్సెస్ కాలేదని.. కమెడియన్ సంచలన నిర్ణయం
అర్జున్ రెడ్డి సినిమాలో నటించి విజయ్ దేవరకొండ ‘బెస్ట్ ఫ్రెండ్’గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. తన కామెడీ టైమింగ్‌తో అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందిన ఈ కమెడియన్ ట్విటర్ నుంచి వైదొలిగారు. దీనికి గల కారణం ఆయన ఇటీవల నటించిన సినిమా ‘మిఠాయి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడమే. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ‘మిఠాయి’ చిత్రం ఈ నెల 22(శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాహుల్ తన ట్విటర్ ద్వారా ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలియజేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. అనంతరం ట్విటర్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. ‘మేము సినిమా బాగా రావటానికి చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి మా ప్రయాత్నాలేవి ఫలించలేదు. సినిమాకు ఇలాంటి ఫలితం వస్తుందని ముందే అంచనా వేశాను. సినిమా పరాజయానికి నేనే క్షమాపణలు తెలుపుతున్నా. దర్శకుడు ఆలోచన, ఊహలను ఇప్పటికీ గౌరవిస్తున్నా’’ అని తన చివరి ట్వీట్లో రామకృష్ణ పేర్కొన్నారు. అయితే తన అకౌంట్ తాత్కాలికంగా డి యాక్టివ్ వేట్ చేశారా? లేక శాశ్వతంగా డిలీట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. -
నవ్వించి పంపించే బాధ్యత మాది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకలుగా నటించిన సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు తరుణŠ æభాస్కర్ బిగ్ సిడీని ఆవిష్కరించి ‘హుషార్’ ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి అందించారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమందరం కలిసి సైన్మా (షార్ట్ ఫిల్మ్), ‘పెళ్ళిచూపులు’ చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. అందరూ అనుకున్నట్లు నేను ఇంకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే.. అనుకోకుండా రోల్స్ రావడంతో యాక్ట్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘నా కథపై నమ్మకంతో సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమాను నిర్మించిన ప్రభాత్ కుమార్‌కి థ్యాంక్స్’’ అన్నారు ప్రశాంత్ కుమార్. ‘‘నేను ఓ డాక్టర్ని. నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నరపాటు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు’’ అన్నారు ప్రభాత్. ‘‘ప్రశాంత్‌కు తెలుగు రాదు. కానీ తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చిన తర్వాత అంతా సెట్ అయ్యింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. ఒక్క అవకాశం ఇవ్వండి.. నవ్విస్తాం’’ అన్నారు ప్రియదర్శి. సంగీతదర్శకుడు వివేక్ సాగర్ పాల్గొన్నారు. -
దర్శకుడిగా మారనున్న కమెడియన్..!
ఇటీవల కాలంలో నటులు కేవలం నటులుగానే మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. తమ అభిరుచికి తగ్గట్టుగా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది వ్యాపార రంగంలో సత్తా చాటుతుండగా మారికొందరు ఇండస్ట్రీలోనే నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరబోతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన ప్రియదర్శి.. దర్శకుడిగా మారనున్నాడు. ఈ విషయాన్ని మిఠాయ్ ఆడియో ఫంక్షన్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. అయితే గతంలో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన ప్రియదర్శి ఈ వేదిక మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. -
‘కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది!’
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 22న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియోను శుక్రవారం విడుదల చేశారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి స్వీకరించారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే... అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనేది కూడా అర్థమైంది. మిఠాయి విషయానికి వస్తే... ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ సైన్మా, పెళ్లి చూపులు చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్, నేనూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల నుంచి ప్రశాంత్ కు సినిమాలంటే చాలా ఇష్టం. లక్కీగా నేను ముందు దర్శకుడు అయ్యా. మిఠాయితో ప్రశాంత్ దర్శకుడిగా మారుతున్నాడు. ఇది ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రశాంత్ సెన్సాఫ్ హ్యూమర్ గానీ... తను ఫాలో అయ్యే యాక్టర్స్ గానీ డిఫరెంట్ లెవెల్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రశాంత్.. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు హీరో వివేక్ సాగర్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు’ అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి మాట్లాడుతూ ‘నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. మేం హుషారు షూటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చాలా మంచి మంచి విషయాలు చెప్పేవారు. ప్రేక్షకులు అందరిలా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం’ అన్నారు. సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘నా కథపై నమ్మకంతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్ కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా... షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ... అందరూ ఎంతో హెల్ప్ చేశారు’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రశాంత్ కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక.. అంతా సెట్ అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమ అంటే.. ఎక్కడ ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తి చేశాడు. సెట్స్ లో మేం తెలుగులో మాట్లాడేవాళ్ళం. తనకు సరిగా అర్థమయ్యేది కాదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి... నవ్విస్తాం’ అన్నారు. -
‘మల్లేశం’ ఫస్ట్ లుక్ విడుదల..
పద్మ శ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మల్లేశం. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత మల్లేశం సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా మల్లేశం సినిమా తెరకెక్కుతుంది. రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మిస్తున్నారు. ఇందులో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. చిత్రయూనిట్ సిరిసిల్ల జిల్లాలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. బాబు శాడిలాస్య ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. లక్ష్మణ్ ఆలే ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సౌండ్ డిజైనర్ నితిన్ లుకోస్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ప్రముఖ రచయిత గోరేటి వెంకన్న, చంద్రబోస్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. వెంకట్ సిద్ధిరెడ్డి ఈ చిత్రానికి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. -
‘మల్లేశం’ ఫస్ట్‌లుక్!
బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో చేనేత కార్మికుడిగా ప్రఖ్యాతి గాంచిన మల్లేశం జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ అవార్డు అందుకున్న మల్లేశం పాత్రలో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ రేపు (ఫిబ్రవరి 3న) సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
ఫిబ్రవరి 22న ‘మిఠాయి’
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. ఈ సినిమాకు డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ ‘ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను
‘‘లిప్‌లాక్‌లు ఉండటం వల్ల ‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలు విజయం సాధించలేదు. అలాంటి ట్రిక్స్‌కు ఆడియన్స్ పడరు. కంటెంట్, కథ బలంగా ఉండటం వల్లే ప్రేక్షకులు ఆ సినిమాలను హిట్ చేశారు. కొందరు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో మా చిత్రాన్ని పోలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని అర్జున్ మహి అన్నారు. వి. రుద్ర దర్శకత్వంలో అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘ఇష్టంగా’. ప్రియదర్శి ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అర్జున్ మహి మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడే హీరో కావాలని ఫిక్స్ అయ్యాను. ఇంజినీరింగ్ పూర్తి చేశాక సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా విడుదలకు రెడీ అవ్వడం హ్యాపీగా ఉంది. యాక్టింగ్ కోసం ట్రైనింగ్ తీసుకోలేదు. వందల సినిమాలు చూశాను. టాలీవుడ్లో చాలా మంచి హీరోలు ఉన్నారు. చిరంజీవిగారు నాకు స్ఫూర్తి. ఈ సినిమాలో బాధ్యత లేని, ఆల్రెడీ బ్రేకప్ అయిన కృష్ణ అనే కొరియోగ్రాఫర్ పాత్ర చేశాను. లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ , లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్‌లను ఈ సినిమాలో చర్చించాం. మహావీర్ మంచి సంగీతం అందించారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మా చిత్రం హ్యాపీగా చూడొచ్చు. సినిమాలో చివరి 25 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. -
రొమాంటిక్ లవ్‌స్టోరీ
అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఇష్టంగా’. సంపత్ .వి రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంపత్ వి.రుద్ర మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. కథకి తగ్గట్టే మంచి విజువల్స్ ఉన్నాయి. గోవాలో 10రోజుల పాటు చిత్రీకరించాం. బడ్జెట్ విషయంలో నిర్మాత రాజీ పడకుండా కావాల్సినవి సమకూర్చారు. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కొత్తవారిని ప్రోత్సహిస్తే మంచి సినిమాలు వస్తాయి. మా సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నాం. నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వెంకటేశ్వరరావు. ‘‘ఒక వెబ్సైట్లో పని చేసే కంటెంట్ రైటర్ బాధ్యతలేని కుర్రాడి ప్రేమలో పడుతుంది. అయినా తమ ప్రేమ స్వచ్ఛమైనదని కథానాయిక పాత్ర నిరూపిస్తుంది. ఇందులో వినోదంతో పాటు సందేశం ఆకట్టుకుంటుంది’’ అని అర్జున్ మహి అన్నారు. తనిష్క్, నటుడు దువ్వాసి మోహన్, కెమెరామెన్ ఆనంద్ నడకట్ల, సంగీత దర్శకుడు యేలేంద్ర మహావీర్ పాల్గొన్నారు. -
అలా మొదలైంది
అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’ సినిమాలో టైటిల్ రోల్ పోషించి, ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు కథానాయిక కీర్తీసురేశ్. ప్రస్తుతం సౌత్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న కీర్తీని ‘హీరోయిన్గా తన తొలి అవకాశం గురించి ఇటీవల ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఆ విషయం గురించి కీర్తి మాట్లాడుతూ – ‘‘నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ముందు నా స్టడీస్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఇంటర్ తర్వాత నాకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయ్యా. నాలుగేళ్లు చదవాలి. ఓ ప్రోగ్రామ్ కోసం కోర్స్ థర్డ్ ఇయర్లో లండన్ వెళ్లాను. ఆ టైమ్‌లో దర్శకుడు ప్రియదర్శన్ ఫోన్ చేశారు. త్వరగా వచ్చేయ్ సినిమా షూటింగ్ మొదలుపెడతాం అనగానే ఆశ్చర్యపోయాను. కానీ నాకు స్టడీస్ కంప్లీట్ చేయాలని ఉంది. ఆ టైమ్‌లో ఏం చేయాలో పాలుపోలేదు. ఈలోపు ప్రియదర్శన్ గారు నాకు యాక్టింగ్‌పై ఆసక్తి లేదు అనుకున్నట్లున్నారు. లక్కీగా నా ఫైనల్ ఇయర్లో ఓ ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం కొంత టైమ్ దొరికింది. ఆ టైమ్‌లోనే నా తొలి మూవీ ‘గీతాంజలి’తో పాటు రెండో సినిమా ‘రింగ్ మాస్టర్’ సినిమాల షూటింగ్‌ను మేనేజ్ చేయడంతో పాటుగా కష్టపడి అనుకున్న టైమ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి గ్రాడ్యుయేట్ అయ్యా. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్‌ని అని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు (సురేశ్‌కుమార్) ప్రియదర్శన్గారితో తొలి సినిమాను నిర్మించారు. నా తొలి సినిమా ప్రియదర్శన్‌గారి దర్శకత్వంలో రూపొందడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
బయోపిక్‌లో ప్రియదర్శి
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతున్న యువ నటుడు ప్రియదర్శి. యంగ్ హీరోల సినిమాలతో కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్న ప్రియదర్శి త్వరలో ఓ ఆసక్తికర పాత్రలో కనిపించనున్నాడు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఓ బయోపిక్‌లో ప్రియదర్శి లీడ్ రోల్లో నటించనున్నాడు. పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కార్మికుడు మల్లేశం జీవిత కథ ఆధారంగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందించనున్న సినిమాలో ప్రియదర్శి టైటిల్ రోల్లో నటించనున్నాడు. నేతన్నలకు శ్రమ తగ్గించేలా కొత్త యంత్రాన్ని కనుగొన్న మల్లేశం జీవితాన్ని రియలిస్టిక్‌గా తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మూవీ ఫ్రెండ్స్
హీరో విజయ్ దేవరకొండతో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... నాని, నిఖిల్‌తో సత్య... రానా, రాజ్ తరుణ్‌తో నవీన్... వీరందరిప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. తెరపై నవ్వులు పూయిస్తున్నారు. ప్రతి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రల్లో ఒకప్పుడు సీనియర్ నటులు రాణించగా... ఇప్పుడు నయా ఆర్టిస్టులు దూసుకొచ్చారు. అలాంటి కొందరు మూవీ ఫ్రెండ్స్ గురించి.. శ్రీనగర్‌కాలనీ: ఓ హీరోయిన్.. ఓ హీరో.. ఓ ఫ్రెండ్.. ఈ ట్రాక్ సినిమాల్లో సూపర్ హిట్. మూవీస్‌లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఓ ట్రెండ్ సెట్టర్. అప్పట్లో నటుడు చంద్రమోహన్ ఫ్రెండ్‌గా నటిస్తే చిత్రాలు హిట్ అనే అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్ లిస్టులో అలీ, వేణుమాధవ్, సునీల్, రాజీవ్ కనకాల, ఉత్తేజ్ చేరారు. వీరి తర్వాత శ్రీనివాసరెడ్డి, వేణు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, గిరిధర్, చిత్రం శ్రీను, సప్తగిరి తదితరులు ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు కొన్ని కొత్త ముఖాలు తెరపైకనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో పాపులర్ అయినకొంతమంది ఆర్టిస్టుల పరిచయమిది... ♦ అభినవ్ గోమటం థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే షార్ట్ఫిలిమ్స్ కూడా చేశాడీ హైదరాబాదీ కుర్రాడు. జగన్నాటకం అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీరావా’లో మంచి పాత్ర చేశాడు. తరుణ్‌భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కామెడీ టచ్ ఉన్న పాత్ర ఇవ్వడంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. దర్శకుడు తేజ, ఆది సాయికిరణ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ ప్రియదర్శి ప్రియదర్శి పక్కా హైదరాబాదీ. 20కి పైగా షార్ట్‌ఫిల్మ్స్ చేశాడు. బైపాస్ రోడ్ మూవీతో సినీ జర్నీ ప్రారంభించగా... మూడో చిత్రం ‘పెళ్లిచూపులు’తో బ్రేకొచ్చింది. ‘నా చావు నేను చస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. టైమింగ్‌తో కూడిన పంచ్‌లతో ప్రియదర్శి హీరో ఫ్రెండ్‌గా అదరగొడుతూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్, వెంకటేష్–వరుణ్‌తేజ్, సుధీర్‌బాబు చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ రాహుల్ రామకృష్ణ ‘సైన్మా’ షార్ట్‌ఫిల్మ్‌తో కెరీర్ ప్రారంభించాడు. అర్జున్‌రెడ్డి సినిమాతో అందరికీ సుపరిచితుడయ్యాడు. తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘గీత గోవిందం’లోనూ రాహుల్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం రాజశేఖర్, శ్రీవిష్ణు, సందీప్‌కిషన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ సత్య అక్కల హావభావాలతోనే కామెడీ రక్తికట్టిస్తాడు. తూర్పుగోదావరి అమలాపురానికి చెందిన సత్య అక్కల అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ‘పిల్ల జమిందార్’ చిత్రానికి అసిస్టెంట్ డెరెక్టర్‌గా చేస్తూ నటించాడు. అనంతరం ‘స్వామిరారా’తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రౌడీఫెల్లో, కార్తికేయ, జైలవకుశ, ఎక్కడికిపోతావు చిన్నవాడా, రంగస్థలం తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’, నిఖిల్ ‘ముద్ర’, నాగార్జున–నానిల ‘దేవదాస్’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ నవీన్ నవీన్‌ది రాజమండ్రి. 100 పర్సంట్ లవ్ చిత్రంలో పాపులర్ అయ్యాడు. ‘5డేస్ ఇన్ హైదరాబాద్’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించాడు. అనంతరం పిల్ల జమిందార్, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, నేనే రాజు నేనే మంత్రి, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో ఫ్రెండ్‌గా తనదైన ముద్ర వేశాడు. ఆకతాయిగా ఉంటూ సరదాగా కామెడీ పండిస్తాడు. ఇప్పుడు సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, మారుతి దర్శకత్వంలోని చిత్రాలతో పాటు మరోదాంట్లో లీడ్‌రోల్ చేస్తున్నాడు. ♦ సుదర్శన్‌రెడ్డి ‘మచ్చా’ అంటూ చిత్తూరు యాసతో అరదగొడతాడు సుదర్శన్‌రెడ్డి. బీటెక్ పూర్తయ్యాక యూఎస్ ప్లాన్స్ కోసం సిటీకొచ్చిన మనోడు... ‘నాకు కోపం వచ్చింది’, ‘ఇదిగో ప్రియాంక’ లాంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత రన్ రాజా రన్, పటాస్, కుమార్ 21ఎఫ్, చలో, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు చేశాడు. ప్రస్తుతం శర్వానంద్, రామ్, నాగచైతన్య చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ మహేష్ విట్టా ఎంబీఏ పూర్తి చేసి, ఉద్యోగం చేయమని తల్లిండ్రులు చెబితే... నేను నటుడు, డెరెక్టర్ అవుతానంటూ హైదరాబాద్ వచ్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేష్... రాయలసీమ యాసతో షార్ట్‌ఫిల్మ్స్, ఫన్ బకెట్లో పాపులర్ అయ్యాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి... కృష్ణార్జున యుద్ధం, చలో, విజేత, నా నువ్వే సినిమాల్లో చేశాడు. పేపర్‌బోయ్, పడి పడి లేచె మనసు చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ వెన్నెలకంటి రాకెందుమౌళి రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకెందుమౌళి. పాటలు, మాటల రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్, డ్యాన్సర్‌గా సుపరిచితుడు. షార్ట్‌ఫిల్మ్స్, వెబ్ సీరిస్‌లలో నటించాడు. చాలా చిత్రాలకు డబ్బింగ్ చెప్పడంతో పాటు పాటలు రాశాడు. నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్ పార్టీ చిత్రాల్లో నటించాడు. పల్లెవాసి, మైడియర్ మార్తాండం, బియాండ్‌లైఫ్ చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు. ♦ అభయ్ బేతిగంటి సిద్దిపేటకు చెందిన అభయ్ ‘సోడాబుడ్డి భాస్కర్’, ‘లగ్గం’ షార్ట్‌ఫిల్మ్స్ చేశాడు. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. పక్కింటి కుర్రాడిలా ఉంటూ కామెడీని పండిస్తున్నాడు. ప్రస్తుతం జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న జార్జిరెడ్డి, నాగశౌర్య చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ వైవా రాఘవ వైజాగ్‌కు చెందిన రాఘం వైవా షార్ట్‌ఫిల్మ్స్‌తో సోషల్ మీడియాలో వైవా రాఘవగా పరిచయమయ్యాడు. గలగల మాట్లాడుతూ అల్లరి పిల్లోడిగా కనిపిస్తాడు. రాజా ది గ్రేట్, కిరాక్ పార్టీ సినిమాల్లో నటించాడు. శివాజీరాజా కుమారుడి చిత్రం, నర్తనశాల, ఫన్ అండ్ ఫస్ట్రేషన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. -
లవ్.. యాక్షన్
అర్జున్ మహి హీరోగా, ‘శరణం గచ్ఛామి’ ఫేమ్ తనిష్క్ రాజన్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇష్టంగా’. సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అడ్డూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ వైవిధ్యంగా ఉంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ సినిమాలో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దువ్వాసి మోహన్, ‘తాగుబోతు’ రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేస్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహీరా. -
డైరెక్షన్ చేస్తానంటున్న ప్రియదర్శి
పెళ్లి చూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు ప్రియదర్శి. తెలంగాణ యాసలో నవ్వులు పూయించే ఈ కామెడీ స్టార్ ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఈ యువ నటుడు తన మనసులోని మాట బయటపెట్టాడు. సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలింస్‌లో నటించిన ప్రియదర్శి, కొన్నింటికి దర్శకత్వం వహించి నిర్మించాడు కూడా. తాను నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఎప్పటికైన దర్శకుడిగా సత్తా చాటుతానంటున్నాడు. అయితే ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉండటంతో దర్శకుడిగా మరేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాడు. -
ఆ మంచితనం వందేళ్లు ఉంటుంది
‘‘బిడ్డను పొగడొద్దని శాస్త్రం చెబుతోంది. అయితే నా బిడ్డను నమ్మిన నిర్మాతలను అభినందిస్తున్నా. ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. జయాపజయాలు పక్కన పెడితే మోహన్‌బాబు ఫ్యామిలీ ఎప్పుడూ ఎవర్నీ మోసం చేయదు. ఆ మంచితనం వందేళ్లు ఉంటుంది’’ అన్నారు మోహన్‌బాబు. మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో విజయ్ యేలెకంటి దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ ‘వైఫ్ ఆఫ్ రామ్’. మంచు ఎంటర్టైన్మెంట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సామ్రాట్, శ్రీకాంత్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘నిర్మాతలు బడ్జెట్ లెక్కలు వేసుకోవాలి. ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి. అనవసర ఖర్చు తగ్గించాలి. అప్పుడే మంచి నిర్మాతగా ఎదుగుతాం. నాకు దర్శకుడంటే చాలా గౌరవం. అతను లేకపోతే సినిమా లేదు. ఇందులో నటించిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. లక్ష్మీ మంచు మాట్లాడుతూ– ‘‘మా నాన్నే నాకు పెద్ద గిఫ్ట్. ఏ దశలోనూ ఆర్టిస్ట్ కావాలని అనుకోని నేను ఈ స్టేజ్ మీద నటిగా ఉన్నందుకు కారణం మా నాన్నే. నీ కూతురిగా ఎప్పుడూ గర్వపడతా. క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాం. నిర్మాతలు నన్ను పూర్తిగా నమ్మడంతో నా బాధ్యత మరింత పెరిగింది. నా ఫ్యామిలీయే నా బ్యాక్‌బోన్. మోహన్‌బాబు కూతురిగా కాకుండా నా సొంత ప్రతిభతో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా ప్రతిక్షణం థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ‘‘దర్శకుడికి ఇది ఫస్ట్ సినిమాలా లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మీతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ‘‘మేం ఎప్పుడైనా బాగా వర్క్ చేశాం అనుకున్నప్పుడు లక్ష్మీ షోస్, వెబ్ సిరీస్‌లు గుర్తుకు వస్తే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. మోహన్‌బాబు అంకుల్‌కి మరోసారి థ్యాంక్స్. లక్ష్మీ వెరీ హార్డ్ వర్కర్. తన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు స్వప్నా దత్. ‘‘మంచు ఎంటర్టైన్మెంట్స్తో భాగం అవ్వడం వల్ల షూటింగ్‌కి వెళ్లే అవసరం లేకపోయింది. సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘లక్ష్మీ గారిని రెండు మూడుసార్లే కలిసినా నన్నో ఫ్రెండ్‌లా నమ్మి అన్ని విషయాల్లో హెల్ప్ చేశారు. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సామ్రాట్, శిల్పా రెడ్డి, శ్రీకాంత్, ప్రియదర్శి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మంచు లక్ష్మి...‘వైఫ్ ఆఫ్ రామ్’
మంచు లక్ష్మి ఈ పేరు టాలీవుడ్లో తెలియని వారుండరు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనలోని నటిని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేందుకు కొత్త కథ, కథనాలకు ఆమె ఎన్నుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచు లక్ష్మి లీడ్ రోల్లో చేస్తున్న ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా టీజర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూస్తే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలిసిపోతోంది. చనిపోయిన తన భర్త కేసు మిస్టరీని ఛేదించడం, పోలీసు విచారణలో ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇలా సినిమాను ఒక సస్పెన్స్‌తో నడిపించినట్టు కనిపిస్తోంది. ప్రియదర్శి పోలీస్ పాత్రలో నటించాడు. విజయ్ యేలకంటి దర్శకత్వం వహించగా... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. The season's most anticipated thriller movie to keep you guessing is here! Wishing all the best to my dear friend @LakshmiManchu ! I am excited to reveal the official Teaser for #WifeOfRam.https://t.co/Z54Duh3eiw — Nagarjuna Akkineni (@iamnagarjuna) 27 April 2018 -
ప్రేమలో అర్జున్‌రెడ్డి యాక్టర్..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. తన ప్రేమికురాలు రిచా శర్మను ప్రపంచానికి పరిచయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల లేదా వచ్చేనెలలో ప్రియదర్శి-రిచా శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని, దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. ‘ఆమె గురించి నా భావాలు, భావోద్వేగాలు పదాల్లో రాయాలని ప్రయత్నించి.. విఫలమయ్యాను. ఆమె అందమైన మనస్సును వర్ణించాలంటే ఎన్నో లక్షల కవితలు రాయాల్సి ఉంటుంది.. నన్ను పూర్తిగా అర్థం చేసుకొని.. నా జీవితంలో తను అడుగుపెట్టబోతుందంటూ’ ఓ అందమైన సందేశంతో ప్రియదర్శి తన ప్రేమికురాలు రిచాశర్మకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, నీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా కమేడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి అనతికాలంలో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో కౌషిక్గా నటించిన ప్రియదర్శి చెప్పిన డైలాగ్ ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి సినిమాలోనూ లాయర్‌గా ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. బాబు బాగా బిజీ, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగి, ఎంసీఏ తదితర సినిమాల్లో నటించాడు. -
కామెడీ మిఠాయి
గాయత్రి గుప్తా, శ్వేతా వర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో ప్రశాంత్‌కుమార్ రూపొందిస్తున్న ‘మిఠాయి’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘డిఫరెంట్ కథ. తెలుగులో డార్క్ కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రమిది’’ అన్నారు సందీప్ రెడ్డి. ‘‘డార్క్ కామెడీ మూవీ అనగానే క్యూరీయాసిటీతో వెయిట్ చేస్తున్నాం. ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘మంచి టీమ్ చేస్తున్న సినిమా. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్ కుమార్. ప్రియదర్శి, భూషణ్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎగ్జిక్యూ టివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వొడవల్లి. -
‘సోషల్ మీడియా దుమారమే’
జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గువ్వా గోరింక’ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియాపై ఓ ఆసక్తికరమైన పాటను రూపొందించారు. ‘అరె దగ్గరి వాళ్లను దూరం చేసి ఆటాడిస్తది కాకా, ఇది ఆండ్రాయిడూ మజాకా. ఒడవని ముచ్చట రచ్చగ మార్చి పిచ్చెక్కిస్తది కాకా, నువు అందులోన దిగినాకా.. అంటూ సాగే ఈ పాటలో సోషల్ మీడియా ట్రెండ్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ, ప్రియాలాల్, మధుమిత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సోషల్ మీడియ దుమారమే’
-
'అద్భుతం చూడాలంటే వెయిట్ చేయాల్సిందే'
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనా ఇంత వరకు రాలేదు. షూటింగ్ అప్ డేట్స్ లీక్ చేస్తున్నప్పటికీ.. సినిమా టైటిల్ ఏంటి.. ఫస్ట్ లుక్ ఎప్పుడు.. ఎలా ఉండబోతుంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇటీవల న్యూ ఇయర్ కానుకగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ వస్తుందని భారీ ప్రచారమే జరిగింది. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని భావించారు. అయితే ఇప్పట్లో ఫస్ట్ లుక్ గాని, టైటిల్ గాని ఎనౌన్స్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో మరోసారి సూపర్ స్టార్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ విషయం పై సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియదర్శి స్పందించాడు. పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న ప్రియదర్శి.. మహేష్, మురుగదాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల మహేష్ అభిమానులతో తన అనుభవాలను పంచుకున్న ఈ యువనటుడు ఫస్ట్ లుక్ ఆలస్యం అవ్వటంపై స్పందించాడు. అద్భుతాన్ని చూడాలంటే కాస్త వెయిట్ చేయాలని.. సూపర్ స్టార్ అభిమానుల కోసం దర్శకుడు అద్భుతమైన విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నాడని తెలిపాడు.