త్వరలోనే సీక్వెల్‌ ఉంటుంది | Jathi Ratnalu Movie Success Meet | Sakshi
Sakshi News home page

త్వరలోనే సీక్వెల్‌ ఉంటుంది

Mar 20 2021 12:37 AM | Updated on Mar 20 2021 12:37 AM

Jathi Ratnalu Movie Success Meet - Sakshi

ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్, నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ

‘‘జాతి రత్నాలు’ సినిమా చూడమని నా స్నేహితులు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల చూడలేకపోయాను. నవీన్, ప్రియదర్శి, రాహుల్‌ దగ్గర ఎంతో కళ ఉంది.. ఇప్పుడు వారికి సమయం వచ్చింది’’ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. నవీన్‌  పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో నాగ్‌ అశ్విన్‌  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘థియేటర్లలో నవ్వులు పూయించేందుకు చేసిన మా ప్రయత్నం ఫలించింది’’ అన్నారు అనుదీప్‌. ‘‘చిత్రం భళారే విచిత్రం’ విడుదలైనప్పుడు వచ్చిన క్రేజ్‌ని మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’’ అని సీనియర్‌ నటుడు నరేష్‌ అన్నారు. ‘‘త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుంది’’ అన్నారు నవీన్‌ పొలిశెట్టి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement