ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి | Naveen Polishetty Special Tweet On His Film Jathi Ratnalu After 3 years | Sakshi
Sakshi News home page

Naveen Polishetty: ఇంకో ‘జాతి రత్నం’ చేస్తా: నవీన్‌

Published Mon, Mar 11 2024 4:34 PM | Last Updated on Mon, Mar 11 2024 5:04 PM

Naveen Polishetty Special Tweet On His Film Jathi Ratnalu After 3 years - Sakshi

మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్‌ఫెక్ట్ యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. 

నవీన్ తన ట్వీట్‌లో రాస్తూ..' బ్లాక్‌బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్‌ ‍అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్‌ జత చేశారు.

కాగా.. ఈ చిత్రంలో నవీన్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement