నవ్వుల ఆటంబాంబు, కామెడీ ఖజానా, పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సినిమా జాతిరత్నాలు. ఈ ఫుల్ కామెడీ ప్యాక్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు అనుదీప్ కేవీ. పిట్టగోడ సినిమాతో 2016లో దర్శకరచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడీ డైరెక్టర్. ఐదేళ్లు గ్యాప్ తీసుకుని జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఈయన సినిమాలే కాదూ, ఇంటర్వ్యూలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. తన నోటి వెంట నుంచి వరుసగా పంచులు పేలుతూనే ఉంటాయి.
గతేడాది ప్రిన్స్ మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఇతడు తాజాగా మ్యాడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం(అక్టోబర్ 5) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అనుదీప్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మ్యాడ్ మూవీ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ నటించమని కోరితేనే తాను ఈ చిత్రంలో యాక్ట్ చేసినట్లు తెలిపాడు.
ఇంతలో యాంకర్ సుమ వచ్చి.. జాతిరత్నాలు సినిమాలో నటించారు. ఈ చిత్రంలోనూ యాక్ట్ చేశారు. మున్ముందు మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నాం అంది. దీంతో అనుదీప్.. అదేం లేదండీ.. ఇదే నా చివరి సినిమా.. కేవలం కళ్యాణ్ కోసమే ఈ మూవీలో నటించాను అని చెప్పుకొచ్చాడు. ఇకపై నటనకు దూరం కానున్నట్లు వెల్లడించాడు.
చదవండి: ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష!
Comments
Please login to add a commentAdd a comment