
‘జాతిరత్నాలు’ మూవీతో హీరోయిన్‌గా పరిచమైన హైదరబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తొలి సినిమాతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఫరియా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ ఒకటి. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా హీరో సంతోష్ శోభన్‌తో కలిసి ఓ టాక్‌లో షోలో పాల్గొంది.
చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషమాలను పంచుకుంది. అలాగే జాతిరత్నాలు సినిమా సమయంలో డైరెక్టర్ హీరోయిన్ కొట్టారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కాగా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందని అడగ్గా హీరో నాగార్జున గారి వల్ల వచ్చిందంటూ ఆసక్తికర విషయం చెప్పింది. తన కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌కి నాగార్జున గెస్ట్‌గా వచ్చారని, అప్పుడు ఆయన తనని చూసి మీరు యాక్టరా? అని అడిగాని చెప్పింది. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశానని, ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది.
చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ కేవీ నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అడగ్గా ఫరియా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘అది సరదాగా జరిగింది. సెట్‌లో అనుదీప్ గారు చాలా సరదగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేతితో అలా అన్నారు. అంతే’ అంటూ వివరణ ఇచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment