anudeep kv
-
రెండేళ్ల తర్వాత 'జాతిరత్నాలు' అనుదీప్ కొత్త సినిమా
'జాతిరత్నాలు' సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' అనే మూవీ చేశాడు. ఇది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. దీంతో అనుదీప్ మరో మూవీ చేయలేకపోయాడు. మధ్యలో 'మ్యాడ్', 'కల్కి' మూవీస్‌లో అతిథి పాత్రల్లో కనిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తన కొత్త మూవీని మొదలుపెట్టాడు.(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో అనుదీప్ సినిమా చేయబోతున్నాడు. బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగింది. 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీస్తున్న మూవీకి 'ఫంకీ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలవ్వాలి. కానీ పలువురు నిర్మాతల దగ్గరకు వెళ్లారు కానీ ఎక్కడా సెట్ కాలేదు. చివరగా సితార సంస్థ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు లాంఛనంగా మొదలైంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ ఉండే అవకాశముంది. ప్రస్తుతం విశ్వక్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్‌పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్‌బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
మాస్ హీరో కోసం 'సప్త సాగరాలు' దాటి వచ్చేస్తున్న వైరల్ బ్యూటీ
సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్‌ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది. కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు. (ఇదీ చదవండి: సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి) తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. -
అనుదీప్ తో రవితేజ సినిమాకు లైన్ క్లియర్
-
ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్
నవ్వుల ఆటంబాంబు, కామెడీ ఖజానా, పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సినిమా జాతిరత్నాలు. ఈ ఫుల్ కామెడీ ప్యాక్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు అనుదీప్ కేవీ. పిట్టగోడ సినిమాతో 2016లో దర్శకరచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడీ డైరెక్టర్. ఐదేళ్లు గ్యాప్ తీసుకుని జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఈయన సినిమాలే కాదూ, ఇంటర్వ్యూలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. తన నోటి వెంట నుంచి వరుసగా పంచులు పేలుతూనే ఉంటాయి. గతేడాది ప్రిన్స్ మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఇతడు తాజాగా మ్యాడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం(అక్టోబర్ 5) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అనుదీప్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మ్యాడ్ మూవీ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ నటించమని కోరితేనే తాను ఈ చిత్రంలో యాక్ట్ చేసినట్లు తెలిపాడు. ఇంతలో యాంకర్ సుమ వచ్చి.. జాతిరత్నాలు సినిమాలో నటించారు. ఈ చిత్రంలోనూ యాక్ట్ చేశారు. మున్ముందు మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నాం అంది. దీంతో అనుదీప్.. అదేం లేదండీ.. ఇదే నా చివరి సినిమా.. కేవలం కళ్యాణ్ కోసమే ఈ మూవీలో నటించాను అని చెప్పుకొచ్చాడు. ఇకపై నటనకు దూరం కానున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష! -
ఓటీటీలో ప్రిన్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
హీరోహీరోయిన్లు శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుస్కూర్ రామ్మోహనరావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా కథేంటంటే.. శివకార్తికేయన్ ఓ స్కూలు టీచర్. అదే స్కూల్లోని ఇంగ్లీష్ టీచర్ మరియాను ప్రేమిస్తాడు. ఇతడు ఇండియన్ అబ్బాయి, అక్కడ ఆమె బ్రిటీష్ అమ్మాయి కావడంతో వీరి ప్రేమకు రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో ఇది ప్రేమ పోరాటంలా కాకుండా రెండు దేశాల మధ్య పోట్లాటగా మారుతుంది. మరి ఆనంద్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే అసలు కథ. ‘All Indians are my brothers and sisters’#PrinceOnHotstar from November 25, Only on @DisneyPlusHSTel. Here's the trailer ▶️ https://t.co/uGjmaidbTq@Siva_Kartikeyan @anudeepfilm @maria_ryab @SureshProdns @SVCLLP @ShanthiTalkies @manojdft @Cinemainmygenes #Sathyaraj pic.twitter.com/VuFtGeWLLz — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 15, 2022 చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఇటీవల ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్
జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మూవీ హిట్‌తో ఆయన రాత్రికి రాత్రే పాపులర్ అయ్యాడు. తాజాగా ప్రిన్స్ సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక అనుదీప్ ఏ ఇంటర్య్వూ ఇచ్చి అది సోషల్ మీడియా వైరల్ కావాల్సిందే. అందులో ఆయన వేసే సరదా పంచ్‌లకు, కామెడీకి ప్రేక్షకులు కడుబ్బా నవ్వాల్సిందే. అలా తనకంటూ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న అనుదీప్ ఓ ఇంటర్య్వూలో షాకింగ్ విషయం బయట పెట్టాడు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన.. తాను అరుదైన వ్యాధి బాధపడుతున్నట్లు చెప్పాడు. చదవండి: ‘కాంతార’కి ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ హీరో: అసలు విషయం చెప్పిన రిషబ్ శెట్టి తను హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్ఎస్పీ) అనే డిజార్డర్ ఉందని తెలిపాడు. ఈ మేరకు అనుదీప్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్ లక్షణాలు కామన్‌గా ఉంటాయి. కానీ అర్ధం చేసుకోలేరు. నా శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల నాలో ఈ వ్యాధిని గుర్తించాను. నాకు గ్లూటెన్ పడదు. కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదు. ఏదైనా పళ్ల రసం తాగితే మెదడు పనితీరు ఆగిపోతుంది. మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. ఏం చేస్తున్నానో అర్థం కాదు. అయితే ఈ డిజార్డర్ ఉన్న వారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? కానీ ఈ వ్యాధి ఉన్నవారు చాలా తొందరగా అలసిపోతారని తెలిపాడు. అనంతరం ‘తాను ఎక్కువ కాంతివంతమైన లైట్స్, ఘాటైన వాసనలు చూసినా వాటి తీవ్రతను తట్టుకోలేను. చాలా ఇబ్బంది పడతా. దీని గురించి శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. ఈ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఉన్నావారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి పరిశోధించి అవే పాటిస్తున్నాను’ అన్నాడు. ఇక తనకు ఉన్న ఈ వ్యాధిపై భవిష్యత్తులో సినిమా తీస్తానని, దాని వల్ల కొందరై హీల్ అవతారని ఆశిస్తున్నానంటూ అనుదీప్ పేర్కొన్నాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ప్రిన్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
‘జాతిరత్నాలు’ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రిన్స్. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. జాతి రత్నాలు మాదిరే ఈ చిత్రంలో కూడా కామెడీ బాగా వర్కౌట్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నవంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వినిస్తున్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకొని ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ‘ప్రిన్స్’ కథేంటంటే.. ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్(శివకార్తికేయన్). ఇతడో స్కూలు టీచర్. హీరో తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్లోనే మరో టీచర్(బ్రిటీష్ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్‌లో పడతాడు. ఇంగ్లండ్‌కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్‌స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్‌లా మారుతుంది. మరి ఆనంద్ ప్రేమ సక్సెస్ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! -
‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా
‘జాతిరత్నాలు’ మూవీతో హీరోయిన్గా పరిచమైన హైదరబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తొలి సినిమాతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఫరియా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ ఒకటి. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా హీరో సంతోష్ శోభన్‌తో కలిసి ఓ టాక్‌లో షోలో పాల్గొంది. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషమాలను పంచుకుంది. అలాగే జాతిరత్నాలు సినిమా సమయంలో డైరెక్టర్ హీరోయిన్ కొట్టారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కాగా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందని అడగ్గా హీరో నాగార్జున గారి వల్ల వచ్చిందంటూ ఆసక్తికర విషయం చెప్పింది. తన కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌కి నాగార్జున గెస్ట్‌గా వచ్చారని, అప్పుడు ఆయన తనని చూసి మీరు యాక్టరా? అని అడిగాని చెప్పింది. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశానని, ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ కేవీ నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అడగ్గా ఫరియా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘అది సరదాగా జరిగింది. సెట్లో అనుదీప్ గారు చాలా సరదగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేతితో అలా అన్నారు. అంతే’ అంటూ వివరణ ఇచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది. -
మేం ఊహించిన దానికంటే ఎక్కువే రెస్పాన్స్ వస్తుంది : అనుదీప్
‘‘ప్రిన్స్’ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ్లో కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. అన్నివర్గాల ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని దర్శకుడు అనుదీప్ కేవీ అన్నారు. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ‘ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా అనుదీప్ కేవీ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచనే ‘ప్రిన్స్’ కథకు స్ఫూర్తి. ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేయమని సురేష్ బాబు, సునీల్, రామ్మోహన్గార్లు స్వేచ్ఛ ఇచ్చారు. నేను కామెడీ సినిమాలు చేసేందుకు చార్లీ చాప్లీన్, జంధ్యాల, రాజ్ కుమార్ సంతోషి వంటి వారు స్ఫూర్తి. బాలచందర్‌గారి సినిమాలు అంటే ఇష్టం.. ఆయన తరహాలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేయాలని ఉంది. హారిక హాసినీ, మైత్రీ మూవీ మేకర్స్‌లో నా తర్వాతి సినిమాలు ఉంటాయి. హీరో రామ్‌గారికి ఓ కథ చెప్పాలి’’అన్నారు. -
ఆ ఐడియా నన్ను ఎక్సయిట్ చేసింది..అందుకే ‘ప్రిన్స్’ చేశా: హీరో
శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక గా నిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న 'ప్రిన్స్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో శివకార్తికేయన్ మీడియాతో ముచ్చుటించారు. ఆ విశేషాలు.. తెలుగులో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారా ? ప్రిన్స్ ఎలా మొదలైయింది ? ఒక ఆర్టిస్ట్ గా అన్ని చోట్ల సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని, ప్రశంసలు అందుకోవాలని ఉంటుంది. ప్రిన్స్ విషయానికి వస్తే.. ఫన్ సినిమాలు తగ్గిపోతున్నాయి. నా వరకూ కామెడీ సినిమాలు చేయడం చూడటం చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్ ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా నచ్చింది. తర్వాత అది 'ప్రిన్స్' గా మారింది. ప్రిన్స్ యూనివర్షల్ సబ్జెక్ట్. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటాయి. అనుదీప్ కథ చెప్పినపుడు ఏ పాయింట్ మిమ్మల్ని ఎక్సయిట్ చేసింది ? అనుదీప్ జాతిరత్నాలు చూశాను. అనుదీప్ రాసుకునే పాత్రల్లో స్వచ్చమైన అమాయకత్వం ఉంటుంది. పాత్రలు ఊహించని విధంగా రియాక్ట్ అవుతాయి. ప్రిన్స్ స్టొరీ ఐడియా చాలా ఎక్సయిట్ చేసింది. ఒక ఇండియన్ బ్రటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎక్సయిట్ చేసింది. ఇందులో సత్యరాజ్ గారి పాత్ర కూడా నన్ను ఎక్సయిట్ చేసింది. సత్యరాజ్ పాత్ర తన కొడుకుతో 'మన కులం, మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు' అని చెబుతుంది. చాలా యూనిక్ క్యారెక్టర్ ఇది. డబ్బింగ్ మీరే చెప్పారా ? లేదండీ. తెలుగు భాషపై పూర్తిగా పట్టురానిదే డబ్బింగ్ చెప్పకూడదని నా అభిప్రాయం. డైలాగ్ మాడ్యులేషన్ చాలా ముఖ్యం. అది భాషపై పట్టుసాధిస్తేనే వస్తుంది. అనుదీప్ తో కొంచెం తెలుగు మాట్లాడుతుంటాను. అయితే సొంతగా డబ్బింగ్ చెప్పే అంతా తెలుగు ఇంకా రాలేదు. వరుణ్ డాక్టర్ లో మీ బాడీ లాంగ్వేజ్ చాలా సెటిల్ద్ గా ఉంటుంది. ప్రిన్స్ లో ఎలాంటి బాడీ లాంజ్వేజ్ ఉంటుంది? వరుణ్ డాక్టర్ డార్క్ కామెడీ. నిజ జీవితానికి పోలిక లేని సినిమా. నా పాత్రలో చిన్న స్మైల్, ఎమోషన్ కూడా ఉండదు. కానీ దాని నుంచే హ్యుమర్ పుడుతుంది. రియల్ లైఫ్ లో అలా నవ్వకుండా ఒక్క అరగంట కూడా ఉండలేను(నవ్వుతూ). ప్రిన్స్ క్యారెక్టర్ తో రిలేట్ చేసుకోగలను. అనుదీప్ తనదైన బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ప్రతి సీన్ ని అనుదీప్ తెలుగులో నటించి చూపించిన తర్వాతే యాక్ట్ చేసేవాడిని. తొలి సారి తెలుగు సినిమా చేయడం ఎలా అనిపించింది ? ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్ గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్ లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన ఉంది. విజయ్, వంశీ పైడిపల్లి గారితో సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ - శంకర్ గారు కలసి పని చేస్తున్నారు. రెండు పరిశ్రమలో కలసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సౌత్ పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉంది. మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది ? ఒక కథ ఎంపిక చేసినప్పుడు గత చిత్రం గురించి అలోచించను. గత చిత్రంలో కామెడీ వర్క్ అవుట్ అయ్యిందని మళ్ళీ అవే ఎలిమెంట్స్ ఉండే కథ ఎంపిక చేయాలని అనుకోను. కథలో సెల్లింగ్ పాయింట్ చూస్తాను. ప్రేక్షకులు ఈ కథని ఎందుకు చూడాలి, ఇందులో కొత్తదనం ఏమిటి, విమర్శకులు దిన్ని ఎలా చూస్తారు ? ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటాను పదేళ్ళ జర్నీ అలా జరిగింది ? టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సోలో హీరోగా ఎదిగాను. ప్రతి అనుభవం నా కెరీర్ కి ఉపయోగపడింది. ఈ పదేళ్ళలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. మీ జర్నీని తెలుగులో నాని గారితో పోల్చుతారు కదా ? అవును. నాని గారు కూడా యాంకర్ గా సహాయ దర్శకుడిగా పని చేశారు. నేను కూడా పని చేశాను. ప్రేక్షకులు కూడా మేము సిమిలర్ గా కనిపిస్తామని చెబుతుంటారు. నాని గారిది కూడా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ప్రిన్స్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ? ప్రిన్స్ కథలో బ్రిటిష్ కనెక్షన్ ఉంది. ఒక కింగ్ డమ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. అలా ఈ చిత్రానికి 'ప్రిన్స్' అని పేరు పెట్టాం. ప్రిన్స్ నిర్మాతలు గురించి ? సురేష్ ప్రొడక్షన్ లెజెండ్రీ ప్రొడక్షన్ హౌస్. తమిళ్ లో కూడా గొప్ప గొప్ప సినిమాలు చేసిన చరిత్ర వారిది. సురేష్ ప్రొడక్షన్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కారణం సునీల్ గారు. బీగినింగ్ నుంచి చాలా ప్రోత్సహించారు. శాంతి టాకీస్ అరుణ్ చాలా సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ ని చేశాను. తెలుగులో ఏ దర్శకులతో కలసి పని చేయాలని అనుకుంటున్నారు ? రాజమౌళి గారు. ఆయనతో కలసి పని చేయాలని అందరికీ ఉంటుంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కొత్తగా చేయబోతున్న చిత్రాలు ? మడోన్నే అశ్విన్ 'మహావీరుడు' చేస్తున్నా.