Tamil Actor Sivakarthikeyan Interesting Comments About Prince Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: ఆ ఐడియా నన్ను ఎక్సయిట్ చేసింది..అందుకే ‘ప్రిన్స్‌’ చేశా

Published Wed, Oct 19 2022 3:54 PM | Last Updated on Wed, Oct 19 2022 5:26 PM

Sivakarthikeyan Talk About Prince Movie - Sakshi

శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక గా నిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న 'ప్రిన్స్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో శివకార్తికేయన్ మీడియాతో ముచ్చుటించారు. ఆ విశేషాలు..

తెలుగులో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారా ? ప్రిన్స్ ఎలా మొదలైయింది ? 
ఒక ఆర్టిస్ట్ గా అన్ని చోట్ల సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని, ప్రశంసలు అందుకోవాలని  ఉంటుంది.  ప్రిన్స్ విషయానికి వస్తే.. ఫన్ సినిమాలు తగ్గిపోతున్నాయి. నా వరకూ కామెడీ సినిమాలు చేయడం చూడటం చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్ ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా నచ్చింది. తర్వాత అది 'ప్రిన్స్' గా మారింది. ప్రిన్స్ యూనివర్షల్ సబ్జెక్ట్‌. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్ గా  ఉంటాయి. 

అనుదీప్ కథ చెప్పినపుడు ఏ పాయింట్ మిమ్మల్ని ఎక్సయిట్ చేసింది ?
అనుదీప్ జాతిరత్నాలు చూశాను. అనుదీప్ రాసుకునే పాత్రల్లో స్వచ్చమైన అమాయకత్వం ఉంటుంది. పాత్రలు ఊహించని విధంగా రియాక్ట్‌ అవుతాయి. ప్రిన్స్ స్టొరీ ఐడియా చాలా ఎక్సయిట్ చేసింది. ఒక ఇండియన్ బ్రటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎక్సయిట్ చేసింది. ఇందులో సత్యరాజ్ గారి పాత్ర కూడా నన్ను ఎక్సయిట్ చేసింది. సత్యరాజ్ పాత్ర తన కొడుకుతో 'మన కులం, మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు' అని చెబుతుంది. చాలా యూనిక్  క్యారెక్టర్ ఇది.

డబ్బింగ్ మీరే చెప్పారా ? 
లేదండీ. తెలుగు భాషపై పూర్తిగా పట్టురానిదే డబ్బింగ్ చెప్పకూడదని నా అభిప్రాయం. డైలాగ్ మాడ్యులేషన్ చాలా ముఖ్యం. అది భాషపై పట్టుసాధిస్తేనే వస్తుంది. అనుదీప్ తో కొంచెం తెలుగు మాట్లాడుతుంటాను. అయితే సొంతగా డబ్బింగ్ చెప్పే అంతా తెలుగు ఇంకా రాలేదు. 

వరుణ్ డాక్టర్ లో మీ బాడీ లాంగ్వేజ్ చాలా సెటిల్ద్ గా ఉంటుంది. ప్రిన్స్ లో ఎలాంటి బాడీ లాంజ్వేజ్ ఉంటుంది? 
వరుణ్ డాక్టర్ డార్క్ కామెడీ.  నిజ జీవితానికి పోలిక లేని సినిమా. నా పాత్రలో చిన్న స్మైల్, ఎమోషన్ కూడా ఉండదు. కానీ దాని నుంచే హ్యుమర్ పుడుతుంది. రియల్ లైఫ్ లో అలా నవ్వకుండా ఒక్క అరగంట కూడా ఉండలేను(నవ్వుతూ). ప్రిన్స్ క్యారెక్టర్ తో రిలేట్ చేసుకోగలను. అనుదీప్ తనదైన బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ప్రతి సీన్ ని అనుదీప్ తెలుగులో నటించి చూపించిన తర్వాతే  యాక్ట్ చేసేవాడిని.  

తొలి సారి తెలుగు సినిమా చేయడం ఎలా అనిపించింది ? 
ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్ గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్ లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన ఉంది. విజయ్,  వంశీ పైడిపల్లి గారితో సినిమా చేస్తున్నారు. అలాగే  రామ్ చరణ్ - శంకర్ గారు కలసి పని చేస్తున్నారు. రెండు పరిశ్రమలో కలసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సౌత్ పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉంది. 

మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది ? 
ఒక కథ ఎంపిక చేసినప్పుడు గత చిత్రం గురించి అలోచించను. గత చిత్రంలో కామెడీ వర్క్ అవుట్ అయ్యిందని మళ్ళీ అవే ఎలిమెంట్స్ ఉండే కథ ఎంపిక చేయాలని అనుకోను. కథలో సెల్లింగ్ పాయింట్ చూస్తాను. ప్రేక్షకులు ఈ కథని ఎందుకు చూడాలి, ఇందులో కొత్తదనం ఏమిటి, విమర్శకులు దిన్ని ఎలా చూస్తారు ? ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటాను 

పదేళ్ళ జర్నీ అలా జరిగింది ? 
టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సోలో హీరోగా ఎదిగాను. ప్రతి అనుభవం నా కెరీర్ కి ఉపయోగపడింది. ఈ పదేళ్ళలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. 

మీ జర్నీని తెలుగులో నాని గారితో పోల్చుతారు కదా ? 
అవును. నాని గారు కూడా యాంకర్ గా సహాయ దర్శకుడిగా పని చేశారు. నేను కూడా పని చేశాను.  ప్రేక్షకులు కూడా మేము సిమిలర్ గా కనిపిస్తామని చెబుతుంటారు. నాని గారిది కూడా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. 

ప్రిన్స్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ? 
ప్రిన్స్ కథలో బ్రిటిష్ కనెక్షన్ ఉంది. ఒక కింగ్ డమ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. అలా ఈ చిత్రానికి 'ప్రిన్స్' అని పేరు పెట్టాం. 

ప్రిన్స్ నిర్మాతలు గురించి ? 
సురేష్ ప్రొడక్షన్ లెజెండ్రీ ప్రొడక్షన్ హౌస్.  తమిళ్ లో కూడా గొప్ప గొప్ప సినిమాలు చేసిన చరిత్ర వారిది. సురేష్ ప్రొడక్షన్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కారణం సునీల్ గారు. బీగినింగ్ నుంచి చాలా ప్రోత్సహించారు. శాంతి టాకీస్ అరుణ్  చాలా సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ ని చేశాను. 

తెలుగులో ఏ దర్శకులతో కలసి పని చేయాలని అనుకుంటున్నారు ? 
రాజమౌళి గారు. ఆయనతో కలసి పని చేయాలని అందరికీ ఉంటుంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్ గారి సినిమాలంటే  నాకు చాలా ఇష్టం. 

కొత్తగా చేయబోతున్న చిత్రాలు ? 
మడోన్నే అశ్విన్ 'మహావీరుడు' చేస్తున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement