సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్‌లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్‌ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది.
కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు.
(ఇదీ చదవండి: సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి)
తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక‍్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్‌లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment