చార్లి గుర్తుందా.. ఇన్నేళ్ల తర్వాత అంటూ వీడియో షేర్‌ చేసిన రక్షిత్‌ | 777 Charlie Star Dog Becomes Mother Gave Birth To Six Babies In Mysuru, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Charlie Dog Viral Video: చార్లి గుర్తుందా.. ఇన్నేళ్ల తర్వాత అంటూ వీడియో షేర్‌ చేసిన రక్షిత్‌

Published Thu, May 16 2024 12:35 PM | Last Updated on Thu, May 16 2024 12:58 PM

Charlie Dog Birth Six Babies

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ '777 ఛార్లి'. చిన్న చిత్రంగా 2022లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా డాగ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు  దక్కించుకుంది. ఈ చిత్రానికి రక్షిత్‌ శెట్టితో పాటు మరో ప్రధాన హీరో ఛార్లీనే.. ఛార్లీ పాత్రలో తెరపై కనిపించేది ఒక శునకమే అయినా..  సినిమా చూస్తున్నంతసేపు చాలామంది దానికి ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యారు. అందుకోసం చార్లికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కొన్ని సీన్ల కోసం పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర రచయిత, దర్శకుడు కిరణ్ రాజ్‌ గతంలో తెలిపారు. కానీ ఆ డాగ్‌ మాత్రం చిత్ర యూనిట్‌ మొత్తాన్ని మెప్పించిందని ఆయన తెలిపారు.

తాజాగా డాగ్‌ చార్లిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు రక్షిత్‌ శెట్టి. లేటు వయసులో 6 అందమైన పిల్లలకు చార్లి జన్మనిచ్చిందని ఆయన తెలిపారు. వాటిని చూసేందుకే తాను మైసూర్‌ వచ్చానని ఒక వీడియో ద్వారా రక్షిత్‌ చెప్పారు. చార్లి మొదటిసారి తల్లి అయినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి చార్లి వయసు కూడా చాలా ఎక్కువ. తను ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తుందని తామందరం ఎంతగానో ఎదరుచూశామని రక్షిత్‌ తెలిపారు. 

ఫైనల్లీ ఇన్నేళ్లకు తామందరిలో చార్లి సంతోషాన్ని నింపిందని ఆయన అన్నారు. చార్లికి ఇక సంతానం కలగదేమోనని అనుకున్నట్లు ఆయన అన్నారు. అయితే, లేటు వయసులో చార్లికి సంతానం కలగడం చాలా సంతోషాన్ని కలిగించిందని రక్షిత్‌ తెలిపారు. ట్రైనర్‌ ప్రమోద్ ఇంట్లో మే 09న 6  పిల్లలకు చార్లి జన్మనిచ్చింది. అందులో 5 ఫిమేల్‌,1 మేల్‌ పప్పీలు ఉన్నాయి. రక్షిత్‌ శెట్టి షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement