777 Charlie Movie OTT Release Date Out, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

777 Charlie In OTT: ఆ ఓటీటీలోకి ‘‘777 ఛార్లి’ .. వాళ్లు మాత్రమే చూడొచ్చు!

Published Sat, Sep 24 2022 3:44 PM | Last Updated on Sat, Sep 24 2022 4:06 PM

777 Charlie Movie OTT Release Date Out - Sakshi

కన్నడ యాక్టర్‌ రక్షిత్‌ శెట్టి  హీరోగా నటించిన  లెటెస్ట్‌ చిత్రం ‘ఛార్లి 777’. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది జూన్‌ 10న విడుదలైన ఈ చిత్రం.. భారీ విజయాన్ని అందుకుంది. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్‌. ఈ సినిమాను తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్‌ చేశారు.

టాలీవుడ్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. సెప్టెంబర్‌ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ఫ్రైమ్‌లో ‘777 ఛార్లి’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. అయితే ఈ చిత్రం అమెజాన్‌ ఫ్రైమ్‌ చందాదారులందరూ చూడడానికి వీలులేదు. కేవలం రెంట్‌కు మాత్రమే ఈ చిత్రాన్ని ఫ్రైమ్‌ వీడియోలో చూడొచ్చు. ఫ్రైమ్‌ వీడియోలో కంటే ముందు మరో ఓటీటీలో కూడా ఈ చిత్రం విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్‌లో  జులై 29 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ అమెజాన్‌ ఫ్రైమ్‌లో విడుదల చేశారు. 

‘777 ఛార్లి’ కథ ఏంటంటే..
ధర్మ(రక్షిత్‌ శెట్టి) కుటుంబ సభ్యులంతా చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో మరణిస్తారు.  ఒంటరిగా బతుకున్న ధర్మ జీవితంలోకి ఛార్లి అనే శునకం  ఎంట్రీ ఇస్తుంది. అనుకొని పరిస్థితుల వల్ల  ఓసారి ధర్మ ఇంటినుంచి బయటకు వస్తుంది ఛార్లి.  ఆ తర్వాత ఛార్లీకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? ధర్మను ఎలా ఎసుకుంది? వారి మధ్య అనుబంధం ఎలా సాగింది? అనేదే మిగతా కథ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement