Rakshit Shetty 777 Charlie Movie Released In OTT, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

777 Charlie OTT Release: ఓటీటీకి వచ్చేసిన ‘777 చార్లీ’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Published Fri, Jul 29 2022 4:40 PM | Last Updated on Fri, Jul 29 2022 9:26 PM

OTT: Rakshit Shetty 777 Charlie Movie Streaming On Voot Now - Sakshi

కన్నడ హీరో, నిర్మాత రక్షిత్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 777 చార్లీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. జూన్‌ 10న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. కిరణ్‌రాజ్ కే దర్శకత్వం వహించిన ఈ డిఫరెండ్ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. ఇందులో తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రక్షిత్‌.

చదవండి: విజయ్‌, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్‌ ఇచ్చిన అనన్య పాండే

ఈ మూవీతో రక్షిత్‌ నేషనల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్‌(Voot) ఈ మూవీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకుంది. నేటి(జూలై 29) అర్ధరాత్రి నుంచి ఈ మూవీ వూట్‌లో అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా చూడాలంటే ముందుగా వూట్‌ సెలక్ట్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ధీని ధర నెలకు రూ. 99 నుంచి అందుబాటులో ఉంది.

చదవండి: మూవీ ఎంట్రీపై మెగా డాటర్‌ నిహారిక భర్త చైతన్య క్లారిటీ!

కాగా వూట్‌ సెలక్ట్‌ అనేది వయాకామ్‌ యెక్క వీడియో ఆన్‌ డిమాండ్‌ ప్లాట్‌ఫాం. దీనిని ఐఓఎస్‌(ios), ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో లౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఈ మధ్యే రక్షిత్‌ ట్వీట్‌ చేస్తూ..  ‘ఇది కేవలం సినిమాగానే కాకుండా సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చినా సరే పట్టించుకోకుండా థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు ఓటీటీలో విడుదలై అక్కడ కూడా అందరికీ మంచి అనుభూతిని పంచుతుంది అని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement