777 Charlie Movie
-
చార్లి గుర్తుందా.. ఇన్నేళ్ల తర్వాత అంటూ వీడియో షేర్ చేసిన రక్షిత్
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ '777 ఛార్లి'. చిన్న చిత్రంగా 2022లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా డాగ్ లవర్స్‌ను ఆకట్టుకుంది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఈ చిత్రానికి రక్షిత్ శెట్టితో పాటు మరో ప్రధాన హీరో ఛార్లీనే.. ఛార్లీ పాత్రలో తెరపై కనిపించేది ఒక శునకమే అయినా.. సినిమా చూస్తున్నంతసేపు చాలామంది దానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అందుకోసం చార్లికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కొన్ని సీన్ల కోసం పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర రచయిత, దర్శకుడు కిరణ్ రాజ్ గతంలో తెలిపారు. కానీ ఆ డాగ్ మాత్రం చిత్ర యూనిట్ మొత్తాన్ని మెప్పించిందని ఆయన తెలిపారు.తాజాగా డాగ్ చార్లిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు రక్షిత్ శెట్టి. లేటు వయసులో 6 అందమైన పిల్లలకు చార్లి జన్మనిచ్చిందని ఆయన తెలిపారు. వాటిని చూసేందుకే తాను మైసూర్ వచ్చానని ఒక వీడియో ద్వారా రక్షిత్ చెప్పారు. చార్లి మొదటిసారి తల్లి అయినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి చార్లి వయసు కూడా చాలా ఎక్కువ. తను ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తుందని తామందరం ఎంతగానో ఎదరుచూశామని రక్షిత్ తెలిపారు. ఫైనల్లీ ఇన్నేళ్లకు తామందరిలో చార్లి సంతోషాన్ని నింపిందని ఆయన అన్నారు. చార్లికి ఇక సంతానం కలగదేమోనని అనుకున్నట్లు ఆయన అన్నారు. అయితే, లేటు వయసులో చార్లికి సంతానం కలగడం చాలా సంతోషాన్ని కలిగించిందని రక్షిత్ తెలిపారు. ట్రైనర్ ప్రమోద్ ఇంట్లో మే 09న 6 పిల్లలకు చార్లి జన్మనిచ్చింది. అందులో 5 ఫిమేల్,1 మేల్ పప్పీలు ఉన్నాయి. రక్షిత్ శెట్టి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rakshit Shetty (@rakshitshetty) -
బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!
బిగ్‌బాస్ షో.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ షో ఒక ఎమోషన్. ఎన్ని పనులున్నా సరే బిగ్‌బాస్ స్టార్ట్ అవుతుందనగానే టీవీలకు అతుక్కుపోతారు. ఈ షోకి అంతలా కనెక్ట్ అయిపోయారు. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది. మలయాళంలో ఇటీవలే ఐదో సీజన్ పూర్తయింది. తమిళంలోనూ ఏడో సీజన్ త్వరలోనే షురూ కానుంది. కన్నడలో పదవ సీజన్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయనున్నారు? ఎంతమంది వస్తారంటూ అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లోకి మూగజీవి ఈసారి హౌస్‌లోకి 17 మంది కంటెస్టెంట్లు ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్‌బాస్ టీమ్.. హౌస్‌లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్ ఎవరన్నది ముందుగానే అధికారికంగా ప్రకటించింది. ఆ కంటెస్టెంట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవారే! 777 చార్లీ సినిమాతో ఆకట్టుకున్న చార్లీ అనే శునకం షోలో ఎంట్రీ ఇస్తోందట! సినిమాలో చార్లీ జనాలను ఎంతగా ఏడిపించిందో అందరికీ తెలిసిందే! తన చేష్టలతో హీరోపై ఎంతో ప్రేమను కురిపించిన ఈ మూగజీవి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. టీఆర్పీ కోసమేనా? షోలోకి చార్లీ వస్తున్నాడంటే ఏమైనా స్పెషల్ ఉందా? అని అడుగుతున్నారు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇంతవరకు ఏ మూగజీవాలను హౌస్‌లోకి పంపించలేదు. అలాంటిది తొలిసారి చార్లీ హౌస్‌లో అడుగుపెడుతుండటంతో అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. చార్లీకి శుభాకాంక్షలు చెప్తున్నారు. టీఆర్పీలు బద్ధలు కొట్టడానికే ఈ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. మరి చార్లీ.. కన్నడ బిగ్‌బాస్ 10వ సీజన్ లాంచ్ రోజు గెస్ట్‌గా హౌస్‌లోకి వెళ్లి వస్తాడా? లేదంటే కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఉంటాడా? అసలు బిగ్‌బాస్ ప్లానేంటి? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే! View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) చదవండి: ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు, గుర్తింపు రావట్లేదని చనిపోదామనుకున్నా -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్‌నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
ఆ ఓటీటీలోకి ‘‘777 ఛార్లి’ .. వాళ్లు మాత్రమే చూడొచ్చు!
కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన లెటెస్ట్ చిత్రం ‘ఛార్లి 777’. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది జూన్ 10న విడుదలైన ఈ చిత్రం.. భారీ విజయాన్ని అందుకుంది. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్ చేశారు. టాలీవుడ్లో కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. సెప్టెంబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్‌లో ‘777 ఛార్లి’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అయితే ఈ చిత్రం అమెజాన్ ఫ్రైమ్ చందాదారులందరూ చూడడానికి వీలులేదు. కేవలం రెంట్‌కు మాత్రమే ఈ చిత్రాన్ని ఫ్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఫ్రైమ్ వీడియోలో కంటే ముందు మరో ఓటీటీలో కూడా ఈ చిత్రం విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్‌లో జులై 29 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సురేశ్ ప్రొడెక్షన్స్ అమెజాన్ ఫ్రైమ్‌లో విడుదల చేశారు. ‘777 ఛార్లి’ కథ ఏంటంటే.. ధర్మ(రక్షిత్ శెట్టి) కుటుంబ సభ్యులంతా చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో మరణిస్తారు. ఒంటరిగా బతుకున్న ధర్మ జీవితంలోకి ఛార్లి అనే శునకం ఎంట్రీ ఇస్తుంది. అనుకొని పరిస్థితుల వల్ల ఓసారి ధర్మ ఇంటినుంచి బయటకు వస్తుంది ఛార్లి. ఆ తర్వాత ఛార్లీకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? ధర్మను ఎలా ఎసుకుంది? వారి మధ్య అనుబంధం ఎలా సాగింది? అనేదే మిగతా కథ. A teary tale of the most precious bond to ever exist 🐕🫶 777 Charlie available for rent from Sept 30 on the #PrimeVideoStore#777Charlie #777சார்லி #777చార్లీ #777ചാർലി #777चार्लि @rakshitshetty @RanaDaggubati @Kiranraj61 @ParamvahStudios @sangeethaSring pic.twitter.com/JeyJShF1De — Suresh Productions (@SureshProdns) September 24, 2022 -
ఓటీటీకి వచ్చేసిన ‘777 చార్లీ’, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ నటించిన లేటెస్ట్ మూవీ 777 చార్లీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. కిరణ్‌రాజ్ కే దర్శకత్వం వహించిన ఈ డిఫరెండ్ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. ఇందులో తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రక్షిత్. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే ఈ మూవీతో రక్షిత్ నేషనల్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్(Voot) ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకుంది. నేటి(జూలై 29) అర్ధరాత్రి నుంచి ఈ మూవీ వూట్‌లో అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా చూడాలంటే ముందుగా వూట్ సెలక్ట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ధీని ధర నెలకు రూ. 99 నుంచి అందుబాటులో ఉంది. చదవండి: మూవీ ఎంట్రీపై మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ! కాగా వూట్ సెలక్ట్ అనేది వయాకామ్ యెక్క వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫాం. దీనిని ఐఓఎస్(ios), ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో లౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఈ మధ్యే రక్షిత్ ట్వీట్ చేస్తూ.. ‘ఇది కేవలం సినిమాగానే కాకుండా సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చినా సరే పట్టించుకోకుండా థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు ఓటీటీలో విడుదలై అక్కడ కూడా అందరికీ మంచి అనుభూతిని పంచుతుంది అని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చాడు. A dollop more of the deleted scenes from #777Charlie And a pleasant news for all of you have who been waiting to watch the film on OTT, @777CharlieMovie will have its digital premiere on @VootSelect on the 29th of July 😊 pic.twitter.com/HLjTVWymgm — Rakshit Shetty (@rakshitshetty) July 27, 2022 -
ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు
కరోనా అనంతరం ఈ ఏడాది వరల్డ్ బాక్సాపీస్‌ను షేక్ చేసిన భారతీయ చిత్రాల్లో ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీదే అగ్రస్థానం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీ తర్వాత కేజీయఫ్ 2 ఉంటుంది. అయితే తాజాగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ను రెండు కన్నడ చిత్రాలు వెనక్కి నెట్టడం గమనార్హం. ఐఎండీబీ(imdb) ఇటీవల రిలీజ్ చేసిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ 169వ స్థానంలో నిలిచింది. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రమైన ‘కేజీయఫ్ 2’, తాజాగా విడుదలైన మరో కన్నడ మూవీ ‘777 చార్లీ ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ అధిగమించాయి. కేజీయఫ్ 2, 101వ స్థానంలో నిలువగా.. ఇదే నెలలోనే విడుదలై 777 చార్లీకి 116వ స్థానం దక్కడం విశేషం. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించింది. ఈ కన్నడ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన బజరంగీ భాయ్ జాన్, దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, బాహుబలి, కేజీఎఫ్ 1, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాలను కూడా అధిగమించాయి. చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కే కిరణ్ రాజ్ దర్శకత్వంలో ‘777 చార్లీ’ చిత్రం రూపొందింది. ధర్మ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కింది. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే పెంపుడు కుక్క (పెట్) ప్రవేశించి.. అతని జీవితాన్నిఎలా మార్చేసిందనేది ఈ కథ. జూన్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో ఇప్పటికీ థియేటర్లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు హీరో రక్షిత్ శెట్టి. -
777 చార్లీ హీరోను సర్ప్రైజ్ చేసిన రజనీకాంత్
కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘777 చార్లీ’. సంగీత శ్రింగేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె. కిరణ్‌రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్ చేశాడు. జూన్ 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అయితే ఈ సినిమా చూసి ఒక్కసారిగా ఏడ్చేశాడు. అంతలా మనసులను కదిలించిందీ చిత్రం. తాజాగా 777 చార్లీ సినిమా వీక్షించాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. అంతేకాదు సినిమా బాగుందంటూ తనకు ఫోన్ చేసి సర్ప్రైజ్ చేశాడట. ఈ విషయాన్ని హీరో రక్షిత్ శెట్టి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 'ఈ రోజు ఎంతో గొప్పగా మొదలైంది. రజనీకాంత్ సర్ ఫోన్ చేశారు. నిన్న రాత్రి 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు. సినిమాను అంత క్వాలిటీగా, ఎంతో లోతుగా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్ తెరకెక్కించిన విధానం, ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్ సర్' అని ట్వీట్ చేశాడు. …how it concludes on a spiritual note. To hear such words from the superstar himself is beyond wonderful. Thank you so much @rajinikanth sir 🤗🤗🤗 — Rakshit Shetty (@rakshitshetty) June 22, 2022 చదవండి: పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి! -
మనసును హత్తుకున్న '777 చార్లి'.. వచ్చేది ఈ ఓటీటీలోనే..
కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి తాజాగా నటించిన చిత్రం '777 చార్లి'. పెట్ డాగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న విడుదలైంది. కె. కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. ఇటీవల ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ గెలుచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా డిజిటల్ రిలీజ్ డేట్ ప్రకటించని ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని సమాచారం. కాగా '777 చార్లి' ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే రక్షిత్ శెట్టి కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'తో తెరంగేట్రం చేశాడు. తర్వాత వచ్చి 'అతడే శ్రీమన్నారాయణ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
లైవ్ లోనే అందరి ముందు కంటతడి పెట్టిన బీజేపీ సీఎం
-
సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం
బెంగళూరు: భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. అందుకే ఆ ముఖ్యమంత్రి ఆ సినిమాను చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆయన అంతలా ఎమోషనల్ కావడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉందండోయ్. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తాజాగా రక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా చూశారు. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్. అయితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఒక్కసారిగా ఏడ్చేశారు. బొమ్మై గతంలో స్నూబీ అనే కుక్కను పెంచారు. ఆయన సీఎం పదవి చేపట్టడం కంటే ముందే ఆ శునకం కన్నుమూసింది. దాని అంత్యక్రియల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చారాయన. అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా కన్నీటి పర్యంతం అయ్యారు. Okayyyyy…. I think I like our CM much more now. This is when they lost ‘Sunny’- their 14 year old family dog. #BasavarajBommai pic.twitter.com/4ECmQMdLA6 — Sangita (@Sanginamby) July 29, 2021 కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సినిమా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందే. షరతులు లేని ప్రేమ(అన్‌కండిషనల్ లవ్) గురించి మాట్లాడుతున్నాను. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ, చాలా స్వచ్ఛమైనది.. అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడారాయన. -
ఆ మూవీ ట్రైలర్ చూడగానే కన్నీళ్లొచ్చాయి : రానా
‘‘మంచి కథలను, చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో నేను యాక్టర్‌గా లేదా నిర్మాతగా... ఎలా ఉన్నా నాకు ఇష్టమే. ‘చార్లీ 777’ వంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటుడు, నిర్మాత రానా. కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘చార్లీ 777’. సంగీత శ్రింగేరి ఫీమేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి కె. కిరణ్‌రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రెస్మీట్లో ‘చార్లీ 777’ బిగ్ టికెట్‌ను రానా లాంచ్ చేశారు. అనంతరం రానా మాట్లాడుతూ – ‘‘చార్లీ 777’ ట్రైలర్ చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాను చూసిన ప్రతిసారి ఎమోషన్ రెట్టింపు అవుతూనే ఉంది. రక్షిత్ శెట్టి చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు నవ్వుతారు.. ఏడుస్తారు. ఇలాంటి మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ధర్మ అనే పాత్ర చేశాను. ధర్మ జీవితంలోకి చార్లీ (పెట్ డాగ్) వచ్చిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అన్నదే కథ. ఈ సినిమా దర్శకుడు కిరణ్‌రాజ్ అంకితభావం ఉన్న దర్శకుడు. చార్లీతో సీన్స్ చాలా కష్టంగా ఉండేవి. ఒకరోజు ఒకే షాట్ తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కశ్మీర్ ఎపిసోడ్‌ను మైనస్ 5 డిగ్రీల వాతావరణంలో తీశాం. చాలా కష్టంగా అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేవికా ఆరాధ్య పాత్రలో నటించాను’’ అన్నారు సంగీత శ్రింగేరి.