Rajinikanth Gives A Surprise Call To Rakshit Shetty And Appreciating 777 Charlie Movie - Sakshi
Sakshi News home page

777 Charlie: యంగ్‌ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం

Published Wed, Jun 22 2022 9:38 PM | Last Updated on Thu, Jun 23 2022 9:58 AM

Rajinikanth Surprise Call to 777 Charlie Hero Rakshith Shetty - Sakshi

కన్నడ యాక్టర్‌ రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘777 చార్లీ’. సంగీత శ్రింగేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె. కిరణ్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్‌ చేశాడు. జూన్‌ 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అయితే ఈ సినిమా చూసి ఒక్కసారిగా ఏడ్చేశాడు. అంతలా మనసులను కదిలించిందీ చిత్రం. తాజాగా 777 చార్లీ సినిమా వీక్షించాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. అంతేకాదు సినిమా బాగుందంటూ తనకు ఫోన్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడట. ఈ విషయాన్ని హీరో రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

'ఈ రోజు ఎంతో గొప్పగా మొదలైంది. రజనీకాంత్‌ సర్‌ ఫోన్‌ చేశారు. నిన్న రాత్రి 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు. సినిమాను అంత క్వాలిటీగా, ఎంతో లోతుగా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్‌ తెరకెక్కించిన విధానం, ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్‌ సర్‌' అని ట్వీట్‌ చేశాడు.

చదవండి: పక్కా కమర్షియల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement