కరోనా అనంతరం ఈ ఏడాది వరల్డ్ బాక్సాపీస్‌ను షేక్ చేసిన భారతీయ చిత్రాల్లో ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీదే అగ్రస్థానం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీ తర్వాత కేజీయఫ్ 2 ఉంటుంది. అయితే తాజాగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు కన్నడ చిత్రాలు వెనక్కి నెట్టడం గమనార్హం. ఐఎండీబీ(imdb) ఇటీవల రిలీజ్ చేసిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ 169వ స్థానంలో నిలిచింది.
చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే
కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రమైన ‘కేజీయఫ్ 2’, తాజాగా విడుదలైన మరో కన్నడ మూవీ ‘777 చార్లీ ఈ జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్ అధిగమించాయి. కేజీయఫ్ 2, 101వ స్థానంలో నిలువగా.. ఇదే నెలలోనే విడుదలై 777 చార్లీకి 116వ స్థానం దక్కడం విశేషం. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించింది. ఈ కన్నడ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన బజరంగీ భాయ్ జాన్, దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, బాహుబలి, కేజీఎఫ్ 1, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాలను కూడా అధిగమించాయి.
చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్
కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కే కిరణ్ రాజ్ దర్శకత్వంలో ‘777 చార్లీ’ చిత్రం రూపొందింది. ధర్మ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కింది. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే పెంపుడు కుక్క (పెట్) ప్రవేశించి.. అతని జీవితాన్నిఎలా మార్చేసిందనేది ఈ కథ. జూన్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో ఇప్పటికీ థియేటర్లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు హీరో రక్షిత్ శెట్టి.
Comments
Please login to add a commentAdd a comment