సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు.
(ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!)
కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే.
కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు
* ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ)
* ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2)
* ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2)
* ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా)
* ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్‌నాథ్ (కాంతారా)
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా)
* ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా)
* ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా)
* ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2)
* ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్)
* ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా)
* ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర)
* ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర)
* ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2)
* ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు)
* ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు)
* ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ)
* ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా)
* స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా)
* స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా)
* ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777)
Comments
Please login to add a commentAdd a comment