Siima Awards 2023
-
తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్ 2023 వేడుక ముగిసింది. తమిళ్ నుంచి విక్రమ్ సినిమాకు గాను కమల్ హాసన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్, కీర్తి సురేష్, మణిరత్నం,మాధవన్ వంటి సూపర్ స్టార్స్‌కు అవార్డ్స్ దక్కాయి. తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (తమిళం): (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ దర్శకుడు (తమిళం): లోకేష్ కనగరాజ్ (విక్రమ్) * ఉత్తమ నటుడు (తమిళం): కమల్ హాసన్ (విక్రమ్) * ఉత్తమ నటి (తమిళం): త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని * ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (విక్రమ్) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) * ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా * ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి) * ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్) * ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే) * ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల * ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి) * ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే) * ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ (విరుమాన్) * ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం * ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) (ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్‌నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
జూ. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆయనకున్న బలం ఎవరు?
సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR సినిమాలో తన అద్భుత నటనకు గాను ఈ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నామినేషన్ లిస్ట్‌లో రామ్ చరణ్ ఉన్నా అవార్డు మాత్రం కొమురం భీం పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్కే దక్కింది. 2016లో జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మొదటిసారి ఈ అవార్డును అందకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) ఇక, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు మెచ్చకోని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషాల్లో కూడా ఆడియన్స్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా జరిగింది 1983 మే 20న జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్ వేయమని చెప్పారు. మేకప్ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్ అని కితాబు ఇచ్చారు. మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది ఎన్టీఆర్‌కు మొదట పెట్టిన పేరు 'తారక్ రామ్'. కానీ తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తారక్ ఇలా చెప్పారు. 'ఓ రోజు తాత గారి నుంచి నుంచి కబురు వచ్చింది. అప్పట్లో ఆయన అబిడ్స్‌లో ఉండే వారు. ఆయన్ను కలిసేందుకు వెళ్లగానే.. 'లోపలికి రండి' అంటూ తాత నుంచి గంభీరమైన స్వరంతో ఆహ్వానం. నేను ఆయన ముందుకు వెళ్లగానే.. పేరేంటి..? అని ఆయన అడగ్గా.. తారక్ అని చెప్పాను. దీంతో వెంటనే, హరికృష్ణ గారిని పిలిచి 'నందమూరి తారక రామారావు' అని పేరు మార్చమని చెప్పారు. ఆ క్షణం నుంచి నేను తాత చేయి వదల్లేదు. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు.' అని ఓ సందర్భంలో తాతతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నాడు. ఎన్టీఆర్‌కు 'అమ్మ' బలమైతే.. 'నాన్న' ప్రాణం హరికృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు శాలిని గారితోనే (జూ. ఎన్టీఆర్ అమ్మ) ఎక్కువ అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోనే తన బాల్యం అంతా గడిచింది. బాల్యంలో బాగా అల్లరితో పాటు స్నేహితులతో క్రికెట్, సినిమాలు, షికార్లు, గొడవలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుండటంతో ఒకసారి బాగా విసిగిపోయిన వారి తల్లిగారు శాలిని హ్యాంగర్‌తో కొట్టారని ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పుకొచ్చారు. 'నేనంటే అమ్మకు ఎంతో ప్రాణం.. ఆమెకు సర్వసం నేనే.. అలాగని ఎప్పుడూ గారాబం చేసేది కాదు. జీవితంలో వాస్తవంలో మాత్రమే బతకాలని నాకు అమ్మే నేర్పింది. నేను ఎప్పుడైనా నిరుత్సాహ పడితే నాలో ఆత్మవిశ్వాసం నింపేది ఆమ్మే. నా జీవితంలో ఆమె నా బలం, బలగం.' అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రాణంగా భావించే తన నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయినప్పుడు ఆయన ఎంతలా కన్నీరు పెట్టుకున్నాడో అందరం చూశాం. హరికృష్ణ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో బతికారని గతంలో జూ. ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఆయనలా బతకడం చాలా కష్టం అని కూడా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో ... ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే అభిమానులకు తారక్ విజ్ఞప్తి చేస్తుంటారు. అభిమానులే తన కుటుంబ సభ్యులని, వారే తన బలగం అని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. తారక్ జీవితంలో ఇవన్నీ ఎవర్గ్రీన్ ♦ తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ♦ పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. ♦ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట. ♦ యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు. ♦ తారక్ బాల్యంలోనే ప్రఖ్యాత కళాకారుల దగ్గర కూచిపూడి నేర్చుకుని పలు వేదికలపై ప్రదర్శనలూ ఇచ్చారు. ♦ 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ♦ ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా.. జై లవ కుశలో త్రిపాత్రాభినయం చేశారు. ♦ పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ♦ జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ♦ నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు. ♦ మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. ♦ 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు. ♦ సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు. ♦ తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట ♦ తన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ప్రేమ. ♦ తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. -
సైమా అవార్డ్స్: స్టేజ్‌పై ఎమోషనల్ అయిన ఎన్టీఆర్
-
ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కళ్ల వెంట కన్నీళ్లు
సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR చిత్రంలో ఆయన కొమురం భీం పాత్రలో తన ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. అవార్డును అందుకున్న ఎన్టీఆర్ స్టేజ్‌పైన ఎమోషనల్ అయ్యారు.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తారక్ తెలియజేశారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ ఇలా మాట్లాడారు. 'కొమరం భీమ్ పాత్ర కోసం నేను న్యాయం చేస్తానని నన్ను మళ్ళీ మళ్ళీ మళ్లీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్. నా కో స్టార్, మై బ్రదర్, మై ఫ్రెండ్ రామ్ చరణ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ఎంతో రుణపడి ఉన్నాను.. వారందరికీ నా కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను.' అని తారక్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 👉: సైమా అవార్డ్స్- 2023లో హాట్‌గా తారల సందడి (ఫోటోలు) 'జనతా గ్యారేజ్' లాంటి సూపర్‌హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర చిత్రంపై భారీ అంచనాలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా. దేవర సినిమా 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. Man Of Masses @tarak9999 won the SIIMA Best Actor Award For RRR MOVIE 💥💥💥#SIIMAinDubai #SIIMAAwards2023 pic.twitter.com/8BRtoBAUiO — Jr NTR Fan Club (@JrNTRFC) September 15, 2023 -
సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్‌లో ప్రారంభం అయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా). గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ హీరో రానా, మంచు లక్ష్మీ ప్రధాన వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 15న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి అయింది. నేడు సెప్టెంబర్ 16న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమాలో దుమ్ములేపిన RRR, సీతా రామం ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌నే కాదు, రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజిల మీద ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా సైమా అవార్డుల రేసులో 11 నామినేషన్స్‌లలో చోటు దక్కించుకొని 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. సీతా రామం చిత్రానికి గాను మూడు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలిచింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం: సీతా రామం * ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR) * ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR) * ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్) * ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద) * ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(RRR) * ఉత్తమ గేయ రచయిత 'నాటు నాటు' పాట కోసం: చంద్రబోస్ (RRR) * ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (DJ టిల్లు) టైటిల్ సాంగ్ కోసం * ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) 'జింతక్' పాట కోసం * ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ - 2) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR) * ఉత్తమ నూతన దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార) * సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2) * ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2) * ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్) * ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్ * ప్రామిసింగ్ న్యూకమ్: వినోద ప్రపంచంలో భవిష్యత్‌లో మంచి స్టార్‌గా గుర్తింపు పొందిన గణేష్ బెల్లంకొండ -
ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్..ఎందుకంటే
‘దేవర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు.సెప్టెంబర్ 15, 16 తేదిల్లో దుబాయ్‌లో జరగనున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)అవార్డుల వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్ట్‌కు వెళ్తున్న ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్‌తో పాటు హీరోలు యశ్, రిషబ్ శెట్టి, హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, శ్రీలీల కూడా సైమా అవార్ట్స్ వేడుకలో పాల్గొననున్నారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్! ఈ ఏడాది సైమా అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఇప్పటికే అస్కార్‌తో పాటు జాతీయ అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. సైమా అవార్డుల్లో సైతం రికార్డు క్రియేట్ చేయబోతుంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌కు అవార్డు లభించినట్లు సమాచారం. అందుకే ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్‌కి చెందిన మరో చిత్రం సీతారామం 10 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. కాంతార, కేజీయఫ్ చిత్రాలకు సైతం 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. తెలుగు ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్, నిఖిల్, సిద్దూ జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్, అడివి శేష్ పోటీ పడుతున్నారు. అయితే ఎన్టీఆర్కే ఉత్తమ నటుడు అవార్డు లభించిందనే వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) చూడగానే అన్నా అని పిలిచా: హిమజ ఎన్టీఆర్ వెళ్తున్న ఫ్లైట్‌లోనే బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కూడా దుబాయ్ వెళ్తున్నారు. ఎన్టీఆర్‌ని చూడగానే దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని హిమజ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ.. ‘చూడగానే అన్న అని పిలిచేశా’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) -
గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌కి ఇదో వేదిక
‘‘సౌత్‌లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. పదకొండేళ్లుగా నేనీ వేడుకల్లో భాగమవుతున్నాను. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌కి చేరుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. దుబాయ్‌లో కలుద్దాం’’ అన్నారు రానా. ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక ఈ నెల 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనుంది. ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రానా పాల్గొన్నారు. ‘‘సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీ యూనియన్ లాంటిది’’ అన్నారు సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్. ‘‘సైమా వేడుకల్లో ఇదివరకు పాల్గొన్నాను. మళ్లీ ఈ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘తొలిసారి సైమా వేడుకల్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ఈ సమావేశంలో శశాంక్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు. -
రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారందరికీ సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ఇస్తారు. దీనికి సినిమా రంగంలో చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్‌కు పోటీ పడుతున్న ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసిన 'సైమా' టీమ్. తాజాగా ఉత్తమ హీరో నామినేషన్ల జాబితాను రిలీజ్ చేసింది. తమళ్,కన్నడ విభాగానికి చెందిన హీరోల జాబితాను కూడా సైమా విడుదల చేసింది. (ఇదీ చదవండి: ఆగ్రహంతో బన్నీ ఫ్యాన్స్.. మైత్రి మూవీస్‌పై ఫైర్.. నేడు ధర్నా చేసే ఛాన్స్) ఇప్పుడు ఈ లిస్ట్‌లోని పేర్లే పెద్ద తలనొప్పిగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈసారి తెలుగు సినిమా విభాగం నుంచి ఉత్తమ నటుల నామినేషన్స్‌లో RRR నుంచి జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు అడివి శేష్ (మేజర్), నిఖిల్ (కార్తికేయ 2),దుల్కర్ సల్మాన్ (సీతారామం), సిద్ధు జొన్నలగడ్డ (DJ టిల్లు) పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఎంతమంది ఉన్నా.. ప్రధానంగా RRR హీరోల మధ్య మాత్రమే పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు అవార్డ్‌ను దక్కించుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గొప్ప..? RRR విడుదల అయ్యాక సినిమా చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న ఇది. సోషల్‌మీడియాలో అయితే, దీనిపై ఓ సుదీర్ఘ చర్చే జరిగింది. మా హీరో సీన్స్ సూపర్ అని కొందరు ఫ్యాన్స్ అంటే.. మా హీరో నటనకు కొత్త అర్థం చెప్పాడని అంటూ మరికొందరు సోషల్‌మీడియాను హోరెత్తించారు. తర్వాత ఆస్కార్ అవార్డ్ వచ్చిన సమయంలో కూడా ఇదే రచ్చ జరిగింది. ఇదే విషయంపై కొందరు సినీ ప్రముఖులు కూడా ఇలా స్పందించారు. 'తొలి భాగంలో ఎన్టీఆర్ ఆధిపత్యం ఉంటే.. ద్వితీయార్థంలో చరణ్ ఆధిపత్యం ఉంటుంది.' అని తెలిపారు. ఇందులో ఎవరినీ తక్కువ చేయలేదని, ఇద్దరికి రాజమౌళి సమ న్యాయం చేశాడని మూవీ క్రిటిక్స్ కూడా తెలిపారు. కానీ సైమా అవార్డ్స్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు ఉండటంతో మళ్లీ ఈ టాపిక్‌పై చర్చ జరుగుతుంది. ఉత్తమ హీరో అవార్డు ఎవరు అందుకుంటారో తెలియాలంటే సెప్టెంబరు 16 వరకు వేచి ఉండాల్సిందే. -
సైమా అవార్డ్స్-2023 వేడుకల ప్రకటన.. ఈసారి హోస్ట్ ఎవరంటే?
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 11 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2023 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు సైమా ఛైర్పర్సన్ బృందాప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు దుబాయ్ వేదిక కానుందని ఆమె తెలిపారు. వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. (ఇదీ చదవండి: నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్) టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తీసుకొచ్చింది సైమానే అని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో తాను కూడా భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. తనకు దక్షిణాదికి చెందిన ఎందరో అభిమానుల నుంచి ప్రేమను పొందానని చెప్పుకొచ్చారు. తన తొలి చిత్రం సీతారామంతోనే సైమాలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. దుబాయ్‌లోని D.W.T.Cలో జరిగే ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా రానా వ్యవహరించనున్నారు. మరోక హోస్ట్‌గా మృణాల్ వ్యవహరించే అవకాశం ఉంది. Nexa Joins SIIMA as the Title Sponsor. SIIMA is the Biggest Awards Show in South India organising its 11th Edition in Dubai on 15th and 16th September. Rana Daggubati and Mrunal Thakur joined Brinda Prasad, Chairperson of SIIMA in announcing the Nexa SIIMA Partnership.… pic.twitter.com/H6na7W7uHr — SIIMA (@siima) July 7, 2023