దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారందరికీ సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ఇస్తారు. దీనికి సినిమా రంగంలో చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్‌కు పోటీ పడుతున్న ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసిన 'సైమా' టీమ్. తాజాగా ఉత్తమ హీరో నామినేషన్ల జాబితాను రిలీజ్ చేసింది. తమళ్,కన్నడ విభాగానికి చెందిన హీరోల జాబితాను కూడా సైమా విడుదల చేసింది.
(ఇదీ చదవండి: ఆగ్రహంతో బన్నీ ఫ్యాన్స్.. మైత్రి మూవీస్‌పై ఫైర్.. నేడు ధర్నా చేసే ఛాన్స్)
ఇప్పుడు ఈ లిస్ట్‌లోని పేర్లే పెద్ద తలనొప్పిగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈసారి తెలుగు సినిమా విభాగం నుంచి ఉత్తమ నటుల నామినేషన్స్‌లో RRR నుంచి జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు అడివి శేష్ (మేజర్), నిఖిల్ (కార్తికేయ 2),దుల్కర్ సల్మాన్ (సీతారామం), సిద్ధు జొన్నలగడ్డ (DJ టిల్లు) పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఎంతమంది ఉన్నా.. ప్రధానంగా RRR హీరోల మధ్య మాత్రమే పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు అవార్డ్‌ను దక్కించుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎవరు గొప్ప..?
RRR విడుదల అయ్యాక సినిమా చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న ఇది. సోషల్‌మీడియాలో అయితే, దీనిపై ఓ సుదీర్ఘ చర్చే జరిగింది. మా హీరో సీన్స్ సూపర్ అని కొందరు ఫ్యాన్స్ అంటే.. మా హీరో నటనకు కొత్త అర్థం చెప‍్పాడని అంటూ మరికొందరు సోషల్‌మీడియాను హోరెత్తించారు. తర్వాత ఆస్కార్ అవార్డ్ వచ్చిన సమయంలో కూడా ఇదే రచ్చ జరిగింది.
ఇదే విషయంపై కొందరు సినీ ప్రముఖులు కూడా ఇలా స్పందించారు. 'తొలి భాగంలో ఎన్టీఆర్ ఆధిపత్యం ఉంటే.. ద్వితీయార్థంలో చరణ్ ఆధిపత్యం ఉంటుంది.' అని తెలిపారు. ఇందులో ఎవరినీ తక్కువ చేయలేదని, ఇద్దరికి రాజమౌళి సమ న్యాయం చేశాడని మూవీ క్రిటిక్స్ కూడా తెలిపారు. కానీ సైమా అవార్డ్స్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు ఉండటంతో మళ్లీ ఈ టాపిక్‌పై చర్చ జరుగుతుంది. ఉత్తమ హీరో అవార్డు ఎవరు అందుకుంటారో తెలియాలంటే సెప్టెంబరు 16 వరకు వేచి ఉండాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment