
శశాంక్ శ్రీవాత్సవ్, నిధీ అగర్వాల్, బృందా ప్రసాద్, రానా, మీనాక్షి
‘‘సౌత్‌లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. పదకొండేళ్లుగా నేనీ వేడుకల్లో భాగమవుతున్నాను. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌కి చేరుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. దుబాయ్‌లో కలుద్దాం’’ అన్నారు రానా. ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక ఈ నెల 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనుంది. ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రానా పాల్గొన్నారు.
‘‘సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీ యూనియన్ లాంటిది’’ అన్నారు సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్. ‘‘సైమా వేడుకల్లో ఇదివరకు పాల్గొన్నాను. మళ్లీ ఈ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘తొలిసారి సైమా వేడుకల్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ఈ సమావేశంలో శశాంక్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment