Nidhi Agarwal
-
సిల్వర్ జ్యువెలరీ ఆవిష్కరించిన సినీ నటి నిధి అగర్వాల్ (ఫోటోలు)
-
నిధి అగర్వాల్.. ఓ వింత కండీషన్
హీరోయిన్లు చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఛాన్సుల్ని అందుకునే విషయంలో పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం తొలి మూవీ చేసేటప్పుడు వింతైన కండీషన్ పెట్టారట. అది చూసి ఈమె షాకైందట.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)''మున్నా మైకేల్' మూవీతో నా కెరీర్ మొదలైంది. ఇదో బాలీవుడ్ మూవీ. టైగర్ ష్రాఫ్ హీరో. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత నాతో ఓ కాంట్రాక్ట్ పై సంతకం చేయించారు. అందులో నో డేటింగ్ అనే కండీషన్ కూడా ఉంది. అంటే సినిమా పూర్తయ్యేవరకు హీరోతో నేను డేటింగ్ చేయకూడదనమాట.కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నప్పుడు ఇవన్నీ గమనించలే గానీ తర్వాత వీటి గురించి తెలిసి ఆశ్చర్యపోయాను' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం తెలుగులో హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు చేస్తున్న నిధి.. ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడింది. 'మంచి, చెడు చెప్పడానికి పద్ధతి ఉంది. హద్దులు దాటి అసభ్యంగా మాట్లాడటం మాత్రం సరికాదు. నేను అస్సలు ఇలాంటివి పట్టించుకోను' అని నిధి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
'హరిహర వీరమల్లు'కు ఏకైక దిక్కు ఆమె మాత్రమే
పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu ) సినిమా మే 9న రిలీజ్ కానుంది. సరిగ్గా 50 రోజుల్లోనే ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పటికే విడుదల విషయంలో పలుమార్లు తేదీలు మారుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal) భారీ ఆశలే పెట్టుకుంది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆపై ఈ చిత్రానికి ప్రధాన బలం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అని తెలిసిందే. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కువగా లీడ్ తీసుకునేది మాత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పాలి.హరిహర వీరమల్లు సినిమాను పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ప్రచారం చేయడం లేదు. తన స్టార్డమ్ వల్ల సినిమా ఆడేస్తుందిలే అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు ఉన్నారు. వాస్తవంగా ఆయన తన సినిమాల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోరని అందరికీ తెలిసిందే.. ఆపై ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అస్సలు ఇటువైపు చూసే ఛాన్స్ లేదు. అయితే, దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రచారానాకి దాదాపు రాకపోవచ్చనే సందేహాలు వస్తున్నాయి. రెండో దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేరని తెలిసిందే. అయితే, ఈ పాన్ ఇండియా సినిమా ప్రచారం కోసం మిగిలిన ఏకైకా పెద్ద దిక్కుగా నిధి అగర్వాల్ మాత్రమే మిగిలిందని చెప్పవచ్చు.‘హరి హరవీరమల్లు’ విడుదల కోసం నిధి అగర్వాల్ చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంది. అందుకే ఈ మూవీ ప్రచార బాధ్యతల్ని కూడా తన భుజానికెత్తుకుంది. ఈ క్రమంలో పలు టీవీ షోలలో పాల్గొని తనదైన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులకు దగ్గరౌతుంది. సుమారు ఇంకో 20రోజుల పాటు ‘హరి హరవీరమల్లు’ ప్రచారంలో ఆమె ఉండనున్నారు. అందులో భాగంగా ఆమె పలు నగరాల్లో కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని ఆశగా ఈ బ్యూటీ ఎదురుచూస్తుంది. -
కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
అందాల నిధి.. డిఫరెంట్ డ్రస్సులో తమన్నా!
చాలారోజుల తర్వాత మెరిసిపోతున్న నిధి అగర్వాల్వెరైటీ ఔట్ ఫిట్ లో తమన్నా స్టైలిష్ పోజులుపెంపుడు కుక్క అస్థికల్ని గోదావరి నదిలో కలిపిన రష్మీహాట్ నెస్ తో చంపేస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీచీరలో కుందనపు బొమ్మలా కేక పుట్టిస్తున్న కాయదు లోహర్పసుపు చీరలో చూడముచ్చటగా తమిళ హీరోయిన్ దివ్య భారతిగ్లామర్ తో చంపేస్తున్న యంగ్ బ్యూటీ మాళవిక శర్మ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nikhila Vimal (@nikhilavimalofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
నుదుట నామాలు.. శివయ్య భక్తిలో టాలీవుడ్ హీరోయిన్స్
మహాశివరాత్రి సందర్భంగా నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల లాంటి హీరోయిన్స్ దేవాలయాలకు వెళ్లారు. సింగర్ శ్రేయా ఘోషల్ శివుడి బొమ్మతో ఉన్న చీరతో కనిపించింది. మరికొందరు బ్యూటీస్ ఎప్పటిలానే కాస్త గ్లామరస్ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Vaishali Raj (@vaishaliraj_official) View this post on Instagram A post shared by Divya khossla (@divyakhossla) View this post on Instagram A post shared by Richa Panai (@richapanai) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tridha Choudhury ✨ (@tridhac) -
అవకాశం ఇస్తామంటూ తిప్పించుకున్నారు : హీరోయిన్
సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మంది కలలు కంటారు. అయితే కొందరు మాత్రమే ఆ కల నెరవేర్చుకుంటారు. మరికొంత మందికి నటించాలని ఉన్నా..అవకాశాలు రావు. ఒక్క చాన్స్ కోసం ఎన్నో రోజులు వేచి చూస్తారు. అవకాశం వచ్చినప్పుడే తమ టాలెంట్‌ని నిరూపించుకుంటారు. ఆ తర్వాత దర్శకనిర్మాతలే వారి ఇళ్ల చుట్టు తిరుగుతారు. కానీ మొదట వచ్చే ఆ ఒక్క చాన్స్ కోసం కొంతమంది ఎన్నో కష్టాలు పడతారు. ఎన్నో అవమానాలను, మోసాలను భరించి.. తమ కలను నెరవేర్చుకుంటారు. అలా తాను కూడా తొలి సినిమా కోసం చాలా కష్టాలు పడ్డానని అంటోంది అందాల తార నిధి అగర్వాల్(Nidhi Agarwal). దాదాపు రెండేళ్ల పాటు ఆఫీసుల చుట్టు తిరిగితే కానీ తనకు అవకాశం రాలేదని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి తన సినిమా కష్టాల గురించి వివరించింది.(చదవండి: అల్లు అర్జున్‌కు అనారోగ్యం.. అందుకే ఇక్కడకు రాలేదు: అల్లు అరవింద్)దీపికా పదుకొణెను చూసి సినిమాల్లోకి..నేను సినిమాల్లోకి రావడానికి కారణం దీపికా పదుకొణె. ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చా. తెరపై దీపికను చూసి..నేను కూడా హీరోయిన్ అవుతానని ఇంట్లో చెప్పాను. మొదట్లో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ముందు చదువు పూర్తి చెయ్.. ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు. కొన్నాళ్ల తర్వాత సినిమాలపై నాకున్న పిచ్చి చూసి..మా నాన్నగారే ప్రోత్సహించారు. హీరోయిన్గా ట్రై చెయ్ అని చెప్పారు. అలా ఇంట్లోవాళ్ల అనుమతితో ఇండస్ట్రీలోకి వచ్చాను.రెండేళ్ల పాటు తిరిగాసినిమా చాన్స్‌లు ఈజీగా వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ఒక్క చాన్స్ రావడం అంత ఈజీ కాదు. నేను అయితే దాదాపు రెండేళ్ల పాటు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగాను. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కొంతమంది దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రెండు మూడు సార్లు ఆఫీసుల చుట్టు తిప్పించుకొని..ఆ తర్వాత మీకు అవకాశం లేదని బయటకు పంపించేశారు. చివరిగా మైఖేల్ మున్నా సినిమా ఆడిషన్‌కి వెళ్తే.. అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను. దాదాపు 300 మందిని ఆడిషన్ చేయగా.. అదృష్టం కొద్ది నేను సెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమా చూసి నాకు నాగ చైతన్య(Naga Chaitanya) ‘సవ్యసాచి’లో చాన్స్ వచ్చింది.అందుకే గ్యాప్ వచ్చిందిఈ మధ్యకాలంలో నేను సినిమాలు తగ్గించాను అని చాలా మంది అంటున్నారు. అది వాస్తవమే. కానీ అవకాశాలు రాలేక కాదు.. ఓ ఒప్పందం కారణంగా సినిమాలు చేయట్లేదు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా పూర్తయ్యేవరకు ఇతర చిత్రాల్లో నటించకూడదని నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. అదే సమయంలో నాకు ది రాజా సాబ్(The Raja Saab) మూవీలో అవకాశం వచ్చింది. దాంతో హరిహర వీరమల్లు మేకర్స్ ని ఆ సినిమాలో చేస్తాను అని అడగగా వాళ్ళు ఓకే చేశారు. ఈ రెండు చిత్రాలు నా కెరీర్‌కి చాలా స్పెషల్ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. -
పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ?
సాధారణంగా ఓ హీరోయిన్ ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసేస్తుంటారు. స్టార్ హీరోయిన్లు అయితే కనీసం ఒకటైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం దాదాపు మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. అలా అని అవకాశాలు రాలేదని కాదు. ఎన్ని అవకాశాలు వచ్చిన వదులుకోవాల్సిన వచ్చింది. దానికి కారణం ఓ స్టార్ హీరో సినిమా. ఆ హీరో సినిమా టీమ్‌తో చేసుకున్న ఒప్పందమే ఆమె కెరీర్‌ని ముంచేసింది. మూడేళ్లుగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తోంది. అయినా కూడా ఆ సినిమా పూర్తి కాలేదు. ఆ సినిమా పేరే హరిహర వీరమల్లు. హీరో పవన్ కల్యాణ్.. మూడేళ్లుగా ఎదురు చూస్తోన్న హీరోయిన్ నిధి అగర్వాల్.కొంప ముంచిన ఒప్పందంపవన్ కల్యాణ్(pawan kalyan) హీరోగా నటించాల్సిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. కరోనా కంటే ముందే ఈ సినిమాను ప్రకటించారు. కొంత షూటింగ్ అయిన తర్వాత ఎన్నికలతో నెపంతో పవన్ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంకా బిజీ అయిపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తికాలేకపోయింది. అయితే ఈ సినిమా ఒప్పుకోవడమే నిధి అగర్వాల్(Nidhi Aggarwal ) కెరీర్‌కి శాపంగా మారింది. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాల్లో నటించరాదని ఒప్పందం చేసుకున్నారట. ఆ కారణంగానే వేరే సినిమాల్లో నటించలేకపోయారట. ఈ విషయాన్ని నిధి అగర్వాలే చెప్పారు.‘లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సైన్ చేశాను. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా ఇవ్వాలని, కాబట్టి సినిమా అయ్యేంతవరకు వేరే సినిమా ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. ఆ సమయంలోనే లాక్డౌన్ వచ్చింది. తర్వాత షూటింగ్ మొదలు పెట్టినా.. రెండోసారి లౌక్‌డౌన్ కారణంగా మళ్లీ వాయిదా పడింది. తర్వాత పవన్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోయారు. ఇలా దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసమే ఉండాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఆ కాంట్రాక్టు వల్లే వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా రావడంతో ఆ సినిమా వదులుకోకూడదు అని హరిహర వీరమల్లు మూవీ టీమ్ తో మాట్లాడి, రిక్వెస్ట్ చేసి, షూటింగ్స్ కి క్లాష్ రానివ్వను అని చెప్పి రాజాసాబ్ సినిమాకు ఓకే చెప్పాను. ఈ రెండింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నాను’ అని నిధి చెప్పారు.తట్టుకోలేక తప్పుకున్న క్రిష్!హరిహర వీరమల్లు చిత్రానికి తొలుత క్రిష్ దర్శకుడు. ఈ పాటికే షూటింగ్ అయిపోయి..రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. దానికి కారణం పవన్ కల్యాణే. ఆయన పాలిటిక్స్‌లో బిజీ కావడంతో కొంతకాలం క్రిష్ ఎదురు చూశాడు. అయితే గ్యాప్‌లో కూడా ఈ సినిమాను పూర్తి చేయకుండా ఇతర సినిమాలు ఒప్పుకోవడం..వాటికి డేట్స్ కేటాయించడంతో ఈ సినిమాకు మరింత గ్యాప్ వచ్చింది. దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మిగిలిన పోర్షన్ పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. అతడి కెరీర్లో ఇప్పటిదాకా హిట్ అన్నదే లేదు. చివరి చిత్రం ‘రూల్స్ రంజన్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. మరి అతను తీసే మిగతా పార్ట్ ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం గమనార్హం. కాగా, పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి భాగం మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
కొంచెం కొత్తగా ఉందాం
క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు. మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్.రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.⇒ మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.⇒ వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్‌పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.⇒ మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?⇒ కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.⇒ చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడగతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్‌కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.⇒ ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..! – చంద్రబోస్హెల్త్... హార్డ్వర్క్మనం ప్రతి ఒక్కరం కెరీర్ కోసం చాలా కష్టపడతాం. హార్డ్‌వర్క్ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్ వర్క్... హెల్త్... హ్యాపీనెస్... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్‌ని ప్లాన్ చేసుకుని పాజిటివ్‌గా ముందుకెళ్లడమే. కెరీర్ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం, నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్‌లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్లో ఎంత సక్సెస్‌పుల్‌గా .. ఎంత టీమ్ స్పిరిట్‌తో.. ఎంత ఎఫర్ట్ఫుల్గా పనిచేశామన్నది ముఖ్యం.రేటింగ్ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్ ట్రిప్‌కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.2025 మీద నా అంచనాలు: షూటింగ్‌లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్ స్టోరీస్, అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్ అయినా 2025లో రిలీజ్ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం, నా గోల్స్. – ఆనంద్ దేవరకొండస్ట్రాంగ్గా... పాజిటివ్‌గా...మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్ లవ్’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్ ఫీలింగ్‌తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్‌గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్స్ట్రెంగ్త్పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్‌స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.ప్రొఫెషన్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్‌గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్లప్రశాంతతకు ప్రాధాన్యంరోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.ప్రొఫెషన్‌గా, కెరీర్‌పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్ అంతా ఎంతో హార్డ్‌వర్క్ చేసిన నా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం నా కెరీర్లో మెమరబుల్ మూమెంట్‌గా చెప్పుకుంటాను.1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. ఇంక న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారా.. బీ గుడ్ టు అదర్స్. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్. ఇంకా.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటున్నాం. – కిరణ్ అబ్బవరంప్రతి టైమ్ మంచిదేజీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్‌గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను. నా వరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఇచ్చాను. ప్రతి టైమ్ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్‌ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్‌కు డబుల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేశాను. హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్ -
బర్త్ డే మూడ్‌లో నభా నటేశ్.. పెళ్లి కూతురిలా ది రాజాసాబ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్‌లో నభా నటేశ్..పెళ్లి కూతురిలా ముస్తాబైన ది రాజాసాబ్ హీరోయిన్!టోక్యోలో ఎంజాయ్ చేస్తోన్న మీనా..బుట్టబొమ్మలా తయారైన యాంకర్ శ్రీముఖి.. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by GQ India (@gqindia) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
చాన్నాళ్లకు నిధి అగర్వాల్ అలా.. బేబీ బంప్‌తో టాలీవుడ్ హీరోయిన్
చాన్నాళ్లకు చీరలో కనిపించిన నిధి అగర్వాల్నవరాత్రి స్పెషల్ చీరలో అందంగా వితికా షేరుబ్లర్ ఫొటోల్లోనూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన 'బేబి' వైష్ణవిడస్కీ బ్యూటీ బ్రిగిడ.. వయ్యారాలు చూడతరమాబేబీ బంప్‌తో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా ఆర్యభర్తతో రొమాంటిక్ పోజుల్లో హిందీ బ్యూటీ శివలీకాచుడీదార్లో చూడముచ్చటగా కృతి సనన్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Ishwarya Vullingala🇮🇳 (@actress_ishwarya_vullingala) View this post on Instagram A post shared by Priya Reddy ♥️ (@sreepriya__126) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Malavika_Manoj (@malavika_manojj) View this post on Instagram A post shared by Reshma Pasupuleti (@reshmapasupuleti) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
చీరలో రీతూ చౌదరి హొయలు.. నిధి అగర్వాల్ కొత్త లుక్
మేకప్ లేకుండా యాంకర్ అనసూయపెళ్లి డ్రస్సులో బార్బీ డాల్‌లా అమీ జాక్సన్బొద్దుగా ఉన్నా ముద్దొచ్చేలా పూనమ్ బజ్వాబీచ్ ఒడ్డున చీరలో అబ్బో అనేలా రాశీ సింగ్టైట్ ఔట్ ఫిట్‌లో కాక రేపుతున్న శ్రద్ధా కపూర్సిల్క్ చీరలో రచ్చ లేపుతున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరిక్యాట్ వాక్ చేస్తూ క్యూట్‌గా ఓరకంట చూస్తూ కృతిశెట్టి View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Pragya Nayan Sinha (@pragyanayans) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) -
రాజాసాబ్ బ్యూటీ బర్త్‌డే.. చీరకట్టులో ఊర్వశి..
రాజాసాబ్ సెట్లో నిధి అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో హీరో శ్రీవిష్ణు శ్రీలీల ఫన్నీ వీడియోప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ఇమాన్విప్రియాంక జైన్ వరలక్ష్మి వ్రతంనిండైన చీరకట్టులో ఊర్వశి రౌతేలా View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Sree Vishnu (@sreevishnu29) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Imanvi (@iman1013) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) -
అనంతపురంలో సినీ తారలు నిధి అగర్వాల్, అనసూయ సందడి (ఫొటోలు)
-
నిధి అగర్వాల్ అలాంటి పోజులు.. బికినీలో ఆ హీరోయిన్!
మత్తెక్కించే పోజుల్లో 'బిగ్‌బాస్' దీప్తి సునయన ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోతున్న అరియానా చాన్నాళ్ల తర్వాత నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్ చీర కట్టినా ఈషా రెబ్బా అస్సలు తగ్గట్లేదుగా బికినీలో కనిపించిన షాకిచ్చిన హీరోయిన్ ప్రణీత డిజైనర్ చీరలో వావ్ అనిపిస్తున్న 'బ్రహ్మస్త్ర' బ్యూటీ క్యూట్ పోజుల్లో వావ్ అనిపిస్తున్న 'జైలర్' కోడలు View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌కి ఇదో వేదిక
‘‘సౌత్‌లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. పదకొండేళ్లుగా నేనీ వేడుకల్లో భాగమవుతున్నాను. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌కి చేరుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. దుబాయ్‌లో కలుద్దాం’’ అన్నారు రానా. ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక ఈ నెల 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనుంది. ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రానా పాల్గొన్నారు. ‘‘సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీ యూనియన్ లాంటిది’’ అన్నారు సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్. ‘‘సైమా వేడుకల్లో ఇదివరకు పాల్గొన్నాను. మళ్లీ ఈ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘తొలిసారి సైమా వేడుకల్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ఈ సమావేశంలో శశాంక్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు. -
ఆ జ్యూస్ తాగుతాను.. అదే నా అందానికి రహస్యం
'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ చిత్రం బంపర్ హిట్ అయనా ఎందుకో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. దీంతో ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అక్కడ తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణంతో బోలెడంత పబ్లిసిటీ దొరికింది. శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ కోలీవుడ్ కోడూ కూస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఆమె ఏం చెప్పిందంటే..పొద్దున్నే లెమన్ జ్యూస్ తాగుతాను. నా డైట్లో తాజా పండ్లు తప్పకుండా ఉంటాయి. అలాగే తగినన్ని మంచినీళ్లూ తాగుతుంటాను. ట్యాన్ ఫ్రీ స్కిన్ కోసం.. సమయం చిక్కినప్పుడల్లా టొమాటో గుజ్జును చేతులు, కాళ్ల మీద అప్లయ్ చేస్తాను. ఇక ఫేస్‌ప్యాక్ విషయానికి వస్తే పెరుగులో కొంచెం తేనె, కాసింత నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటాను. దీంతో ముఖం నున్నగా.. కాంతిమంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చింది. -
Nidhi Agarwal Photos: క్యూట్ లుక్ తో అదరగొడుతున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)
-
పాపం, టైం బ్యాడ్ అంటూ ట్రోలింగ్.. స్పందించిన హీరోయిన్
ఏ రంగంలోనైనా సక్సెస్‌తోనే ఏదైనా ముడిపడి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నా విజయం వరించకపోతే అవకాశాలు దరిచేరవు. ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ పరిస్థితి ఇలాంటిదే! చూడచక్కని అందం ఈ చిన్నదాని సొంతం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నిధి అగర్వాల్ నటించింది. వాటిలో తెలుగులో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టింది. తమిళంలో జయం రవి సరసన భూమి, శింబుతో ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కలగ తలైవన్ చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవి నిధి అగర్వాల్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై స్పందించిన నిధి అగర్వాల్ ఒక భేటీలో మాట్లాడుతూ.. నటన విషయంలో తానే కాదు పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొంది. అదే విధంగా నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిజమే, తాను ఇప్పటివరకు సినిమాల్లో అందంగా కనిపించాలన్న విషయంపైనే దృష్టి సారించానని, అలా గ్లామరస్ పాత్రలో నటించానని చెప్పింది. అయితే ఇప్పుడు నటన గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను చూస్తూ తన నటనకు మెరుగులు దిద్దుకుంటున్నట్లు చెప్పింది. ఇకపై ప్రతిభావంతులైన దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర పోషిస్తున్నానని, ఇది తన సినీ కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి భార్యకు విడాకులిచ్చి ప్రేయసితో నటుడి సహజీవనం -
రూమర్లు ఎక్కువ, అవకాశాలు తక్కువ.. ఛాన్సుల కోసం నిధి
హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించినా సరైన గుర్తింపు లభించలేదు. టాలీవుడ్లో ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ మూవీలో భాగమయినప్పటికీ స్టార్ ఇమేజ్ ఆమెకు అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. కోలీవుడ్‌లోనూ జయం రవి, శింబు, ఉదయనిధి స్టాలిన్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే ఈమెకు ఇక్కడ విజయాల కంటే వదంతులే ఎక్కువగా వచ్చాయని చెప్పవచ్చు. నటుడు శింబుకు జంటగా ఈశ్వరం చిత్రంలో నటించినప్పుడు ఆయనతో ప్రేమాయణం అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ సరసన కలగతలైవన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకుంది.ఇందులో గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అయినా కోలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమైపోయింది. ఇక తెలుగులో కూడా ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. పవన్ కళ్యాణ్‌కు జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రమే అది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. దీంతో నిధి అగర్వాల్ ఇప్పుడు అవకాశాల వేటలో పడింది. ఇందుకు గ్లామర్ బాటను ఎంచుకుంది. అలా ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని తీయించుకున్న గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఆమెకు ఎంతవరకూ ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)చదవండి: తీర్పు కోసం జైలు చుట్టూ తిరుగుతున్న స్టార్స్ -
దేనికైనా అదృష్టం ఉండాలి: నిధి అగర్వాల్
సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమని అంటోంది నటి నిధి అగర్వాల్. ఆకర్షణీయమైన అందం ఈమె సొంతం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తున్నా ఆ స్థాయిలో పెద్ద హిట్లు సాధించలేకపోతోంది. తమిళంలో జయం రవికి జంటగా భూమి, శింబు సరసన ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్‌తో కలగతలైవన్ చిత్రాలు చేసింది. వీటిల్లో ఏది ఈ అమ్మడి కెరీర్‌కు ప్లస్ కాలేదనే చెప్పాలి. ఇటీవల నిధి అగర్వాల్ ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. తాను అదృష్టాన్ని నమ్ముతానని చెప్పింది. అది లేకపోతే ఎవరికి ఏదీ కుదరదని పేర్కొంది. ముఖ్యంగా సినిమా రంగంలో అదృష్టం చాలా అవసరమని చెప్పింది. ఉదాహరణకు కొన్ని కథలు వినడానికి అద్భుతంగా ఉంటాయని.. అయితే చివరికి చిత్రం వేరే విధంగా వస్తుందని పేర్కొంది. అదే విధంగా పేపర్‌పై సుమారుగా ఉన్న కథలు తెరపై చూస్తే బ్రహ్మాండంగా ఉండి ఆశ్చర్యపరుస్తాయని తెలిపింది. అందుకు కారణం 90 శాతం అదృష్టమే అని తాను భావిస్తానంది. ఇకపోతే కథలను ఆశతో ఎంపిక చేసుకునే స్థాయికి తాను చేరుకున్నానని భావించడం లేదని చెప్పింది. అయితే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని, ముఖ్యంగా నాట్యానికి ప్రముఖ్యత ఉన్న కథా చిత్రంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్నా నటన పరంగా ఎలాంటి వ్యత్యాసం లేదని అయితే వ్యాపారపరంగా చాలా తేడా ఉంటుందని నటి నిధి అగర్వాల్ పేర్కొంది. -
మత్తు కళ్లతో మలైక.. మతిపోగొడుతున్న అనసూయ
సోషల్ హల్చల్: ► క్యూట్ లుక్స్‌తో మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి ► మత్తు కళ్లలో ఫిదా చేస్తున్న మలైకా అరోరా ► పరికిణిలో సాంప్రదాయబద్దంగా నటి హిమజ ► వింటర్లో వైన్ గ్లాసుతో డిజైనర్ కోమల్ పాండే ► వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న యాంకర్ అనసూయ ► ప్రియుడిని పెళ్లాడిన కేరింత బ్యూటీ సుకృతి View this post on Instagram A post shared by Khanna Jewellers (@khannajewellerskj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) -
Nidhi Agarwal: ఆయనకు జతగా అవకాశం వస్తే చాలు.. పారితోషికం వద్దు
స్టార్ ఇమేజ్ కోసం ఐదేళ్లుగా పోరాడుతున్న నటి నిధి అగర్వాల్. ఈ హైదరాబాద్ బ్యూటీ తొలుత బాలీవుడ్‌లోకి ప్రవేశం చేసినా అక్కడ వర్కౌట్ కాకపోవడంతో తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. హలో ఆమె నటించిన సవ్యసాచి చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత రామ్‌తో జత కట్టిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయాన్ని సాధించినా అది దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్‌ల ఖాతాలోనే చేరిపోయింది మినహా నిధి అగర్వాల్‌కి పెద్దగా ఉపయోగ పడలేదనే చెప్పాలి. కారణం తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమి రావడం లేదు. ఇంతకుముందు ఎప్పుడో పవన్ కళ్యాణ్‌కు జంటగా కమిట్ అయిన హరి హర వీరమల్లు చిత్రం ఒకటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉంది. దీంతో నిధి అగర్వాల్ దృష్టి ఇతర భాషా చిత్రాలపై పడింది. అలా తమిళంలో శింబుతో చేసిన ఈశ్వరన్ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఇక రవి సరసన నటించిన భూమి చిత్రం బాగుందనపించినా, అది ఓటీటీలో విడుదల కావడంతో ఈమె కెరీర్‌కి ప్లస్ కాలేకపోయింది. తాజాగా ఉదయ నిధి స్టాలిన్‌తో జతకట్టిన కలగ తలైవన్పై నిధి అగర్వాల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రం కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో నెక్ట్స్ ఏంటి అనే ఆలోచనలో పడ్డ నిధి అగర్వాల్ తాజాగా నటుడు ధనుష్‌కు గాలం వేసే పనిలో పడింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో బిజీగా ఉన్న నటుడు ధనుష్. దీంతో ఆయనతో జతకట్టాలని ఆకాంక్షను నిధి అగర్వాల్ వ్యక్తం చేసింది. ఆమె ఒక భేటీలో పేర్కొంటూ ధనుష్‌తో నటించే అవకాశం వస్తే పారితోషికం కూడా తీసుకోను అని పేర్కొంది. మరి ఈ ప్రయత్నం అయినా ఫలవంతం అవుతుందో లేదో చూడాలి. -
ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్
నటి నిధి అగర్వాల్ ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు శింబు సరసన ఈశ్వరన్, జయం రవికి జంటగా భూమి చిత్రాల్లో మెరిసింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కలగ తలైవన్ చిత్రంలో నాయికగా నటించింది. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా నటి నిధి అగర్వాల్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కలగ సంఘం చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఒకసారి దర్శకుడు మగిళ్ తిరుమేణి నుంచి ఫోన్ వచ్చిందని, వెంటనే ఆయన్ని కలుస్తానని చెప్పానంది. అలా కలిసిన వెంటనే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోమని చెప్పారంది. ఆ తర్వాత ఆయన తన ముఖ కవళికలను మాత్రమే ఫొటో షూట్ చేశారని చెప్పింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించాలని తెలిపారు. ఇందులో నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పింది. ఆయన సహ నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారంది. ఉదయనిధి స్టాలిన్‌కు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, పనుల ఒత్తిడి ఉంటుందని, అయితే వాటిని షూటింగ్లో ఎప్పుడు కనబరిచే వారు కాదని చెప్పింది. తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పటి నుంచి తమిళభాషను నేర్చుకుంటున్నానని నిధి అగర్వాల్ తెలిపింది. చదవండి: మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్ ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. -
నిధి అగర్వాల్ ఇకపై నటిస్తుందో, లేదో?. హీరో షాకింగ్ కామెంట్స్
తమిళసినిమా: నెంజిక్కు నీతి వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఉదయనిధి స్టాలిన్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. అలా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రాల్లో ఒకటి కలగ తలైవన్. తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఈయన నిర్మించిన ఈ చిత్రంలో ఈశ్వరన్, భూమి చిత్రాల ఫేమ్ నిధిఅగర్వాల్ కథా నాయకిగా నటించింది. బిగ్‌బాస్ ఆరవ్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి మీగామన్, తోడు చిత్రాల ఫేమ్ మేడి న్ తిరుమేణి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ దేవా సంగీతం, దిల్ రాజు చాయాగ్రహణం అందించిన ఈ చి త్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ నెల 18వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పా ల్గొన్న శాసనసభ్యుడు, చిత్ర కథానాయకుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ దర్శకుడు చిత్రాన్ని చాలా చక్కగా, త్వరగా చిత్రీకరించా రని పేర్కొన్నారు. అయితే దీన్ని మూ డేళ్లుగా చెక్కుకుంటూ వచ్చారన్నారు. ఈనెల 18వ తేదీన విడుదల చేయాలని చెప్పామని, లేకపోతే ఇంకా దీన్ని చెక్కుతూనే ఉండేవారని, అంత పర్ఫెక్ట్గా కలగ తలైవన్ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దారని తెలిపారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో తనకంటే కథానాయకి నిధిఅగర్వాల్నే ఎక్కువగా శ్రమించారని, ఆమెకే ఎక్కువగా ఫైట్స్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, వాటి కోసం ఆమె దెబ్బలు తింటూ చాలానే కష్టపడ్డారని చెప్పారు. పాపం ఆమె మళ్లీ తమిళ చిత్రాల్లో నటిస్తుందో? లేదో అని సరదాగా వ్యాఖ్యానించారు. దీని తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న మా మన్నన్ చిత్రం విడుదల కానుందని తెలిపారు. కాగా అందరూ చిత్రాల నుంచి వైదొలగవద్దని చెబుతున్నారని తెలి పారు. తాను నటించడం మొదలెట్టిందే ఇప్పుడే అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. -
అందుకే స్టార్ హీరో సినిమాలో ఛాన్సులు వస్తున్నాయి : నిధి అగర్వాల్
తమిళసినిమా: గ్లామర్‌ను నమ్ముకున్న యువ కథానాయికల్లో నటి నిధి అగర్వాల్ ఒకరు. అయినా ఈ అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి. 2017లో మున్నా మైఖేల్ చిత్రం ద్వారా కథానాయికగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత అక్కడ అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ 2018లో సవ్యసాచి అనే చిత్రంతో పరిచయం అయ్యింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అదే ఏడాది ఈశ్వరన్ చిత్రం ద్వారా కోలివుడ్‌కు వచ్చింది. శింబుకు జంటగా నటించిన ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా నిధి అగర్వాల్ మాత్రం బాగానే వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం నటుడు శింబుతో ప్రేమాయణం అనే ప్రచారం వైరల్ కావడమే. అలాగే తమిళంలో జయం రవికి జంటగా భూమి అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం మంచి ప్రశంసలు అందుకున్నా, ఓటీటీలో విడుదల కావడంతో ఈమెకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. దీంతో ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. ప్రస్తుతం కళగ తలైవన్ అనే చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ఇక తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం ఎప్పుడు పూర్తవుతుందో? ఆ చిత్ర దర్శక నిర్మాతలకే తెలియడం లేదు. దీంతో అవకాశాల వేటలో పడ్డ నిధి అగర్వాల్ గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. దీని గురించి ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ ఇక్కడ ప్రతిభకు విలువ లేదంది. గ్లామర్‌కే ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా అందాలను ఆరబోసే వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారంది. అయితే 20 శాతం మంది మాత్రమే ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది. మరో విషయం ఏంటంటే తనకు ఇక్కడ స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు రావడానికి కారణం పారితోషికమే అని చెప్పింది. ప్రముఖ హీరోయిన్లు డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇవ్వడానికి ఇష్టపడని దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. కాగా ఈ అమ్మడు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకే పారితోషికం తీసుకుంటుందని సమాచారం. -
ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు..: ‘ఇస్మార్ట్’ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ చైతన్య ‘సవ్యసాచి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిధి అగర్వాల్. ఆ తర్వాత రామ్ సరసన ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించి తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది. మరోవైపు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్గా పుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే ఈ సందర్భంగా నిధి పరిశ్రమలో హీరోయిన్లను కేవలం గ్లామర్ షో కోసమే అన్నట్టు చూస్తారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. అందం కూడా ఉండాలి. కేవలం టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు హీరోయిన్ అందంగా ఉందా? లేదా? అనేదే చూస్తారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరోయిన్ పని గ్లామర్ షో చేయడమే. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్ ప్రేక్షకులు చూసేది కూడా అదే. అందుకే నేను గ్లామర్ షో చేసేందుకు వెనుకాడను. డైరెక్టర్లు అడిగితే కాదని కూడా చెప్పను. ఇక పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే అసలు వదులుకోను. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎలాంటి డిమాండ్ చేయను. వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. కాకపోతే నా మినిమం పారితోషికం ఇంత అని మాత్రం చెప్తాను. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా చేస్తే ఆ తర్వాత అవకాశాలు తప్పకుండా వస్తాయని నేను నమ్ముతాను’ అని అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. -
ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన నిధి అగర్వాల్
నెంజుక్కు నీది సినిమా తరువాత ఉదయనిధి స్టాలిన్ మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో మామన్నన్ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తీ సురేష్, వడివేలు, భగత్ బాసిల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ స్థితిలో మజిద్ తిరుమేని దర్శకత్వంలో ఉదయనిధి కొత్త చిత్రంలో నటిస్తారని రెండేళ్ల క్రితమే ప్రకటించింది. కాగా ఈ చిత్ర బృందం ఇప్పుడు సినిమా టైటిల్‌ను వెల్లడించింది. కలగ తలైవన్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా, అరోల్ కొరెల్లి సంగీతం అందిస్తున్నారు. -
Nidhi Agarwal: అసలే భర్త పరిస్థితి బాగాలేదు.. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్.. అయినా సరే!
ఎంతో ఆనందంగా సాగిపోతున్న పచ్చని సంసారంలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన ఉపద్రవాలు కుటుంబంలోని సంతోషాన్ని చిదిమేశాయి. అయినా తట్టుకుని నిలబడి, మరెంతో మంది అభాగ్యుల జీవితాల్లో సంతోషం అనే పువ్వులు పూయిస్తోంది ఆ ఇంటి ఇల్లాలు నిధీ అగర్వాల్. ఢిల్లీకి చెందిన నిధీ అగర్వాల్ భర్త అతుల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో లాజిస్టిక్ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. 2012లో అరుదైన వ్యాధి ‘మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ’ వచ్చింది. దీంతో అతుల్ మెదడులోని కణాలు క్రమంగా క్షీణించడంతో శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. దీంతో మాటలు, శరీరంలో కదలికలు ఆగిపోయి మంచానికే పరిమితమయ్యాడు. రోజులు గడిచే కొద్ది ఆహారం కూడా తీసుకోవడం కష్టమైంది. పైపు ద్వారా తీసుకోవాల్సి వచ్చింది. పచ్చని సంసారంలో ఏర్పడిన ఈ విపత్తు నుంచి కోలుకోక ముందే, నిధీ అగర్వాల్‌కు ఆరోగ్యం బాగుండకపోవడంతో పరీక్షలు చేసిన వైద్యులు 2014 లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అసలే భర్త పరిస్థితి బాగాలేదు. ఈ సమయంలో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తెలియడంతో బాధను ఆపుకోలేకపోయింది. అయితే అదృష్టవశాత్తూ తొలిదశలోనే తెలియడం కొంత మెరుగైంది. తనకొచ్చిన కష్టాన్ని దిగమింగుకుని కీమోథెర పీ తీసుకుని కాస్త కుదుటపడింది. ఆతరువాత బ్యూటీ థెరపీ తీసుకుంది. ఈ థెరపీ తో నిధీ అగర్వాల్‌కు కొంత ఉపశాంతితోపాటు, జీవితంపై ఆశలు చిగురించాయి. బ్లిస్ ఫౌండేషన్.. తనలాగా అనేక కుటుంబ కష్టాలు, వివిధ రకాల రోగాలతో బాధపడుతోన్న వారికి బ్యూటీథెరపీతో తను పొందిన ఉపశాంతిని అందించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే తన కొడుకు సాయంతో ‘బ్లిస్ ఫౌండేషన్’ను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ ద్వారా.. క్యాన్సర్ రోగులకు బ్యూటీ థెరపీ అందిస్తోంది. ఈ థెరపీలో భాగంగా రోగులకు మేకప్ వేయడంతోపాటు, మోడల్ హెయిర్ స్టైల్స్‌తో అందంగా, సరికొత్తగా చూపిస్తూ వారికి జీవితం మీద ఆశలు కల్పిస్తోంది. రోగులను అందంగా అలంకరించి వారిని ర్యాంప్ వాక్ చేయించి వారిలో రోగులమన్న భావనను తీసివేసేందుకు కృషి చేయసాగింది. జుంబా కూడా.. బ్యూటీ థెరపీతోపాటు జుంబా, థియేటర్ థెరపీ తో రోగుల బాధాకర భావోద్వేగాలను నియంత్రిస్తోంది. ఈ థెరపీలే కాదు, క్యాన్సర్‌ను ఎలా జయించాలో తెలిపే అవగాహన కార్యక్రమాలను ‘క్యాన్సర్ సర్వైవర్ మంత్’ పేరిట నిర్వహిస్తోంది. క్యాన్సర్‌ను తొలిదశలో ఎలా గుర్తించాలి? ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలో అవగాహన కార్యక్రమాల ద్వారా వివరిస్తూ అనేకమంది రోగులకు సాంత్వన కలిగిస్తోంది. కష్టాలను జయిస్తూనే, సంతోషంగా ఎలా ఉండవచ్చనే మాటకు ఉదాహరణగా నిలుస్తోంది నిధీ అగర్వాల్. చదవండి: Surat Old Couple Inspirational Story: కూతురి జుట్టు బాగా ఊడిపోవడం చూసి... ఇంటర్నెట్లో వెదికి.. వృద్ధ దంపతులు! -
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు.. ఆ హీరోతో నిధి వివాహం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లవ్ ఎఫైర్ మరోసారి తెరమీదకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఈ నిధి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్న నిధి షూటింగ్ పూర్తయిన వెంటనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తుందట.కాగా ఈశ్వరన్ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నిధి ఆ సినిమా సమయంలోనే శింబుతో ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్ టాక్. మరి నిధి-శింబుల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్స్‌తో లవ్ ట్రాక్ నడిపిన శింబు ఈసారి అయినా పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. -
ఓటీటీలోకి మహేశ్ మేనల్లుడి సినిమా.. ఎప్పటి నుంచంటే..
Hero Movie OTT Platform: యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
స్టార్ హీరోతో నిధి అగర్వాల్ పెళ్లి? త్వరలోనే అనౌన్స్మెంట్!
Will Nidhi Agarwal And Simbu To Get Married Soon?: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరు త్వరలోనే ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ టాక్. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత కొంతకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కథనాలు వెలుడుతున్నాయి. ఈ వార్తలపై ఇంతవరకు స్పందించని ఈ జంట త్వరలోనే తమ పెళ్లి కబురు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా మానాడు చిత్రంతో హిట్ అందుకున్న శింబు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అటు నిధి సైతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. -
పాతికేళ్ల తర్వాత వెంకీ.. 20 ఏళ్ల తర్వాత నాగార్జున!
బాలీవుడ్ తెరపై ఎన్నేళ్లయింది నాగ్ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది వెంకీ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది రాశీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లయింది నిధీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లకెన్నేళ్లకు అంటోంది బాలీవుడ్. మరి.. హిందీలో వెంకటేశ్ కనిపించి పాతికేళ్లయింది. నాగార్జున దాదాపు 20 ఏళ్లు. రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్ చిన్న బ్రేక్ తర్వాత హిందీ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్లో ఈ నలుగురూ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. కెరీర్లో దాదాపు 75 సినిమాలు చేశారు వెంకటేశ్. వాటిలో దాదాపు పాతిక రీమేక్సే ఉంటాయి. అసలు బాలీవుడ్లో వెంకటేశ్ వేసిన తొలి అడుగు కూడా రీమేక్‌తోనే పడింది. 1991లో వచ్చిన తమిళ చిత్రం ‘చిన్న తంబి’ (ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘చంటి’గా రీమేక్ చేశారు) హిందీ రీమేక్ ‘అనాడీ’తో వెంకటేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1993లో ఈ చిత్రం బీ టౌన్లో మంచి హిట్ సాధించింది. వెంకీకి హిందీలోనూ పాపులారిటీ పెరిగింది. ఇక హిందీలో వెంకీ చేసిన రెండో సినిమా కూడా రీమేకే కావడం విశేషం. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా పరిచయమైన ‘యమలీల’ చిత్రం అప్పట్లో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ ‘తక్దీర్వాలా’లో వెంకటేశ్ హీరోగా చేశారు. ఆ తర్వాత బాలీవుడ్లో మరో మూవీ చేయడానికి వెంకీ ఆసక్తి చూపించలేదు. కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ హీరోలుగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ ఫిల్మ్ రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే తెలుగులో హిట్ సాధించిన ‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో వెంకటేశ్, అర్జున్ కపూర్ నటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. మరోవైపు ‘శివ, ద్రోహి, క్రిమినల్, అగ్ని వర్ష్’... ఇలా హిందీలో దాదాపు పది సినిమాలు చేశారు నాగార్జున. 2003లో వచ్చిన హిందీ చిత్రం ‘ఎల్ఓసీ: కార్గిల్’లో ఓ లీడ్ రోల్ చేసిన నాగార్జున ఆ తర్వాత హిందీ సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మూడు భాగాలుగా విడుదల కానున్న హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రయాలజీ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లు కాగా, అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా ఇతర ప్రధాన తారాగణంగా కనిపిస్తారు.‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఇక అందాల తార రాశీ ఖన్నా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ బీ టౌన్ వైపు వెళ్లారు. 2013లో వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’తో నటిగా రాశీ ఖన్నా కెరీర్ ఆరంభమైంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత రాశీకి హిందీలో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగులో మాత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో హీరోయిన్గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్కసారిగా రాశీకి అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఎనిమిది సంత్సరాల వరకు రాశీ డైరీ సౌత్ సినిమాలతో ఖాళీ లేకుండా పోయింది. అయితే తాజాగా తన డైరీలో ‘యోధ’ అనే హిందీ సినిమాకు రాశీ ఖన్నా చోటు కల్పించారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాగర్ అమ్రే, పుష్కర్ ఓజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ మరో హీరోయిన్. యాక్షన్ మూవీ ‘యోధ’ ఈ ఏడాది నవంబరు 11న విడుదల కానుంది. అయితే రాశీ కేవలం హిందీలో సినిమా మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లూ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ‘రుద్ర’, షాహిద్ కపూర్ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌ను ఆమె ఆల్రెడీ పూర్తి చేసేశారు. ఈ ఏడాదే ఈ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. సేమ్ టు సేమ్ రాశీ ఖన్నాలానే నిధి ముందు హిందీ సినిమా ద్వారానే కథానాయిక అయ్యారు. ‘మున్నా మైఖేల్’ (2017) అనే సినిమాతో హిందీ తెరపై తొలిసారి కనిపించారు. తాజాగా హిందీలో ఓ పెద్ద సినిమా అంగీకరించి నట్లుగా నిధీ అగర్వాల్ తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.ఈ నలుగురే కాదు.. మరికొందరు తారలు ‘బ్యాక్ టు బాలీవుడ్’ అంటూ హిందీ ప్రాజెక్ట్స్ అంగీకరించే పనిలో ఉన్నారు -
అంబ్రేన్ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్..!
భారతదేశంలో అతిపెద్ద మేక్ ఇన్ ఇండియా మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్ అంబ్రేన్ తన సరికొత్త డాట్స్ మ్యూస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ 23 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ.1999గా కంపెనీ పేర్కొంది. ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో ఇందులో బూస్ట్ చేసిన డ్రైవర్ల వల్ల 23 గంటల ప్లేటైమ్ వస్తుంది. దీనికి 365 రోజుల వారంటీ కూడా ఉంది. ఈ ప్రొడక్ట్ Flipkart, Tata Cliq, భారతదేశంలోని అనేక ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. క్లాసిక్ స్టైల్‌తో కూడిన ఈ కాంపాక్ట్ ఇయర్‌బడ్‌లు స్పష్టమైన సంభాషణల కోసం అధిక-నాణ్యత గల ఇన్-బిల్ట్ మైక్రోఫోన్లను కలిగి ఉంటాయి. ఈ వైర్లెస్ ఇయర్‌బడ్‌ల పరిధి 10మీ. ఇవి సరికొత్త బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఇయర్ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్, సిరి కోసం వాయిస్ యాక్టివేషన్ కూడా ఉంది. అంబ్రేన్ ప్రస్తుతం భారతదేశంలో టీడబ్ల్యూఎస్‌లో బలమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. డాట్స్ సిరీస్‌లో - డాట్స్ స్లే, డాట్స్ 38, డాట్స్ 11, డాట్స్ ట్యూన్ &నియోబడ్స్ 11 & 33 ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో అంబ్రేన్ డాట్స్ మ్యూస్ టీడబ్ల్యూఎస్ కోసం బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్గా నటి నిధి అగర్వాల్ సంతకం చేసింది. (చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..!) -
పదిహేనేళ్ల తర్వాత ‘హీరో’ కోసం థియేటర్‌కు వెళ్లాను : జగపతిబాబు
‘‘పదిహేనేళ్లుగా థియేటర్స్‌కు వెళ్లని నేను ‘హీరో’ సినిమా కోసం వెళ్లాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. పెద్ద సినిమాల్లో నటించిన నాకు కొత్త దర్శకులతో చేయాలనిపించలేదు. అందుకే ‘హీరో’ చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా? లేదా అనిపించింది. కానీ నా అంచనాలు తారుమారయ్యేలా చేశారు దర్శకుడు శ్రీరామ్. ఈ సినిమా చూశాక గతంలో నేను చేసిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం గుర్తొచ్చింది. అశోక్‌లో మంచి తపన కనిపించింది’’ అన్నారు జగపతిబాబు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో అశోక్ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్యలో సినిమా చూశాను. వారి పాజిటివ్ రెస్పాన్స్ తెలిసింది’’ అన్నారు. ‘‘అశోక్ పడిన కష్టం తెరపై తెలుస్తోంది. థియేటర్స్‌లో నిజమైన పండగ కనిపిస్తోంది’’ అన్నారు శ్రీరామ్. ∙శ్రీరామ్ ఆదిత్య, నిధీ అగర్వాల్, గల్లా జయదేవ్, పద్మావతి, అశోక్, జగపతిబాబు -
‘హీరో ’మూవీ రివ్యూ
టైటిల్: హీరో నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు నిర్మాత : పద్మావతి గల్లా దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య టి సంగీతం : జిబ్రాన్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ టాలీవుడ్లోకి వారసుల ఎంట్రీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన కొంత మంది హీరోలు..తమ వారసులను సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్‌బాబు మేనల్లుడు, కృష్ణ మనవడు గల్లా అశోక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘హీరో’.ఈ మూవీ సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 15)న విడుదలైంది. ‘హీరో’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘హీరో’కథేంటంటే..? మధ్యతరగతి కుటుంబానికి చెందిన అర్జున్(అశోక్) చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కలలు కంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. అదే క్రమంలో తాను ఉంటున్న అపార్ట్మెంట్లోని పక్క ప్లాట్‌లోకి వచ్చిన పశువుల వైధ్యురాలు సుబ్బు అలియాస్ సుభద్ర(నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయాణం సాఫీగా సాగుతున్న క్రమంలో అర్జున్‌కు ఒక కొరియర్ వస్తుంది. అందులో ఓ గన్ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. అనుకోకుండా ఓ క్రైమ్ కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ గన్ ఎక్కడ నుంచి వచ్చింది? క్రైమ్ కేసు నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు తండ్రి(జగపతిబాబు)తో ఆ గన్‌కు ఉన్న సంబంధం ఏంటి? సుబ్బు ప్రేమను అర్జున్ ఎలా దక్కించుకున్నాడు? హీరో అవ్వాలనే అర్జున్ కోరిక నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. అశోక్ గల్లాకి ఇది తొలి సినిమా. కానీ ఆ విషయంలో తెరపై ఎక్కడా కనిపించలేదు. అర్జున్ పాత్రలో అశోక్ ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్ బాగుంది. ఫైట్ సీన్స్‌తో పాటు డాన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక సుబ్బుగా నిధి అగర్వాల్ మరోసారి తెరపై తనదైన అందాలతో అలరించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అశోక్ , నిధిల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇక హరో స్నేహితుడు, రాప్ సింగర్‌గా సత్య తనదైన కామెడీతో నవ్వించాడు. హీరోయిన్ తండ్రిగా జగపతి బాబు నటన ఆటకుంటుంది. చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. క్లైమాక్స్‌లో మాత్రం నవ్వించాడు. హీరో తండ్రిగా నరేశ్ తనదైన నటనతో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ సలీమ్ భాయ్ పాత్రలో రవికిషన్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో సినిమా హీరోగా బ్రహ్మజీ అయితే ఫుల్‌గా నవ్విస్తాడు. కోట శ్రీనివాసరావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? శమంతకమణి, భలేమంచి రోజు, దేవదాస్ చిత్రాలలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీరామ్ ఆదిత్య.. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హీరో’ని తెరకెక్కించాడు. ఓ కామెడీ కథకి ముంబై మాఫియా లింకులు కలిపి ఫన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా రోటీన్‌గా సాగినప్పటికీ.. ప్రేక్షకుడికి మాత్రం బోర్ కొట్టించకుండా కామెడీతో మెప్పించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథ రోటీన్ కామెడీతో సాగడం సినిమాకు కాస్త మైనస్. జగపతి బాబు ప్లాష్ బ్యాక్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించుకున్న ప్రేక్షకుడికి.. ఆయన్ని కామెడీ పీస్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కామెడీ పండించడంలో భాగంగానే జగపతిబాబుని అలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక క్లైమాక్స్‌లో బ్రహ్మాజీ ఎంట్రీ అయితే అదిరిపోయింది. సినిమా హీరోగా బ్రహ్మాజీ పండించిన కామెడీ.. నవ్వులు పూయిస్తుంది. స్క్రీన్‌ప్లే బాగుంది. రోటీన్ కథనే.. డీసెంట్ కామెడీతో కాస్త డిఫరెంట్‌గా చూపించాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. జిబ్రాన్ సంగీతం ఆకట్టుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జుంబారే పాటతో పాటు రాప్ సాంగ్ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది.ఈ సినిమాకి నిర్మాణ విలువలు మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మొత్తంగా కొన్ని లాజిక్స్‌ని పక్కనపెట్టి చూస్తే ఈ సంక్రాంతికి ‘హీరో’ ఎంటర్టైన్ చేస్తాడు. -
ఆకట్టుకుంటున్న హీరో మూవీ ట్రైలర్, జక్కన్న చేతుల మీదుగా రిలీజ్
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలనే వేగవంతం చేసిన చిత్ర బృందంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా దర్శక ధీరుడు రాజమౌళి హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ చేశాడు. కాగా నేడు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు మరణించడంతో ఈవెంట్‌ను క్యాన్సల్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాజమౌళి చేతుల మీదుగా సోమవారం ట్రైలర్‌ను విడుదల చేయించింది మూవీ యూనిట్. చదవండి: Khushbu Sundar: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి ఇక ట్రైలర్ విషయానికోస్తే లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ అంశాలను ప్రధానంగా తీసుకుని మేకరస్ ట్రైలర్‌పై దృష్టి పెట్టారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ సాంతం ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అశోక్ గల్లా జోడీగా నిధి అగర్వాల్ నటించింది. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో విలక్షణ నటుడు జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక అజయ్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీతో పాటు పలువురు నటీనటులు ఈ చిత్రంలో అలరించనున్నారు. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ -
సొగసుల నిధీని బయట పెట్టిన నిధీ అగర్వాల్..
-
స్టార్ హీరోతో లవ్‌లో పడ్డ నిధి, అతడి ఇంట్లోనే మకాం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రెండుమూడుసార్లు ప్రేమలో విఫలమైన శింబుతో ఆమె లవ్‌లో పడిందని, త్వరలో వీళ్లిద్దరూ ఏడడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారంటూ ఓ క్రేజీ గాసిప్ సినీప్రియులను ఆకర్షిస్తోంది. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఇది గతేడాది జనవరిలో రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట! కరోనా టైంలో లవ్‌లో పడ్డ నిధి కొంతకాలంగా చెన్నైలోని శింబు ఇంట్లోనే ఉంటోందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే! కాగా 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. గతేడాది 'ఈశ్వరన్'తో కోలీవుడ్‌లో లక్ పరీక్షించుకున్న ఆమె ప్రస్తుతం 'హీరో', 'హరిహర వీరమల్లు' సహా ఒక తమిళ చిత్రం చేస్తోంది. శింబు విషయానికి వస్తే 'మానాడు' సినిమాతో ఈ మధ్యే మంచి సక్సెస్ అందుకున్నాడీ హీరో. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం శింబు చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. అప్సరసలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫొటోలు చూసేయండి -
అశోక్ గల్లా ‘హీరో’ సినిమా ప్రెస్‌మీట్
-
అందుకే సంక్రాంతికి వస్తున్నాం: ఆదిశేషగిరి రావు
‘‘సినిమాలో కంటెంట్ ఉంటే సంక్రాంతికి రెండు మూడు విడుదలయినా కూడా నిలబడతాయి. మంచి కథ ఉన్నందుకే ‘హీరో’ను సంక్రాంతికి తీసుకొస్తున్నాం’’ అని నిర్మాత జి. ఆదిశేషగిరి రావు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సూపర్ స్టార్ కృష్ణగారి ‘పచ్చని సంసారం’ చిత్రంలో అశోక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అప్పటి నుంచే నటనపై ఆసక్తి పుట్టినట్టుంది. స్టార్స్‌కు, మాస్ హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనకు ఉన్నాయి’’ అన్నారు. ‘‘హీరో’ని జనవరి 15న విడుదల చేయమని కృష్ణగారు చెప్పారు’’ అన్నారు ఎంపీ గల్లా జయదేవ్. ‘‘హీరో’ సినిమాలో అశోక్‌ను చూస్తుంటే నాన్నగారే (కృష్ణ) ఎక్కువగా గుర్తొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లో మహేశ్‌బాబు కనిపించాడు’’ అన్నారు పద్మావతి గల్లా. ‘‘మా సినిమాను ఈ నెల 26న విడుదల చేద్దామనుకున్నాం కానీ కొన్ని సినిమాలు వాయిదా పడటంతో సంక్రాంతికి వస్తున్నాం’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ‘‘నా కల నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో కృష్ణగారు, మహేశ్‌బాబుగారు ఎలాంటి ప్రత్యేక పాత్రలో కనిపించరు’’ అన్నారు అశోక్ గల్లా. -
నిధి అగర్వాల్‌కు ‘హరి హర వీరమల్లు' సర్ప్రైజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్గా నటిస్తుంది. మంగళవారం (ఆగస్టు17)న నిధి అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాకు సంబంధించి ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పంచమి అనే పాత్రలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ కనిపించనుంది. నిండైన చీరకట్టు, నాట్యం చేస్తున్నట్లున్న నిధి లుక్ ఆకట్టుకుంటుంది. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా సినిమా నేపథ్యం ఉండనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన వన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లిమ్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ బందిపోటు దారుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. నిధి అగర్వాల్‌తో పాటు జాక్వలైన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్గా నటించనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. చదవండి :షూటింగ్ చేస్తుండగా చంపేస్తామని బెదిరించారు: సత్యదేవ్ (Bheemla Nayak: కేక పెట్టిస్తున్న ఫస్ట్ గ్లింప్స్, పవన్ ఎంట్రీ అదుర్స్) Beauty as ELEGANT & RADIANT as the Moon… We wish our gorgeous #PANCHAMI @AgerwalNidhhi a very Happy Birthday! ❤️ - Team #HariHaraVeeraMallu @PawanKalyan @AMRatnamOfI @ADayakarRao2 @mmkeeravaani @gnanashekarvs @saimadhav_burra @benlock @aishureddy82 @HHVMFilm pic.twitter.com/U4PL2aIqKI — Krish Jagarlamudi (@DirKrish) August 17, 2021 -
సెట్లో హీరోయిన్ ముందు‘సోనూసూద్’ కంటతడి.. వీడియో వైరల్
రియల్ హీరో సోనూసూద్ షూటింగ్ సెట్లో కంటతడి పెట్టాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచి ధైర్యం చెప్పిన ఈ గొప్ప మానవతావాది.. సెట్లో, అదీ కూడా హీరోయిన్ ముందు ఎందుకు ఏడ్చాడనేగా మీ అనుమానం. దానికి ఒక కారణం ఉంది. ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో సోనూ సూద్, నిధీ అగర్వాల్ జంటగా ‘సాత్ క్యా నిభావోగే’పాట తెరకెక్కిన విషయం తెలిసిందే. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడిన సూపర్ డూపర్ హిట్ ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ ఇది. ఈ పాటలో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది. ఈ పాటను టోనీ కక్కర్ రచించడంతో పాటు అల్లాఫ్రాజ్తో కలిసిఆలపించాడు. ఈ నెల 9న ఈ పాట విడుదలైంది. అయితే దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో ఆయన హీరోయిన్ కూర్చున కెమెరా ట్రాలీ లాగుతూ కనిపించారు. ‘ఓ హిట్ సాంగ్ తీయాలంటే ఎంతో కష్టపడాలి’ అంటూ కంట తడిపెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) చక్కని ప్రేమ కథ ఈ వీడియో లో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది. కొంతమంది గుండాలను పట్టుకోవడానికి పోలీస్ అధికారి సోనూసూద్ పబ్ లోకి ఎంటర్ అయ్యి, వారిని పట్టుకుంటాడు. అదే పబ్ లో అతని మాజీ ప్రేయసి నిధి అగర్వాల్ డాన్సర్ గా ఉండటం చూసి ఆశ్యర్యపోతాడు. అతన్ని పోలీస్ ఆఫీస్ గా చూసి ఆమె కూడా షాక్ కు గురవుతుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్ళ క్రితం పల్లెటూరిలో జరిగిన ప్రేమాయణాన్ని ఫరాఖాన్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. అనివార్య పరిస్థితుల్లో సోనూకు నిధి దూరమై పోతుంది. అయితే తిరిగి వాళ్ళిద్దరూ ఇలా కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. -
షూటింగ్లో పొల్గొన్న ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్
చెన్నై: నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పుదుచ్చేరిలో జరుగుతున్న తన రాజా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ శుక్రవారం పుదుచ్చేరిలో మొదలైంది. ఉదయనిధికి జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. కలైయరసన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రేమ్ ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. -
నా దగ్గర అన్ని రకాల సాక్స్ కలెక్షన్ ఉంది : హీరోయిన్
నిధి అగర్వాల్.. వైవిధ్యమైన ఆలోచన, ఆచరణే ఆమె విజయ రహస్యం. ఫ్యాషన్‌లోనూ అదే ఫార్ములా! ఆమె ఫేవరేట్ బ్రాండ్సే నమూనా!! స్టార్స్‌కు ఎస్వీఏ ఫేవరేట్ 'సోనమ్, ప్రకాశ్ మోదీ అనే ఇద్దరు డిజైనర్స్ కలసి స్థాపించిన సంస్థ ఎస్వీఏ. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఎవర్ గ్రీన్ డిజైన్స్‌ను అందిస్తున్నారు. అదే వీరి బ్రాండ్ వాల్యూని పెంచింది. డిజైన్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. ఫ్యాబ్రిక్కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. నాణ్యమైన వస్త్రాల కోసం ముంబైలో ఓ పరిశ్రమనే స్థాపించారు. అక్కడ తయారైన ఫ్యాబ్రిక్‌తో మాత్రమే వీరు డిజైన్స్ చేస్తారు. అందుకే చాలా మంది స్టార్స్‌కు ఎస్వీఏ ఫేవరేట్. విదేశాల్లో కూడా వీరి దుస్తులకు మంచి గిరాకీ ఉంది. డిజైనర్ పీస్ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ బ్రాండ్ డిజైన్స్ లభిస్తాయి. నీతా బూచ్రా.. ప్రసిద్ధ బంగారు ఆభరణాల వ్యాపారి లలిత్ కుమార్ బూచ్రా వారసురాలు. నగల మీదున్న మోజుతో జ్యూయెలరీ డిజైనర్‌గా మారింది నీతా. స్టార్స్ కోసం ప్రత్యేకంగా ఆభరణాలను డిజైన్ చేస్తుంది. ప్రియాంక చోప్రా, విద్యా బాలన్ వంటి సెలబ్రిటీస్‌కు ఆమె అభిమాన డిజైనర్. జైపూర్‌లో ‘నీతా బూచ్రా జ్యూయెలరీ ’ పేరుతో బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల దుకాణం ఉంది. కేవలం డిజైన్ ఆధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఏది కొనాలన్నా రూ. వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్రిస్ట్యా లుబుటా టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో క్రిస్ట్యా లుబుటా ఫుట్‌వేర్ ఒకటి. దాదాపుగా ప్రతి హాలీవుడ్ స్టార్ దగ్గర దీని కలెక్షన్ ఉంటుంది. 1991లో మొదలైన ఈ సంస్థను ది గ్రేట్ డిజైనర్ క్రిస్ట్యా లుబుటా స్థాపించారు. ఫ్యాషన్ వరల్డ్ .. ప్యారిస్‌లో దీని మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇప్పటి వరకు సుమారు ఆరు లక్షల ఫుట్‌వేర్ డిజైన్స్‌ను ఈ సంస్థ అందించింది. ఈ బ్రాండ్‌కు ప్రపంచమంతా స్టోర్స్ ఉన్నాయి. ఈ ఫుట్‌వేర్ ఖరీదు చాలా చాలా ఎక్కువ. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: ఎస్వీఏ ధర: రూ. 65,000 జ్యూయెలరీబ్రాండ్: నీతా బూచ్రా జ్యూయెలరి ధర: డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. ఫుట్‌వేర్ బ్రాండ్: ఐరిజ క్రిస్ట్యా లుబుటా పంప్స్ ధర:రూ. 55,567 ఎవరైనా రకరకాల షూస్ ఇష్టపడ్తారు. నాకైతే రకరకాల సాక్స్ ఇష్టం. ఎప్పుడూ ఒకేరకమైన సాక్స్ ధరించను. నా దగ్గర వివిధ బ్రాండ్స్ సాక్స్ కలెక్షన్ ఉంది.– నిధి అగర్వాల్ -దీపిక కొండి -
అలాంటివి ఇష్టం ఉండదు.. సింపుల్‌గా 'నో' అనేస్తా : హీరోయిన్
సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన నిధి ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది . గ్లామర్ డోస్‌కు సైతం ఏమాత్రం వెనక్కి తగ్గని నిధి యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. వర్షం పాటల్లో నటించడం అంత సులువు కాదని, షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. పైనుంచి వర్షం పడుతున్నా, కళ్లు తెరిచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం తన వల్ల కాదని, అలాంటి పాటలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పట్లో రెయిన్ సాంగ్స్ చేయడం గురించి ఆలోచించడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. -
అలాంటి చీప్ పనులు చేయకండి .. నెటిజన్లపై నిధి అగర్వాల్ ఫైర్
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఆమె అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే ఎప్పుడూ ఫోటో షూట్స్‌తో రచ్చ చేసే.. నిధి తాజాగా ఓ విషయం మీద బాగా సీరియస్ అయింది. అలాంటి ఫోటోలు షేర్ చేయకండి అంటూ నెటిజన్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ‘నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం ఇవ్వవల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే.. వాటిని షేర్ చేయకండి.. అది అనసరం. అవి చీప్ పనులే అవుతాయి. దిగజారకండి’అంటూ నిధి ఫైర్ అయింది. ఆమె అంతలా ఫైర్ కావడానికి కారణమైన ఫోటో ఏదో మాత్రం చెప్పలేదు. ఇక నిధి సినిమాల విషయానివస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. అలాగే అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంలో నటిస్తున్నారు. -
జిమ్‌లో దుమ్ములేపుతోన్న కాజల్.. నవ్వులు చిందిస్తున్న నిధి
తీవ్రమైన ఒత్తిడితో బాధపడతున్నారా? అయితే కామెడీ సినిమాలు చూడమని చెబుతున్నారు నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని బ్లాక్ డ్రెస్‌లో బైక్‌పై ఫోటోకి ఫోజులు ఇస్తున్న లక్ష్మీరాయ్ పెళ్లి తర్వాత ఫిట్‌నెస్‌పై కాజల్ బాగా ఫోకస్ పెట్టింది. జిమ్ సెంటర్లో దిగిన ఫోటోని అభిమానులతో పంచుకుంది ఈ అందాల చందమామ పిల్లితో ఆడుకుంది అనుపమ పరమేశ్వరన్. దాంతో కలిసి దిగిన ఫొటోని అభిమానులకు చూపిస్తూ.. ఒక పిల్లి మరో పిల్లిని లీడ్ చేస్తోంది అని రాసుకొచ్చింది. పనిని ఇంటి వరకు తీసుకురావోద్దు. ఇది కొన్ని సార్లు విరాట్‌కి వర్తించదు అంటుంది అనుష్క శర్మ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
హల్చల్ : కొంటెగా చూస్తున్న దివి.. కవ్విస్తోన్న రష్మీ
♦ ఫోజులతో కవ్విస్తోన్న యాంకర్ రష్మీ ♦ ఇంక వెయిట్ చేయలేనంటున్న రకుల్ ♦ తన పవర్ ఏంటో చూపించిన మంచు లక్ష్మీ ♦ ఏం చేయాలో తెలియడం లేదంట తమన్నాకి ♦ చీరకట్టులో నాయని పావని ♦ గిరగిర తిప్పమంటున్న హీనా ఖాన్ ♦ ఎంతో అందంగా ముస్తాబైన మాధురీ దీక్షిత్ ♦ రీల్స్‌తో అదరగొడుతున్న నిధి అగర్వాల్ ♦ బరువులు ఎత్తుతున్న పరిణితీ చోప్రా ♦ లేట్ నైట్ పోస్టును షేర్ చేసిన కోమల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by DP (@dishaparmar) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
Nidhhi Agerwal: పట్టిస్తే లక్ష రూపాయల నజరానా!
ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ కుక్కపిల్ల మిస్ అయినట్లు పోస్ట్ పెట్టింది. దాన్ని పట్టించిన వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కోకో అనే పేరున్న ఆ కుక్కపిల్ల కనిపించినట్లైతే ఫొటోలో ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించింది. మొత్తానికి ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక నిధి కెరీర్ విషయానికి వస్తే.. 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో కాలు మోపింది. 'మిస్టర్ మజ్ను'తో డిజాస్టర్ అందుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన ఈ సినిమా నిధికి మంచి ఆఫర్స్‌ను అందించింది. అలా 'ఇస్మార్ట్ శంకర్'లో హీరోయిన్గా ఛాన్స్ చేజిక్కుంచుకుంది. ఇది సూపర్ హిట్ కావడంతో నిధికి మళ్లీ వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు'లో హీరోయిన్గా నటిస్తున్న నిధి అశోక్ గల్లా హీరోగా వస్తోన్న చిత్రంలోనూ కథానాయికగా కనువిందు చేయనుంది. చదవండి: మహేశ్‌తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ! -
రెచ్చిపోయిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ.. ఫైర్ అవుతున్న అనసూయ
ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి తెలియదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అనసూయ. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ జాగ్రత్తలు చెప్పింది హాట్ ఫోటోతో కుర్రకారు మతులు పోగొతున్న నిధి అగర్వాల్ చీర కట్టులో కట్టులో హాట్ పోజులు ఇస్తూ హీట్ పెంచుతున్న దీప్తి సునైనా చూపులతో చంపేస్తున్న ఈషా రెబ్బా కొంటెచూపుతో హృదయాలను కొల్లగొడుతోంది నటి నజ్రియా ‘కలర్స్ వర్సెస్ బ్లాక్ అండ్ వైట్’.. ఇందులో మీకేది ఇష్టం అంటూ నెటిజన్లను ప్రశ్నించింది వర్షా బొల్లమ్మ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) అదా శర్మ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Y A S H ⭐️🌛🧿 (@yashikaaannand) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) ] View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
మహేశ్‌తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ!
‘సవ్యసాచి’ మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచమైన నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. తన రెండవ సినిమా ‘మిస్టర్ మజ్ను’తో అక్కినేని వారసుడు అఖిల్‌తో జత కట్టిన ఈ భామ తన నటనతో మంచి మార్కులు కొట్టెసింది. ఈ క్రమంలో ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరోయిన్గా అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. దీంతో ఆమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం నిధి తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కాగా క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర విరమల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో పవన్‌కు జోడిగా నిధి నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే నిధి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేశ్ ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా కారణంగా చిన్న బ్రేక్ వచ్చింది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా బుట్టబోమ్మ పూజ హెగ్డెను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేశ్‌కు జోడివగా నిధి అగర్వాల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా పూజాను తీసుకోవాలనుకున్న చిత్ర బృందం తాజా నిధి పేరును ప్రతిపాదిస్తున్నట్లు తాజాగా తెరపైకి వచ్చింది. అయితే ఈ మూవీ నిధి మెయిన్ రోల్లో కనిపించనుందా లేదా సెకండ్ హీరోయిన్గా కనువిందు చేయనుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: నా విస్కీకి నాలుగేళ్లు : హీరోయిన్ అనుపమ నందు యాక్టింగ్‌పై భార్య గీతా మాధురి కౌంటర్! -
చూపులతో మత్తెక్కిస్తున్న నిధి.. కళ్లు చెప్తాయంటున్న లక్ష్మీ
నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా అంటున్నఅనసూయ నోటితో చెప్పలేని చాలా మాటలు కళ్లు చెప్తాయంటున్న లక్ష్మీరాయ్ కుర్రకారులకు మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్ చూపులు ఈ పాటలో ప్రేమ ఉంది అంటూ హింది పాటకు స్టెప్పులేసిన హారిక View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) ! View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) ! View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
35 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా : హీరోయిన్
లాక్డౌన్ తర్వాత షూటింగ్‌లు మొదలుపెట్టినప్పుడు అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుని చిత్రీకరణలో పాల్గొనడం మొదలుపెట్టారు. అలా కరోనా టెస్ట్ చేయించుకున్నవారిలో నిధీ అగర్వాల్ ఉన్నారు. ఈ విషయం గురించి నిధీ మాట్లాడుతూ –‘‘ఫస్ట్ టైమ్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపించింది. కానీ తర్వాత అలవాటు పడ్డాను. గత అక్టోబరు నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న సినిమాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల మధ్య తిరుగుతూ బిజీగా ఉంటున్నాను. జర్నీ చేసిన ప్రతిసారీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికి దాదాపు 35సార్లు టెస్ట్ చేయించుకున్నాను’’ అన్నారు. చదవండి: ‘రామ్ సేతు’లో అక్షయ్ కుమార్ ఫస్ట్‌లుక్ చూశారా? ‘వకీల్ సాబ్’కు అనుమతి నిరాకరణ -
సోషల్ హల్చల్: హాట్ పిక్‌తో కవ్విస్తున్న జాన్వీ కపూర్
►కీర్తి సురేశ్ కొంగు పట్టుకొని వదులనంటున్న బుజ్జి కుక్క. ఫన్నీ వీడియోని ఫ్యాన్స్‌తో పంచుకున్న ‘మహానటి’ ►చూపులతో చంపేస్తున్న ‘జాతిరత్నాలు’ చిట్టి ►పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కుక్కతో ఆడుకుంటున్న చార్మీ ►అందాలు ఆరబోయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటూ హాట్ పిక్‌ని షేర్ చేసిన జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Shreyas Media (@shreyasgroup) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) -
సోషల్ హల్చల్: వేడెక్కిస్తున్న సారా, కాలం ఆగిపోవాలంటున్న రాశీ
► ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అంటున్న హీరోయిన్ రాశీ ఖన్నా. ► బీచ్ తీరాన వేడివేడిగా విటమిన్ సీ తీసుకుంటూ ఫొటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ సారా అలీఖాన్. ► మనం ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చూడకపోవడం వెనక ఓ కారణం ఉంది అని చెబుతున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ► మీ పరిధిని విస్తరించండి అంటూ భరత నాట్య భంగిమను షేర్ చేసిన సీనియర్ నటి శోభన. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు
-
‘సోషల్’ హల్చల్: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి
♦హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సెగలు కక్కిస్తోంది. వాలెంటైన్స్‌డే సందర్భంగా హాట్ ఫోటోని షేర్ చేసి కుర్రకారుల మతులో పొగొడుతోంది. సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ♦ ప్రేమను ప్రతి రోజు సెలెబ్రేట్ చేసుకోమని సలహాలు ఇస్తూ వాలెంటైన్స్ డే సందర్భంగా హబ్బీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ ♦ తన అందాలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది బుల్లితెర యాంకర్ విష్టుప్రియ. గత కొద్ది రోజులుగా హాట్ ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తున్న ఈ హాట్ యాంకర్.. ప్రేమికుల రోజు సందర్భంగా అందాలు ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ♦ సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే ప్రతి రోజు వాలెంటైన్స్డేనే అంటుంది మంజుల ఘట్టమనేని. ప్రేమికుల రోజు సందర్భంగా తన భర్త సంజయ్ స్వరూప్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ విషెష్ తెలియజేసింది. ♦ సింగిల్ కుర్రాళ్లకు వాలెంటైన్స్‌డే విషెష్ చెబుతూ హాట్ వీడియోని షేర్ చేసింది బ్యూటీ సిమ్రత్‌కౌర్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీహరి’ చిత్రంలో ఈ అమ్మడు ఒక హీరోయిన్గా చేసింది. ♦ అందం అంటే శరీరానికి సౌకర్యంగా ఉండడమే అంటున్న మంచు లక్ష్మీ ♦ మీకో బిగ్ న్యూస్ చెబుతానని నిన్నటి నుంచి ఊరిస్తుంది హాట్ యాంకర్ శ్రీముఖి. ఈ వాలెంటైన్స్ డే తనకు మిక్స్డ్ పీలింగ్ని మిలిల్చిందని చెబుతోంది. మరికొద్ది గంటల్లో మీకో న్యూస్ చెబుతానంటూ తన ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
‘ఇస్మార్ట్’ బ్యూటీకి చేదు అనుభవం.. అందరి ముందే..
ఇస్మార్ట్ శంకర్ ఫేం, హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురరైంది. హీరో శింబుతో కలిని నిధి అగర్వాల్ ఈశ్వరన్ అనే తమిళ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత బాలాజీ కబా నిర్మించిన ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. కె.భారతీరాజా వంటి సీనియర్ స్టార్ డైరెక్టరు కీలకమైన పాత్ర పోషించగా, నందితా శ్వేత, ఇతర తారాగణం నటించారు. కాగా, ఇటీవల జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో చిత్ర దర్శకుడు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాడు. దీంతో ఈ ఇష్యూ కోలివుడ్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే.. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఈశ్వరన్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడుతుండగా.. దర్శకుడు సుశీంద్రన్ పదే పదే మధ్యలో కలుగజేసుకుంటూ 'శింబు మామ ఐ లవ్యు' అని చెప్పు అంటూ అడ్డుపడుతూ బలవంత పెట్టారు. దీంతో నిధి కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి ప్రవర్తనను తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూపై దర్శకుడు సుశీంద్రన్ స్పందిస్తూ.. సినిమాలో శింబును ఉద్దేశించి నిధి 'మామా ఐ లవ్యూ' అని చెప్పే డైలాగ్ ఉంటుందని, దాన్ని హైలైట్ చేద్దామనే ఆడియో ఫంక్షన్లో అలా చెప్పనని వివరణ ఇచ్చారు. కాగా, ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది.