పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. మంగళవారం (ఆగస్టు17)న నిధి అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాకు సంబంధించి ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పంచమి అనే పాత్రలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ కనిపించనుంది. నిండైన చీరకట్టు, నాట్యం చేస్తున్నట్లున్న నిధి లుక్ ఆకట్టుకుంటుంది.
15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా సినిమా నేపథ్యం ఉండనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన వన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లిమ్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ బందిపోటు దారుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. నిధి అగర్వాల్‌తో పాటు జాక్వలైన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్‌గా నటించనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
చదవండి :షూటింగ్ చేస్తుండగా చంపేస్తామని బెదిరించారు: సత్యదేవ్
(Bheemla Nayak: కేక పెట్టిస్తున్న ఫస్ట్ గ్లింప్స్, పవన్ ఎంట్రీ అదుర్స్)
Beauty as ELEGANT & RADIANT as the Moon… We wish our gorgeous #PANCHAMI @AgerwalNidhhi a very Happy Birthday! ❤️
— Krish Jagarlamudi (@DirKrish) August 17, 2021
- Team #HariHaraVeeraMallu @PawanKalyan @AMRatnamOfI @ADayakarRao2 @mmkeeravaani @gnanashekarvs @saimadhav_burra @benlock @aishureddy82 @HHVMFilm pic.twitter.com/U4PL2aIqKI
Comments
Please login to add a commentAdd a comment