
ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినీరంగంలో కొనసాగుతారా..? మళ్లీ కొత్త సినిమాలు చేస్తారా..? అని అభిమానుల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ విషయంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం రావడం కష్టమేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఈ మూడు సినిమాల కోసం పవన్ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. దీంతో నిర్మాతలకు బడ్జెట్ పెరిగి తలనొప్పిగా మారిందని కూడా చెబుతున్నారు.
తమిళ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనకు డబ్బు అవసరం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే, తాను సినిమా నిర్మాణరంగంలో మాత్రం భాగం కానన్నారు. 'నాకు ఉన్న ఏకైకా ఆదాయమార్గం నటన మాత్రమే.. నాకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటాను.' అని పవన్ అన్నారు. 2020 ముందు వరకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కేవలం రూ. 15 కోట్ల లోపు మాత్రమే అని ఇండస్ట్రీలో చెబుతున్న మాట.. అయితే, వకీల్‌సాబ్ సినిమా నుంచి ఆయన రూ. 50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment