OG Movie
-
ఫ్యాన్స్ ఓజీ అని అరుస్తుంటే బెదిరింపుల్లా ఉన్నాయి: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ఎట్టకేలకు పవన్.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై స్పందించాడు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ..అభిమానులు ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.డేట్స్ ఇచ్చా..నేను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇచ్చాను. కానీ నిర్మాతలే సరిగా వినియోగించుకోలేదు. హరిహర వీరమల్లు మూవీ (Hari Hara Veeramallu Movie) షూటింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా స్క్రిప్టు పనులే జరుగుతున్నాయి. ఈ మూడు చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాను అని తెలిపారు. హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఇది పీరియాడిక్ ఫిలింగా తెరకెక్కనుంది. (చదవండి: అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్)సినిమా..క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఓజీ విషయానికి వస్తే సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025వ సంవత్సరంలో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.చదవండి: పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?' -
పవన్ కళ్యాణ్ 06 లో ఛాన్స్ ఎలా వచ్చిదంటే..
-
దేవర ముంగిట దుల్కర్, రవితేజ..
-
పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్!
‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. పార్ట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 5నే విడుదల కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ తేది కూడా మారినట్లు తెలుస్తోంది. (చదవండి: ఆ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు: మహేశ్ బాబు)తాజా సమాచారం ప్రకారం..దేవర అనుకున్న దాని కంటే రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడట. అంటే అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి ప్రీసోన్ చేస్తున్నారట. వాస్తవానికి సెప్టెంబర్ 27న పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’చిత్రం విడుదల కావాల్సింది. చాలా రోజుల క్రితమే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రీలీజ్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అందుకే దేవర రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడు. రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ వాయిదా పడినందుకు పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందితే.. దేవర ముందే వస్తున్నందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. (చదవండి: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా!)ఇక దేవర విషయానికొస్తే.. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కినేని సుధాకర్, కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుతో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. -
పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అనుకున్న టైమ్ కంటే 'దేవర' ముందుగానే థియేటర్లలోకి రాబోతున్నాడా? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఏకంగా పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ తేదీకి టెండర్ వేశాడని తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది? 'దేవర' ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది?(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?)'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. దీన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న తొలి భాగం రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో కొత్త తేదీ ప్రకటించారు. అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశముందని అంటున్నారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి చెప్పిన టైం కంటే రెండు వారాల ముందే అంటే సెప్టెంబరు 27నే థియేటర్లలోకి తీసుకువస్తారని టాక్ నడుస్తోంది.అయితే ఆ తేదీకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత డీవీవీ దానయ్య ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న పవన్.. ఇవి పూర్తయిన తర్వాత అయినా డేట్స్ ఇస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఇచ్చినా సరే ఇప్పట్లో పూర్తవుతాయనే నమ్మకం అయితే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా 'దేవర'.. సెప్టెంబరు చివర్లో రావాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సోలో డేట్ దొరుకుతుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో నిజమెంతనేది త్వరలో ఓ క్లారిటీ వస్తుందిలే!(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్) -
అజ్ఞాతవాసి పొలిటికల్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు కూడా ఆయనవే. కానీ 2024 ఎన్నికలు జరగక ముందే 'పవర్ స్టార్' అవతారంలో ఫిక్సయ్యేలా కనిపిస్తున్నాడు పవన్. అదే అభిప్రాయం ఆయన అభిమానుల్లో కూడా కలుగుతోంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్లు సినిమాలు వదులుకోలేరు. రాజకీయాలను.. ముఖ్యంగా అధికారాన్ని చెలాయించాలనుకుంటారు. రెండూ కావాలని వస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు. (ఇదీ చదవండి: లగేజీ ప్యాక్ చేసుకున్న మెగా బ్రదర్స్.. పరుగులు పెడుతున్న పవన్) పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటిషియనా? లేక సినిమాలు పార్ట్ టైమా? అనే విషయంలో పవన్‌కు ఓ క్లారిటీ ఉన్నట్టుంది. గత రెండేళ్ల కాలం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. వారం క్రితం జెండా సభ అంటూ స్టేజీపై రెచ్చిపోయిన పవన్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆ సభకు ముందు కూడా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నాడు. 50 రోజుల్లో ఎన్నికలు ఉండగా ఏ పార్టీ అధినేత కూడా ఇలా చేయడు. వారాహి యాత్ర అంటూ ఊదరగొట్టినా.. ఆరు నెలల నుంచి ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో అతి కష్టమ్మీద 8 మంది అభ్యర్థులను దించినా.. చివరాఖరి వరకు పవన్ ప్రచారమే చేయలేదు. షూటింగ్‌లు లేనప్పుడు మాత్రమే పవన్‌కు రాజకీయాలు గుర్తొస్తాయంటారు జనసైనికులు. అధికారం కోసం అల్లాడిపోయే.. పవన్.. రాజకీయాలకు ఎంత సమయం కేటాయిస్తున్నడన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. గత మూడేళ్లుగా ఆయన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం. 2019 - సినిమా నెరేషన్ 2021 - వకీల్ సాబ్ 2022 - భీమ్లా నాయక్ 2023 - బ్రో 2024 - ఓజీ, హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్(?) 2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తోన్న పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓజి సినిమా కోసం ఇంకా కనీసం 30 రోజులు షూటింగ్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ సినిమాకు బాగా మార్కెట్ కావాలని తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే ఓజి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. అనుకున్న సమయానికి రీలీజ్ చేయాలంటే ఎన్నికలు అయిన వెంటనే పవన్ రాజకీయాలను ప్యాకప్ చేసి సినిమాల కోసం మేకప్ వేసుకోవాలి. పవన్ చేతిలో హరిహరవీరమల్లు (క్రిష్) , ఓజీ (సుజిత్) , ఉస్తాద్ భగత్ సింగ్ (హరీష్ శంకర్) వంటి టాప్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో హరిహరవీరమల్లు, ఓజీ చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఫుల్ బిజీగా ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కోసం పార్ట్‌టైమ్ జాబ్ మాదిరి టీడీపీలో స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ రోల్ ముగిసిన తర్వాత వెంటనే మళ్లీ రెగ్యూలర్ షూటింగ్స్‌లోకి వెళ్లడం ఖాయం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మోసం చేశారు: ట్రాన్స్‌జెండర్) తాజాగా నిర్మాత దానయ్య కూడా పవన్‌ను కలిసిన విషయం తెలిసిందే.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఓజి సినిమా పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఈ భారీ ప్రాజెక్ట్‌తో పాటు.. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో రెండు వున్నాయనే విషయం తెలిసిందే. ఇలా మొత్తం మూడు సినిమాలు చేయాలి.. సాధారణంగా ఒక టాప్ హీరోకు చెందిన సినిమా తర్వాత మరో సినిమా థియేటర్లోకి రావాలంటే సుమారు రెండేళ్లు అయినా పడుతుంది. అలాంటిది పవన్ ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. అంటే ఈ లెక్కన పవన్ వచ్చే ఎన్నికల వరకు మళ్లీ సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఉన్న ప్రాజెక్ట్‌లతోనే ఆయన బిజీగా ఉంటే మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే భవిష్యత్‌లో సినిమాలు కొనసాగించాలనే పవన్ నిర్ణయించుకున్నారని స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు కోసం... తాను రాజకీయం చేస్తున్నానని పదేపదే చెబుతున్న పవన్.. అందుకు తగ్గట్టు తాజాగా జరిగిన జెండా సభలో కూడా బాబును ఉద్ధండుడిగా అభివర్ణించాడు. అక్కడి వరకు జనసేన కార్యకర్తలకు ఇబ్బంది లేదు కానీ.. నన్నెలా ప్రశ్నిస్తారంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే పవన్ విరుచుకుపడడం .. జనసైనికులను షాక్‌కు గురి చేసింది. తాను అసలు రాజకీయాలు చేస్తాడా? ఎన్నికల తర్వాత పార్టీ నడుపుతాడా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వడు. సింగిల్‌గా పోటీ చేయి, వచ్చే ఎన్నికల నాటికి నాయకుడిగా ఎదుగుతావని బీజేపీ పెద్దలు చీవాట్లు పెట్టారని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అంత హితబోధ చేసినా.. పవన్ మాత్రం జై బాబు మత్తులోనే ఉన్నాడు. మరి రాజకీయాలైనా సీరియస్‌గా చేస్తాడా.. అదీ లేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఓడిపోతుందని పవన్, ఆయన దత్తతండ్రికి ముందే తెలుసంటున్నారు. అన్ని లెక్కలు పవన్ వద్ద ఉన్నాయి కాబట్టే సినిమాలు వదులుకోకుండా వచ్చే ఐదేళ్ల వరకు పలు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తరువాతే ఆయన నటించడం ఎక్కువైంది అన్నది ఫిలింనగర్లో పిల్లాడిని అడిగినా చెబుతాడు. పవన్ పొలిటికల్ సినిమాకు అప్పటివరకు భశుం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ వీక్నెస్ ఏంటో గానీ.. మరీ ఇంత దిగజారుడా..!?) -
అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!
హీరోయిన్ ప్రియాంక మోహన్.. అభిమాని అడిగిన వింత ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇన్ స్టాలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు 'ఆస్క్ ఎనీ థింగ్' పేరు ఫన్ సెషన్ లాంటిది పెడుతుంటారు. అయితే కొందరు ఆకతాయులు ఫన్నీ ప్రశ్నల్లాంటివి అడుగుతుంటారు. తాజాగా ప్రియాంక మోహన్ విషయంలో అలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) నాని' గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఆ తర్వాత 'శ్రీకారం' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పూర్తిగా తమిళంకే పరిమితమైపోయింది. మళ్లీ ఇప్పుడు 'ఓజీ', 'సరిపోదా శనివారం' లాంటి తెలుగు చిత్రాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇన్ స్టాలో ప్రియాంక మోహన్.. 'ఆస్క్ ఎనీథింగ్' అని చిన్న ఫన్ సెషన్ పెట్టింది. ఇందులో ఓ నెటిజన్/అభిమాని.. 'మీ గోళ్లు చూపించండి మేడమ్' అని అడిగాడు. దీనికి బదులిచ్చిన ప్రియాంక.. తన చేతిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 'వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో ఏంటో' అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
రికార్డ్ ధరకు 'ఓజీ' ఆడియో రైట్స్
-
బిగ్ బాస్ శుభశ్రీకి గోల్డెన్ ఛాన్స్.. పాన్ ఇండియా సినిమాలో ఎంట్రీ
బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురుకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. లాయర్ కావాలని ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు పరిశ్రమపై మక్కువతోనే ఇక్కడికి వచ్చానని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. తాజాగా ఆమెకు పవన్- సుజీత్ కాంబినేషన్లో వస్తున్న 'OG' సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించేందుకు అవకాశం దక్కింది. ఇదే విషయాన్ని ఆమె ప్రకటిస్తూ డైరెక్టర్ సుజీత్‌తో దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. బిగ్ బాస్‌లో ఆట కూడా బాగా ఆడుతుంది అనుకునే లోపే అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. కానీ అంతా మన మంచికే జరిగిందిలే అని తాజాగా సుబ్బు ఫ్యాన్స్ తెలుపుతున్నారు. పవన్‌తో నటించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. తన టాలెంట్ పట్ల నమ్మకాన్ని ఉంచిన డైరెక్టర్ సుజీత్‌కు థ్యాంక్స్ చెప్పింది. తనను అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ తెలిపింది. ఇకపోతే బిగ్‌బాస్ సీజన్ 7 నుంచి ఐదో వారంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది శుభశ్రీ రాయగురు. నిజానికి సుబ్బు చాలా బలమైన కంటెస్టెంట్‌గా ఉన్నప్పటికీ ఆమె ఎలిమినేషన్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమె రీఎంట్రీ ఉంటుందని ఆశిస్తే అది కూడా ఊల్టాపుల్టా పేరుతో ఆమె ఆశలకు గండి పడింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..!
సాహో తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్ యాక్షన్‌లో మోడ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్ లుక్ అదిరిపోయింది. గ్లింప్స్ అద్భుతంగా ఉందంటూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. హంగ్రీ చీతా అనే పేరుతో వచ్చిన ఓజీ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. ఫోటోలు షేర్ చేసిన రోజా) పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆర్జీవీ చేసిన ట్వీట్ చేశారు. 'ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది.. నేను ఇప్పటి వరకు చూసిన పీకే ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. హే సుజిత్ మీరు చంపేశారు బ్రో అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు సైతం క్రేజీ పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఊహించని ట్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఓజీ గ్లింప్స్ ఆ రేంజ్లో అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో గ్లింప్ల్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. (ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) కాగా.. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. This has to be the HAPPIEST BIRTHDAY for @PawanKalyan #OGGlimpse is simply OUT OF THE WORLD ..This is the BESTEST among all P K trailers I have ever seen Hey #Sujeeth YOU KILLED IT 💪 https://t.co/yrcB6JMd9O — Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2023 -
‘ఓజీ’ గ్లింప్స్ వచ్చేసింది
‘సాహో’ తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని తాజాగా విడుదల చేశారు మేకర్స్. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి బలాన్ని చేకూర్చింది. కానీ కొన్ని చోట్ల విక్రమ్ సినిమాకు అనిరుధ్ అందిచిన బీజీఎం గుర్తుకువస్తుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఓజీ గ్లింప్స్‌ని చూసేయండి