పవన్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌..ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌! | Jr NTR Devara Movie Is Preponed, New Release Date Update Expected Soon | Sakshi
Sakshi News home page

Devara Preponed: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. పవన్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!

Published Wed, Jun 12 2024 4:40 PM | Last Updated on Wed, Jun 12 2024 6:02 PM

Jr NTR Devara Movie Is Preponed, New Release Date Update Expected Soon

‘జనతా గ్యారేజ్‌’ లాంటి హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. పార్ట్‌ 1 ఈ ఏడాది ఏప్రిల్‌ 5నే విడుదల కావాల్సింది. అయితే షూటింగ్‌ ఆలస్యం కావడంతో అక్టోబర్‌ 10కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ తేది కూడా మారినట్లు తెలుస్తోంది.  

(చదవండి: ఆ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు: మహేశ్ బాబు)

తాజా సమాచారం ప్రకారం..దేవర అనుకున్న దాని కంటే రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడట. అంటే అక్టోబర్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 27కి ప్రీసోన్‌ చేస్తున్నారట. వాస్తవానికి సెప్టెంబర్‌ 27న పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ’చిత్రం విడుదల కావాల్సింది. చాలా రోజుల క్రితమే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌. కానీ షూటింగ్‌ ఇంకా పూర్తి కాకపోవడంతో రీలీజ్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అందుకే దేవర రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడు. రిలీజ్‌ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ వాయిదా పడినందుకు పవన్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందితే.. దేవర ముందే వస్తున్నందుకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు. 

(చదవండి: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జిని డ్రైవ్‌ చేసిన ఆనంద్ మహీంద్రా!)

ఇక దేవర విషయానికొస్తే.. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో మిక్కినేని సుధాకర్‌, కె. హరికృష్ణ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుతో ఎన్టీఆర్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement