బిగ్‌ బాస్‌ శుభశ్రీకి గోల్డెన్‌ ఛాన్స్‌.. పాన్‌ ఇండియా సినిమాలో ఎంట్రీ | Bigg Boss 7 Subhashree Rayaguru Got Chance In Pawan Kalyan OG Movie, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Bigg Boss Subhashree In OG: బిగ్‌ బాస్‌ శుభశ్రీకి గోల్డెన్‌ ఛాన్స్‌.. పాన్‌ ఇండియా సినిమాలో ఎంట్రీ

Published Tue, Oct 24 2023 11:09 AM | Last Updated on Tue, Oct 24 2023 2:35 PM

Subhashree Rayaguru Got OG Movie Chance - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్ 7 కంటెస్టెంట్‌ శుభశ్రీ రాయగురుకు గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కింది. లాయర్‌ కావాలని ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగు పరిశ్రమపై మక్కువతోనే ఇక్కడికి వచ్చానని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. తాజాగా ఆమెకు పవన్‌- సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'OG' సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించేందుకు అవకాశం దక్కింది.

ఇదే విషయాన్ని ఆమె ప్రకటిస్తూ డైరెక్టర్‌ సుజీత్‌తో దిగిన ఒక ఫోటోను షేర్‌ చేసింది. బిగ్‌ బాస్‌లో ఆట కూడా బాగా ఆడుతుంది అనుకునే లోపే అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. కానీ అంతా మన మంచికే జరిగిందిలే అని తాజాగా సుబ్బు ఫ్యాన్స్‌ తెలుపుతున్నారు. పవన్‌తో నటించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. తన టాలెంట్‌ పట్ల నమ్మకాన్ని ఉంచిన డైరెక్టర్‌ సుజీత్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.

తనను అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ తెలిపింది. ఇకపోతే బిగ్‌బాస్‌ సీజన్ 7 నుంచి ఐదో వారంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది శుభశ్రీ రాయగురు. నిజానికి సుబ్బు చాలా బలమైన కంటెస్టెంట్‌గా ఉన్నప్పటికీ ఆమె ఎలిమినేషన్‌ కావడంతో అందరూ షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ఆమె రీఎంట్రీ ఉంటుందని ఆశిస్తే అది కూడా ఊల్టాపుల్టా పేరుతో ఆమె ఆశలకు గండి పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement