పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'? | Ntr Devara Movie New Release Date Rumours | Sakshi
Sakshi News home page

Devara Movie: 'దేవర' రిలీజ్.. అనుకున్న టైం కంటే ముందే?

Published Wed, May 8 2024 5:38 PM | Last Updated on Wed, May 8 2024 6:37 PM

Ntr Devara Movie New Release Date Rumours

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అనుకున్న టైమ్ కంటే 'దేవర' ముందుగానే థియేటర్లలోకి రాబోతున్నాడా? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఏకంగా పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ తేదీకి టెండర్ వేశాడని తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది? 'దేవర' ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది?

(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?)

'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. దీన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న తొలి భాగం రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో కొత్త తేదీ ప్రకటించారు. అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశముందని అంటున్నారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి చెప్పిన టైం కంటే రెండు వారాల ముందే అంటే సెప్టెంబరు 27నే థియేటర్లలోకి తీసుకువస్తారని టాక్ నడుస్తోంది.

అయితే ఆ తేదీకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత డీవీవీ దానయ్య ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న పవన్.. ఇవి పూర్తయిన తర్వాత అయినా డేట్స్ ఇస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఇచ్చినా సరే ఇప్పట్లో పూర్తవుతాయనే నమ్మకం అయితే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా 'దేవర'.. సెప్టెంబరు చివర్లో రావాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సోలో డేట్ దొరుకుతుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో నిజమెంతనేది త్వరలో ఓ క్లారిటీ వస్తుందిలే!

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement