‘ఓజీ’ గ్లింప్స్‌ వచ్చేసింది | Pawan Kalyan and Sujeeth's OG Movie Glimpse Out - Sakshi
Sakshi News home page

‘ఓజీ’ గ్లింప్స్‌ వచ్చేసింది

Published Sat, Sep 2 2023 12:39 PM | Last Updated on Sat, Sep 2 2023 12:48 PM

OG Movie Glimpse Out - Sakshi

‘సాహో’ తర్వాత దర్శకుడు సుజిత్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని తాజాగా విడుదల చేశారు మేకర్స్‌. అర్జున్ దాస్ ఓయిస్ ఓవ‌ర్ తో ఈ టీజ‌ర్ మొద‌లైంది. ప‌దేళ్ల క్రితం బాంబేలో వ‌చ్చిన తుపాను గుర్తుందా? అది మ‌ట్టి, చెట్ల‌తో పాటు, స‌గం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు న‌రికిన మ‌నుషుల ర‌క్తాన్ని మాత్రం ఇప్ప‌టికీ ఏ తుఫాను క‌డ‌గ‌లేక‌పోయింది. అలాంటి వాడు మ‌ళ్లీ తిరిగి వ‌స్తున్నాడు అంటే..’ అంటూ పవన్‌ ఎంట్రీని చూపించారు. తమన్‌ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి బలాన్ని చేకూర్చింది. కానీ కొన్ని చోట్ల విక్రమ్‌ సినిమాకు అనిరుధ్‌ అందిచిన బీజీఎం గుర్తుకువస్తుంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. ఓజీ గ్లింప్స్‌ని చూసేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement