
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగులో స్టార్ హీరో. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చేతిలో ఉన్న సినిమాలే పూర్తి చేయలని పరిస్థితి. అలాంటి కొత్త చిత్రాలంటే అస్సలు అయ్యే పనికాదు. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు రెండు క్యాన్సిల్ అయ్యాయనే మాట వినిపిస్తోంది.
పవన్ చేతిలో ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఓజీ' (OG Movie) సినిమాలున్నాయి. వీటిలో 'హరిహర..' లెక్క ప్రకారం ఈ మార్చి 27న రిలీజ్ కావాలి. కానీ మే 9కి వాయిదా వేశారు. పవన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. మరి మేలో అయినా సరే సినిమా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.
(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?)
పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న 'ఓజీ'కి దాదాపు 20 రోజుల డేట్స్ పవన్ ఇవ్వాల్సి ఉందట. అది ఎప్పుడు జరిగితే దానిబట్టి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లి చాలా ఏళ్లు అయిపోయాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి.
ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaab Bhagath Singh) షూటింగ్ కొన్నిరోజులు చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని హోల్డ్ లో పెట్టేశారనే టాక్ ఉంది. అలానే సురేందర్ రెడ్డితో కమిట్ అయిన ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే పవన్ చివరి చిత్రం 'ఓజీ'నే!
(ఇదీ చదవండి: రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!)
Comments
Please login to add a commentAdd a comment