Ustaad Bhagat Singh
-
మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2'
సాధారణంగా మార్చి నెల అనగానే పరీక్షల సీజన్, సినిమాలు పెద్దగా చూడరు అనే అపవాదు ఉంటుంది. కానీ ఇదే నెలలో గతంలో 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా మూవీ వచ్చి బ్లాక్‌బస్టర్ అయింది. బలగం, కోర్ట్, జాతిరత్నాలు తదితర చిన్న చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఆదుకుంటాడనుకున్న 'ఉస్తాద్'.. బయ్యర్లని నిండా ముంచాడు. ఇంతకీ ఈ నెల బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మార్చి తొలివారం ఏకంగా 10 వరకు చిన్న సినిమాలు వచ్చాయి. వీటిలో శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. కానీ ఉసూరుమనిపించింది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. తొలిసారి దర్శకురాలు, నిర్మాతగా తీసిన 'ఎస్.సరస్వతి' ఇదే వారం వచ్చింది. ఫ్లాప్ అయింది. శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. 'మెన్షన్ హౌస్ మల్లేష్' కూడా నిలబడలేదు.మూడోవారం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు ఉన్నాయని.. రెండోవారం వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' చిత్రం 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అసలు ఇదొకటి రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది.మూడోవారం ఉగాది కానుకగా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. రిలీజ్ నాడు పండగ సెలవు కావడంతో ఉన్నంతలో థియేటర్లు నిండాయి కానీ టాక్ నెగిటివ్ వచ్చింది. రెండోరోజుకల్లా ఆ ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం పవన్ కెరీర్లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ చాలాచెప్పాడు. అభిమానులని కూడా సరిగా ఆకట్టుకోలేకపోయిందీ చిత్రం. ఇదే తేదీన వచ్చిన డబ్బింగ్ బొమ్మ 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్‌ని ఆదుకుంది. రెండు రోజుల ఆలస్యంగా తెలుగు వెర్షన్ వచ్చినప్పటికీ మన ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. 'ఉస్తాద్..'ని లైట్ తీసుకున్నారు.చివరిదైన నాలుగోవారంలో బ్యాండుమేళం, లేచింది మహిళా లోకం, సుయోధన తదితర స్ట్రెయిట్ మూవీస్‌తో పాటు యూత్, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ నెలలో ఏ తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. 'ధురంధర్ 2' మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ అంతో ఇంతో కళకళలాడేలా చేసింది. ఇది కూడా లేకపోయింటే అంతే సంగతులు.(ఇదీ చదవండి: అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్) -
ఓటీటీలో ఉస్తాద్ భగత్‌సింగ్..!
పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వైరల్ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ పేర్కొంది. ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ధురంధర్-2 హిట్ కావడంతో చాలా స్క్రీన్స్ నుంచి ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాన్ని తొలగించారు.‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో పాటుగా ధురంధర్-2 దెబ్బ కూడా గట్టిగానే ప్రభావం చూపింది. దీంతో థియేట్రికల్ రన్లో బోల్తా పడింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఏప్రిల్ 17న నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్కు తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ 24న తప్పకుండా ఉస్తాద్ ఓటీటీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. థియేటర్స్‌లో మెప్పించలేని ఈ మూవీ కనీసం ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా మంచి రెస్పాన్స్ సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
అమెరికాలో ఉస్తాద్ కలెక్షన్స్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో విడుదలైన కొత్త మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మార్చి 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. తొమ్మిదిరోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 68.06 కోట్ల నెట్ రాబట్టినట్లు సాక్నిల్క్ ట్రేడ్ సంస్థ ప్రకటించింది. అయితే, ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ఆపై శుక్రవారం నాడు నార్త్ అమెరికాలో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్‌సింగ్ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. అక్కడ లాభాల్లోకి ఈ చిత్రం రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. లేదంటే భారీ నష్టాలు తప్పవు. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులు నివ్వెరపోయారు. శుక్రవారం నాడు అయితే అమెరికాలో కేవలం 4వేల డాలర్లు రూ. 3.79 లక్షలు మాత్రమే రాబట్టింది. సినిమా డిజాస్టర్ కావడంతో చాలాచోట్ల ఉస్తాద్‌ను తొలగించేశరాఉ. ఇది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద తమ అంచనాలను నిరాశపరిచినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌ను చాలామంది ఫ్యాన్స్ నిందిస్తున్నారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే, అమెరికాలో ధురంధర్-2 దుమ్మురేపుతుంది. ప్రస్తుతం రూ. 275 కోట్లు సాధించి రికార్డ్ నెలకొల్పింది. North America Thursday Gross | Totals: #DhurandharTheRevenge - $643K | $18.06M#Aadu3 - $8K | $465K#BandMelam - $6K | $8K#Youth - $4K | $98K#UstaadBhagatSingh - $4K | $780K— Venky Box Office (@Venky_BO) March 27, 2026 -
మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్‌కి అర్థం కావట్లేదు!
ఏ సినిమా గానీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అని రిలీజైన రోజే అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే ఫ్లాప్ అనే నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం అందరికీ ఉండదు. కొందరికి మొదట్లోనే సీన్ అర్థమైపోతే మరికొందరికి మాత్రం ఎప్పటికి అర్థం అవుతుందో అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో గతవారం పలకరించిన దర్శకుడు హరీశ్ శంకర్.. మూవీ ఫ్లాప్ అయినా సరే విడిచిపెట్టట్లేదు. తాను తీసింది సూపర్ హిట్ అనే రేంజులో ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌కి ఇచ్చిన సమాధానమైతే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ మొత్తం డిస్కషన్ ఈయన గురించే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)గతంలో పవన్‌తో 'గబ్బర్ సింగ్' అనే రీమేక్ తీసి హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వచ్చాడు. దాదాపు అప్పటి తరహా టెంప్లేట్ స్టోరీ కావడం, మూసగా ఉందనే నెగిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచి నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. ప్రతి మూవీకి కలెక్షన్స్ ప్రకటించే వీళ్లు.. 'ఉస్తాద్' విషయంలో మౌనం పాటించారు. అందరికీ అప్పుడే ఫలితం అర్థమైపోయింది. దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం తాను తీసింది హిట్ అనే రేంజులో ఇంటర్వ్యూలు, మీటప్స్ పెడుతూ బిజీ అయిపోయాడు. అందులో ఈయన, హీరోయిన్లు తప్పితే మరో టెక్నీషియన్ కనిపించలేదు.రెండు నెలల క్రితం అంటే సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' రిలీజ్‌కి ముందు దర్శకుడు మారుతి కూడా ఇలానే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. తీరా థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత విషయం అర్థమైపోయి సైలెంట్ అయిపోయాడు. అభిమానులు ఎంతలా ట్రోల్ చేసినా సరే అవన్నీ భరిస్తూ వచ్చాడు తప్పితే ఏది పడితే అది మాట్లాడలేదు. హరీశ్ శంకర్ మాత్రం సినిమాలో తప్పుల్ని కూడా సమర్థించుకుంటున్నాడు. పవన్ ఎంట్రీ సీన్‌పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. మాస్టర్ తీసింది, తాను తీసింది నచ్చడంతోనే రెండుషాట్స్ పెట్టానని చెప్పేసరికి నెటిజన్ల మతిపోతోంది. హిట్ అయిన సినిమా గురించి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది గానీ ఫ్లాప్ అయిన మూవీ గురించి పదేపదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదు. ఈ విషయం హరీశ్ శంకర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్) -
ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్..
'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైందని పూర్తి లెక్కలతో వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటించిన ఈ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. సుమారు. 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అయితే, సినిమా విడుదలై వారం గడిచినప్పటికీ కలెక్షన్స్‌పై కనీసం ఒక్క పోస్టర్ కూడా నిర్మాతలు విడుదల చేయలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా ఫలితమేనని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, ట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం చూస్తే ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ నిలిచిపోయింది.'ఉస్తాద్ భగత్ సింగ్' నష్టాల దెబ్బ నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్స్పైనే ఎక్కువ పడింది. భారీ ధరకు కొనుగోలు చేసిన వారు పెట్టుబడిలో కనీసం సగం కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఓవర్సీస్లో ఉస్తాద్‌ను విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో మైత్రీ మూవీస్ వారే రిలీజ్ చేశారు. ఆపై సీడెడ్, కర్ణాటకలతో పాటు ఏపీలో కూడా పేలవంగా కలెక్షన్స్ రాబట్టింది.పెట్టుబడిలో సగం కూడా రాలేదుట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ ప్రకారం ఉస్తాద్ భగత్‌సింగ్ మొదటి వారం రూ. 65.74 కోట్ల నెట్ సాధించింది. ఏడోరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే రాబట్టడంతో పవన్ కల్యాణ్ మార్కెట్ సత్తా ఇంతేనా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ప్రకారం ట్రెండ్ చూస్తే రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో ఉస్తాద్ ప్రయాణం ముగిసిపోవడం దాదాపు ఖాయం. ఒక్క నైజాం ఏరియాలోనే దాదాపు రూ. 30 కోట్ల నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం సుమారు రూ. 115 కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం. అయితే, ఏడురోజుల్లో రూ. 50 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఈ మూవీకి పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో భారీ నష్టాలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి డిస్ట్రిబ్యూటర్స్‌కు ఏర్పడింది.పవన్ గత సినిమా 'ఓజీ' కేవలం నాలుగు రోజుల్లోనే రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫైనల్ కలెక్షన్స్ కూడా రూ.100 కోట్ల మైలురాయిని చేరలేకపోవడం కష్టమే.. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 1 మిలియన్ డాలర్ కంటే తక్కువ వసూలు చేసింది. ఇది దాని ఘోరమైన ప్రదర్శనను స్పష్టం చేస్తోంది. ఈ మధ్య విడుదలైన డిజాస్టర్ సినిమాలు అఖండ -2, హరి హర వీర మల్లు చిత్రాలు కూడా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ మైలురాయిని చేరుకోవడంలో విఫలమైంది. -
పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!
కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?
గతంలో పవన్ కల్యాణ్ వరస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు 'దబంగ్'ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసిన దర్శకుడు హరీశ్ శంకర్ హిట్ కొట్టాడు. ఇది 2011లో జరిగింది. మూవీలో కంటెంట్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేసరికి ప్రేక్షకులు ఆదరించారు. దాదాపు అదే టెంప్లేట్‌తో తీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ అభిమానుల కోసం దీన్నే తీశానని హరీశ్ శంకర్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్‌కి తప్పితే సగటు ఆడియెన్స్‌కి నచ్చలేదు. బుకింగ్సే అందుకు నిదర్శనం.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)ఇప్పుడు పవన్‌తో మరో సినిమా తీస్తానని హరీశ్ శంకర్ అంటున్నాడు. ఈసారి స్టోరీ కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చేలా తీస్తానని అంటున్నాడు. అయితే ఈ దర్శకుడు మూవీ చేస్తానని అనడం బాగానే ఉంది గానీ పవన్ ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి మూవీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒప్పుకొన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి తర్వాత మూవీస్ చేస్తాడా అనేది సందేహమే.హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. గద్దలకొండ గణేశ్, మిస్టర్ బచ్చన్ లాంటి రీమేక్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇప్పుడు తీసిన 'ఉస్తాద్..' ప్రకటించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికే ఐదేళ్లు పట్టేసింది. ఇప్పుడు మరో సినిమా అంటే అయ్యే పనేనా అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకొన్న ప్రొడ్యూసర్ ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!) -
శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!
ఓ సినిమా హిట్-ఫ్లాప్ అనేది చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అంటే స్టార్ హీరోల మూవీస్ ఓ మోస్తరుగా ఉన్నా ఆడేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అభిమానుల కోసం స్పెషల్‌గా తీశామని దర్శకులు చెబుతున్నా ఎందుకనో పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చింది. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్)విడుదలైన రోజు ఉగాది కావడం, 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ షోలు పడకపోవడంతో ఉన్నంతలో ఆడియెన్స్ ఈ మూవీకి వచ్చారు. దీంతో రూ.30 కోట్లకు పైనే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ రెండురోజుకి(శుక్రవారం) వసూళ్లలో విపరీతమైన డ్రాప్ కనిపించింది. కేవలం రూ.9 కోట్లే వచ్చాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వీకెండ్ అయ్యేసరికి మరింతగా వసూళ్లు తగ్గిపోవచ్చు.ఇకపోతే ఈ మూవీలో పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. రాశీఖన్నా పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండాఫ్‌ని ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీలీల కనిపిస్తుంది. ఈమె వరకు యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఎందుకనో ఈ మూవీ కూడా ఈమెకు కలిసివచ్చేలా కనిపించట్లేదు. 'ఉస్తాద్..' సక్సెస్‌పై ఈమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం రెండు మూడు చిత్రాలు కూడా వదిలేసుకుంది. చూస్తే ఇప్పుడి పవన్ కల్యాణ్ కూడా ఈమెని కాపాడలేకపోయాడనిపిస్తోంది.తెలుగులో గత ఐదేళ్ల నుంచి శ్రీలీల సినిమాలు చేస్తోంది. తొలి చిత్రం 'పెళ్లి సందడి' పర్లేదనిపించింది. రవితేజతో చేసిన 'ధమాకా' సూపర్ హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే హిట్ అనిపించింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డీనరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర వరకు అన్ని ఫెయిల్యూర్సే. తమిళంలో ఈ సంక్రాంతికి వచ్చిన మొదటి మూవీ 'పరాశక్తి'ది కూడా ఇదే ఫలితం. ఇప్పుడు పవన్ 'ఉస్తాద్..' కూడా ఇదే లిస్టులో చేరేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
ఉస్తాద్ ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్, టెన్షన్ లో పవన్ ఫ్యాన్స్
-
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలోకి ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలు వచ్చేశాయి. పేరుకే హిందీ అయినప్పటికీ 'ధురంధర్'కి మన దగ్గర కూడా ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ చిత్రానికి అభిమానులు తప్పితే సగటు ఆడియెన్స్ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే ఇంతకీ ఈ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ సంగతేంటి? ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుప్రీత చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ముందుగా 'ధురంధర్ 2' విషయానికొస్తే తొలి భాగం డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించారు. ఇప్పుడు రిలీజైన సీక్వెల్‌ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్కి చెందిన హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. మొదటి పార్ట్‌లానే ఈసారి కూడా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే చివరి వారంలోనే 'ధురంధర్ 2' డిజిటల్‌గా అందుబాటులోకి వస్తుంది. అయితే దీన్ని థియేటర్లలోనే చూడాలని చాలామంది అంటున్నారు.మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేశారు. అయితే ఇది ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో పవన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంటుంది. సోషల్ మీడియాలో వినిపించినట్లు ఇది 'తెరి' రీమేక్ అయితే కాదనే క్లారిటీ వచ్చింది. కాకపోతే రొటీన్ కమర్షియల్ పోలీస్ టెంప్లేట్ స్టోరీతోనే దీన్ని తెరకెక్కించారు. టాక్ అయితే నెగిటివ్‌గానే వస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు సంగతి ఏంటనేది తెలుస్తుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
పవన్ VS రణ్వీర్.. ఇది మూడోసారి
భారతీయ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల వరకు పోటీగా రిలీజైన చిత్రం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. వీటి టాక్ ఏంటి? చూసిన వాళ్లు ఏమంటున్నారు? అనే విషయాల్ని పక్కనబెడితే పవన్ vs రణ్వీర్ పోటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలోనూ ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)రణ్వీర్ సింగ్.. హిందీ సినిమాలే చేసినప్పటికీ తెలుగులోనూ కాస్తంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఇక్కడ కూడా ఇతడి మూవీస్ రిలీజయ్యాయి. గతంలో అంటే 2011లో పవన్ కల్యాణ్ 'పంజా' వచ్చినప్పుడే రణ్వీర్ 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్' మూవీ కూడా వచ్చింది. వీటిలో పంజా ఫ్లాప్ కాగా రణ్వీర్ ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. 2023లోనూ మళ్లీ వీళ్లిద్దరూ ఒకేరోజున చిత్రాల్ని రిలీజ్ చేశారు. పవన్ 'బ్రో' సినిమాతో రాగా రణ్వీర్ 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'తో వచ్చాడు. ఇక్కడ సేమ్ సీన్ రిపీటైంది పవన్ మూవీ ఫ్లాప్ కాగా రణ్వీర్ హిట్ కొట్టాడు.ఇపుడు ముచ్చటగా మూడోసారి రణ్వీర్ వర్సెస్ పవన్ పోటీలో నిలిచారు. ఈసారి రణ్వీర్ 'ధురంధర్ 2' ఆధిపత్యమే కొనసాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'కి ప్రీమియర్ల నుంచే నెగిటాక్ వస్తోంది. కంటెంట్ మరీ ఔట్ డేటెడ్‌గా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 'ధురంధర్ 2' హవా తెలుగులోనూ గట్టిగానే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. తొలి నుంచి ఇది తమిళ మూవీ 'తెరి'కి రీమేక్ అని ప్రచారం సాగింది. గత కొన్నాళ్ల నుంచి ఈ విషయాన్ని డైరెక్టర్ ఖండిస్తూ వచ్చాడు. అయినా సరే దీనిపై పెద్దగా బజ్ లేదు. దానికి తోడు 'ధురంధర్ 2'కి పోటీగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఆంధ్రలో ఎర్లీ మార్నింగ్, ఓవర్సీస్ షోలు పడ్డాయి. మూవీ చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో ఏముంటున్నారు? ట్విటర్ టాక్ ఏంటి?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తిగా ఔట్ డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. రైటింగ్ పరంగా కొత్తగా ఏం ఆశించలేం కానీ ఉన్నంతవరకైనా బాగా తీయాలిగా. అది కూడా సరిగా తీయలేదు. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. కామెడీ, కమర్షియల్ రైటింగ్ విషయంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘోరంగా ఫెయిలయ్యాడు. అలానే పవన్ ఎనర్జీ కూడా మిస్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)#UstaadBhagatSingh A Completely Outdated Commercial Entertainer!A commercial film like this doesn’t necessarily need out of the box writing, but it atleast needs some freshness. This one feels outdated to the core from the start to end. A few elevation blocks work, but the film…— Venky Reviews (@venkyreviews) March 18, 2026#UstaadBhagatSingh - PK’s look, Screen presence & Dialogues r the positives in this Routine, Outdated Drama. Parthiban Naidu as weak villain. Sreeleela ok. Raashi Khanna has no scope. Thaman does a Anirudh work in BGM. One melody track nice. Narration is a Patience Tester. BORE!— Christopher Kanagaraj (@Chrissuccess) March 18, 2026Indukenemo manaki raanidi..mana valla kaanidi cheyyakudadu antuntaru.. #HarishShankar @/harish2you#UstaadBhagatSingh #UBSReview https://t.co/Maam0Ys7tM pic.twitter.com/Pw5e37SahX— Sasi Kiran (@SasiKir54703134) March 18, 2026#UstaadBhagatSinghOutdated from start to finish.A few elevation scenes work, but overall feels like stitched mass compilation with weak flow.#PawanKalyan shines in bits, but energy is missing.#HarishShankar disappoints wth forced comedy & writing.⭐ 1.5/5 - Save your money. pic.twitter.com/N6ZoLLhQqS— theindia.360 (@theindiaa360) March 19, 2026ఫస్ట్ హాఫ్ పర్లేదు అనుకునేలోపు, సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెట్టింది. #UstaadBhagatSingh@PawanKalyan@harish2you— 𝕤𝕣𝕚𝕟𝕦 𝕧𝕚𝕥𝕒𝕝 (@srinuvital) March 19, 2026Painful 1st half.. PawanKalyan lost his touch in acting, trying his best.. Not a single ticket worthy episode. Weak writing with no proper story & screenplay underlined by excellent bgm.. collar etthara song is good. Worst interval, hope 2nd half saves #UBS #UstaadBhagatSingh— Peter Reviews (@urstrulyPeter) March 18, 2026 -
నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల! గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సారీ చెప్పాడు తమిళ దర్శకుడు, నటుడు ఆర్.పార్తీబన్. ఓపక్క హీరో విజయ్ విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లాడీ హీరో. దీంతో కొన్నాళ్లపాటు త్రిష బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని పార్తిబన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది.కుల ప్రస్తావనఇంతలోనే మరో వివాదంలో ఇరుక్కున్నాడు పార్తిబన్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కులం గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. స్టేజీపై కులం ప్రస్తావన తేవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. నేను ఎలాంటి తప్పునైనా సరే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెప్తున్నా.. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారిఏదో నోరు జారాను. ఇన్నేండ్ల అనుభవంలో కుల ప్రస్తావన తేవడం ఇదే మొట్టమొదటిసారి. కానీ, కులానికి ప్రాధాన్యతనిచ్చేవారిని నేను అస్సలు ఇష్టపడను. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అనుకోకుండా పొరపాటు జరిగింది. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎంతోమందిని బాధపెట్టానని అర్థమైంది.క్షమించండినేను కేవలం నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి. సినిమామీరు నాపై ఉంచిన ప్రేమను, నమ్మకాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాను అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.చదవండి: పీలింగ్స్ సాంగ్ బానే చూశారుగా.. ఈ పాటకెందుకంత రాద్ధాంతం? -
'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా
లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!)గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్ చూడనున్నారనమాట. రిలీజ్ 19నే అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్‌తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!
టాలీవుడ్ దర్శకుల్లో చాలామందికి చిరంజీవితో సినిమా చేయాలని ఆశ. కానీ ఎప్పటికప్పుడు చిరంజీవి మూవీస్ లైనప్ మారిపోతూనే ఉంది. ప్రస్తుతానికైతే యంగ్ డైరెక్టర్స్‌కే ఎక్కువగా అవకాశమిస్తున్నారు. సంక్రాంతికి అనిల్ రావిపూడితో వచ్చి హిట్ కొట్టారు. 'విశ్వంభర' కోసం వశిష్ఠతో పనిచేశారు. ప్రస్తుతం బాబీతో, శ్రీకాంత్ ఓదెలతో తలో ప్రాజెక్ట్ చేయనున్నారు. తర్వాత ఎవరితో చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు హరీశ్ శంకర్.. చిరుతో మూవీ చేయాలని ఆశపడుతున్నాడు.(ఇదీ చదవండి: రిలీజ్‌కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!)పవన్‌తో కలిసి గతంలో 'గబ్బర్ సింగ్' చేసి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న హరీశ్ శంకర్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' చేశాడు. ఈ గురువారమే సినిమా థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే చిరంజీవితో మూవీ చేయడం గురించి హరీశ్ శంకర్ మాట్లాడాడు. రౌడీ అల్లుడు, దొంగ మొగడు లాంటి ఎంటర్టైనర్ తీయాలని ఉందంటూ తన ఆశని బయటపెట్టాడు.'ఈ (ఉస్తాద్ భగత్ సింగ్) ట్రైలర్ చూసి చిరంజీవి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. డైలాగ్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. పవన్ అందంగా ఉన్నారని చెప్పారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు కొడుకు కూడా అనిపించింది. నేను చిరంజీవిని చాలాసార్లు కలిశాను. కలిసి కొన్ని యాడ్స్ కూడా తీశాను. ఆయనతో నా మూవీ ప్రాసెస్‌లో ఉంది. కచ్చితంగా మెగాస్టార్‌తో గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమా చేసి తీరతాను' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.హరీశ్ శంకర్ చెప్పడం వరకు బాగానే ఉంది గానీ చిరంజీవి యస్ చెబతారా అనేది ప్రశ్న. ఎందుకంటే హరీశ్ శంకర్ దర్శకుడిగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ లేవు. అప్పుడెప్పుడో వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రమే పెద్ద హిట్. తర్వాత చేసిన వాటిలో ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర ఓకే ఓకే అనిపించాయి. గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. 'ఉస్తాద్' సంగతేంటనేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. ఇది హిట్ అయి, హరీశ్ శంకర్ ఆశ నిజమవుతుందో లేదో చూడాలి? ఎందుకంటే గతంలోనే చిరు-హరీశ్ మూవీ అంటూ రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!) -
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. -
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపు
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతినివ్వడంతోపాటు టికెట్ల ధరలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెంచింది. ఈ నెల 19న తెల్లవారుజామున ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. ఇక సినిమా విడుదలయ్యాక పది రోజులపాటు మలీ్టప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.125, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.100 పెంచుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
పవన్ సినిమాకు భారీగా టికెట్ ధరల పెంపు
-
ఉస్తాద్ ఆశలన్నీ ట్రైలర్ మీదే.. తేడా వస్తే గల్లంతే
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఏర్పడనుంది. ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి ఇప్పటికే భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా కాలరే ఎత్తరా... అంటూ సాగే పాటని విడుదల చేశారు.ధురంధర్ స్పీడ్ఇప్పటికే ధరుంధర్-2 టికెట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో సరైన ప్లానింగ్‌తో పద్ధతి ప్రకారం చిత్ర యూనిట్ ముందుకెళ్తుంది. అయితే, ఉస్తాద్ భగత్‌సింగ్ మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. దేఖ్లెంగే సాలా సాంగ్ అభిమానులను ఆకట్టుకుంది. సోషల్‌మీడియాలో మంచి స్పందన కూడా వచ్చింది. అయితే, ఆ తరువాతి రెండు పాటలు ఆరా ఆఫ్ ఉస్తాద్, కాలరే ఎత్తరా... చుట్టూ హైప్ ఉన్నప్పటికీ అనుకున్నంత రేంజ్లో బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యాయి.ముఖ్యంగా, తాజాగా విడులైన కాలరే ఎత్తరా... పాటలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చూస్తారని హరీష్ శంకర్ పదే పదే సూచించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సాంగ్ మేకింగ్ రిఫ్రెషింగ్‌గా ఉన్నప్పటికీ, ఈ పాట చాలా మంది అభిమానులకు ఊహించినంత హైప్‌ని అందించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మొత్తంమీద, ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చాలా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. ఇక అందరి చూపు మార్చి 14న విడుదల కానున్న ట్రైలర్ మీదనే ఆశలు ఉన్నాయి. సినిమాలో బలమైన కంటెంట్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిపేలా ట్రైలర్ కట్ ఉంటేనే సినిమాకు బలం పెరుగుతుంది. ఇప్పుడు అందరి చూపు ట్రైలర్‌పైనే ఉంది. ఇక్కడ కూడా సరైన కంటెంట్ లేకుండా విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆపై ధురంధర్-2 వంటి హిట్ ప్రాంఛైజ్ని తట్టకుని ఉస్తాద్ ఎంతమేరకు నిలబడుతాడో చూడాల్సి ఉంది.ట్రైలర్‌తో తేలిపోతుంది.తమిళ్ హిట్ సినిమా తేరి రీమేక్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాన్ని తెరకెక్కించారని విమర్శలు ఉన్నాయి. అయితే, దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో ఎలాంటి నిజంలేదని చెప్పారు. ఉస్తాద్ సరికొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల కానున్నడంతో అసలు విషయం ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ తేరి రీమేక్ అయితే మాత్రం ఉస్తాద్ భగత్‌సింగ్‌ను ఎవరూ కాపాడలేరనేది వాస్తవం. -
ఖుషి రోజులను గుర్తు చేసేలా ఉంటుంది: నిర్మాత రవిశంకర్ యలమంచిలి
‘‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చాలా బాగా వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ మూవీ స్థాయికి తగ్గకూడదనే లక్ష్యంతో హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. ‘ఖుషి’ నాటి రోజులను గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుందని హామీ ఇవ్వగలను. అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని నిర్మాత రవిశంకర్ యలమంచిలి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం 19న విడుదల కానుంది.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాలరే ఎత్తరా..’ అంటూ సాగే మూడో పాటని విడుదల చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘1500 నుంచి 2000 మందితో ఈ పాటను తెరకెక్కించాం. మైత్రి మూవీ మేకర్స్‌లాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం’’ అని తెలిపారు. ‘‘నేను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. పాటల రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడారు. -
ఉస్తాద్ భగత్‌సింగ్ 'కాలరే ఎత్తరా..' సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. -
టాలీవుడ్లో మరో వివాదం.. సారీ చెప్పిన డైరెక్టర్
పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తీసిన దర్శకుడు హరీశ్ శంకర్.. హీరో మహేశ్ బాబు అభిమానుల్ని హర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం అంతా ట్విటర్లో ఈ విషయం గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయ్యేసరికి సదరు డైరెక్టర్.. మహేశ్ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్)అసలేం జరిగింది?మంగళవారం సాయంత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. బాబు రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా 'తథాస్తు' అని రీట్వీట్ చేశాడు. సెకన్ల వ్యవధిలో విషయం అర్థమై హరీశ్ శంకర్.. తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మహేశ్ బాబు అభిమానులు మాత్రం హరీశ్ శంకర్‌ని ఘోరంగా ట్రోల్ చేశారు. 'ఉస్తాద్..' మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు హరీశ్ శంకర్.. మహేశ్ అభిమానులకు సారీ చెప్పాడు.హరీశ్ ఏమన్నాడు?'సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పనులతో నిన్నంతా బిజీగా గడిచింది. అదే టైంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజులకు రిప్లై ఇస్తూ ఆ హడావుడిలో ఓ ట్వీట్‌ని పూర్తి చదవకుండానే రీట్వీట్ చేశాను. నా టీమ్ అలెర్ట్ చేయగానే నిమిషం లోపే ట్వీట్ డిలీట్ చేశాను. మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవముంది. 'పోకిరి' గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. 'వారణాసి'తో ఆయన పేరుమీద మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నాను''ఆయనని కానీ ఆయన అభిమానులని కానీ బాధపెట్టాలని ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదలయ్యే ఈ టైంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఓ సినిమా రికార్డులు సృష్టించాలనే అందరి హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని హరీశ్ శంకర్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా) -
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తొలుత ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఓ వారం ముందే వచ్చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఉగాది సందర్భంగా 19వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే రన్ టైమ్ ఎంతనేది కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)'ఉస్తాద్..' చిత్రానికి విడుదలకు 9 రోజుల ముందే సెన్సార్ చేసేశారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెన్సార్ సభ్యులు.. ఎలాంటి కట్స్ చెప్పలేదట. అలానే 2 గంటల 34 నిమిషాల నిడివితో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రీ మూవీస్ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్ అని చాలారోజులుగా ప్రచారం నడిచింది. మూవీ టీమ్ మాత్రం పదే పదే వీటిని ఖండించింది. సెన్సార్ ముగించారు. ట్రైలర్ కూడా వదిలితే సినిమా కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గానే ప్రకటించారు. కానీ ప్రీమియర్ల విషయంలో మాత్రం మూవీ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కలిసి చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాన్నాళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. గతేడాది చివరలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు వేయాలని తొలుత అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు నిర్మాణ సంస్థ.. ప్రీమియర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 19న ఉదయం 7 గంటల నుంచి మాత్రమే రెగ్యులర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారట.(ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)ప్రీమియర్ల విషయంలో 'ఉస్తాద్' వెనక్కి తగ్గటానికి బజ్ ఏమైనా కారణమా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతానికి ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. రెండు పాటలు రిలీజైనప్పటికీ అవేం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే మూవీ చూడాలా వద్దా అని చాలామంది ఆడియెన్స్ ఓ అంచనాకు రావొచ్చు. దీనితో పాటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా 'ధురంధర్ 2'పై హైప్ బాగానే ఉంది.'ధురంధర్ 2' ప్రీమియర్ షోలు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్‌లోనే టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీని రన్ టైమ్ దాదాపు 4 గంటలు. పోలిక అని చెప్పలేం కానీ 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన తర్వాత ప్రేక్షకుడు.. 'ఉస్తాద్' ప్రీమియర్ అంటే ఆసక్తి చూపిస్తాడా అంటే సందేహమే. బహుశా ఈ కారణాల వల్లే 'ఉస్తాద్'.. ప్రీమియర్ల రిస్క్ తీసుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్) -
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్లో మార్పు
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ యశ్ ‘టాక్సిక్’ వాయిదా పడడంతో కాస్త ముందుగానే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట దేవిశ్రీ సంగీత దర్శకుడు. అయితే ఇప్పటికీ బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి కాకపోవడంతో..బీజీఎం కోసం తమన్‌ని రంగంలోకి దించారు. పాటలు దేవిశ్రీ.. బీజీఎం తమన్ అందించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే డీఎస్పీ ఫ్యాన్స్ మాత్రం నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. దేవిశ్రీ కంటే గొప్ప సంగీతం ఇంకెవరు అందించలేరని.. నిర్మాణ సంస్థ తప్పుడు నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు?
టాలీవుడ్ నుంచి ఈ నెలలో రాబోతున్న భారీ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. మార్చి 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. విడుదలకు మరో 20 రోజుల మాత్రమే సమయముంది. సరిగ్గా ఈ సమయంలో కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు: శివాజీ)'గబ్బర్ సింగ్' కాంబో రిపీట్ చేస్తూ పవన్-హరీశ్ శంకర్ మరోసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. తొలుత 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తమిళ మూవీ 'తెరి'కి ఇది రీమేక్ అని అన్నారు. కానీ తర్వాత తర్వాత టైటిల్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని మారినా సరే రీమేక్ రూమర్స్ మాత్రం ఆగలేదు. దర్శకుడు, మూవీ టీమ్ ఎంతలా ఇది రీమేక్ కాదు బాబోయ్ అని అంటున్నా జనాలు, అభిమానులు కూడా ఎందుకో నమ్మట్లేదు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ఆకట్టుకోగా.. రెండోది దారుణంగా నిరాశపరిచింది. ఇకపోతే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవికి బదులు తమన్ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కొన్ని వైరల్ అవుతున్నాయి. అలానే మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' వాయిదా పడడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్..' టీమ్ భావిస్తోంది. అనుకున్నట్లు 26న కాకుండా ఓ వారం ముందుకు జరిగి 19వ తేదీన తమ సినిమాని రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ అండ్ టీమ్ అనుకుంటున్నారట. మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?) -
నా సినిమాని పట్టుకుని 'తెరి' చేశారు.. హరీశ్ శంకర్ కామెంట్స్
మార్చి నెలాఖరులో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఒకేఒక్క పెద్ద సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటివరకు అనుకున్నంతగా బజ్ లేదు. ఎందుకో రావట్లేదు కూడా. దానికి చాలానే కారణాలు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే ఇది రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ మూవీకి రైటర్‌గా పనిచేసిన ఒకప్పటి దర్శకుడు దశరథ్.. ఇది 'తెరి' రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఇప్పటికే అదే నిజమని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.మూవీ టీమ్ గానీ దర్శకుడు హరీశ్ శంకర్ గానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి రీమేక్ కాదని గతంలో చెప్పారు. తాజాగా పలువురు జర్నలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోనూ హరీశ్ శంకర్.. మరోసారి రీమేక్ గురించి స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా అనిపించాయి.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)'తెరి మూవీలో ట్వింకిల్ ట్వింకిల్ అంటూ పాడే ఓ సీన్ ఉంటుంది. అది నా 'గబ్బర్ సింగ్' మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్‌ని స్పూర్తిగా తీసుకుని తీశారు. నా సినిమాని పట్టుకుని తెరి చేస్తే.. నువ్వు 'తెరి' రీమేక్ చేస్తున్నావంటే నేను ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాని దిగువన కామెంట్స్ చాలావరకు ఈ దర్శకుడికి వ్యతిరేకంగానే వస్తుండటం విచిత్రం.కెరీర్లో చాలా సినిమాలు చేసిన హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి ఒక్కటీ సరైన సినిమా తీయలేకపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ లాంటి ఒకటి రెండు మూవీస్ ఆకట్టుకున్నప్పటికీ మరీ సూపర్ హిట్ కాలేకపోయాయి. హరీశ్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. చూడాలి మరి హరీశ్ శంకర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్‌డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్‌కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్‌లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్
పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ 'గబ్బర్ సింగ్' చేశారు. అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు. ఇప్పటికే పవన్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత)'దేఖ్ లేంగ్ సాలా' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశారు. బీట్ బాగానే ఉంది కానీ ఎక్కడో విన్నామే ఇది అనిపించేలా మ్యూజిక్ ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.ఈ సినిమా విషయానికొస్తే.. తమిళ హీరో విజయ్ 'తెరి'కి ఇది రీమేక్ అని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం కొత్త స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైతే తప్ప కంటెంట్ ఏంటనేది క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. రీమేక్ అనే రూమర్స్ దీనికి కారణం. అలానే దర్శకుడు హరీశ్ శంకర్ గత కొన్ని చిత్రాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్) -
బర్త్‌డే స్పెషల్
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవన్ కల్యాణ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయనంక బోస్, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్: దినేష్ నరసింహన్, హరీష్. -
మిస్ శ్లోక
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని మరో హీరోయిన్ పాత్రకు రాశీఖన్నాను ఎంపిక చేసింది యూనిట్.‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లో శ్లోక పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అశుతోష్ రానా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నాగ మహేశ్, టెంపర్ వంశీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
పవన్ కొత్త సినిమాలు క్యాన్సిల్?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగులో స్టార్ హీరో. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చేతిలో ఉన్న సినిమాలే పూర్తి చేయలని పరిస్థితి. అలాంటి కొత్త చిత్రాలంటే అస్సలు అయ్యే పనికాదు. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు రెండు క్యాన్సిల్ అయ్యాయనే మాట వినిపిస్తోంది.పవన్ చేతిలో ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఓజీ' (OG Movie) సినిమాలున్నాయి. వీటిలో 'హరిహర..' లెక్క ప్రకారం ఈ మార్చి 27న రిలీజ్ కావాలి. కానీ మే 9కి వాయిదా వేశారు. పవన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. మరి మేలో అయినా సరే సినిమా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?)పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న 'ఓజీ'కి దాదాపు 20 రోజుల డేట్స్ పవన్ ఇవ్వాల్సి ఉందట. అది ఎప్పుడు జరిగితే దానిబట్టి రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లి చాలా ఏళ్లు అయిపోయాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి.ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaab Bhagath Singh) షూటింగ్ కొన్నిరోజులు చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని హోల్డ్ లో పెట్టేశారనే టాక్ ఉంది. అలానే సురేందర్ రెడ్డితో కమిట్ అయిన ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే పవన్ చివరి చిత్రం 'ఓజీ'నే!(ఇదీ చదవండి: రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!) -
ఫ్యాన్స్ ఓజీ అని అరుస్తుంటే బెదిరింపుల్లా ఉన్నాయి: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ఎట్టకేలకు పవన్.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై స్పందించాడు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ..అభిమానులు ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.డేట్స్ ఇచ్చా..నేను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇచ్చాను. కానీ నిర్మాతలే సరిగా వినియోగించుకోలేదు. హరిహర వీరమల్లు మూవీ (Hari Hara Veeramallu Movie) షూటింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా స్క్రిప్టు పనులే జరుగుతున్నాయి. ఈ మూడు చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాను అని తెలిపారు. హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఇది పీరియాడిక్ ఫిలింగా తెరకెక్కనుంది. (చదవండి: అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్)సినిమా..క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఓజీ విషయానికి వస్తే సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025వ సంవత్సరంలో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.చదవండి: పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?' -
అది 'తేరీ' రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మరోవైపు 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు పూర్తి చేయాలి. వీటిని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ తేలవు, మునగవు అన్నట్లు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అలా పవన్ చేయాల్సిన మూవీస్ విషయంలో కన్ఫ్యూజన్ తీరట్లేదు. ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసేలా దర్శకుడు దశరథ్ కామెంట్స్ చేశాడు.పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' చేశారు. హిందీ మూవీ 'దబంగ్'కి రీమేక్ ఇది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో చాన్నాళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది దళపతి విజయ్ 'తేరీ' రీమేక్ అని ప్రచారం జరిగింది. తర్వాత దీని పేరుని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్.. అప్పట్లో దీన్ని 'తేరీ' రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్)రీసెంట్గా దశరథ్ తీసిన 'మిస్టర్ ఫెర్ఫెక్ట్' సినిమా రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చేసరికి.. ఇది 'తేరీ' కాదని అన్నారు. అంటే మాట మార్చేసినట్లే. అప్పట్లో మిస్ కమ్యూనికేషన్ వల్ల, స్టోరీ లైన్ ఒకేలా అనిపించడం వల్ల అలా చెప్పానని దశరథ్ అన్నారు.పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది 'తేరీ' రీమేక్ అని అందరూ ఫిక్సయిపోయారు. అప్పట్లో ఈ విషయమై హరీశ్ శంకర్‌ని చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ హోల్ట్‌లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)Abba Sairam 🙏#UstaadBhagathSingh pic.twitter.com/mwgqfTE3sG— ♈️👁️🗨️〽️💲❗️ (@vamsi_pamuri) October 25, 2024 -
మెగా హీరోస్ పైనే హరీష్ ఆశలు..
-
Ustaad Bhagat Singh: సినిమాల్లోనూ పవన్ ప్యాకేజీ పాలిటిక్స్!
సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.. సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న హైడ్రామా చూస్తుంటే, ఆ మాట ఆయనకి సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది. రాజకీయం కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను వాడుతూ చివరికి రెండిటికి చెడ్డ రేవడిలా మారాడు ఈ నట నాయకుడు. ఒకప్పుడు పవన్ కల్యాణ్ నుంచి సినిమా అంటే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉండేవి. సినిమా అప్డేట్స్ వస్తే చాలు మెగా ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఓ చిన్న హీరో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా పవన్ మూవీకి రావడం లేదు. దానికి కారణం సినిమాను సినిమాగా తీయకుండా.. తన రాజకీయాల కోసం వాడుకోవడమే. ప్రతి సినిమాలోనూ తన పార్టీ ప్రచారం కోసం అనవసరపు సన్నివేశాలనో.. డైలాగ్స్నో చొప్పించి, ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటున్నారు. ఆ మధ్య ‘బ్రో’ సినిమాలోనూ ప్యాకేజీ పాలిటిక్స్ చేసి, చివరకు నిర్మాతలకు కోట్లల్లో నష్టం వచ్చేలా చేసి సైడ్ అయిపోయాడు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లోనూ తన ప్యాకేజీ పాలిటిక్స్‌ని అప్లై చేశాడు. తన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌పై డైలాగ్స్ చెప్పించి.. సినిమాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. అందులో పవన్ జస్ట్ యాక్టర్ మాత్రమే. అంటే రెమ్యునరేషన్ తీసుకొని నటించి వెళ్లాలి. కానీ ఒకవైపు భారీగా పారితోషికం పుచ్చుకుంటునే.. మరోవైపు ఆ సినిమానే తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నాడు. అలా తనకొచ్చిన ప్రతి సినిమానూ రాజకీయంగా వాడుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. దీని వల్ల నిర్మాతలు రూ. కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది. ఒకవేళ సినిమాలను రాజకీయాల కోసం వాడుకోవాలంటే.. తనే నిర్మాతగా మారి సినిమా చేస్తే బాగుంటుంది కానీ.. మరొకరి సొమ్ముతో ఈయన రాజకీయ ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పార్ట్‌టైం పాలిటిక్స్‌కి ఫిక్స్! ఇది ఎన్నికల సమయం. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కానీ ప్యాకేజీ స్టార్ మాత్రం ఇప్పుడు కూడా తన సమయాన్ని సినిమాలకే కెటాయిస్తున్నాడంటే.. ఎన్నికల తర్వాత తన దారి ఎటో తెలిసిపోతుంది. ఎన్నికలు అయిపోగానే పాలిటిక్స్‌కి ప్యాకప్ చెప్పి..ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకొనే.. వరుస సినిమాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వపన్ చేతిలో హరిహరవీరమల్లు , ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో పవన్ ఫుల్టైమ్ని సినిమాలకే కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ‘గ్లాస్’డైలాగ్స్‌పై సెటైర్స్ తాజాగా రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాపై ఇప్పటి వరకు భారీ అంచనాలు ఉండేవనీ..కానీ గ్లింప్స్ చూశాక పవన్ ఈ సారి కూడా తన స్వార్థం కోసం సినిమాను చెడగొట్టాడని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా గ్లింప్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను అడ్డుపెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరమా అని పవర్ స్టార్ ఫ్యాన్సే చర్చించుకుంటున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే.. సినిమాలోని ‘గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం’ డైలాగ్స్‌పై సెటైరికల్ కామెంట్ చేస్తున్నారు. ‘అసలు సినిమాకు గాజు గ్లాసుకు సంబంధం ఏంటి?’, ‘ఇదేదో జనసేన పొలిటికల్ యాడ్‌లా ఉందే’‘ఈసారి పిఠాపురం(పవన్ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానం)లో గ్లాస్ నుజ్జు నుజ్జు అయిపోతుందటగా’, ‘ఫ్యాన్ గాలికి గ్లాస్ పగిలిపోవడం ఖాయం’ అంటూ కామెంట్ చేస్తున్నారు.


