
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మరోవైపు 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు పూర్తి చేయాలి. వీటిని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ తేలవు, మునగవు అన్నట్లు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అలా పవన్ చేయాల్సిన మూవీస్ విషయంలో కన్ఫ్యూజన్ తీరట్లేదు. ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసేలా దర్శకుడు దశరథ్ కామెంట్స్ చేశాడు.
పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' చేశారు. హిందీ మూవీ 'దబంగ్'కి రీమేక్ ఇది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో చాన్నాళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది దళపతి విజయ్ 'తేరీ' రీమేక్ అని ప్రచారం జరిగింది. తర్వాత దీని పేరుని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్.. అప్పట్లో దీన్ని 'తేరీ' రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు.
(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్)
రీసెంట్‌గా దశరథ్ తీసిన 'మిస్టర్ ఫెర్‌ఫెక్ట్' సినిమా రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చేసరికి.. ఇది 'తేరీ' కాదని అన్నారు. అంటే మాట మార్చేసినట్లే. అప్పట్లో మిస్ కమ్యూనికేషన్ వల్ల, స్టోరీ లైన్ ఒకేలా అనిపించడం వల్ల అలా చెప్పానని దశరథ్ అన్నారు.
పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది 'తేరీ' రీమేక్ అని అందరూ ఫిక్సయిపోయారు. అప్పట్లో ఈ విషయమై హరీశ్ శంకర్‌ని చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ హోల్ట్‌లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)
Abba Sairam 🙏#UstaadBhagathSingh
pic.twitter.com/mwgqfTE3sG— ♈️👁️🗨️〽️💲❗️ (@vamsi_pamuri) October 25, 2024